Deposit money
-
మోదీ నోట.. ఆ మాట రానేలేదు
పుణే: నాలుగేళ్ల పాలనలో బీజేపీ ప్రభుత్వం అన్నింటా విఫలమైందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఆ విమర్శలను తిప్పికొట్టేందుకు బీజేపీ నానా ప్రయాసలు పడుతోంది. ఈ క్రమంలో బీజేపీ నేత అమర్ సాబ్లే చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఎన్నికల సందర్భంగా ప్రతీ పౌరుడి బ్యాంకు ఖాతాలో రూ. 15 లక్షలు డిపాజిట్ చేస్తానని ప్రధాని మోదీ హామీ ఇచ్చారని, అది నెరవేర్చలేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. దీనిపై స్పందించిన అమర్.. అసలు మోదీ నోట ఆ మాట రాలేదని చెబుతున్నారు. ‘ప్రజల ఖాతాలో డబ్బు డిపాజిట్ చేస్తానని మోదీగారూ ఏనాడూ చెప్పలేదు. అదసలు బీజేపీ ఎన్నికల మేనిఫేస్టోలో లేని అంశం. అలాంటప్పుడు ఆ ప్రస్తావన ఎక్కడి నుంచి వస్తుంది. పైగా ప్రతిపక్షాలు ఈ విషయంపై రాద్ధాంతం చేస్తున్నాయి. రూ. 15 లక్షలను ఖాతాలో వేస్తామన్న హామీ, బీజేపీ విఫలం.. అంటూ ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నాయి. ఇలాంటి విషయాల్లో జనాల్లోకి తప్పుడు సంకేతాలు తీసుకెళ్లటం మంచిది కాదు’ అని అమర్ సాబ్లే పేర్కొన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శనివారం పింప్రీలో ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన పై వ్యాఖ్యలు చేశారు. విదేశాల్లో మూలుగుతున్న నల్లధనానంత వెనక్కి తెప్పించి.. ప్రతీ పౌరుడి ఖాతాలో రూ.15 లక్షలు జమ చేయిస్తానని మోదీ నాటి ఎన్నికల(2014) ప్రచారంలో ప్రామిస్ చేశారు. ఈ హామీపై బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా అప్పట్లో ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ... అది సాధ్యమయ్యే పని కాదని అందరికీ తెలుసని.. అదోక రాజకీయ జుమ్లా అని చెప్పారు. ఇక ఈ హామీపై ఓ వ్యక్తి సమాచార హక్కు చట్టం కింద 2016 నవంబర్‌లో వివరణ కోరాడు. అయితే రెండేళ్ల తర్వాత ప్రధాని కార్యాలయం అదసలు ‘సమాచారం’ కిందే రాదంటూ అతని దరఖాస్తును తిరస్కరించటం గమనార్హం. -
పోస్ట్‌మాస్టర్ చేతివాటం
మిరుదొడ్డి(దుబ్బాక): నమ్మకానికి మారుపేరుగా నిలిచే పోస్టాఫీసులో బ్రాంచి పోస్టుమాస్టర్ చేతివాటం చూపిన వైనం మండల పరిధిలోని రుద్రారం ఫోస్టాఫీసులో బుధవారం వెలుగులోకి వచ్చింది. గత 31 నెలలుగా పోస్టాఫీసులో జమ చేసిన డిపాజిట్ డబ్బులను సబ్ పోస్టాఫీసు అకౌంట్‌కు చూపకుండా పోస్టుమాస్టర్ లత రూ.లక్షల్లో స్వాహా చేసినట్లు ఖాతాదారులు లబోదిబో మంటున్నారు. బ్రాంచి పోస్టాఫీసు ఎదుట ఖాతాదారులు ఆందోళనకు దిగారు. వివరాలు ఇలా ఉన్నాయి. మెదక్ జిల్లా నిజాంపేట సబ్ ఫోస్ట్ ఆఫీస్ కింద మండల పరిధిలోని రుద్రారం బ్రాంచ్ పోస్టాఫీసులో 47 సుకన్య సంవృద్ధి అకౌంట్లు, 76 రికరింగ్ డిపాజిట్లు, సేవింగ్ బ్యాంక్, గ్రామీణ రూరల్ తపాలా జీవిత బీమా వంటి లావాదేవీలు నిర్వహిస్తుంటారు. ఈ క్రమంలో పోస్టుమాస్టర్ లత తీసుకుంటున్న డిపాజిట్లల్లో అనుమానాలు తలెత్తుతున్నట్లు గమనించిన కొందరు ఖాతాదారులు నిజాంపేట సబ్‌పోస్టాఫీసులో వాకబు చేశారు. తమ ఖాతా బుక్కుల్లో