Digging for Hidden treasures
-
గుప్తనిధుల కోసం ఇల్లాలినే చంపారు
హైదరాబాద్: గుప్త నిధులు దక్కుతాయనే మూఢనమ్మకం ఓ నిండుప్రాణాన్ని బలితీసుకుంది. కట్టుకున్నభర్త, కన్నకొడుకే ఈ దారుణానికి ఒడిగట్టారు. నగర నడిబొడ్డులో ఈ ఘటన చోటుచేసుకుంది. రాజ్‌భవన్ ఎదురుగా ఉన్న ఎంఎస్‌మక్తాలో గురువారం అర్థరాత్రి అఫ్జల్ బేగం అనే మహిళను ఆమె భర్త, కొడుకు కలిసి గొంతుకోసి చంపారు. గుప్త నిధుల కోసమే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు సమాచారం. నిందితులు పరారీలో ఉన్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. పంజాగుట్ట పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు. -
గుప్త నిధుల కోసం తవ్వకాలు
వేమనపల్లి (ఆదిలాబాద్ జిల్లా) : పురాతన శివాలయంలో గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపారు. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా వేమనపల్లి మండలం సూరారం గ్రామంలో ఉన్న పురాతన శివాలయంలో జరిగింది. వివరాల ప్రకారం.. సూరారం గ్రామంలో ఉన్న పురాతన శివాలయం ప్రస్తుతానికి శిథిలావస్థకు చేరుకుంది. అయితే బుధవారం రాత్రి కొంతమంది దుండగులు ఈ ఆలయంలో చోరబడి గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపారు. కాగా గురువారం తెల్లవారుజామున ఈ విషయాన్ని గమనించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.