Fashion: కొన్ని మార్పులే.. కొత్తగా!
‘మనం ఎలా ఉంటున్నామో మన వార్డ్రోబ్ మనకే పరిచయం చేస్తుంది అందుకే, పర్ఫెక్ట్ ప్లాన్ కంపల్సరీగా ఉండాల్సిందే. అలాగని ఎప్పుడూ షాపింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఉన్న వాటినే కొద్దిపాటి మార్పులతో మనదైన బడ్జెట్లో స్టయిలిష్ లుక్‌తో మార్కులు కొట్టేసేలా డిజైన్ చేసుకోవాలి. సందర్భానుసారమే కాదు సీజన్‌ని బట్టి కూడా ఎంపిక ఉండాలి..’ అంటూ తన వార్డ్రోబ్ ముచ్చట్లను మనతో పంచుకుంటున్నారు హైదరాబాద్ గచ్చిబౌలిలో ఉంటున్న సుమిత కందిమళ్ల.కొన్ని మార్పులే.. కొత్తగా!ఓల్డ్ శారీస్‌తో న్యూ లుక్ ఈ రోజుల్లో ఒక మంచి డిజైన్ ఘాగ్రా కొనాలంటే చాలా ఖర్చు. అందుకని, అదే మోడల్స్‌లో అంతే లుక్‌తో ఉండే తక్కువ రేట్ లెహంగాలు ఆన్లైన్ వేదికలపై వెతికి తీసుకుంటాను. పాతికేళ్ల క్రితం ఉన్న చీరలను రీయూజ్ చేయాలనే ఆలోచనతో చుడీదార్స్, లెహంగాలను డిజైన్ చేయిస్తుంటాను. చేనేతలకు పేరొందిన ్రపాంతాలకు వెళ్లినప్పుడు అక్కడి స్థానిక మార్కెట్లో షాపింగ్ చేస్తాను. దీని వల్ల తక్కువ బడ్జెట్లో అనుకున్నవి లభిస్తాయి.డిజైన్స్‌కి ముందుగా డ్రాయింగ్..శారీస్‌ను బట్టి బ్లౌజ్ డిజైన్స్ నాకేవి బాగుంటాయో ఒక పేపర్ మీద డ్రా చేసుకుంటాను. ఆ తర్వాత ఎప్పుడూ కుట్టించే టైలర్ దగ్గర ఇస్తాను. మనం ఉండే ప్లేస్, వాతావరణాన్ని బట్టి కూడా స్టైల్ మార్చుకోవాల్సి ఉంటుంది. నైట్ పార్టీ అయితే షిమ్మర్, గ్లిట్టర్ లైట్ వెయిట్ డ్రెస్సులను ఎంపిక చేసుకుంటాను. వేసవిలో కంచిపట్టు కాకుండా బెనారస్, షిఫాన్స్ని ఎంపిక చేసుకుంటాను. పూజలు అంటే పట్టు చీరలు సహజమే. పెళ్లి, రిసెప్షన్ వంటివాటికి చీరలు కట్టినా హెయిర్‌స్టైల్స్‌లో మార్పులు చేసుకుంటాను. జ్యువెలరీని కూడా మిక్స్ అండ్ మ్యాచ్ చేస్తుంటాను. వీటికి తగినట్లుగా డిజైనర్ బ్యాగ్స్, సన్‌గ్లాసెస్, వాచీ కలెక్షన్స్ యూజ్ చేస్తాను.కలర్స్.. కాంట్రాస్ట్..ఎప్పుడూ ఒకే తరహా వేస్తే డ్రెస్సింగ్ అయినా, కలర్ కాంబినేషన్స్ అయినా బోర్‌గా అనిపిస్తుంది. కొన్నిసార్లు గ్రీన్ షేడ్స్‌లో కావాలనుకుంటే మోనోక్రోమ్ లుక్‌లో ప్లాన్ చేసుకుంటాను. ఒక్కోసారి పూర్తిగా కాంట్రాస్ట్ వేసుకుంటాను. నా డ్రెస్సింగ్ లేదా మేకప్‌లో ఏమైనా చేంజెస్ కోసం మా అమ్మాయిల సూచనలూ తీసుకుంటాను. బర్త్ డే పార్టీలకు పూర్తిగా వెస్ట్రన్ వేర్, డే టైమ్ అయితే నీ లెంగ్త్, ఈవెనింగ్ అయితే షార్ట్స్ కూడా ప్లాన్ చేసుకుంటాను. కొన్నింటిని డెనిమ్, లెదర్ జాకెట్స్‌తో కవర్ చేసేవీ ఉంటాయి.ముగ్గురం... డిఫరెంట్‌గా!నాకు ఇద్దరూ అమ్మాయిలే కాబట్టి నాతోపాటు వారికీ అన్నీ సెట్ చేయాల్సిందే. చాలావరకు ఫ్యామిలీ కాంబినేషన్ సేమ్ కలర్ థీమ్ అంటుంటారు. కానీ, ఒక్కొక్కరు ఒక్కో స్కిన్ టోన్‌లో ఉంటారు. వారికి నచ్చిన కలర్ కాంబినేషన్స్ తీసుకొని ప్లాన్ చేస్తాను. ఒకరిని ట్రెడిషనల్‌గా, మరొకరిని ఫ్యాన్సీగా తయారు చేస్తాను. నేను వారికి భిన్నంగా ఉండేలా ప్లాన్ చేసుకుంటాను.ఒకరికి బ్రేస్లెట్స్ ఇష్టం, మరొకరికి రింగ్స్ ఇష్టం. నాకు గాజులు బాగా ఇష్టం. ఒకరు బ్రేస్లెట్ ధరిస్తే, మరొకరు పది, పదకొండు రింగ్స్ పెట్టుకుంటారు. ఇంకొకరు బ్యాంగిల్స్ ఎక్కువగా వేసుకుంటారు.తిరుపతికి వెళితే అక్కడి నుంచి రకరకాల గాజులు కొనుక్కొస్తాను. డ్రెస్‌కు తగినట్టు గాజులు అలా సెట్ చేస్తాను. ప్రతి ఫంక్షన్స్‌కి 2–3 రోజుల ముందే ప్రతిదీ సెట్ చేసి ఉంచుతాను.ఆల్‌టైమ్ ఫేవరెట్..మగ్గం వర్క్‌లో థ్రెడ్ వర్క్ కన్నా జర్దోసి వర్క్ చాలా ఇష్టం. అందుకే, వెల్వెట్ మీద హెవీ వర్క్ చేయించాను. ఇది ఎప్పటికీ ట్రెండ్‌లో ఉంటుంది. వెల్వెట్ లెహంగాకి ఎంబ్రాయిడరీ చేయించాను. దానికి బ్లౌజ్ మారుస్తుంటాను. మగ్గం వర్క్‌లో క్వాలిటీ మాత్రం మిస్ కాకూడదు.పాతదైనా ప్రత్యేకమే..మా అమ్మమ్మ చీరల్లో నుంచి నా దగ్గరకు ఒక గద్వాల కాటన్ శారీ వచ్చింది. అప్పటి నేత ఇప్పటికీ బాగుంటుంది. దానిని కూడా డిజైనర్ బ్లౌజ్‌తో ఫంక్షన్స్‌కి కట్టుకుంటాను. ఏ చీర కొన్నా నా తర్వాత నా పిల్లలకు ఆ చీరలు వెళ్లేలా ప్లాన్ చేసుకుంటాను. నా పెళ్లప్పుడు కొన్న కోటా చీర ఇప్పటికీ కట్టుకుంటాను.