గత 31 నెలలుగా డిపాజిట్ చేస్తున్నప్పటికి సబ్ ఫోస్టాఫీసులో కేవలం రూ.4 వేలు మాత్రమే జమ అయినట్లు ఆన్లైన్లో చూపెట్టడంతో ఖాతాదారులు అవాక్కయ్యారు. దీంతో రుద్రారం బ్రాంచ్ ఫోస్టాఫీసులో జరుగుతున్న తతంగంపై మెదక్ సబ్ డివిజనల్ పోస్టల్ ఇన్స్పెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న సబ్ డివిజనల్ పోస్టల్ ఇన్స్పెక్టర్ నికిత్, మేయిల్ పర్సన్ కరుణాకర్ బుధవారం రుద్రారం పోస్టాఫీసును ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు. పోస్టాఫీసులోని లావాదేవీలపై విచారణ చేపట్టారు. రికార్డుల పరిశీలనలో బ్రాంచ్ పోస్టుమాస్టర్ లత ఖాతాదారుల పాసుబుక్కుల్లో డబ్బులు జమచేసిన అనంతరం సబ్‌పోస్టాఫీసుకు రోజువారి అకౌంట్ చూపకుండా డబ్బులు స్వాహాచేసినట్లు పోస్టల్ అధికారులు నిర్ధారణకు వచ్చారు. విషయం తెలుసుకున్న ఖాతాదారులు బ్రాంచ్ పోస్టాఫీసుకు చేరుకుని ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని అధికారులను కోరారు. ఖతాదారులకు న్యాయం చేస్తాం.. రుద్రారం బ్రాంచ్ పోస్టాఫీసులో జరిగిన సొమ్ము స్వాహాపై ఖాతాదారులు ఆందోళన చెందవద్దని మెదక్ సబ్ డివిజనల్ పోస్టల్ ఇన్స్పెక్టర్ అంకిత్ అన్నారు. ఖతాదారుల పాసుబుక్కులను, రికార్డులను పూర్తిగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఎంత సొమ్ము స్వాహా అయ్యిందో విచారిస్తున్నామని తెలిపారు. నష్టపోయిన ఖతాదారులకు బ్రాంచ్ పోస్టుమాస్టర్ నుంచి సొమ్మును రికవరీ చేసి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఖాతాదారులు శాంతించారు. అవకతవకలకు పాల్పడిన బ్రాంచ్ పోస్టుమాస్టర్‌పై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. – మెదక్ సబ్ డివిజనల్ పోస్టల్ ఇన్స్పెక్టర్ అంకిత్ -
రైతుల పాలిట...భయంకరులు
వ్యవసాయ మదుపుల కోసం బంగారు ఆభరణాలపై ఆంధ్రా బ్యాంక్‌లో రుణం తీసుకున్నాను. రుణమాఫీ వస్తుందని ప్రకటించడంతో నాకు వర్తిస్తుందని ఆశతో ఉన్నాను. మదుపుల కోసం బ్యాంక్‌లో డబ్బులు డిపాజిట్ చేసుకొని అవసరాలకు తీసుకున్నాను. రుణం కట్టలేదన్న సాకుతో నాకిచ్చే ఖాతాను స్తంభింపచేశారు. ఏటీఎం నిలుపుదలచెయ్యడంతో డబ్బులు తీయడానికి వీలులేకపోయింది. -చొక్కాపు తిరుపతిరావు, రైతు, అప్పయ్యపేట, సీతానగరం అన్నదాతలను బ్యాంకర్లు బ్లాక్‌లిస్ట్‌లో చేరుస్తున్నారు. వారి ఖాతాలను స్తంభింపజేసి ఉన్న కొద్దిపాటి సొమ్మును వ్యవసాయ పెట్టుబడులకు అందకుండా చేస్తున్నారు. ఖరీఫ్ రుణాలు ఇవ్వవలసిన సమయంలో బకాయిలు చెల్లించాలంటూ తాఖీదులొస్తుండడంతో రైతులు కలవరపడుతున్నారు. గత ఏడాది పంటలు పండక, ఈ ఏడాది మదుపు లేక సతమతమవుతున్న పరిస్థితుల్లో నోటీసులిస్తూ బ్యాంకర్లు భయాందోళనకు గురి చేస్తున్నారు. ఏటీఎం లావాదేవీలను కూడా నిలిపేస్తున్నారు. బంగారంపై వ్యవసాయ రుణాలు తీసుకున్న వారికైతే ఆభరణాలు వేలం వేస్తామని హెచ్చరిస్తున్నారు. దీంతో అన్నదాత పరిస్థితి అగమ్యగోచరంగా తయారయింది. సాక్షి ప్రతినిధి, విజయనగరం: రుణమాఫీ చేస్తామని ఎన్నికలకు ముందు ఊరూవాడా ఊదరగొట్టి, రైతులెవ్వరూ బకాయిలు చెల్లించవద్దని గొప్పగా