Direct Plan
-
మీ పెట్టుబడికి మీరే డ్రైవర్!
భవిష్యత్ లక్ష్యాల కోసం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో నియమబద్ధంగా పెట్టుబడులు పెట్టే ధోరణి మన దేశంలో క్రమంగా విస్తరిస్తోంది. ఇందుకు నెలవారీ వస్తున్న సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) పెట్టుబడులే నిదర్శనం. 16,928 కోట్లు సిప్ రూపంలో అక్టోబర్ నెలలో మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లోకి వచ్చాయి. ఇప్పటి వరకు ఒక నెలలో సిప్ ద్వారా వచి్చన గరిష్ట పెట్టుబడులు ఇవి. అంతేకాదు, ప్రతి నెలా ఈ మొత్తం పెరుగుతూ పోతుండడం, మరింత మంది ఇన్వెస్టర్లు ఈక్విటీ ఫండ్స్ వైపు అడుగులు వేస్తుండడాన్ని తెలియజేస్తోంది. కొత్తగా వచ్చే ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్లు, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పట్ల కనీసం ప్రాథమిక అవగాహన కలిగి ఉండాలి. ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్‌లో డైరెక్ట్ ప్లాన్లు, రెగ్యులర్ ప్లాన్లలో ఏది ఎంపిక చేసుకోవాలన్నది తెలిసి ఉండాలి. దీర్ఘకాలంలో ఈక్విటీ ఫండ్స్ ద్వారా సంపద సమకూర్చుకోవాలని ఆశించే వారు ఈ రెండింటిలో ఏది ఎంపిక చేసుకుంటే ఎక్కువ ప్రయోజనమో తెలిసి ఉంటే, తమ లక్ష్యం సులువు అవుతుంది. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో రెగ్యులర్ ప్లాన్లతో పోలిస్తే డైరెక్ట్ ప్లాన్లు దీర్ఘకాలంలో అధిక రాబడులు అందిస్తాయి. రెగ్యులర్ ప్లాన్ అంటే మ్యూచువల్ ఫండ్స్ డి్రస్టిబ్యూటర్ ద్వారా లేదా బ్రోకర్ ద్వారా విక్రయించే ప్లాన్. దీనిపై వారికి అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీల (ఏఎంసీలు/మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణ సంస్థలు) నుంచి కమీషన్లు అందుతాయి. కనుక ఎక్స్పెన్స్ రేషియో (ఇన్వెస్టర్ పెట్టుబడి నుంచి ఏటా వసూలు చేసే మొత్తం) రెగ్యులర్ ప్లాన్లలో అధికంగా ఉంటుంది. డైరెక్ట్ ప్లాన్లలో మధ్యవర్తుల ప్రమేయం ఉండదు. మూడో పక్షం (బ్రోకర్లు, ఫిన్‌టెక్ సంస్థలు) కూడా రెగ్యులర్ ప్లాన్లను ఆఫర్ చేస్తున్నాయి. అయినప్పటికీ వీటిపై కమీషన్ చెల్లింపులు ఉండవు. కనుక డైరెక్టర్ ప్లాన్లలో ఎక్స్పెన్స్ రేషియో, రెగ్యులర్ ప్లాన్లతో పోలిస్తే తక్కువగా ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్‌లో డైరెక్ట్ ప్లాన్లను ప్రవేశపెట్టి పదేళ్లు అవుతోంది. అయినా, ఇప్పటికీ ఎక్కువ మంది పెట్టుబడులు రెగ్యులర్ ప్లాన్లలోకే వెళుతున్నాయి. డైరెక్ట్ ప్లాన్లలో రాబడులు ఎక్కువగా ఉంటున్నప్పటికీ.. రెగ్యులర్ ప్లాన్లతో పోలిస్తే డైరెక్ట్ ప్లాన్లలో ఫోలియోలు ఎంతో తక్కువగా ఉన్నట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కనుక ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసే ప్రతీ ఇన్వెస్టర్ వీటి మధ్య వైరుధ్యాన్ని తప్పక తెలిసి ఉండాలి. అనుకూలతలు... మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్ (సలహాదారు) లేదా పంపిణీదారు (డి్రస్టిబ్యూటర్) సేవలు అవసరం లేకుండా నేరుగా పెట్టుబడులు పెట్టే వారికి వ్యయాలు ఆదా చేసుకునేందుకు తీసుకొచి్చందే డైరెక్ట్ ప్లాన్లు. సులభంగా చెప్పాలంటే డ్రైవర్ సాయం లేకుండా ఎవరి కారును వారు డ్రైవ్ చేసుకున్నట్టు. ఇన్వెస్టర్ తన పెట్టుబడుల నిర్వహణను తానే చూసుకోవడం. మ్యూచువల్ ఫండ్స్‌లో టీఈఆర్ అని ఉంటుంది. అంటే టోటల్ ఎక్స్పెన్స్ రేషియో (టీఈఆర్). ఇందులో ఫండ్ నిర్వహణ చార్జీలు, మార్కెటింగ్ వ్యయాలు, రిజిస్ట్రార్ ఫీజు, కస్టోడియన్ ఫీజు, ఇతర వ్యయాలు కలిపి ఉంటాయి. రెగ్యులర్ ప్లాన్లలో పంపిణీదారులకు కమీషన్ చెల్లించాల్సి వస్తుంది. కనుక ఇక్కడ చెప్పుకున్న వివిధ రకాల వ్యయాలకు కమీషన్ కూడా తోడు కావడంతో రెగ్యులర్ ప్లాన్లలో టీఈఆర్ ఎక్కువగా ఉంటుంది. ఇన్వెస్టర్ పెట్టుబడి విలువపై వార్షికంగా టీఈఆర్‌ను అమలు చేస్తారు. కానీ చార్జీ మినహాయింపు ఏరోజుకారోజు కొనసాగుతుంది. పెట్టుబడి నుంచి అధిక వ్యయాలను మినహాయించినప్పుడు ఆ మేర రాబడి తగ్గుతుంది. ఒక ఇన్వెస్టర్ రెండు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో రూ.10,000 చొప్పున లమ్సమ్‌గా ఇన్వెస్ట్ చేశారని అనుకుందాం. ‘ఏ’ అనే పథకంలో టీఈఆర్ ఒక శాతంగా ఉంది. ‘బీ’ అనే పథకంలో టీఈఆర్ 2.5 శాతంగా ఉంది. కానీ, పదేళ్ల తర్వాత రూ.10,000 పెట్టుబడి ‘ఏ’ పథకంలో రూ.36,587గా మారితే, ‘బీ’ పథకంలో రూ.31,407 సమకూరింది. అంటే వ్యత్యాసం ఎంతుందో స్పష్టంగా అర్థమవుతోంది. రాబడులు పేరొందిన ఈక్విటీ ఫండ్స్ డైరెక్ట్, రెగ్యులర్ ప్లాన్లలో ప్రతి నెలా రూ.5,000 చొప్పున సిప్ రూపంలో ఇన్వెస్ట్ చేసే వారి రాబడులు పరిశీలించినా.. డైరెక్ట్ ప్లాన్లలోనే ఎక్కువ ఉంటున్నాయి. ఉదాహరణకు మిరే అస్సెట్ లార్జ్‌క్యాప్ ఫండ్ ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ (ఎక్స్ఐఆర్ఆర్) డైరెక్ట్ ప్లాన్‌లో 16.73 శాతం రాగా, రెగ్యులర్ ప్లాన్‌లో ఇది 15.60 శాతంగానే ఉంది. అంటే గడిచిన పదేళ్లలో ఈ పథకంలో చేసిన రూ.6 లక్షల సిప్ కాస్తా డైరెక్ట్ ప్లాన్‌లో రూ.14.26 లక్షలుగా మారితే, రెగ్యులర్ ప్లాన్‌లో రూ.13.42 లక్షలు అయి ఉండేది. అంటే ఈ రెండింటి మధ్య రూ.82,945 వ్యత్యాసం కనిపిస్తోంది. రెగ్యులర్ ప్లాన్‌ను ఎంపిక చేసుకోవడం వల్ల ఇన్వెస్టర్ పదేళ్ల కాలంలో కమీషన్ల రూపేణా ఇంత మొత్తం నష్టపోవాల్సి వస్తుందని అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు ఎస్బీఐ బ్లూచిప్ ఫండ్, ఐసీసీఐ ప్రుడెన్షియల్ బ్లూచిప్ ఫండ్‌లోనూ రెగ్యులర్ ప్లాన్‌తో పోలిస్తే డైరెక్ట్ ప్లాన్లలో రూ.67,540, రూ.60,788 చొప్పున అధిక రాబడి వచ్చింది. నేపథ్యం.. 2007 వరకు మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు పెట్టుబడులపై 2–2.5 శాతం వరకు ఎంట్రీ లోడ్‌ను వసూలు చేశాయి. డి్రస్టిబ్యూటర్లు లేదా నేరుగా ఫండ్స్ సంస్థల ద్వారా ఇన్వెస్ట్ చేసినా ఈ చార్జ్ పడేది. కాకపోతే అప్పట్లో ఫండ్స్‌లో పెట్టుబడులు చాలా తక్కువగా ఉండేవి. దీంతో మరింత మంది రిటైల్ ఇన్వెస్టర్లు మ్యూచువల్ ఫండ్స్ దిశగా అడుగులు వేసేందుకు ప్రోత్సహించాలని సెబీ నిర్ణయించింది. కనుక నేరుగా మ్యూచువల్ ఫండ్స్ సంస్థ ద్వారా పెట్టుబడులు పెట్టే వారి నుంచి ఎంట్రీ లోడ్ వసూలు చేయవద్దంటూ మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి)ను సెబీ కోరింది. అప్పట్లో సెబీ చైర్మన్‌గా దామోదరన్ ఉన్నారు. ఆయన తర్వాత సీబీ భవే అదే విధానానికి మద్దతుగా నిలిచారు. 2008లో ప్రపంచ ఆరి్థక మాంద్యం కారణంగా మార్కెట్లు కుదేలు కావడంతో రిటైల్ ఇన్వెస్టర్లు పెట్టుబడులకు వెనుకంజ వేసిన పరిస్థితి కనిపించింది. దీంతో 2009లో సెబీ ఫండ్స్‌లో ఎంట్రీలోడ్‌ను రద్దు చేసింది. ఆ తర్వాత నుంచి పంపిణీదారులు, ఏజెంట్లకు ఫండ్స్ సంస్థలు కమీషన్ చెల్లిస్తూ, ఆ మొత్తాన్ని టోటల్ ఎక్స్పెన్స్ రేషియో (టీఈఆర్) పేరుతో ఇన్వెస్టర్ల నుంచి రాబట్టడం మొదలు పెట్టాయి. నేరుగా ఫండ్స్ సంస్థల ద్వారా పెట్టుబడులు పెట్టే వారికి, పంపిణీదారులు ద్వారా పెట్టుబడులు పెట్టే వారికి ఒక్కటే టీఈఆర్ వసూలు చేసేవి. దీనివల్ల ఎంట్రీలోడ్ రద్దు చేసిన ప్రయోజనం ఇన్వెస్టర్లకు నెరవేరకుండా పోయింది. దీంతో డైరెక్ట్ ప్లాన్లకు అప్పటి సెబీ చైర్మన్ యూకే సిన్హా పునాది వేశారు. గతంలో యూటీఐ మ్యూచువల్ ఫండ్‌కు చైర్మన్‌గా పనిచేసిన అనుభవం ఆయనకు ఉండడంతో, నేరుగా ఇన్వెస్ట్ చేసే వారికి ప్రయోజనం కలి్పంచాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో నేరుగా ఇన్వెస్ట్ చేసే వారికి కమీషన్ల బెడద తొలగి, డైరెక్ట్ ప్లాన్లలో టీఈఆర్ తక్కువగా ఉండడం అమల్లోకి వచి్చంది. ఇన్వెస్టర్లు ఎందుకు దూరం..? 2007 వరకు మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు పెట్టుబడులపై 2–2.5 శాతం వరకు ఎంట్రీ లోడ్‌ను వసూలు చేశాయి. డి్రస్టిబ్యూటర్లు లేదా నేరుగా ఫండ్స్ సంస్థల ద్వారా ఇన్వెస్ట్ చేసినా ఈ చార్జ్ పడేది. కాకపోతే అప్పట్లో ఫండ్స్‌లో పెట్టుబడులు చాలా తక్కువగా ఉండేవి. దీంతో మరింత మంది రిటైల్ ఇన్వెస్టర్లు మ్యూచువల్ ఫండ్స్ దిశగా అడుగులు వేసేందుకు ప్రోత్సహించాలని సెబీ నిర్ణయించింది. కనుక నేరుగా మ్యూచువల్ ఫండ్స్ సంస్థ ద్వారా పెట్టుబడులు పెట్టే వారి నుంచి ఎంట్రీ లోడ్ వసూలు చేయవద్దంటూ మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి)ను సెబీ కోరింది. అప్పట్లో సెబీ చైర్మన్‌గా దామోదరన్ ఉన్నారు. ఆయన తర్వాత సీబీ భవే అదే విధానానికి మద్దతుగా నిలిచారు. 