DGP KP Singh
-
నేరస్తుల్ని చంపే హక్కు ప్రజలకుంది
హరియాణా డీజీపీ సంచలన వ్యాఖ్య ఛండీగఢ్: నేరస్తుల ప్రాణం తీసేందుకు ప్రజలకు హక్కు ఉందంటూ హరియాణా కొత్త డీజీపీ కేపీ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నేరం జరుగుతుండగా చూస్తున్నప్పుడు ఆ నేరస్తుడ్ని చంపే హక్కు చట్టం ఇచ్చిందన్న సంగతి ప్రజలకు తెలియదన్నారు. ‘ఎవరినైనా చంపేందుకు ప్రయత్నిస్తుంటే.. ఆ నేరానికి పాల్పడుతున్న వారిని చంపేందుకు చట్టం అనుమతిస్తోంది. ఇది సామాన్యుల బాధ్యత కూడా’ అన్నారు. ‘ఎవరైనా ఒక మహిళను అవమానిస్తే, మీరు చూస్తుండగా ఎవరినైనా చంపుతుంటే ఆ నేరస్తుడి ప్రాణం తీసేందుకు హక్కు ఉంది’అని ఆవేశంగా ప్రసంగించారు. -
ప్రాణహాని ఉంటే చంపొచ్చు!
హర్యానా: తన ప్రాణాలకు ముప్పొస్తే దాడికి పాల్పడుతున్న వ్యక్తిని మట్టుపెట్టొచ్చా? అంటే అవుననే చెప్తున్నారూ.. హర్యానా రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డీజీపీ) కేపీ సింగ్. కామన్ మ్యాన్ కు క్రిమినల్ లేదా ఈవ్ టీజర్ ను చంపే అర్హత ఉందని అన్నారు. ప్రాణహాని కలిగినపుడు లేదా శారీరక వేధింపులు లేదా ఆస్థికి నష్టం కలిగించే విషయాల్లో చట్టం ప్రతి మనిషికి దుర్మార్గులను చంపే అర్హత కల్సించిందని తెలిపారు. ఆత్మరక్షణ కోసం క్రిమినల్ చంపొచ్చని చాలా మందికి తెలియదని అన్నారు. ఇలా చేయడం చట్టవిరుద్ధం కాదని చెప్పారు. చట్టమేం చెప్తోందీ.. ఇండియన్ పీనల్ కోడ్(ఐపీసీ)100 ప్రకారం ఆరు కేసుల్లో ప్రత్యర్ధిని చంపొచ్చని ఇందులో ఉంది. 1. ప్రాణహాని ఉందని తప్ప మరే కారణం లేకుండా క్రిమినల్ ను చంపరాదు 2. తీవ్ర బాధకరంగా వేధిస్తుంటే ఎదుటి వ్యక్తిని చంపొచ్చు. 3. శారీరక వేధింపులకు పాల్పడటానికి ప్రయత్నిస్తే చంపొచ్చు. 4. కిడ్నాప్ చేస్తారని భావిస్తే చంపొచ్చు. 5. అసహజ పద్ధతిలో శృంగారానికి ప్రేరేపిస్తే చంపొచ్చు. 6. తప్పుడు ఉద్దేశంతో ఒక వ్యక్తిని నిర్భందించడం, అధికారులను చేరకుండా అడ్డుకోవడం వంటివి చేసినప్పుడు చంపొచ్చు.