dibar
-
ఇంటర్ పరీక్షల్లో నలుగురు డిబార్
డోన్ టౌన్ : ఇంటర్ మీడియట్ మొదటి సంవత్సరం పరిక్షల్లో మాస్‌కాపీయింగ్‌కు పాల్పడుతున్న నలుగురు విద్యార్థులను సిట్టింగ్ స్క్వాడ్ సోమవారం డిబార్ చేసింది. డోన్ మోడల్ స్కూల్ కేంద్రంగా నిర్వహిస్తున్న పరీక్షలను సోమవారం జిల్లా సిట్టింగ్ స్క్వాడ్ నాగస్వామి నాయక్, డిపార్ట్మెంటల్ అధికారి నాగయ్య, ప్రిన్సిపాల్ నాగరవీందర్ తనిఖీలు చేశారు. మాస్‌కాపీయింగ్‌కు పాల్పడుతున్న నవోదయ, వెంకటేశ్వర, ప్రభుత్వ జూనియర్ కాలేజీలకు చెందిన నలుగురిని గుర్తించి డిబార్ చేశారు. -
డీబార్ ‘150’
♦ ఇంటర్ పరీక్షల్లో ఇదీ పరిస్థితి ♦ జంటజిల్లాల్లో గణనీయంగా మాల్‌ప్రాక్టీస్ కేసులు నమోదు ♦ విస్మయం వ్యక్తం చేస్తున్న అధికారులు సాక్షి, హైదరాబాద్: ఎన్నడూ లేని విధంగా ఈ సారి ఇంటర్మీడియెట్ పరీక్షల్లో విద్యార్థులు అధిక సంఖ్యలో డిబార్ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటే.. రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లోనే కాపీ కొడుతూ దాదాపు 150 మంది పట్టుబడ్డారు. సెకండియర్‌కు సంబంధించి మరో పరీక్ష మిగి లి ఉండగానే ఈ స్థాయిలో డిబార్ కావటం చర్చ నీయాంశంగా మారింది. నిత్యం డిబార్ అవుతున్న విద్యార్థుల సంఖ్యను చూసి అధికారులు సైతం విస్మ యం వ్యక్తం చేస్తున్నారు. ఇంతటి భారీ సంఖ్యలో స్క్వాడ్లకు దొరకడం తమ అనుభవంలో ఇదే తొలిశారని అంటున్నారు. ఎటువంటి తప్పిదాలకు, కాపీయింగ్ తావులేకుండా పూర్తిగా పారదర్శకంగా పరీక్షలు నిర్వహించాలని ఇంటర్ బోర్డ్ నుంచి జిల్లా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు అందాయి. ఈ క్రమంలో పరీక్షల ప్రారంభం నుంచి పకడ్బందీగా, ప్రశాంతంగా నిర్వహిం చడంపై జిల్లా అధికారులు దృష్టి సారించారు. ఇందులో భాగంగా సాధ్యమైనన్ని కేంద్రాల్లో 11 ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు విస్తృతంగా తనిఖీలు చేశాయి. జంట జిల్లాల్లో ఒక్కో పరీక్షకు 50కి పైగా కేంద్రాల్లో తనిఖీ బృందాలు తిరిగాయి. ద్వితీయ భాష మినహా అన్ని పరీక్షల్లోనూ విద్యార్థులు డిబార్ అయ్యారు. ఒకేరోజు గరిష్టంగా 24 మంది కాపీ కొడుతూ పట్టుబడటం... కాపీయింగ్ తీవ్రతను తెలియజేస్తోంది. రంగారెడ్డి జిల్లా పరిధిలో 71, హైదరాబాద్ జిల్లాలో 75 మంది విద్యార్థులు డిబార్ అయ్యారు. ఇందులో నలుగురు విద్యార్థులు ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాస్తూ దొరికారు. ఇవన్నీ కలుపుకుంటే.. పట్టుబడిన వారి సంఖ్య 146కు చేరింది. వీరందరిపై ఆయా పోలీస్స్టేషన్లలో మాల్‌ప్రాక్టీస్ కేసులు నమోదయ్యాయి. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి హైటెక్ కాపీయింగ్‌కు యత్నించిన ఫస్టియర్ విద్యార్థి ఎజాజ్ ఈనెల 12న సనత్‌నగర్‌లో ఇన్విజిలెటర్‌కు చిక్కిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో రాష్ట్రవ్యాప్తంగా అందరి చూపు నగరంపై పడింది. ఉన్నతాధికారులు చాలా సీరియస్ అయ్యారు. ముగిసిన ఫస్టియర్ పరీక్షలు ఈనెల 2న ప్రారంభమైన ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు మంగళవారంతో ముగిశాయి. ఇన్నాళ్లూ పుస్తకాలతో కుస్తీ కట్టిన విద్యార్థులు.. పరీక్షలు ముగియడంతో చిరునవ్వుతో ఇంటిముఖం పట్టారు. చివరి పరీక్షలో హైదరాబాద్ జిల్లా పరిధిలో ముగ్గురు, రంగారెడ్డి జిల్లాలో నలుగురు విద్యార్థులు డిబార్ అయ్యారు. వీరిపై మాల్‌ప్రాక్టీస్ కేసులు నమోదయ్యాయి. ఫస్టియర్ ప్రధాన సబ్జెక్టులన్నీ పూర్తికాగా.. ఒకేషనల్, బ్రిడ్జి కోర్సు సబ్జెక్టులు మాత్రమే మిగిలాయి. ఇవి కూడా శనివారంతో ముగియనున్నాయి. బుధవారం జరిగే పరీక్షతో సెకండియర్ పరీక్షలు పూర్తవుతాయి. పట్టుబడ్డ విద్యార్థుల వివరాలు పరీక్ష రంగారెడ్డి హైదరాబాద్ ఫస్టియర్ 32 32 సెకండియర్ 39 39 -
ఇంటర్లో 17 మంది విద్యార్థుల డిబార్
సాక్షి, సిటీబ్యూరో: జంట జిల్లాల పరిధిలో బుధవారం నిర్వహించిన ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలో 17 మంది విద్యార్థులు డిబార్ అయ్యారు. హైదరాబాద్ జిల్లాలో మెహదీపట్నంలోని ఎల్బీ జూనియర్ కాలేజ్‌లో ఒకరు, శ్రీ అరబిందో జూనియర్ కాలేజీలో ఇద్దరు, పాతబస్తీలోని అల్హబెత్ కాలేజీలో నలుగురు, ఖైరతాబాద్‌లోని షాదాన్ జూనియర్ కాలేజీలో ఐదుగురు విద్యార్థులు మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడ్డారు. రంగారెడ్డి జిల్లా పరిధిలో మరో ఐదుగురిపై మాల్ ప్రాక్టీస్ కింద కేసులు నమోదు చేసినట్లు జంట జిల్లాల ఆర్ఐఓలు రవికుమార్, గౌరీ శంకర్లు తెలిపారు. మొత్తం 2,01,248 మందికి గాను 1,90,721 మంది విద్యార్థులు (94.76 శాతం) పరీక్షకు హాజరయ్యారు. హైదరాబాద్ జిల్లాలో 94.62 శాతం, రంగారెడ్డి జిల్లాలో 94.87 శాతం విద్యార్థులు పరీక్ష రాశారు. -
ఇంటర్ పరీక్షల్లో ఏడుగురి డిబార్
గుంటూరు : మైక్రో కాపీయింగ్‌కు పాల్పడుతున్న ఏడుగురు ఇంటర్ విద్యార్థులు డిబార్ అయ్యారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలోని నారాయణ జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రాన్ని జిల్లా పరీక్షల కమిటీ అధికారి రామచందర్‌రావు, ఇతర అధికారులు సోమవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులు ఏడుగురు కాపీ చేస్తూ పట్టుబడ్డారు. దీంతో వారిని డిబార్ చేశారు. (సత్తెనపల్లి) -
పరీక్షలు ప్రశాంతం
తొలిరోజు 48,870మంది హాజరు రెండు కేంద్రాల్లో నేలపై అవస్థలు 48 కేంద్రాల్లో తనిఖీలు.. ఒకరు డిబార్ నేటి నుంచి ఇంటర్ సెకండియర్‌కు... పెదవాల్తేరు (విశాఖపట్నం) : ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు విద్యార్థులు చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొన్నారు. ఈ ఏడాది నేలబారు పరీక్షలకు తావు లేకుండా పక్కా ఏర్పాట్లు చేసినప్పటికీ ఏజెన్సీలోని రెండు కేంద్రాల్లో విద్యార్థులు నేలపైనే పరీక్షలు రాశారు. అర్బన్‌లో ఆ పరిస్థితి లేనప్పటికీ విద్యార్థులు ఇరుకు గదులతో ఇబ్బంది పడ్డారు. తక్కువ కెపాసిటీ ఉన్న కళాశాలలకు ఎక్కువమంది విద్యార్థులను కేటాయించడంతో ఈ పరిస్థితి వచ్చింది. గదులు చాలకపోవడంతో ఆరుబయట కుర్చీలు ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహించారు. నగరంలోని నాలుగు కళాశాలల్లో ఈ సమస్య ఎదురైంది. మరుసటి రోజు నుంచి ఇలాంటి పరిస్థితి రాకుండా అదనపు గదులు కేటయించాలని ఇంటర్ బోర్డు అధికారులు పరీక్ష కేంద్రాల యాజమాన్యాలను ఆదేశించారు. తొలి రోజు నిర్వహించిన భాషా పరీక్షకు 48,870 మంది విద్యార్థులు హాజరయ్యారు. 