2008లో ప్రపంచ ఆరి్థక మాంద్యం కారణంగా మార్కెట్లు కుదేలు కావడంతో రిటైల్ ఇన్వెస్టర్లు పెట్టుబడులకు వెనుకంజ వేసిన పరిస్థితి కనిపించింది. దీంతో 2009లో సెబీ ఫండ్స్‌లో ఎంట్రీలోడ్‌ను రద్దు చేసింది. ఆ తర్వాత నుంచి పంపిణీదారులు, ఏజెంట్లకు ఫండ్స్ సంస్థలు కమీషన్ చెల్లిస్తూ, ఆ మొత్తాన్ని టోటల్ ఎక్స్పెన్స్ రేషియో (టీఈఆర్) పేరుతో ఇన్వెస్టర్ల నుంచి రాబట్టడం మొదలు పెట్టాయి. నేరుగా ఫండ్స్ సంస్థల ద్వారా పెట్టుబడులు పెట్టే వారికి, పంపిణీదారులు ద్వారా పెట్టుబడులు పెట్టే వారికి ఒక్కటే టీఈఆర్ వసూలు చేసేవి. దీనివల్ల ఎంట్రీలోడ్ రద్దు చేసిన ప్రయోజనం ఇన్వెస్టర్లకు నెరవేరకుండా పోయింది. దీంతో డైరెక్ట్ ప్లాన్లకు అప్పటి సెబీ చైర్మన్ యూకే సిన్హా పునాది వేశారు. గతంలో యూటీఐ మ్యూచువల్ ఫండ్‌కు చైర్మన్‌గా పనిచేసిన అనుభవం ఆయనకు ఉండడంతో, నేరుగా ఇన్వెస్ట్ చేసే వారికి ప్రయోజనం కలి్పంచాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో నేరుగా ఇన్వెస్ట్ చేసే వారికి కమీషన్ల బెడద తొలగి, డైరెక్ట్ ప్లాన్లలో టీఈఆర్ తక్కువగా ఉండడం అమల్లోకి వచి్చంది. ఇన్వెస్టర్లు ఎందుకు దూరం..? డైరెక్ట్, రెగ్యులర్ ప్లాన్ల మధ్య రాబడుల్లో ఇంత స్పష్టమైన వైరుధ్యం కనిపిస్తున్నా, ఈ ప్రయోజనాన్ని పొందుతున్న ఇన్వెస్టర్లు 25 శాతానికి మించి లేరు. యాంఫీ గణాంకాల ప్రకారం మొత్తం 13.89 కోట్ల వ్యక్తిగత ఫండ్స్ ఫోలియోల్లో డైరెక్టర్ ప్లాన్లలో పెట్టుబడులకు సంబంధించినవి కేవలం 3.45 కోట్ల ఫోలియోలే ఉన్నాయి. ఫండ్స్ నిర్వహణ ఆస్తుల్లో డైరెక్ట్ ప్లాన్ల నుంచి వస్తున్నది 12 శాతం మించి లేదు. ఇందుకు గల కారణాలపై మహీంద్రా మనులైఫ్ మ్యూచువల్ ఫండ్ ఎండీ, సీఈవో ఆంటోనీ హెరెడియా తన అభిప్రాయాలను పంచుకున్నారు. ‘‘ఇందుకు రెండు కారణాలు ఉన్నాయి. ఫండ్స్‌లో రెగ్యులర్ ప్లాన్లు సైతం దీర్ఘకాలంలో ఇన్వెస్టర్లకు మంచి సంపదను సమకూర్చి పెట్టాయి. దీనికి తోడు డైరెక్ట్ ప్లాన్లపై ఎక్కువ మందిలో అవగాహన లేదు’’అని వివరించారు. ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు డైరెక్ట్ ప్లాన్ల వైపే మొగ్గు చూపుతుంటే, నాన్ ఇండివిడ్యువల్ ఇన్వెస్టర్లలోనూ 50 శాతం మంది డైరెక్టర్ ప్లాన్లనే ఎంచుకుంటున్నారు. కేవలం రిటైల్ విభాగంలోనే డైరెక్ట్ ప్లాన్లను ఎంపిక చేసుకుంటున్న వారు తక్కువగా ఉంటున్నారు. ఏమిటి మార్గం..? ఈక్విటీలు, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పట్ల అవగాహన ఉంటే మెరుగైన పథకాలకు సంబంధించి డైరెక్ట్ ప్లాన్లను ఇన్వెస్టర్లు ఎంపిక చేసుకోవచ్చు. లేదంటే ఫైనాన్షియల్ అడ్వైజర్ సాయం తీసుకోవాలి. దీర్ఘకాలంలో మెరుగైన రాబడులకు, సంపద సృష్టికి మ్యూచువల్ ఫండ్ పథకం ఎంపిక కీలకం అవుతుంది. మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమలో వేలాది పథకాలు ఉన్నాయి. ఇందులోనూ ఎన్నో విభాగాలు ఉన్నాయి. వీటిల్లో ఇన్వెస్టర్ల ఆకాంక్షలు, రిస్‌్కకు అనుగుణంగా అనుకూలమైన వాటిని ఎంపిక చేసుకోవడం కొంచెం క్లిష్టమైన పనే. ఈక్విటీ మార్కెట్ల పట్ల అవగాహన కలిగి ఉండి, రోజులో కొంత సమయం కేటాయించే వీలున్న వారు నేరుగా డైరెక్ట్ ప్లాన్లలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. లేదంటే సెబీ నమోదిత ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ల సేవలను ఆశ్రయించినట్టయితే, వారు మెరుగైన పథకాలకు సంబంధించి డైరెక్ట్ ప్లాన్లను సూచిస్తారు. కాకపోతే సెబీ వద్ద నమోదైన ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్లు కేవలం 1,328 మందే ఉన్నారు. కనుక ఇన్వెస్టర్లు డిస్కౌంట్ బ్రోకర్లు, ఫిన్‌టెక్ సంస్థల సేవలను సైతం పొందొచ్చు. కాకపోతే చాలా మంది తమ స్నేహితులు, కుటుంబ సభ్యులు, బంధువుల సూచనల మేరకే నడుచుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. వ్యత్యాసాలు ► మ్యూచువల్ ఫండ్స్ డైరెక్ట్ ప్లాన్లలో పంపిణీదారులు, బ్రోకర్లు తదితర మధ్యవర్తుల ప్రమేయం ఉండదు. కనుక రెగ్యులర్ ప్లాన్‌లో యూనిట్ ఎన్ఏవీతో పోలిస్తే, డైరెక్ట్ ప్లాన్ యూనిట్ ఎన్ఏవీ ఎక్కువగా ఉంటుంది. ►డైరెక్ట్ ప్లాన్లలో టీఈఆర్ తక్కువ. దీంతో దీర్ఘకాలంలో పెట్టుబడుల వృద్ధి వీటిల్లో ఎక్కువ. ►డైరెక్ట్ ప్లాన్లను ఏ సంస్థా సూచించదు. ఇన్వెస్టర్ నేరుగా ఎంపిక చేసుకోవాలి. ►ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా డైరెక్ట్ ప్లాన్లలో సులభంగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. జెరోదా, గ్రోవ్ వంటి సంస్థలు సైతం డైరెక్ట్ ప్లాన్లను ఆఫర్ చేస్తున్నాయి. -
రెగ్యులర్ నుంచి డైరెక్ట్ ప్లాన్‌కు మారడం ఎలా?
