devision
-
టెస్కో పాలక మండలి రద్దా? కొనసాగింపా?
► సీఎం నిర్ణయం మేరకు నడుచుకోవాలని భావిస్తున్న అధికారులు ► విభజన ప్రణాళిక మేరకు రాష్ట్రానికి 11 మంది డెరైక్టర్లు ► 2018 మార్చితో ముగియనున్న సభ్యుల పదవీకాలం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర చేనేత సహకార సంఘం (టెస్కో) ప్రస్తుత పాలక మండలి సభ్యుల కొనసాగింపుపై సందిగ్ధం నెలకొంది. 2018 మార్చితో ప్రస్తుత పాలక మండలి సభ్యుల పదవీ కాల పరిమితి ముగియనుంది. అయితే పాలక మండలి సభ్యులు, చైర్మన్ నియామకం రాజకీయాలతో ముడిపడి ఉండటంతో రద్దు ప్రతిపాదన తెర పైకి వస్తోంది. పాలక మండలి కొనసాగించాలా.. లేక రద్దు చేయాలా అనే అంశంపై అధికార పార్టీ ముఖ్య నేతల నుంచి ఒత్తిళ్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి మార్గనిర్దేశనం మేరకు పాలక మండలి కొనసాగింపుపై నిర్ణయం తీసుకోవాలని చేనేత, జౌళి శాఖ అధికారులు భావిస్తున్నారు. పెరుగుతున్న ఒత్తిళ్లు ఆంధ్రప్రదేశ్ చేనేత సహకార సంఘం (ఆప్కో) విభజన ప్రణాళికకు గతేడాది ఆగస్టులో షీలాబిడే కమిటీ ఆమోదం తెలిపింది. 2015 అక్టోబర్ 31 నుంచి తెలంగాణ చేనేత సహకార సంఘం (టెస్కో) సొంతంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఆప్కో పాలక మండలిలో 24 మంది ైడె రెక్టర్లుగా ఉండగా.. విభజన ప్రణాళిక మేరకు తెలంగాణకు 11, ఆంధ్రప్రదేశ్‌కు 13 మంది డెరైక్టర్లను కేటాయించారు. వీరందరూ ఉమ్మడి రాష్ట్రంలో 2013 ఫిబ్రవరిలో నియమితులు కాగా.. 2018 మార్చి 16కల్లా వీరి పదవీకాలం ముగియనుంది. పాలక మండలి విభజన జరిగిన నేపథ్యంలో ప్రస్తుతం 11 మంది సభ్యుల్లో ఒకరిని చైర్మన్ గా ఎన్నుకునేందుకు నోటిఫికేషన్ ఇవ్వాలని.. కొందరు డెరైక్టర్లు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. వీరి ప్రతిపాదనకు టీఆర్ఎస్కు చెందిన ఇద్దరు కీలక మంత్రులు మద్దతు పలుకుతున్నట్లు సమాచారం. గతంలో ఆప్కో చైర్మన్‌గా పనిచేసిన నేత ఒకరు.. ప్రస్తుత పాలక మండలిని రద్దు చేసి కొత్తగా నియమించాలంటూ లాబీయింగ్ చేస్తున్నారు. ఇరువైపుల నుంచి ఒత్తిడి పెరగడంతో.. సీఎం మార్గనిర్దేశనం మేరకు నడుచుకోవాలని మంత్రి జూపల్లి కృష్ణారావు నిర్ణయించుకున్నట్లు సమాచారం. దీనిపై దిశానిర్దేశం చేయాలంటూ సీఎంకు మంత్రి లేఖ రాసినట్లు సమాచారం. ఆప్కో విభజన ప్రణాళికకు ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు తుది ఆమోదం తెలిపితే తప్ప.. నూతన పాలక మండలిని నియమించే అవకాశం లేదని చేనేత శాఖ వర్గాలు వెల్లడించాయి. -
