dharmavaram mla
-
ధర్మవరంలో ఇకపై తాగునీటి సమస్య ఉండదు : ఎమ్మెల్యే కేతిరెడ్డి
-
సమస్యల పరిష్కారం కోసం కాల్‌సెంటర్
సాక్షి, ధర్మవరం: అర్హులందరికీ సంక్షేమ పథకాలను అందజేయడం, అవినీతి నిర్మూలన కోసం ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. సంక్షేమ పథకాలకు అర్హులకు అందించేందుకు కాల్‌సెంటర్‌ను ఏర్పాటు చేశారు. గురువారం స్థానిక ఎస్బీఐ కాలనీలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన కాల్‌సెంటర్‌ను ఆయన ప్రారంభించారు. ధర్మవరం నియోజకవర్గ పరిధిలోని ప్రజలు ఏ సమస్య అయినా, ఏ సంక్షేమ పథకం అందకపోయినా 94931 56565 నంబర్‌ను ఫోన్ చేయవచ్చన్నారు. ఈ సందర్భంగా కేతిరెడ్డి మాట్లాడుతూ, తమ నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి స్ఫూర్తితో పారదర్శక పాలన, సంక్షేమ పథకాలు 100 శాతం అందించాలన్న తలంపుతో ముందుకు పోతున్నామన్నారు. ఇందులో భాగంగా కాల్‌సెంటర్ ఏర్పాటు చేసి ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామన్నారు. సంక్షేమ పథకాలు అందించేందుకు ఎవరైనా లంచం అడిగినా, బెదిరించినా ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చన్నారు. -
సూరీ..నిజం చెప్పాలె!
ఇంత కాలం నెరవేర్చకుండా అటకెక్కించిన హామీల మూటను ధర్మవరం ఎమ్మెల్యే సూరి కిందకు దించాడు. భుజాన వేసుకుని ఎన్నికల ప్రచారానికి జనం మధ్యలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. ఇంతలో ఆ మూటలో నుంచి ఓ హామీ సూరిని పలకరించింది. ‘ఓ సూరీ.. ఎమ్మెల్యేగా ఐదేళ్లు ధర్మవరం నియోజకవర్గాన్ని పాలించావు. ఈ ఐదేళ్లూ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా మోసం చేశావు. ఇప్పడు మళ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు పట్టువదలకుండా బయలుదేరావు. నీ సమయస్ఫూర్తిని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నా. నీకు ప్రయాస భారం తెలియకుండా ఓ కథ చెబుతాను విను. అంటూ ఆయన హామీలను ఓసారి గుర్తు చేసింది. సాక్షి, తాడిమర్రి : ముప్పై సంవత్సరాల క్రితం తాడిమర్రి మండలంలోని చెరువులను పీఏబీఆర్ నీటితో నింపేందుకు శ్రీకారం చుట్టారు. పీఏబీఆర్ నుంచి పలు గ్రామాల మీదుగా కాలువ తవ్వకాలు చేపట్టారు. తాడిమర్రి మండలంలోని శివంపల్లి వద్ద (112వ కిలోమీటర్)కు చేరుకోగానే పనులు ఆగిపోయాయి. మరో 2.4 కి.మీ మేర పనులు జరిగితే తాడిమర్రి సమీపంలోని తాటిమాండ్ల వంక మీదుగా చిత్రావతి నది నుంచి మండలంలోని చెరువులకు నీరు చేరుతుంది. చెరువుల్లో నీరు చేరితే ఈ పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలాలు పెరిగి బోరుబావుల్లో నీటిమట్టం పెరిగి సాగునీటి సంకటం తప్పిపోతుంది. రైతుల జీవితాలే మారిపోతాయి. కానీ ఈ పనులు మూడు దశాబ్దాలుగా ముందుకు సాగలేదు. మూడేళ్ల క్రితం ఎమ్మెల్యే హోదాలో ఈ పనులు పూర్తి చేసి, చెరువులకు నీరు అందిస్తామంటూ నీవు చేసిన హంగామా అంతాఇంతా కాదు. కాలువ వెళ్లే మార్గంలో 33.70 ఎకరాల భూమి అవసరమని, రైతుల నుంచి కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఇందుకు రైతులకు పరిహారంగా చెల్లించేందుకు రూ. 1.36 కోట్లు కూడా మంజూరయ్యాయని ప్రకటించావు. కాలువ తవ్వకాలకు రూ.8 కోట్లతో డిటైయిల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్ (డీపీఆర్) సిద్ధం చేసి అనుమతుల కోసం పంపినట్లు ఊరించావు. కాలువ నిర్మాణం పూర్తి కాగానే మండలంలోని అన్ని చెరువులనూ నీటితో నింపుతామంటూ ఆశలు పెట్టావు. ఆ తర్వాత అటువైపు కన్నెత్తి చూడలేదు. 2018 జనవరి 4న మర్రిమాకులపల్లిలో జరిగిన జన్మభూమి గ్రామసభలో, ఈ ఏడాది జనవరి 8న తాడిమర్రిలో జరిగిన జన్మభూమి గ్రామసభలోనూ పీఏబీఆర్ కాలువ నిర్మాణం పూర్తి చేస్తానని హామీనిచ్చావు. నేటికీ ఈ పనులు చేపట్టలేదు. సూరీ! ఇప్పుడు చెప్పు.. దేశానికి వెన్నముక రైతే అని అంటారు కదా? మరి అలాంటి రైతు సంక్షేమానికి నీవు చేసిందేమి? అసంపూర్తిగా నిలిచిపోయిన కాలువ పనులు పూర్తి చేస్తానని మూడేళ్లుగా రైతులను మభ్య పెడుతూ వచ్చావు. నిధులూ మంజూరయ్యాయన్నావు... మరి పనులు ఎందుకు పూర్తి చేయలేకపోయావు..? వాస్తవాలు నీవు చెప్పకపోతే నియోజకవర్గ ప్రజలే చెబుతారు. నియోజకవర్గంలో నీవు తలెత్తుకుని తిరగలేవు. అలాగని తప్పు సమాధానం చెప్పి జనాన్ని మభ్య పెట్టే ప్రయత్నం చేస్తే నీకు ఓటమి తప్పదు. సమాధానం చెప్పేందుకు సూరి నోరు విప్పాడు. ‘ఓటు బ్యాంక్ రాజకీయల కోసం’ అంటూ చెప్పేలోపు హామీ అడ్డుకుని మభ్య పెట్టే ప్రయత్నం చేయమాకు సూరీ.. వాస్తవాలేమిటో ప్రజలే చెబుతారు విను అంటూ ఆ హామీ కాస్త గాలికి ఎగిరిపోయింది. ఇతని పేరు అల్లే రామచంద్రారెడ్డి. తాడిమర్రి మండలం శివంపల్లి గ్రామం. ఐదు ఎకరాల్లో 900 చీనీ చెట్లు పెంచుతున్నాడు. మరో 1.50 ఎకరాల్లో వేరుశనగ పంట సాగు చేపట్టాడు. సాగునీరు సరిపోక పోవడంతో మరో మూడు ఎకరాలను బీడుగా వదిలేశాడు. ఇటీవల రూ.1.20 లక్షలు ఖర్చుచేసి రెండు బోర్లు వేశాడు. చుక్కనీరు పడలేదు. పీఏబీఆర్ కాలువ నిర్మాణం పూర్తయి చెరువులకు నీరు చేరి ఉంటే ప్రస్తుతమున్న పంటను కాపాడుకోవడంతో పాటు మిగిలిన మూడు ఎకరాల్లోనూ పంట సాగు చేసేవాడినంటూ రైతు చెబుతున్నాడు. రైతులను మభ్యపెట్టారు కాలువ నిర్మాణం పూర్తి చేస్తున్నట్లు రైతులను ఎమ్మెల్యే సూరి మభ్య పెట్టారు. రైతులకు మేలు చేయాలనే ఆలోచన ఆయనలో లేకపోవడంతో నిర్మాణ పనులు హామీకే పరిమితమయ్యాయి. – ఓబిరెడ్డి, శివంపల్లి, తాడిమర్రి మండలం -
‘అనంత’లో ఉద్రిక్తత