నేను కొన్ని మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేశాను. వీటిల్లో కొన్ని డైరెక్ట్ ప్లాన్లు ఉన్నాయి. మరికొన్ని రెగ్యులర్ ప్లాన్లు ఉన్నాయి. కొన్ని రెగ్యులర్ ప్లాన్లను డైరెక్ట్ ప్లాన్లుగా మార్చుకోవాలనుకుంటున్నాను. ఎలా మార్చుకోవాలి?అన్ని మ్యూచువల్ ఫండ్ కంపెనీలు ఈ రెగ్యులర్ ప్లాన్‌ను డైరెక్ట్ ప్లాన్‌గా మార్చుకోవడానికి వీలు కల్పిస్తున్నాయా? ఇలా మార్చుకోవడానికి ఏమైనా చార్జీలు చెల్లించాల్సి ఉంటుందా? రెగ్యులర్ ప్లాన్లను డైరెక్ట్ ప్లాన్లుగా మార్చుకుంటే ఏమైనా పన్ను భారం ఉంటుందా? వీరేందర్, విశాఖపట్టణం రెగ్యులర్ ప్లాన్లను డైరెక్ట్ ప్లాన్లుగా మార్చుకోవచ్చు. అన్ని మ్యూచువల్ ఫండ్ కంపెనీలు ఈ అవకాశాన్ని కల్పిస్తున్నాయి. దీనికి సంబంధించిన దరఖాస్తులను నింపి సదరు మ్యూచువల్ ఫండ్ సంస్థకు సమర్పించాలి. మీరు ఇన్వెస్ట్ చేస్తున్న స్కీమ్ పేరు పక్కన డైరెక్ట్ అని స్పష్టంగా రాయాలి. ఏఆర్ఎన్(యాంఫీ రిజిస్ట్రేషన్ నంబర్) కోడ్‌ను కూడా రాయడం మర్చిపోకండి. మీ దరఖాస్తును పరిశీలించి మీ రెగ్యులర్ ప్లాన్లను డైరెక్ట్ ప్లాన్లుగా మార్చడానికి సదరు మ్యూచువల్ ఫండ్ సంస్థకు కనీసం పది రోజులు పడుతుంది. ఈ ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాత మ్యూచువల్ ఫండ్ సంస్థ నుంచి మీకు వచ్చే స్టేట్మెంట్లో మీ మ్యూచువల్ ఫండ్ స్కీమ్ పేరు పక్కన డైరెక్ట్ప్లాన్ అని ఉంటుంది. మీ ప్లాన్ రెగ్యులర్ నుంచి డైరెక్ట్‌కు మారిందనడానికి ఇదే నిర్ధారణ. అన్ని మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను డైరెక్ట్ ప్లాన్లుగా మార్చుకోవచ్చు. ఈటీఎఫ్‌లకు మాత్రం మినహాయింపు ఉంటుంది. ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్స్(ఈఎల్ఎస్ఎస్), లాక్ ఇన్ పీరియడ్ ఉన్న ఇతర స్కీమ్‌లకు ఆ లాక్ ఇన్ పీరియడ్ పూర్తయిన తర్వాతనే డైరెక్ట్ ప్లాన్లుగా మార్చుకునే వీలు ఉంటుంది. ఇన్వెస్టర్ల ఇన్వెస్ట్మెంట్స్ ఉన్న మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్‌ను రెగ్యులర్ ప్లాన్ నుంచి డైరెక్ట్ ప్లాన్లకు మార్చడానికి ప్రస్తుతం ఏ మ్యూచువల్ ఫండ్ ఎలాంటి ఎగ్జిట్ లోడ్‌ను వసూలు చేయడం లేదు. ఎందుకైనా మంచిది మీరు మార్చాలనుకుంటున్న స్కీమ్‌లకు సంబంధించిన మ్యూచువల్ ఫండ్ సంస్థ ఏవైనా చార్జీలు వసూలు చేస్తుందో లేదో స్పష్టంగా తెలుసుకోండి. రెగ్యులర్ ప్లాన్ నుంచి డైరెక్ట్ ప్లాన్లకు మారడమనేది మ్యూచువల్ ఫండ్ యూనిట్లు విక్రయించి, మరో మ్యూచువల్ ఫండ్ యూనిట్లను కొనుగోలు చేయడంగా పరిగణిస్తారు. అందుకని, ఇలా మారేటప్పుడు మీపై ఏమైనా మూలధన లాభాల పన్నులు పడతాయేమో అనే విషయం కూడా చెక్ చేసుకోండి. ఒకవేళ మీరు ప్రస్తుతం ఏదైనా రెగ్యులర్ ప్లాన్‌లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్)లో ఇన్వెస్ట్ చేస్తున్నట్లయితే, ఈ సిప్‌ను ఆపేయాలి. డైరెక్ట్ ప్లాన్‌లో కొత్త సిప్‌ను ప్రారంభించాలి. నేను ప్రవాస భారతీయుడిని. అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తున్నాను. నేను క్యాన్ (కామన్ అకౌంట్ నంబర్) పొందవచ్చా ?ఎలా దరఖాస్తు చేయాలి? సంబంధిత వివరాలను తెలపండి? సురేశ్, ఈ మెయిల్ ద్వారా ప్రవాస భారతీయ ఇన్వెస్టర్లు కూడా క్యాన్ (కామన్ అకౌంట్ నంబర్) కోసం నమోదు చేసుకోవచ్చు. నివాసిత ఇన్వెస్టర్లు క్యాన్ కోసం ఎలా దరఖాస్తు చేస్తారో, మీరు కూడా అలాగే సంబంధిత డాక్యుమెంట్లతో దరఖాస్తు చేయాలి. క్యాన్ నమోదు దరఖాస్తు పత్రాన్ని నింపి మ్యూచువల్ ఫండ్ యుటిలిటిస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్(ఎంఎఫ్‌యూఐ)కు చెందిన పాయింట్స్ ఆఫ్ సర్వీస్(పీఓఎస్)గానీ, ఎంఎఫ్‌యూఐ సంబంధిత డిస్ట్రిబ్యూటర్‌కు గానీ, లేదా ఎంఎఫ్యూఐలో సభ్యత్వం ఉన్న ఏదైనా మ్యూచువల్ ఫండ్ కంపెనీ బ్రాంచీలో కానీ సమర్పించాలి. ఎంఎఫ్‌యూ వెబ్సైట్ నుంచి క్యాన్ దరఖాస్తులను డౌన్లోడ్ చేసుకోవచ్చు. వివిధ మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌లకు సంబంధించి లావాదేవీలు జరపడానికి ఒక కామన్ ప్లాట్‌ఫామ్‌ను ఎంఎఫ్‌యూఐ అందిస్తోంది. క్యాన్‌ను ఉపయోగించి ఈ కామన్ ప్లాట్‌ఫామ్ ద్వారా ఇన్వెస్టర్లు మ్యూచువల్ ఫండ్ లావాదేవీలను నిర్వహించుకోవచ్చు. అన్ని ఇన్వెస్ట్‌మెంట్స్‌కు ఒకే రిఫరెన్స్‌గా క్యాన్‌ను ఇన్వెస్టర్‌కు కేటాయిస్తారు. క్యాన్‌ను ఉపయోగించి వివిధ మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌లకు సంబంధించి బహుళ లావాదేవీలను ఇన్వెస్టర్లు క్యాన్ ద్వారా ఒకే దరఖాస్తు/ చెల్లింపుద్వారా జరపవచ్చు. ప్రస్తుతం గిల్ట్‌ఫండ్స్ మంచి పనితీరును కనబరుస్తున్నాయని మిత్రులు చెబుతున్నారు. డెట్ ఫండ్స్ కన్నా వీటి పనితీరు బావుందని వారంటున్నా రు. వడ్డీరేట్లు తగ్గిపోతున్న ప్రస్తుత తరుణంలో ఇన్వెస్ట్‌మెంట్స్‌కు గిల్ట్ ఫం డ్స్ మంచి సాధనాలని నేను భావిస్తున్నాను. నా నిర్ణయం సరైనదేనా? ఇక్బాల్, హైదరాబాద్ గిల్ట్ ఫండ్స్ ప్రభుత్వ సెక్యూరిటీల్లో పెట్టుబడులు పెడతాయి. ఇవి దీర్ఘకాల మెచ్యూరిటీ సాధనాలు. వడ్డీరేట్ల మార్పుల ప్రభావం ఈ ఫండ్స్‌పై ఉంటుంది. వడ్డీరేట్లు పడిపోతున్నప్పుడు మంచి రాబడులను ఇస్తాయి. అలాగే వడ్డీరేట్లు పెరుగుతున్నప్పుడు తక్కువ రాబడులనిస్తాయి. రానున్న రోజుల్లో వడ్డీరేట్లు తగ్గిపోతాయనే అంచనాలు బాగా ఉన్నాయి. ఈ అంచనాలు ఆధారంగానే పలువురు ప్రస్తుతం ఈ ఫండ్స్ వైపు ఆకర్షితులవుతున్నారు. మీరు ఒకవేళ ఈ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్‌చేస్తే, వడ్డీరేట్లు పెరగడం మొదలవుతుందనుకున్నప్పుడు వీటి నుంచి వైదొలగాల్సి ఉంటుంది. వడ్డీరేట్లు పెరగడం, తగ్గడం– ఈ విషయాలపై మీకు తగిన అవగాహన,. అంచనాలు ఉంటేనే గిల్ట్ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్ చేయండి. ఇలా అంచనా వేయడం కష్టమన్న ఉద్దేశంతో పలువురు రిటైల్ ఇన్వెస్టర్లు డెట్ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్ చేస్తారనే విషయాన్ని మరచిపోకండి. -
రెగ్యులర్ ప్లానుల్లోనే అధిక డివిడెండ్లు ఎందుకు?
నేను కొద్దికాలంగా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నాను. రెగ్యులర్ ప్లాన్‌ల్లో, డెరైక్ట్ ప్లాన్‌ల్లో కూడా ఇన్వెస్ట్ చేస్తున్నాను. అయితే డెరైక్ట్ ప్లాన్‌ల్లో కంటే రెగ్యులర్ ప్లాన్‌ల్లోనే అధికంగా డివిడెండ్లు లభిస్తున్నాయి. దీనికి కారణమేమిటి? - సుధారాణి, సికింద్రాబాద్ మ్యూచువల్ ఫండ్స్‌కు సంబంధించి రెగ్యులర్ ప్లాన్లు ఎప్పటినుంచో ఇన్వెస్టర్లకు అందుబాటులో ఉన్నాయి. కానీ డెరైక్ట్ ప్లాన్లు 2013 నుంచే అందుబాటులోకి వచ్చాయి. ఇక రెగ్యులర్ ప్లాన్లు దీర్ఘకాలం నుంచి ఉన్నందున వాటి కార్పస్‌లు అధికంగా ఉంటాయి. అంతేకాకుండా దీర్ఘకాలం అమల్లో ఉన్నందున అధిక డివిడెండ్లు ఇస్తాయి. ఇక 2013 నుంచే డెరైక్ట్ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి వీటి లాభాలు తక్కువగా వుండొచ్చు. లేదా కొన్ని సందర్భాల్లో లాభాలు వుండకపోవొచ్చు కూడా. రెగ్యులర్ ప్లాన్లతో పోల్చితే తక్కువగా ఉంటాయి. గతంలో మ్యూచువల్ ఫండ్స్ తమ పూర్వపు రిజర్వ్‌ల నుంచి కూడా డివిడెండ్లను చెల్లించేవి. అలా కాకుండా మ్యూచువల్ ఫండ్స్ తమ తమ పోర్ట్‌ఫోలియోల్లో ఆర్జించిన వాస్తవిక లాభాల నుంచే డివిడెండ్లు చెల్లించాలని మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ, 2010 మార్చిలో ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల వల్ల రెగ్యులర్ ప్లాన్ల డివిడెండ్లు కూడా అంతకు ముందు నుంచి పోలిస్తే, తగ్గాయి. నేను ఇటీవలే సొంత వ్యాపారం ప్రారంభించాను. ఖర్చులు పోను పొదుపు చేయడానికి రూ.30,000 వరకూ మిగులుతున్నాయి. ఈ మొత్తాన్ని 4-5 మ్యూచువల్ ఫండ్స్‌లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. ఏ తరహా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయమంటారు? ఒక్కో సిప్‌కు ఒక్కో తేదీలో ఇన్వెస్ట్ చేయమంటారా? లేకుంటే అన్ని ఫండ్ల సిప్‌లకు ఒకే తేదీన ఇన్వెస్ట్ చేయమంటారా? - వేణు, విజయవాడ దీర్ఘకాల ఇన్వెస్ట్‌మెంట్స్‌కు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో సిప్(సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్) విధానంలో ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడులు పొందవచ్చు. ద్రవ్యోల్బణాన్ని తట్టుకునే రాబడులు వస్తాయి. పైగా పన్ను ప్రయోజనాలు కూడా లభిస్తాయి. ఇక సిప్ల నిర్వహణకు ఇదే సరైన పద్ధతి అంటూ ఏదీ లేదు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌ల్లో దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి నెలవారీ సిప్‌ల్లో ఏ తేదీల్లో ఇన్వెస్ట్ చేసినా మీకు వచ్చే రాబడుల్లో పెద్దగా తేడా ఏమీ ఉండదు. అందుకని ఒక్కో