గుప్త నిధుల కోసం తవ్వకాలు | Digging for Hidden treasures in Adilabad | Sakshi
Sakshi News home page

గుప్త నిధుల కోసం తవ్వకాలు

Published Thu, Aug 20 2015 6:36 PM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM

Digging for Hidden treasures in Adilabad

వేమనపల్లి (ఆదిలాబాద్ జిల్లా) : పురాతన శివాలయంలో గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపారు. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా వేమనపల్లి మండలం సూరారం గ్రామంలో ఉన్న పురాతన శివాలయంలో జరిగింది. వివరాల ప్రకారం.. సూరారం గ్రామంలో ఉన్న పురాతన శివాలయం ప్రస్తుతానికి శిథిలావస్థకు చేరుకుంది.

అయితే బుధవారం రాత్రి కొంతమంది దుండగులు ఈ ఆలయంలో చోరబడి గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపారు. కాగా గురువారం తెల్లవారుజామున ఈ విషయాన్ని గమనించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement