Dhan Raj
-
డైరెక్టర్‌గా ధన్‌రాజ్ కొత్త సినిమా.. టీజర్ విడుదల
టాలీవుడ్లో చిన్న చిన్న పాత్రల నుంచి హాస్యనటుడిగా ఎదిగి ఆ తరువాత కథానాయకుడి స్థాయికి చేరిన నటుడు ధన్‌రాజ్. ఈయన తాజాగా దర్శకుడిగా అవతారమెత్తి కథానాయకుడిగా నటించిన చిత్రం 'రామన్ రాఘవన్'. నటుడు సముద్రఖని ప్రధాన పాత్రను పోషించిన ఈ చిత్రం ద్వారా మోక్ష అనే నటి కథానాయకిగా పరిచయం అవుతున్నారు. స్టేట్ పెన్సిల్ ప్రొడక్షన్స్ పతాకంపై పృధ్వీ పోలవరపు నిర్మించిన ఈ చిత్రం తెలుగు, తమిళం భాషల్లో రూపొందింది. ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని, త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. ఈ సందర్భం తాజాగా చిత్రం టీజర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని చెన్నైలోని ప్రసాద్‌ల్యాబ్‌లో నిర్వహించారు. ఇందులో దర్శకుడు బాలా, పాండిరాజ్, నటుడు బాబీసింహ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొని టీజర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దర్శకుడు, కథానాయకుడు ధన్‌రాజ్ మాట్లాడుతూ.. అమ్మానాన్నలకు ధన్యవాదాలన్నారు. శివప్రసాద్ రాసిన కథతో రూపొందించిన చిత్రం రామన్ రాఘవన్ అని తెలిపారు. తాను ఈ చిత్రానికి యాక్సిడెంటల్ దర్శకుడినని చెప్పారు. ఏ దర్శకుడి వద్ద పనిచేయలేదని చెప్పారు. వేరే దర్శకుడు చేయాల్సిన ఈ చిత్రానికి తాను అనివార్యకారణాలతో దర్శకుడిని అయ్యానన్నారు. ఈ చిత్రం కథ గురించి సముద్రఖని చెప్పినప్పుడు నువ్వే దర్శకత్వం వహించు అని ధైర్యం ఇచ్చారన్నారు. తాను 100 మంది దర్శకుల చిత్రాల్లో నటించానని, వారి ప్రభావంతోనే ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు చెప్పారు. సముద్రఖని లేకపోతే ఈ చిత్రం ఉండేది కాదని ధన్‌రాజ్ పేర్కొన్నారు. సముద్రఖని మాట్లాడుతూ తాను ఇప్పటివరకూ 10కి పైగా చిత్రాల్లో నాన్నగా నటించానని చెప్పారు. అవి ఒక్కొక్కటి ఒక్కో విధంగా రూపొందాయన్నారు. ఈ చిత్ర దర్శకుడు ధన్‌రాజ్‌కు అమ్మా నాన్న లేరని, తనే స్వయం కృషితో ఈ స్థాయికి వచ్చారని పేర్కొన్నారు. నాన్న ఇతి వృత్తంతో కూడిన కథ అని తను చెప్పగానే రండి చేద్దాం అని చెప్పానన్నారు. నమ్మకంతో వచ్చే వాళ్లు చిత్రాన్ని బాగా రూపొందిస్తారని అలా ధన్‌రాజ్‌ను నమ్మి తానీ చిత్రం చేశానని చెప్పారు. ఇది తండ్రీ కొడుకుల మధ్య ప్రేమాభిమానాలను ఆవిష్కరించే కథా చిత్రంగా ఉంటుందని సముద్రఖని చెప్పారు. దర్శకుడు బాలా మాట్లాడుతూ సముద్రఖనికి అభిమానిగా తాను ఇక్కడికి వచ్చానన్నారు. ఆయన నటుడిగా తానేమిటో నిరూపించుకున్నారని, ఆయన శ్రమకు తాను అభిమానినని అన్నారు. ఇతరులకు సహాయం చేసే ఆయన గుణం తనను ఆశ్చర్యానికి గురి చేస్తుందన్నారు. ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నట్లు బాలా పేర్కొన్నారు. -
నో లిమిట్స్
ధన్ రాజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘బుజ్జీ.. ఇలా రా 2’. ‘బుజ్జీ ఇలా రా’ (2022)కి ఇది సీక్వెల్. ‘నో లిమిట్స్’ ఉపశీర్షిక. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ అంజి దర్శకుడు. ‘‘తండ్రీకూతుళ్ల ఎమోషన్ నేపథ్యంలో సాగే థ్రిల్లర్ ఫిల్మ్ ఇది’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: సర్వేశ్ మురారి. -
ఒకే ఫ్రేమ్‌లో మన తెలుగు కమెడియన్స్, పార్టీలో రచ్చ.. ఫొటో వైరల్
