ప్రాణహాని ఉంటే చంపొచ్చు! | Haryana DGP Says Common Man Can Kill a Criminal | Sakshi
Sakshi News home page

ప్రాణహాని ఉంటే చంపొచ్చు!

Published Fri, May 27 2016 12:43 PM | Last Updated on Tue, Oct 9 2018 5:43 PM

Haryana DGP Says Common Man Can Kill a Criminal

హర్యానా: తన ప్రాణాలకు ముప్పొస్తే దాడికి పాల్పడుతున్న వ్యక్తిని మట్టుపెట్టొచ్చా? అంటే అవుననే చెప్తున్నారూ.. హర్యానా రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డీజీపీ) కేపీ సింగ్. కామన్ మ్యాన్ కు క్రిమినల్ లేదా ఈవ్ టీజర్ ను చంపే అర్హత ఉందని అన్నారు. ప్రాణహాని కలిగినపుడు లేదా శారీరక వేధింపులు లేదా ఆస్థికి నష్టం కలిగించే విషయాల్లో చట్టం ప్రతి మనిషికి దుర్మార్గులను చంపే అర్హత కల్సించిందని తెలిపారు. ఆత్మరక్షణ కోసం క్రిమినల్ చంపొచ్చని చాలా మందికి తెలియదని అన్నారు. ఇలా చేయడం చట్టవిరుద్ధం కాదని చెప్పారు.

చట్టమేం చెప్తోందీ..

ఇండియన్ పీనల్ కోడ్(ఐపీసీ)100 ప్రకారం ఆరు కేసుల్లో ప్రత్యర్ధిని చంపొచ్చని ఇందులో ఉంది.

1. ప్రాణహాని ఉందని తప్ప మరే కారణం లేకుండా క్రిమినల్ ను చంపరాదు

2. తీవ్ర బాధకరంగా వేధిస్తుంటే ఎదుటి వ్యక్తిని చంపొచ్చు.

3. శారీరక వేధింపులకు పాల్పడటానికి ప్రయత్నిస్తే చంపొచ్చు.

4. కిడ్నాప్ చేస్తారని భావిస్తే చంపొచ్చు.

5. అసహజ పద్ధతిలో శృంగారానికి ప్రేరేపిస్తే చంపొచ్చు.

6. తప్పుడు ఉద్దేశంతో ఒక వ్యక్తిని నిర్భందించడం, అధికారులను చేరకుండా అడ్డుకోవడం వంటివి చేసినప్పుడు చంపొచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement