Dial Your JC
-
డయల్ యువర్ జేసీకి 21 ఫిర్యాదులు
కాకినాడ సిటీ : కలెక్టరేట్ కాల్‌సెంటర్ నుంచి జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ శనివారం డయల్ యువర్ జేసీ నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి 21 ఫోన్లు రాగా, వాటిలో భూసర్వే, రేష¯ŒSకార్డులు, బ్యాంకు రుణాలు తదితర అంశాలపై ఫిర్యాదులు వచ్చాయి. ఎస్సీ శ్మశాన వాటిక సర్వే నంబర్ 429ను ఆక్రమించి, రైతులు మధ్యలోంచి రోడ్డు వేశారని, సర్వేకు దరఖాస్తు చేశామని రాజానగరం మండలం కాపవరానికి చెందిన సుబ్బారావు తెలుపగా, సంబంధిత తహశీల్దార్‌ను పరిశీలించాల్సిందిగా ఆదేశించారు. జాతీయ పొదుపు పథకం ఏజెంట్లుగా పనిచేసిదుకు ఇన్సెంటివ్‌గా రూ.లక్షా 50వేలు వరకూ చెల్లించాల్సి ఉందని, రెండేళ్లుగా తిరుగుతున్నామని సామర్లకోటకు చెందిన సత్యనారాయణమూర్తి ఫిర్యాదు చేయగా పరిశీలించి పరిష్కరిస్తామన్నారు. అసంఘటిత కార్మికులందరూ బీమా చేయించుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న బీమా పథకంలో అసంఘటిత కార్మికులందరూ నమోదు చేయించుకోవాలని జేసీ సూచించారు. ఈ నెల 15వ తేదీలోపు అందరూ సభ్యులుగా చేరాలని, ప్రజాసాధికారిత సర్వేలో ఇంటింటికీ వచ్చి నమోదు చేస్తున్నారని, వివరాలు తెలియజేసి నమోదు చేయించుకోవాలన్నారు. ఏడాదిగా రూ.15 బీమా చెల్లించాలని, 15 ఏళ్ల నుంచి 50 ఏళ్లలోపు వారు దీనికి అర్హులన్నారు. డీఎస్ఓ జి.ఉమామహేశ్వరరావు, డీఎం ఎ.కృష్ణారావు, కలెక్టరేట్ ఏఓ తేజేశ్వరరావు పాల్గొన్నారు. -
డయల్ యువర్ జేసీకి 18 ఫిర్యాదులు
కాకినాడ సిటీ: డయల్ యువర్ జేసీ కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి శనివారం ఆయన డయల్ యువర్ జేసీ కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి 18 ఫోన్ కాల్స్ వచ్చాయి. వాటిలో భూ సర్వే, రేషన్ కార్డులు, రోడ్లు, విద్యుత్ తదితర సమస్యలకు జేసీ నేరుగా సమాధానమిచ్చారు. పెద్దింటి వారిపాలెంలో పంచాయతీ స్థలం ఆక్రమణకు గురైందని అంబాజీపేట మండలం కె.పెదపూడి నుంచి రాజారావు ఫిర్యాదు చేశారు. కొత్తపేట మండలం బిళ్ళకుర్రు నుంచి గొలకోటి విష్ణుమోహన్‌రావు తన భూమి సర్వే నంబర్ 282/4 ఆన్లైన్లో నమోదు చేయాల్సిందిగా దరఖాస్తు చేసినప్పటికీ ఇంతవరూ ఆన్లైన్లో నమోదుకాలేదని ఫిర్యాదు చేశారు. తాళ్ళరేవు మండలం పి.మల్లవరం నుంచి బొతు శ్యామలాదేవి మాట్లాడుతూ ఇళ్ళ స్థలం ఇచ్చారుగాని, పట్టా ఇవ్వలేదని, ఆ స్థలంలో పాక వేసుకుంటే తొలగించారన్నారు. డీఎస్ఓ ఉమామహేశ్వరరావు, డీఎం ఎ.కృష్ణారావు, సర్వే ఏడీ నూతన్‌కుమార్ పాల్గొన్నారు. -
‘కల్యాణలక్ష్మి’ డబ్బులు ఇంకెప్పుడు..!
డయల్ యువర్ జేసీలో ఫిర్యాదు సంగారెడ్డి క్రైం : కల్యాణలక్ష్మి పథకం కింద దరఖాస్తు చేసి నెలలు గడుస్తున్నా ఇంతవరకు డబ్బులు ఇవ్వలేదని దుబ్బాక మండలం రామక్కపేటకు చెందిన దళితుడు నవీన్‌కుమార్ వాపోయారు. డయల్ యువర్ జేసీ కార్యక్రమంలో భాగంగా మంగళవారం కలెక్టరేట్లో డీఎస్ఓ కార్యాలయ డిప్యూటీ తహశీల్దార్ బాల్‌రాజ్ ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా సదాశివపేటకు చెందిన నసీర్ మాట్లాడుతూ సదాశివపేటలోని షాపు నంబర్ 6,14 రేషన్ దుకాణాల్లో డీలర్లు సరుకులను సక్రమంగా పంపిణీ చేయడం లేదన్నారు. సమగ్ర విచారణ చేపట్టి వినియోగదారులకు సకాలంలో సరుకులు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. హత్నూర మండలం దేవులపల్లి గ్రామానికి చెందిన రంగారెడ్డి మాట్లాడుతూ గ్రామంలోని సర్వే నం. 33లోని ఆరు ఎకరాల 9 గుంటల భూమిలో సర్వే చేయాలన్నారు. సదాశివపేట మండలం పెద్దాపూర్‌కు చెందిన కుమార్ మాట్లాడుతూ గ్రామంలో మద్యం బెల్టు షాప్ నిర్వహిస్తున్నారని తగిన చర్యలు తీసుకోవాలన్నారు. దౌల్తాబాద్ మండలం దొమ్మాటకు చెందిన గంగాధర్‌రావు మాట్లాడుతూ గ్రామంలోని సర్వే నం. 649/1లోని భూమిని సర్వే చేయాలని కోరారు. నారాయణఖేడ్‌కు చెందిన ఎండీ మినాజొద్దీన్ మాట్లాడుతూ వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మించుకున్నప్పటికీ ఇప్పటివరకు బిల్లు మంజూరు కాలేదన్నారు. దౌల్తాబాద్ మండలం ఇందుప్రియాల్‌కు చెందిన నాగరాజు మాట్లాడుతూ గ్రామంలోని అసైన్మెంట్ భూమిని సర్వే చేయాలన్నారు. తూప్రాన్ మండలం మనోహరాబాద్‌కు చెందిన బాబురావు మాట్లాడుతూ గ్రామ శివారులోని ఎల్లమ్మ చెరువు హద్దులను నిర్దేశించాలని కోరారు.