వెండితెరపై మనల్ని కడపుబ్బా నవ్వించే మన తెలుగు కమెడియన్స్ అంతా ఒకచోటే చేరితే ఎలా ఉంటుంది. ఊహించుకుంటూనే వారు చేసే రచ్చ ఎలా ఉంటుందో కళ్ల ముందు కదలాడుతుంది కదా. మరి నిజంగానే వారంత ఒక్కచోట చేరితే. ఇక ఫ్యాన్స్, ప్రేక్షకులకు కనులవిందె. వేణు(టిల్లు), సప్తగిరి, శ్రీనివాస్ రెడ్డి, చిత్రం శ్రీను, వెన్నెల కిషోర్ పలువురు కమెడియన్స్ ఒకప్పుడు మనల్ని తమ కామెడీతో కడుపుబ్బా నవ్వించారు. అయితే కొంతకాలంగా వారిలో కొంతమంది వెండితెరపై తక్కువగా కనిపిస్తున్నారు. చదవండి: షణ్ముఖ్, సిరిలపై షాకింగ్ కామెంట్స్ చేసిన జెస్సీ.. అరియాన షాక్ దీంతో దీంతో వారి కామెడీని, నటనను మన తెలుగు ప్రేక్షకులు మిస్ అవుతున్నారు. అలాంటి వారికి మరోసారి కనువిందు చేసే ఓ ఫొటతో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మన ఒకప్పటి కమెడియన్స్‌తో పాటు ఇప్పుటి కమెడియన్స్ అంతా ఒక్కచోట చేరారు. వేణు, శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిషోర్, ధన్‌రాజ్, రాజేశ్‌తో పాటు పలువురు కమెడియన్స్ కొన్ని రోజుల క్రితం కొంతమంది కలిసి ఫ్లయింగ్ కలర్స్ అనే ఓ గ్రూప్‌ను పెట్టుకున్నారు. చదవండి: మరింత దూకుడుగా సమంత, త్వరలో హాలీవుడ్ ఎంట్రీ! View this post on Instagram A post shared by Dhanraj (@yoursdhanraj) ఈ గ్రూప్ వాళ్ళు ప్రతి నెల ఎవరో ఒకరి ఇంట్లో కలుస్తూ సరదాగా పార్టీ చేసుకుంటారు. ప్రతి సారి ఏదో ఒక థీమ్‌తో పార్టీ చేసుకుంటారు. తాజాగా సండే వీకెండ్ సందర్భంగా ఈ గ్రూప్ మెంబర్స్ మళ్ళీ కలుసుకుని పార్టీ చేసుకున్నారు. ఈ పార్టీలో అందరూ బ్లూ కలర్ డెనిమ్ షర్ట్, ప్యాంటుతో మెరిపించారు. ఈ నేపథ్యంలో కమెడియన్ వేణు(టిల్లు) వారందరి గ్రూప్ ఫొటోను ఇన్స్టాగ్రామ్ షేర్ చేస్తూ నిన్న మా కలర్స్‌తో హ్యాపీ సండే అంటూ రాసుకొచ్చాడు. అలాగే ధన్‌రాజ్ కూడా ఈ ఫొటోను షేర్ చేస్తూ ‘స్వీట్ అండ్ క్యూట్ పార్టీ. హోస్టింగ్ చేసింది వెన్నెల కిషోర్, కమెడియన్ సత్య. లవ్ యూ’ అంటూ షేర్ చేశాడు. చదవండి: రియల్ సినతల్లికి రూ. 10 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్ View this post on Instagram A post shared by Venu Tillu (@venu_tilloo) -
నవ్వించే ‘ఏకే రావ్ పీకే రావ్’
హాస్యనటులుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ధన్‌రాజ్, తాగుబోతు రమేష్ ‘ఏకే రావ్ పీకే రావ్’ చిత్రంతో హీరోలుగా మారారు. సాయివెంకటేశ్వర కంబైన్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి కోటపాటి శ్రీను దర్శకత్వం వహించారు. కేఎస్సార్ స్వరపరచిన ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. పాటల సీడీని నాని ఆవిష్కరించి, దామోదరప్రసాద్, నందినీరెడ్డికి ఇచ్చారు. ఈ చిత్రం ద్వారా ధన్‌రాజ్, తాగుబోతు రమేష్ కెరీర్ మరింత పుంజుకోవాలని, తమ సంస్థ ద్వారా తాగుబోతు రమేష్‌కి బ్రేక్ రావడం ఆనందంగా ఉందని దామోదరప్రసాద్ అన్నారు. తను నటించిన అలా మొదలైంది, ఈగ, భీమిలి కబడ్డీ చిత్రాల్లో ధన్‌రాజ్, తాగుబోతు రమేష్ చేశారనీ, ఈ ఇద్దరూ హీరోలుగా నటించిన ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని నాని చెప్పారు. ధన్‌రాజ్, రమేష్ కష్టపడే తత్వం ఉన్నవారని, ఈ చిత్రం బాగా ఆడి నిర్మాతకు లాభాలు రావాలని శివాజి తెలిపారు. ఓ ఏరియాలో ఈ సినిమాని పంపిణీ చేస్తున్నానని సురేష్ కొండేటి అన్నారు. టైటిల్ రోల్స్‌ని భుజాన మోయగలమనే నమ్మకం కుదరడం, కథలో వినోదం ఉండటంతో ఈ సినిమా చేశామని ధన్‌రాజ్, తాగుబోతు రమేష్ చెప్పారు. ఇంకా నందినీరెడ్డి, మారుతి, ప్రిన్స్, డీయస్ రావు, బెక్కెం వేణుగోపాల్ తదితరులు సినిమా విజయం సాధించాలనే ఆకాంక్షను వెలిబుచ్చారు.