సిప్‌కు ఒక్కో తేదీన ఇన్వెస్ట్ చేయడం వల్ల ఒనగూరే ప్రయోజనాలేమీ ఉండవు. పైగా వేర్వేరు తేదీల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల వ్యయ ప్రయాసలు అధికంగా ఉంటాయి. అందుకని ఒకే తేదీన అన్ని సిప్‌ల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల వ్యయ ప్రయాసలు తగ్గుతాయి. ఇక సాధారణంగా నెల మొదట్లో వేతనాలు రావడం, వ్యాపారం ఎక్కువగా జరగడం జరుగుతుంది. కాబట్టి నెల మొదటి వారంలో సిప్‌ల్లో ఇన్వెస్ట్ చేయడం సముచితంగా ఉంటుంది. నేను ఇటీవలనే ఒక మ్యూచువల్ ఫండ్‌కు చెందిన ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్(ఈఎల్ఎస్ఎస్)లో సిప్ విధానంలో ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించాను. వీటికి లాక్ ఇన్ పీరియడ్ మూడేళ్లు కదా ! మూడేళ్లు దాటిన తర్వాత ఈ యూనిట్లన్నింటినీ ఉపసంహరించుకోవచ్చా? ఏడాది దాటి, మూడేళ్లలోపు ఈ యూనిట్లను ఉపసంహరించుకుంటే ఏమైనా పన్నులు చెల్లించాల్సి ఉంటుందా? - రాజు, విశాఖపట్టణం ఈఎల్ఎస్ఎస్లో సిప్ విధానంలో ఇన్వెస్ట్ చేస్తే, దీర్ఘకాలంలో మంచి రాబడులు పొందవచ్చు. అయితే ఈఎల్ఎస్ఎస్లో ప్రతి ఇన్‌స్టాల్‌మెంట్‌కు మూడేళ్ల లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. అంటే ప్రతి సిప్ కాలపరిమితి మూడేళ్లు దాటిన తర్వాతనే వాటిని ఉపసంహరించుకోవడానికి వీలవుతుంది. మీ విషయంలో మీరు ఇన్వెస్ట్మెంట్స్ ప్రారంభించి మూడేళ్లయింది. కాబట్టి మీరు మొదటి సిప్ యూనిట్లను మాత్రమే రిడీమ్ చేసుకునే వీలుంటుంది. ఇలా ప్రతి సిప్‌కు మూడేళ్లు దాటిన తర్వాతనే మీరు వాటిని రిడీమ్ చేసుకోవచ్చు. ఈఎల్ఎస్ఎస్ వంటి పన్ను ఆదా మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు మూడేళ్ల లాక్ఇన్ పీరియడ్ ఉంటుంది. కాబట్టి వీటిని మీరు మూడేళ్లలోపు, ఏడాది దాటిన తర్వాత రిడీమ్ చేసుకోలేరు. మూడేళ్లు దాటిన తర్వాతనే వీటిని ఉపసంహరించుకునే వీలు ఉంటుంది. ఎస్బీఐ ఫార్మా, ఎస్బీఐ స్మాల్ అండ్ మిడ్‌క్యాప్ ఫండ్ల్లో గత కొంత కాలంగా ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఈ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు ఏమైనా పన్ను మినహాయింపులు ఉన్నాయా? ఏ మేరకు పన్ను మినహాయింపులు పొందవచ్ఛు? - అనంత్, బెంగళూరు అన్ని మ్యూచువల్ ఫండ్స్‌కు పన్ను మినహాయింపులు లభించవు. ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్(ఈఎల్ఎస్ఎస్)లకు మాత్రమే ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80సీ ప్రకారం పన్ను మినహాయింపులు లభిస్తాయి. వీటికి మూడేళ్ల లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. మీరు ఇన్వెస్ట్ చేస్తున్న రెండు ఫండ్స్-ఎస్బీఐ ఫార్మా, ఎస్బీఐ స్మాల్ అండ్ మిడ్‌క్యాప్ ఫండ్లు-ఈ కేటగిరి కిందకు రావు కాబట్టి, మీకు ఎలాంటి పన్ను మినహాయింపులు లభించవు. పన్ను మినహాయింపులు లభించాలంటే ఈఎల్ఎస్ఎస్లలో ఇన్వెస్ట్ చేయాలి. ఈఎల్ఎస్ఎస్లలో ఇన్వెస్ట్ చేస్తే పన్ను ప్రయోజనాలతో పాటు దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణాన్ని తట్టుకునే రాబడులను కూడా పొందవచ్చు. పిల్లల చదువు, సొంత ఇల్లు సమకూర్చుకోవడం, రిటైర్మెంట్ నిధి ఏర్పాటు తదితర దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల కోసం ఈఎల్ఎస్ఎస్ స్కీముల్లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడులు పొందవచ్చు. -
డెరైక్ట్ ప్లాన్లకు డివిడెండ్లు తక్కువ ఎందుకు?
నా పేరు మీద పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్ ఖాతా ఒకటి ఉంది. నా ఇద్దరు కుమారుల పేరు మీద రెండు పీఎఫ్ ఖాతాలు నిర్వహిస్తున్నాను. సెక్షన్ 80 సీ కింద పన్ను మినహాయింపు పొందే మొత్తాన్ని ఇప్పటికే ఈ మూడు పీఎఫ్ ఖాతాల్లో జమ చేశాను. పన్ను మినహాయింపుకు మించిన మొత్తాన్ని ఈ పీఎఫ్ అకౌంట్లలలో ఇన్వెస్ట్ చేయవచ్చా? - అరవింద్, విశాఖపట్టణం ఒక వ్యక్తికి పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్ ఉన్నప్పటికీ, తన మైనర్ కుమారుల పేరు మీద ఖాతాలు తెరవడానికి పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్ నిబంధనలు అనుమతిస్తున్నాయి. అయితే ఒక ఆర్థిక సంవత్సరంలో అన్ని ఖాతాల్లో కలిపి గరిష్టంగా ఇన్వెస్ట్ చేయగలిగేది రూ.1.50 లక్షలు మాత్రమే. అంటే మీరు ఈ మూడు పీఎఫ్ ఖాతాల్లో రూ.