డయల్ యువర్ జేసీకి 21 ఫిర్యాదులు
Published Sat, Nov 5 2016 11:39 PM | Last Updated on Mon, Sep 4 2017 7:17 PM
కాకినాడ సిటీ :
కలెక్టరేట్ కాల్‌సెంటర్ నుంచి జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ శనివారం డయల్ యువర్ జేసీ నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి 21 ఫోన్లు రాగా, వాటిలో భూసర్వే, రేష¯ŒSకార్డులు, బ్యాంకు రుణాలు తదితర అంశాలపై ఫిర్యాదులు వచ్చాయి. ఎస్సీ శ్మశాన వాటిక సర్వే నంబర్ 429ను ఆక్రమించి, రైతులు మధ్యలోంచి రోడ్డు వేశారని, సర్వేకు దరఖాస్తు చేశామని రాజానగరం మండలం కాపవరానికి చెందిన సుబ్బారావు తెలుపగా, సంబంధిత తహశీల్దార్‌ను పరిశీలించాల్సిందిగా ఆదేశించారు. జాతీయ పొదుపు పథకం ఏజెంట్లుగా పనిచేసిదుకు ఇన్సెంటివ్‌గా రూ.లక్షా 50వేలు వరకూ చెల్లించాల్సి ఉందని, రెండేళ్లుగా తిరుగుతున్నామని సామర్లకోటకు చెందిన సత్యనారాయణమూర్తి ఫిర్యాదు చేయగా పరిశీలించి పరిష్కరిస్తామన్నారు.
అసంఘటిత కార్మికులందరూ బీమా చేయించుకోవాలి
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న బీమా పథకంలో అసంఘటిత కార్మికులందరూ నమోదు చేయించుకోవాలని జేసీ సూచించారు. ఈ నెల 15వ తేదీలోపు అందరూ సభ్యులుగా చేరాలని, ప్రజాసాధికారిత సర్వేలో ఇంటింటికీ వచ్చి నమోదు చేస్తున్నారని, వివరాలు తెలియజేసి నమోదు చేయించుకోవాలన్నారు. ఏడాదిగా రూ.15 బీమా చెల్లించాలని, 15 ఏళ్ల నుంచి 50 ఏళ్లలోపు వారు దీనికి అర్హులన్నారు. డీఎస్‌ఓ జి.ఉమామహేశ్వరరావు, డీఎం ఎ.కృష్ణారావు, కలెక్టరేట్ ఏఓ తేజేశ్వరరావు పాల్గొన్నారు.
Advertisement
Advertisement