డోన్ పోలీసులపై హెచ్చార్సీలో ఫిర్యాదు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా డోన్ పోలీసులపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్లో ఫిర్యాదు నమోదైంది. ఓ కేసు విషయంలో పోలీస్ స్టేషన్కు వెళ్తే.. అకారణంగా దాడి చేశారని.. ఈ అంశాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా లాభం లేకపోవడంతో పాటు అక్రమ కేసులు బనాయిస్తుమని వేధిస్తుండటంతో బాధిత దంపతులు శుక్రవారం హెచ్చార్సీని ఆశ్రయించారు. తనపై దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకొని రక్షణ కల్పించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.