పిలుపు ఇచ్చిన చంద్రబాబు, అధికారంలోకి రాగానే ప్లేటు ఫిరాయించడంతో అన్నదాతలు అలో లక్ష్మణా అంటున్నారు. కమిటీ నివేదిక ఆధారంగా రుణమాఫీ చేస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి ఇప్పుడు రుణాల రీషెడ్యూల్ చేస్తామని చెబుతుండడంతో రైతులు తీవ్ర అయోమయానికి గురవుతున్నారు. మరో వైపు బ్యాంకర్లు తమ పనితాము చేసుకుపోతున్నారు. బకాయిలు చెల్లించని సీతానగరం మండలంలో రైతులకు చెందిన సేవింగ్స్ ఖాతాలను, ఏటీఎం లావాదేవీలను ఆంధ్రా బ్యాంకు, ఎస్బీఐ, గ్రామీణ వికాస్ బ్యాంకులు బ్లాక్ చేశాయి. బంగారంపై రుణాలు తీసుకున్నవారికికైతే ఆభరణాలు వేలం వేస్తామని నోటీసులు జారీ చేస్తున్నాయి. జిల్లాలోని 150 జాతీయ, 70 గ్రామీణ బ్యాంకుల ద్వారా 2. 67 లక్షల మంది రైతులు రూ.1,692 కోట్ల రుణాలు తీసుకున్నారు. ఇందులో లక్షా 82 వేల మంది రైతులు రూ.763 కోట్ల రుణాలను నేరుగా తీసుకోగా, 55 వేల మంది రైతులు బంగారం తాకట్టు పెట్టి రూ.628 కోట్ల రుణాలు తీసుకున్నారు. మరో 30 వేల మంది రైతులు వ్యవసాయ యంత్రాలు, సామగ్రి ఇతరత్రా అవసరాల కింద రూ.301 కోట్ల టెర్మ్ రుణాలు తీసుకున్నారు. రుణమాఫీపై చంద్రబాబు అనుసరిస్తున్న తీరుతో వీరంతా ఇప్పుడు అయోమయంలో పడ్డారు. బ్యాంకుల నుంచి అందుతున్న నోటీసులతో భయాందోళన చెందుతున్నారు. ప్రస్తుతం టీడీపీ మంత్రులు ప్రస్తావిస్తున్న రుణాల రీషెడ్యూల్ అంశంతో నిరాశ నిస్పృహకు గురవుతున్నారు. ఎప్పటికైనా బకాయిలను తామే చెల్లించాల్సిన పరిస్థితి వస్తుందని భయపడుతున్నారు. పొదుపుఖాతాల నుంచి బకాయిలు డ్రా... జిల్లాలో రూ.391.06 కోట్ల మేర డ్వాక్రా సంఘాలకు బ్యాంకులు రుణాలిచ్చాయి. రుణ మాఫీ ప్రకటనతో డ్వాక్రా సంఘాలు దాదాపు వాయిదాల చెల్లింపులు నిలిపేశాయి. లావాదేవీలు స్తంభించిపోవడంతో బ్యాంకులు నోటీసులు జారీ చేస్తున్నాయి. బకాయిలు కట్టి తీరాల్సిందేనని గట్టిగా ఒత్తిడి చేస్తున్నాయి. కొన్నిచోట్లయితే పొదుపు ఖాతాల నుంచి బ్యాంకులు డ్రా చేస్తున్నట్టు తెలుస్తోంది. మాఫీ కోసం చూస్తే ...నోటీసు ఇచ్చారు ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేస్తుందని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నాం. తీరా అలమండ వికాస్గ్రామీణ బ్యాంకు వారు రుణం తీర్చాలని నోటీసు పంపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రుణమాఫీ చేస్తామని ప్రకటనలు చేస్తున్నారు. మరోవైపు రుణం చెల్లించాలని బ్యాంకు నోటీసిచ్చింది. అలమండ గ్రామీణ వికాస్‌బ్యాంకులో పంటల కోసం 35 వేలు రుణం తీసుకున్నాను. పంటలపండక తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నాం. ఈ పరిస్థితిలో వడ్డీతో కలిపి రూ.43 వేలు చెల్లించాలని నోటీసు వచ్చింది. - బోని జగన్నాథం, రైతు,శిరికిపాలెం, జామి మండలం నోటీసులిచ్చారు మాది సాయి పొదుపు సంఘం. సభ్యులందరం రుణం తీసుకున్నాం. రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించడంతో కట్టడం మానేశారు. తీరా బకాయి చెల్లించాలని బేంకోలు నోటీసు పంపించారు. - దివ్వల పార్వతి, సాయి పొదుపు సంఘం, గొడికొమ్ము, జామి మండలం