2,457మంది హాజరు కాలేదు. ముంచంగిపుట్టు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మాస్ కాపీయింగ్‌కు పాల్పడిన ఒక విద్యార్థిని డిబార్ చేశారు. జిల్లావ్యాప్తంగా 111 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించగా 48 కేంద్రాలను ప్రత్యేక బృందాలు తనిఖీలు చేశాయి. ఇంటర్‌బోర్డు 14 మందిని తనిఖీ బృందాల్లో నియమించ గా జిల్లా కలెక్టర్ ఇంజినీరింగ్ శాఖకు చెందిన 14 మందిని తనిఖీ బృందాలుగా నియమించారు. వీరంతా పరీక్షలను పర్యవేక్షించారు. అంతేకాకుండా హై పవర్ కమిటీ, డెక్ కన్వీనర్లు, డీవీఈవో, ఆర్ఐవో, పోలీస్ బృందాలు కూడా తనిఖీలు నిర్వహించాయి. గురువారం నుంచి ద్వితీయ సంవ త్సరం విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తారు. జిల్లావ్యాప్తంగా 111 పరీక్ష కేంద్రాల్లో వీరు పరీక్షలు రాయనున్నారు. ఈ పరీక్షలను కూడా ఇంటర్ బోర్డు, జిల్లా కలెక్టర్ నియమించిన ప్రత్యేక తనిఖీ బృందాలు పర్యవేక్షించనున్నాయి. ఈ పరీక్షలకు 50.567మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ట్రాఫిక్ టెన్షన్ ఇంటర్ విద్యార్థులను ట్రాఫిక్ టెన్షన్ వెంటాడింది. సమయానికి పరీక్ష కేంద్రానికి వెళ్తామో లేదోనని ఆందోళన పడ్డారు. ఆర్టీసీ కాంప్లెక్స్, ద్వారకానగర్, డాబాగార్డెన్స్ వంటి రద్దీ ప్రాంతాల్లోని పరీక్ష కేంద్రాలకు వెళ్లాల్సిన విద్యార్థులు ఉదయం ట్రాఫిక్‌లో ఇరుక్కున్నారు. కార్పొరేట్ కళాశాలల విద్యార్థులు కార్లలో, మధ్యతరగతి విద్యార్థులు ఆటోలు, ద్విచక్ర వాహనాల్లో రావడంతో రద్దీ ఎక్కువైంది. సాధారణ సమయాల్లోనే రద్దీగా ఉండే ఆర్టీసీ కాంప్లెక్స్, డాబాగార్డెన్స్, ద్వారకానగర్ ఏరియాలు పరీక్షల కారణంగా మరింత ర ద్దీగా మారాయి. ట్రాఫిక్‌ను తప్పించుకుని పరీక్ష కేంద్రాలకు చేరుకోవడానికి విద్యార్థులు ఉరుకులు, పరుగులు తీశారు. ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ సిబ్బందిని నియమించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరారు. -
డిగ్రీ పరీక్షల్లో నలుగురి డిబార్
నెల్లూరు సిటీ, న్యూస్‌లైన్: వీఎస్‌యూ పరిధిలో సోమవారం నిర్వహించిన డిగ్రీ పరీక్షలో నలుగురు విద్యార్థులు కాపీయింగ్‌కు పాల్పడుతూ డిబార్ అయ్యారు. నగరంలో డీకే ప్రభుత్వ కళాశాల కేంద్రంలో నిర్వహిస్తున్న డిగ్రీ తృతీయ సంవత్సర పరీక్షల్లో ఒకరు, సర్వోదయ కళాశాల కేంద్రంలో నిర్వహిస్తున్న ప్రథమ సంవత్సర పరీక్షల్లో ముగ్గురు విద్యార్థులు కాపీయింగ్‌కు పాల్పడుతుండగా అధికారులు గుర్తించి డిబార్ చేశారు. తృతీయ సంవత్సర పరీక్షల్లో 366 మందికి 270 మంది, ప్రథమ సంవత్సర పరీక్షలకు 722 మందికి 551 మంది హాజరయ్యారు. ముగిసిన ఎంసీఏ, ఎల్ఎల్బీ పరీక్షలు వీఎస్‌యూ పరిధిలో నిర్వహిస్తున్న ఎంసీఏ, ఎల్ఎల్బీ సెకండ్ సెమిస్టర్ పరీక్షలు సోమవారం ముగిశాయి. ఎంసీఏ పరీక్షలకు 290 మందికి 232 మంది, ఎల్ఎల్బీ పరీక్షలకు 251 మందికి 182 మంది హాజరయ్యారు.