ప్రభుత్వ వైద్యుల విభజనలో తప్పులు
* కమలనాథన్ కమిటీ అంగీకరించిందన్న టీ వైద్యుల జేఏసీ * జాబితా రద్దుపై రెండు, మూడు రోజుల్లో నిర్ణయం! * కమలనాథన్‌తో తెలుగు రాష్ట్రాల సీఎస్ల సమావేశం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఏపీ ప్రభుత్వ వైద్యుల విభజనలో తప్పులు దొర్లినమాట వాస్తవమేనని కమలనాథన్ కమిటీ అంగీకరించిందని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల జేఏసీ కన్వీనర్ డాక్టర్ లాలూప్రసాద్ చెప్పారు. విభజన జాబితాపై వివాదం నెలకొన్న నేపథ్యంలో బుధవారం తెలంగాణ, ఏపీ ప్రభుత్వ ప్రధానకార్యదర్శులు రాజీవ్‌శర్మ, ఎస్పీ ఠక్కర్‌లు కమలనాథన్ కమిటీతో సమావేశమయ్యారు. సమావేశంలో వైద్య, ఆరోగ్య శాఖకు చెందిన వివిధ విభాగాల అధిపతులు, ప్రభుత్వ వైద్యుల సంఘం ప్రతినిధులతోపాటు కేంద్ర ప్రభుత్వ జాయింట్ సెక్రటరీ పాల్గొన్నారు. జాబితాలో తప్పులు జరిగినట్లు కమలనాథన్ అంగీకరించారని డాక్టర్ లాలూప్రసాద్ తెలిపారు. ఈ నేపథ్యంలో రెండు, మూడు రోజుల్లో జాబితా రద్దుకు సంబంధించిన అంశంపై ప్రకటన చేస్తామని కమలనాథన్ తమకు హామీయిచ్చారని చెప్పారు. జాబితాలో అక్రమాలు జరిగాయని డీఎంఈ రమణి కూడా అంగీకరించారని తెలిపారు. ఏపీకి చెందిన చాలామంది వైద్యులు ఒకటి నుంచి నాలుగో తరగతి సర్టిఫికెట్లను మాత్రమే ఇచ్చారని, కానీ ఐదు నుంచి పదో తరగతి వరకు సర్టిఫికెట్లను జత చేయలేదని తాము కమలనాథన్‌కు వివరించామన్నారు. భార్యాభర్తలు ఏపీలో ఉన్నా తెలంగాణకే కేటాయించారని, దీనిని అధికారులు ఉద్దేశపూర్వకంగానే చేశారని లాలూ ప్రసాద్ ఆరోపించారు. -
త్వరలో ఆప్కో విభజన
గుంటూరు: ఆప్కో సంస్థను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలవారిగా విడగొట్టనున్నారని ఆప్కో చైర్మన్ మురుగుడు హనుమంతరావు చెప్పారు. ఆప్కో విభజన కోసం ఈ నెల 19న నిర్వహించిన జనరల్ బాడీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని సెంట్రల్ కమిటీకి నివేదించినట్లు తెలిపారు. గుంటూరు జిల్లా చెరుకుపల్లిలోని ఆరుంబాక వీవర్స్ సొసైటీలోని స్టాక్‌ను సోమవారం ఆయన పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌కు 58, తెలంగాణకు 42 సొసైటీలు ఉంటాయని చెప్పారు. ఏ రాష్ట్రంలో ఉన్న ఆస్తులు, అప్పులు ఆ రాష్ట్రానికే వస్తాయన్నారు. చేనేత సహకార సంఘాల అభివృద్ధికి ప్రభుత్వాన్ని రూ.175 కోట్లు వెచ్చించాలని కోరినట్లు చెప్పారు. వీవర్స్ సొసైటీలోని కార్మికుల రుణాలను ప్రభుత్వం మాఫీ చేస్తుందన్నారు.