Dinesh Chandra Arora
-
ఆ ముగ్గురికీ షాక్: శ్రీలంక కొత్త కెప్టెన్ అతడే!
కొలంబో: ఈ నెలాఖరులో బంగ్లాదేశ్‌లో పర్యటించి మూడు వన్డేల సిరీస్ ఆడనున్న శ్రీలంక జట్టును సెలక్టర్లు ప్రకటించారు. వికెట్ కీపర్ కుశాల్ పెరీరాను కొత్త కెప్టెన్‌గా నియమించారు. పెరీరా ఇప్పటివరకు 101 వన్డేలు, 22 టెస్టులు, 47 టి20 మ్యాచ్‌ల్లో శ్రీలంకకు ప్రాతినిధ్యం వహించాడు. స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరిగిన సిరీస్‌లో కెప్టెన్‌గా ఉన్న కరుణరత్నేతోపాటు సీనియర్ ఆల్‌రౌండర్ ఎంజెలో మాథ్యూస్, మాజీ కెప్టెన్ దినేశ్ చండీమల్లపై సెలెక్టర్లు వేటు వేశారు. మరోవైపు దాదాపు ద్వితీయ శ్రేణి జట్టుతో జూలై లో భారత్... శ్రీలంక పర్యటనకు వెళ్లనున్న సంగతి తెలిసిందే. జూలై 13, 16, 19 తేదీల్లో వన్డేలు... జూలై 22, 24, 27 తేదీల్లో టి20 మ్యాచ్‌లు నిర్వహిస్తారు. హంబన్‌టోట, దంబుల్లాలను వేదికలుగా పరిశీలిస్తున్నారు. 2018 నిదాహస్ ట్రోఫీ తర్వాత భారత జట్టు శ్రీలంకలో ఆడలేదు. చదవండి: మమ్మల్ని చూసే ద్రవిడ్ అలా... -
ఐసీఎస్ఐ కార్యదర్శిగా దినేశ్ చంద్ర అరోరా
హైదరాబాద్: ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ఐసీఎస్ఐ) కార్యదర్శిగా దినేశ్ చంద్ర అరోరా బాధ్యతలు స్వీకరించారు. చార్టర్డ్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీల్లో అర్హత సాధించిన దినేశ్‌చంద్ర... ఐటీ, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎఫ్ఎంసీజీ వంటి తదితర రంగాలకు చెందిన పలు కంపెనీల్లో పనిచేశారు. అరోరాకు బిజినెస్ ప్రణాళికల రూపకల్పన, వ్యాపార వ్యూహరచన, బడ్జెటింగ్, నిధుల సమీకరణ, ప్రైవేట్ ఈక్విటీ మేనేజ్మెంట్, ట్యాక్స్ ప్లానింగ్, లీగల్ డ్రాఫ్టింగ్, రిస్క్ మేనేజ్మెంట్ తదితర అంశాల్లో మంచి అనుభవముంది.