లక్షన్నరకు మించి ఇన్వెస్ట్ చేయడానికి వీలు లేదు. ఇటీవల రెండు పెద్ద సంస్థలు(టాటా, యాక్సిస్) తమ మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌లకు సంబంధించి డివిడెండ్లను ప్రకటించాయి. టాటా ఇథికల్ ఫండ్, యాక్సిస్ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్స్ ఈ డివిడెండ్లను ప్రకటించాయి. అయితే ఈ ఫండ్స్ రెగ్యులర్ ప్లాన్లకు మాత్రమే ఈ డివిడెండ్లు వర్తిస్తాయి. డెరైక్ట్ ప్లాన్లకు మాత్రం కాదు. ఇది డెరైక్ట్ ప్లాన్‌ల్లో ఇన్వెస్ట్ చేసిన వారిని నిరుత్సాహపరచడమే అవుతుంది కదా? ఫండ్ హౌస్‌లు ఇలా ఎందుకు చేస్తాయి? - పవన్, హైదరాబాద్ తగినంత లాభాలు పొందలేకపోయినందున టాటా ఇథికల్ ఫండ్, యాక్సిస్ లాంగ్‌టర్మ్ ఈక్విటీ ఫండ్స్‌కు సంబంధించిన డెరైక్ట్ ప్లాన్లకు డివిడెండ్లను ఆయా మ్యూచువల్ ఫండ్ సంస్థలు ప్రకటించలేకపోయాయి. తగినంత లాభాలు పొందితేనే మ్యూచువల్ ఫండ్ సంస్థలు ఇన్వెస్టర్లకు డివిడెండ్లను పంపిణి చేస్తాయి. గతంలో మ్యూచువల్ ఫండ్ సంస్థలు తమ ప్రీమియం నిధుల నుంచే డివిడెండ్లను చెల్లించేవి. కానీ మ్యూచువల్ ఫండ్ సంస్థలు తమ పోర్ట్‌ఫోలియోలు ఆధారంగా ఆర్జించిన లాభాల నుంచే డివిడెండ్లను ఇవ్వాలని 2010, మార్చిలో సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ) ఆదేశాలు జారీ చేసింది. డెరైక్ట్ ప్లాన్లు 2013 నుంచి అమల్లోకి వచ్చాయి. వీటితో పోల్చితే రెగ్యులర్ ప్లాన్లు చిరకాలం నుంచి రంగంలో ఉంటున్నాయి. కనుక వాటికి భారీ నిధులు, తగినంత లాభాలు ఉంటాయి. కాబట్టి సాధారణంగా రెగ్యులర్ ప్లాన్లు డివిడెండ్లు చెల్లిస్తాయి. మరోవైపు డెరైక్ట్ ప్లాన్లు అమల్లోకి వచ్చి కొంత కాలమే అయినందును వీటి లాభాలు స్వల్పంగా ఉండడం వల్ల అవి డివిడెండ్లను చెల్లించలేకపోతున్నాయని చెప్పవచ్చు. నేను 2011 జూన్‌లో ఎల్ఐసీ ఎండోమెంట్ ప్లస్ పాలసీ తీసుకున్నాను. పాలసీ కాలవ్యవధి 10 సంవత్సరాలు. రూ.4 లక్షలకు బీమా రక్షణ తీసుకున్నాను. మూడు నెలలకొకసారి రూ.9,000 చొప్పున ప్రీమియం చెల్లిస్తున్నాను. ఈ పాలసీని సరెండర్ చేద్దామనుకుంటున్నాను. నాది సరైన నిర్ణయమేనా? సరెండర్ వాల్యూ ఎంత ఉండొచ్చు?ఈ పాలసీలో తక్కువ రాబడులు వస్తున్నందున మంచి రాబడులు వచ్చే మరో స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. తగిన సలహా ఇవ్వగలరు? - మృణాళిని, బెంగళూరు ఎల్ఐసీ ఎండోమెంట్ ప్లస్ పాలసీ అనేది యులిప్, ఎండోమెంట్ ప్లాన్లను కలగలసిన పాలసీ. ఇది టూ-ఇన్-వన్ ఇన్వెస్ట్మెంట్-కమ్-ఇన్సూరెన్స్ పాలసీ. ఐదేళ్ల తర్వాత ఫండ్ వేల్యూ ఎంత అనేదానిపై సరెండర్ వేల్యూ ఆధారపడి ఉంటుంది. మీ ప్రశ్నను బట్టి చూస్తే ఈ పాలసీని సరెండర్ చేయాలని సీరియస్‌గానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇలాంటి ఇన్సూరెన్స్-కమ్-ఇన్వెస్ట్మెంట్ పాలసీలు తగిన బీమా రక్షణను ఇవ్వలేవు. అంతేకాకుండా తగిన రాబడులు కూడా అందించలేవు. బీమాను, ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఎప్పుడూ కలగలపవద్దు. బీమా రక్షణ కోసం టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోండి. తక్కువ ప్రీమియమ్‌తో ఎక్కువ బీమా రక్షణ పొందవచ్చు. ఇక మీ దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల సాధన కోసం ఏదైనా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్)లో ఇన్వెస్ట్ చేయండి. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఐదు, అంతకు మించిన సంవత్సరాలు ఇన్వెస్ట్ చేస్తే మీరు మంచి రాబడులు పొందగలరు. నేను 2002-13 సంవత్సరాల మధ్య ఒక కంపెనీలో ఉద్యోగం చేశాను. ఆ తర్వాత నా సొంత వ్యాపారాన్ని ప్రారంభించాను. ఉద్యోగం నుంచి వైదొలిగాక ఎంప్లాయిస్ ప్రావిడెండ్ ఫండ్ నుంచి నాకు రావలసిన సొమ్ములను తీసేసుకున్నాను. నాకు పెన్షన్ వస్తుందా? - సంతోష్, రాజమండ్రి మీ సర్వీస్ 10 సంవత్సరాలకు మించి ఉన్నందున మీకు 50 ఏళ్లు దాటిన తర్వాత నుంచి మీకు పెన్షన్ వస్తుంది. మీరు చివరిసారి ఉద్యోగం చేసిన కంపెనీ ద్వారా ఫారమ్-10డి ద్వారా పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. మీరు ఎక్కడ పెన్షన్ పొందాలనుకుంటున్నారో, ఆ ప్రాంతానికి సంబంధించిన బ్యాంక్/పోస్ట్ ఆఫీస్ వివరాలను ఆ దరఖాస్తులో పేర్కొనాలి. - ధీరేంద్ర కుమార్ సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
ఆర్బిట్రేజ్ ఫండ్.. ఆకర్షణీయమేనా?
