సాహో సీఐ దిలీప్
కృష్ణరాజపురం: ఖాకీ చొక్కా వెనుక కరుకైన హృదయమే కాదు కారుణ్యం కూ డా ఉంటుందని అ డుగోడి సీఐ దిలీప్ నిరూపించారు. ఉత్తర కర్ణాటకకు చెందిన సురేశ్ అనే యువకుడు ఇటీవల విడుదలైన సాహో చిత్రాన్ని చూడడానికి ఓ థియేటర్‌కు వెళ్లాడు. అయితే టికెట్ లేకుండా థియేటర్ లోపలికి ప్రవేశించడానికి ప్రయత్నించగా అడ్డుకున్న సిబ్బంది సురేశ్‌ను అడుగోడి పోలీసులకు అప్పగించారు. దీంతో సీఐ దిలీప్ సురేశ్‌ను వివరాలు అడగ్గా కుటుంబ పోషణ కోసం బెంగళూరుకు వచ్చానని, అయితే ఎక్కడా పని లభించకపోవడంతో డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నానని వివరించాడు. తెలుగు హీరో ప్రభాస్‌కు అభిమానని అందుకే సాహో సినిమా చూడడానికి థియేటర్లోకి వెళ్లడానికి ప్రయత్నించానని తెలిపాడు. సురేశ్ పరిస్థితి తెలుసుకున్న సీఐ దిలీప్ అదే స్టేషన్లో హౌస్ కీపింగ్‌తో పాటు ఓ హోటల్లో కూడా పని ఇప్పించి గొప్ప మనసు చాటుకున్నారు. దీంతో సీఐ దిలీప్‌పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.