– ఎస్పీ బంగ్లా ఎదుట ధర్మవరం ఎమ్మెల్యే ఆందోళన – మంత్రి పరిటాల సునీత అనుచరులు, పోలీసులు ఉద్దేశపూర్వకంగానే తమవారిని కొట్టారంటూ ఆరోపణ – ధర్మవరం డీఎస్పీ వేణుగోపాల్, ఎస్ఐ రాజశేఖర్‌రెడ్డిలను సస్పెండ్ చేయాలని డిమాండ్ అనంతపురం సెంట్రల్ : తన నియోజకవర్గంలో మంత్రి పరిటాల సునీత అనుచరుల ఆగడాలు ఎక్కువయ్యాయని ఆరోపిస్తూ ధర్మవరం ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ (వరదాపురం సూరి) ఆందోళనకు దిగారు. తన అనుచరులతో కలిసి శనివారం అనంతపురంలో ఎస్పీ బంగ్లా (క్యాంపు కార్యాలయం) ఎదుట బైఠాయించారు. ఉద్రిక్త వాతావరణం తలెత్తడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ముందస్తుగానే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇద్దరు డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలతో పాటు భారీగా సిబ్బందిని మోహరించారు. వజ్రా, వాటర్‌క్యాన్ వాహనాలనూ సిద్ధంగా ఉంచారు. వందలాది మంది కార్యకర్తలు, ధర్మవరంలో శుక్రవారం జరిగిన ఘర్షణలో గాయపడిన తన అనుచరులతో కలిసి ఎస్పీ బంగ్లా ఎదుట బైఠాయించిన వరదాపురం.. మంత్రి సునీత, పోలీసుల తీరుపై మండిపడ్డారు. ధర్మవరం చరిత్రలో ఎన్నడూ ఇలాంటి ఘటన జరగలేదన్నారు. ఒకే ఘటనలో దాదాపు వంద మంది తమ పార్టీ కార్యకర్తలు, నాయకులు, వార్డు కౌన్సిలర్ గాయపడి ఆస్పత్రుల పాలయ్యారన్నారు. చిగిచెర్ల రోడ్డు వద్ద తమపార్టీ నాయకులు చేపడుతున్న పనులకు మంత్రి పరిటాల సునీత అనుచరులు అడ్డు తగులుతున్నారని చెప్పడంతో తాను వెళ్లి సర్ది చెప్పానన్నారు. తర్వాత దాదాపు 200 మంది మంత్రి పరిటాల సునీత, శ్రీరాం అనుచరులు వచ్చి తమ వారిపై విచక్షణారహితంగా దాడి చేశారన్నారు. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న వారిని పోలీసులు కూడా కొట్టారన్నారు. మంత్రి అనుచరులు, పోలీసులు కలిసి ఉద్దేశపూర్వకంగానే తమవారిపై దాడి చేశారని ఆరోపించారు. అధికారంలో ఉండి కూడా ప్రతిపక్ష నాయకుల తరహాలో ధర్నా చేయాల్సి వస్తోందన్నారు. ఈ విషయాన్ని సీఎం దృష్టికి కూడా తీసుకుపోతామన్నారు. ధర్మవరం డీఎస్పీ వేణుగోపాల్, ఎస్ఐ రాజశేఖరరెడ్డిలను సస్పెండ్ చేయాలని, పరిటాల అనుచరులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా ఎస్పీ రాజశేఖర్‌బాబును కలిసి వినతిపత్రం అందజేశారు. ఎస్పీ స్పందిస్తూ ధర్మవరం ఘటనపై విచారణ చేయిస్తామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ధర్మవరంలో 144 సెక్షన్ ధర్మవరంటౌన్ :మంత్రి పరిటాల సునీత, ఎమ్మెల్యే సూరి అనుచరుల మధ్య ఘర్షణ నేపథ్యంలో పోలీసులు ధర్మవరంలో ఈ నెల 21వ తేదీ వరకు 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. పట్టణ శివారు ప్రాంతాలు, ప్రధాన వీధుల్లో గస్తీ నిర్వహిస్తున్నారు. గుంపులుగా అనుమానితులు ఎవరైనా తిరుగుతుంటే అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.