మ్యూచువల్ ఫండ్స్‌లో డెరైక్ట్ ఆప్షన్ ద్వారా ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలపండి? - సమీర, విజయవాడ మ్యూచువల్ ఫండ్స్‌కు సంబంధించి డెరైక్ట్ ప్లాన్ల ద్వారా మ్యూచువల్ ఫండ్ సంస్థ నుంచి నేరుగా యూనిట్ల కొనుగోళ్లు/అమ్మకాలు జరపవచ్చు. మధ్యలో ఎలాంటి మధ్యవర్తులు ఉండరు. ఈ డెరైక్ట్ ప్లాన్ల వల్ల డిస్ట్రిబ్యూటర్లకు/ఏజెంట్లకు చెల్లించే కమీషన్ చార్జీలు ఇన్వెస్టర్లకు ఆదా అవుతాయి. మ్యూచువల్ ఫండ్ సంస్థలు ప్రస్తుత, కొత్త స్కీమ్‌ల్లో డెరైక్ట్ ప్లాన్లను తప్పనిసరిగా ఆఫర్ చేయాలని సెబీ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు 2013, జనవరి 1 నుంచే అమల్లోకి వచ్చాయి. మీరు ఆశించే రాబడులు, మీరు భరించగలిగే రిస్క్‌లను బట్టి సరైన మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌లను ఎన్నుకోగలను అన్న ధీమా ఉన్నప్పుడే మీరు డెరైక్ట్ ప్లాన్లల్లో ఇన్వెస్ట్ చేయడం మంచిది. మ్యూచువల్ ఫండ్స్‌కు సంబంధించి రెగ్యులర్ ప్లాన్లల్లో మూడు రకాలైన (మేనేజ్మెంట్, నిర్వహణ, డిస్ట్రిబ్యూటర్)... వ్యయాలుంటాయి. అదే డెరైక్ట్ ప్లాన్లల్లో అయితే రెండు రకాలైన వ్యయాలు మాత్రమే ఉంటాయి. డిస్ట్రిబ్యూటర్ వ్యయాలు ఉండవు. ఫలితంగా ఎక్స్పెన్స్ రేషియో తక్కువగా ఉండి రాబడులు ఎక్కువగా ఉంటాయి. ఏ స్కీమ్ పోర్ట్‌ఫోలియో అయినా, డెరైక్ట్, రెగ్యులర్ ప్లాన్లకు ఒకే విధంగా ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ లక్ష్యాలు, నిధుల కేటాయింపు, ఇన్వెస్ట్మెంట్ వ్యూహం, ఎగ్జిట్ లోడ్, రిస్క్ అంశాలు, తదితర అంశాలన్నీ ఒకే రకంగా ఉంటాయి. డెట్ ఫండ్స్‌కు ప్రత్యామ్నాయంగా ఆర్బిట్రేజ్ ఫండ్స్‌ను పరిగణించవచ్చా? పన్ను పరంగా ఆర్బిట్రేజ్ ఫండ్స్ ఆకర్షణీయమేనా ? - విజయ్, కరీంనగర్ పన్ను అంశాల పరంగా చూస్తే డెట్ ఫండ్స్‌కు ప్రత్యామ్నాయంగా ఆర్బిట్రేజ్ ఫండ్స్‌ను పరిగణించవచ్చు. గత బడ్జెట్లో డెట్ ఫండ్స్‌కు సంబంధించి పన్ను అంశాల్లో మార్పులు వచ్చాయి. డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్‌ను మూడేళ్లకు మించి కొనసాగిస్తేనే వాటిపై వచ్చే రాబడులను దీర్ఘకాలిక మూలదన లాభాలుగా పరిగణించేలా పన్ను సంబంధిత అంశాల్లో మార్పులు,చేర్పులు చేశారు. దీంతో పన్ను పరంగా డెట్ ఫండ్స్‌కు ఉన్న ఆకర్షణ పోయింది. పన్ను అంశాల పరంగా చూస్తే ఆర్బిట్రేజ్ ఫండ్స్‌ను ఈక్విటీ ఫండ్స్‌గా పరిగణిస్తారు. ఏడాది తర్వాత వీటిపై లభించే రాబడులపై ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన పనిలేదు. ఒకవేళ ఏడాదిలోపే విక్రయిస్తే 15 శాతం స్వల్పకాల మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. స్వల్పకాల డెట్ ఫండ్స్ లేదా లిక్విడ్ ఫండ్స్ కన్నా ఇవి తక్కువ రాబడులనే ఇచ్చినప్పటికీ, వాటికి ఇవి మంచి ప్రత్యామ్నాయ ఇన్వెస్ట్మెంట్ సాధనాలుగా పరిగణించవచ్చు. పైగా పలు పన్ను ప్రయోజనాల కారణంగా ఇవి ఆకర్షణీయమైన ఇన్వెస్ట్మెంట్ సాధనాలని చెప్పవచ్చు. నా వయస్సు 39 సంవత్సరాలు. ఆరోగ్యకరంగా ఫిట్‌గానే ఉన్నాను. నేను రూ.75 లక్షలకు గాని, రూ. కోటికి గానీ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకుంటున్నాను. హెచ్డీఎఫ్సీ క్లిక్2 ప్రొటెక్ట్, మ్యాక్స్ లైఫ్ టర్మ్ పాలసీ రెండింటిల్లో దేనిని తీసుకోమంటారు ? - భవానీ, నెల్లూరు మ్యాక్స్ ఆన్లైన్ టర్మ్ ప్లాన్, హెచ్డీఎఫ్సీ క్లిక్2 ప్రొటెక్ట్ .. ఇవి రెండూ మంచి టర్మ్ పాలసీలే. కాకుంటే ప్రీమియమ్‌ల్లో తేడా ఉంది. రెండు కంపెనీలకు క్లెయిమ్‌ల సెటిల్మెంట్ విషయంలో మంచి ట్రాక్ రికార్డే ఉంది. రెండింటిలో ఏదైనా ఎంచుకోవచ్చు. అలా కాకుండా 50 లక్షలకొక టర్మ్ పాలసీ చొప్పున రెండు కంపెనీలవీ తీసుకోవచ్చు. పాలసీ తీసుకునేటప్పుడే అన్ని వ్యక్తిగత, ఆరోగ్య సంబంధిత వివరాలను తప్పనిసరిగా వెల్లడించాలి. జరగరానిది ఏదైనా జరిగితే, క్లెయిమ్‌ల విషయంలో ఎలాంటి అసౌకర్యం తలెత్తదు. మీ వయస్సును బట్టి రూ.50 లక్షల టర్మ్ పాలసీకి మ్యాక్స్ ఆన్లైన్ టర్మ్ పాలసీకి అయితే ఏడాదికి రూ.6,400, హెచ్డీఎఫ్సీ క్లిక్2 ప్రొటెక్ట్‌కు అయితే రూ.8,600 చొప్పున ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. గత నాలుగు నెలల నుంచి మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించాను. నా వార్షికాదాయం రూ.2.3 లక్షలలోపే ఉంది.నేను ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయలేదు. మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నాను కాబట్టి ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయడం తప్పనిసరా? ఏయే పరిస్థితుల్లో ఆదాయపు పన్ను రిటర్న్‌లు దాఖలు చేయాల్సి ఉంటుంది? - శ్రీకాంత్, హైదరాబాద్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసినంత మాత్రాన తప్పనిసరిగా ఆదాయపు పన్ను రిటర్న్‌లు దాఖలు చేయాలన్న నిబంధనేదీ లేదు. మీ వార్షికాదాయం రూ.2,50,000 దాటితేనే మీరు ఆదాయపు పన్ను రిటర్న్‌లు దాఖలు చేయాల్సి ఉంటుంది. ఐదు రకాల ఆదాయాలు(వేతనం, గృహాస్తి, వ్యాపారం/వృత్తి ద్వారా లాభాలు, మూలధన లాభాలు(మ్యూచువల్ ఫండ్ విక్రయాల ద్వారా లభించే లాభాలు కలుపుకొని), ఇతర మార్గాలు) మొత్తాన్ని కలిపి ఆదాయపు పన్ను లెక్కిస్తారు. ధీరేంద్ర కుమార్ సీఈవొ,వ్యాల్యూ రీసెర్చ్