Discreet
-
సరిహద్దులో పేట్రేగిన పాక్
జమ్మూ / ఆర్నియా / శ్రీనగర్: కాల్పుల విరమణ ఒప్పందానికి పాకిస్తాన్ మరోసారి తూట్లు పొడిచింది.అంతర్జాతీయ సరిహద్దు(ఐబీ) వెంట జమ్మూకశ్మీర్‌లోని గ్రామాలు, బీఎస్ఎఫ్ ఔట్‌పోస్టులు లక్ష్యంగా పాక్ రేంజర్లు బుధవారం మోర్టార్లు, భారీ ఆయుధాలతో విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఐదుగురు పౌరులు ప్రాణాలు కోల్పోగా, మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆర్ఎస్ పురా, ఆర్నియా, బిష్నాహ్, రామ్‌గఢ్, సాంబా సెక్టార్లలో కొన్నిచోట్ల మంగళవారం అర్థరాత్రి నుంచే పాక్ బలగాలు కాల్పులు ప్రారంభించాయని పోలీస్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఈ కాల్పులు క్రమంగా మిగతా సెక్టార్లకూ విస్తరించాయన్నారు. పాక్ కాల్పుల నేపథ్యంలో ప్రజలంతా సురక్షిత ప్రాంతానికి వెళ్లిపోవడంతో ఆర్నియా పట్టణం నిర్మానుష్యంగా మారిపోయిందన్నారు. ఆర్నియా పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన 76,000 మందికి పైగా ప్రజలు ప్రాణ భయంతో సురక్షిత ప్రాంతానికి తరలివెళ్లారన్నారు. మరోవైపు పాక్ కాల్పుల మోతపై బిషన్‌సింగ్(78) అనే స్థానికుడు స్పందిస్తూ.. ‘1971 తర్వాత ఇంత భారీస్థాయిలో షెల్లింగ్‌ను నేనెప్పుడూ చూడలేదు. వెంటనే పాకిస్తాన్‌తో యుద్ధం చేసి ఈ సమస్యలన్నింటిని ఒకేసారి పరిష్కరించాలని ప్రధాని నరేంద్ర మోదీని మేం డిమాండ్ చేస్తున్నాం’ అని చెప్పారు. మరోవైపు అనంతనాగ్ జిల్లాలో గస్తీలో ఉన్న బలగాలపై ఉగ్రవాదులు గ్రెనేడ్‌ను విసిరి పరారయ్యారు. ఈ ఘటనలో 10 మంది పౌరులు గాయపడ్డారు. -
విచక్షణ ప్రధానం
ఆత్మీయం ఆయన ఓ జెన్ గురువు. ఆయన ఒకరోజు సాయంత్రం వాకిలి అరుగుమీద కూర్చుని రేడియోలో వస్తున్న పాటలు వింటూ ఆనందిస్తున్నారు. పక్కనున్న శిష్యుడికి పాటలలోని భావాన్ని, గాన మాధుర్యాన్ని వివరిస్తున్నారు. కాస్సేపటికి ఆయనను చూడడానికి ఒక సాధువు వచ్చారు. ఏంటీ? ఇవాళ షికారుకెళ్ళలేదా?’’ అడిగారు సాధువు. ‘లేదు... ఇదిగో ఈ పాటలు వింటున్నాను. బాగున్నాయా?’’ అడిగారు గురువు. ఏమిటీ ఆయన పాటలు వింటున్నారా? ఆయన తాగుబోతటగా? చుక్కజీnకుండా ఒక్క క్షణం కూడా ఉండలేడు. అంతెందుకు తాగందే పాడలేడు...’’ అని ఆ గాయకుడి గురించి చాలా తక్కువ చేసి మాట్లాడాడు సాధువు. అప్పుడు గురువుగారు ‘‘మనకు కావలసింది ఆయన గొంతు బాగుందా? లేదా? పాట బాగా పాడుతున్నాడా? లేదా అనేవే ముఖ్యం... ఏమంటారు?అన్నారు. ఏదో పనున్నట్టు అక్కడినుంచి వెళ్ళిపోయాడు సాధువు. కొంతసేపైంది. మరో సాధువు వచ్చాడు గురువుగారిని చూడటానికి. రేడియోలో వినిపిస్తున్న పాట విని సాధువు కూర్చుంటూనే ఆ పాట పాడుతున్న గాయకుడి గురించి పొగిడాడు. ‘ఆయన గాత్రం అమోఘం. ఆయన ఏ పాటైనా ఆస్వాదించి పాడతారు. ఆ తీరు నాకు చాలా ఇష్టం’ అన్నాడు. అప్పుడు గురువుగారు ‘‘ఆ గాయకుడు ఎప్పుడు తాగుతూనే ఉంటాడటగా? చుక్క లేనిదే క్షణంæఉండలేడంటారు అందరూ...’’ అన్నారు. దాంతో ఆ సాధువు చిన్నబుచ్చుకుని వెళ్ళిపోయాడు. ఇద్దరు సాధువులతోనూ గురువుగారి మాట తీరును గమనిస్తున్న శిష్యుడికి ఏమీ అర్థం కాలేదు. సమయం చూసుకుని ‘‘గురువుగారూ, మిమ్మల్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియడం లేదు’’ అన్నాడు. గురువుగారు ఇలా అన్నారు – ‘‘కాయగూరలు తూకం వేయడం దుకాణదారు పని. ఆ త్రాసులో మనుషులను కూర్చోపెడితే అది విరిగిపోదూ? అందుకే ఎవరు ఎవర్ని తూకం వేసినా నేను అడ్డుపడి ఏదో ఒకటి మాట్లాడి ఆ విమర్శను సరి చేస్తాను. ఎవరో ఏదో అంటున్నారని మనల్ని మనం సందిగ్ధంలోకి నెట్టేసుకోకూడదు. మనకు హాని లేనంత వరకు ఎవరు ఏం చెప్పినా నష్టం లేదు. విచక్షణ ముఖ్యం’’ అని!