Distribution rails
-
అటవీ భూములకు పట్టాలు పంపిణీ
- గిరిజనుల సంక్షేమానికి పోరాడుతా: ఎమ్మెల్యే ఈశ్వరి చింతపల్లి: గిరిజన హక్కుల పరిరక్షణ కోసం అవసరమైతే ప్రాణాలు ఒడ్డి పోరాడుతామని పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అన్నారు. జర్రెలలో గురువారం గిరిజనులకు అటవీ హక్కుల చట్టం కింద భూమి పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గిరిజనులుఆర్ఓఎఫ్ భూములకు పట్టాలు పంపిణీకి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ శ్రీకారం చుట్టారన్నారు. ఆయన మరణాంతరం మన్యంలో బాక్సైట్ ఖనిజాన్ని తవ్వుకుపోయేందుకు కుట్రలో భాగంగానే పట్టాల పంపిణీ నిలిచిపోయిందన్నారు. దీనిపై గిరిజనులు, తమ పార్టీ నేతల పోరాటాల ఫలితంగా ఈ రోజు బాక్సైట్ నిక్షేపాలు ఉన్న ప్రాంతాల్లో భూములకు పట్టాలు పంపిణీకి ప్రభుత్వం దిగి వచ్చిందన్నారు. మన్యంలో బాక్సైట్ తవ్వకాల వల్ల గిరిజనుల బతుకులు ఛిద్రమవుతాయనే తాము చేపడుతున్న వ్యతిరేక ఉద్యమాల్లో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. గిరిజనుల అభీష్టానికి వ్యతిరేకంగా ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టినా తాను సహించబోనని, అసెంబ్లీలో కూడా ప్రతిపక్ష నేత జగన్ ఆధ్వర్యంలో వ్యతిరేకించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. గత కొన్నేళ్ళుగా జర్రెల ప్రాంతంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగకపోవడం వల్ల గిరిజనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ప్రధానంగా రహదారి అధ్వానంగా ఉండటంతో వాహనాల రాకపోకలకు సమస్యగా ఉందని, ఇప్పుడు ఘాట్‌రోడ్డులో సీసీ ర్యాంపు నిర్మాణానికి చర్యలు తీసుకున్నామని చెప్పారు. మొండిగెడ్డ వరకు ఆర్టీసీ బస్సులను నడిపేందుకు సంబంధిత అధికారులతో చర్చించి చర్యలు చేపడుతామన్నారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన గిరిజన కుటుంబాలకు రూ.2 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇప్పించేలా తాను డిమాండ్ చేస్తున్నానని, గాయపడ్డ వారికి కూడా రూ.25 వేలు అందజేసేలా అధికారుల దృష్టికి తీసుకు వెళ్ళానన్నారు. తన ఒత్తిడి మేరకు ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులు గ్రావిటీ పథకాలకు ప్రణాళికలు రూపొందిస్తున్నారని ఆమె తెలిపారు. మొదటి విడతగా 91 మందికి పట్టాలు పంపిణీ చేస్తున్నామని, రెండవ విడతలో మరో 106 మందికి పట్టాలు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో జీకేవీధి, చింతపల్లి జెడ్పీటీసీలు గంటా నళిని, కె.పద్మకుమారి, తహశీల్దార్ చిరంజీవి పడాల్, ఆర్‌డబ్ల్యుఎస్ జేఈ భగవత్, జర్రెల సర్పంచ్ ఎ.విజయకుమారి, జర్రెల, మొండిగెడ్డ ఎంపీటీసీలు జగ్గమ్మ, తెల్లన్నదొర, వైసీపీ నాయకులు ఎ.వి.మూర్తి, రవి, గంగాధర్, మాజీ సర్పంచ్ సత్యనారాయణ పాల్గొన్నారు. -
మానుకోటలో భూ పంచాయితీ
అంగన్వాడీల ఇళ్ల స్థలాలపై రగడ కట్టిన ఇళ్లను కూల్చివేసిన బాబునాయక్‌తండా వాసులు బోరున విలపిస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు మహబూబాబాద్ : మానుకోట పట్టణంలో భూములు పంచాయితీ జోరుగా సాగుతోంది. ప్రభుత్వం నిరు పేదలకు పట్టాలు పంపిణీ చేసినప్పటికీ.. కొందరు ఆ భూములు తమవేనని గొడవలకు దిగుతున్నారు. ఇందుకు నిదర్శనంగా అంగన్వాడీ వర్కర్లు, ఆయూలకు పంపిణీ చేసిన స్థలమే ఉంటుంది. వివరాల్లోకి వెళితే... పట్టణ శివారు తొర్రూరురోడ్డులోని సబ్‌జైల్ సమీపంలో 551 సర్వే నంబర్లో సుమారు 56 మంది అంగన్వాడీ వర్కర్లు, ఆయూలకు 2010లో ప్రభుత్వం స్థలాలు కేటారుుంచి పట్టాలు పంపిణీ చేసింది. ఇందులో భాగంగా ఒక్కొక్కరికి 80 గజాల చొప్పున స్థలాన్ని కేటాయించింది. దీంతో కొందరు అంగన్వాడీ వర్కర్లు, ఆయూలు తమకు కేటారుుంచిన స్థలంలో ఇళ్లు కట్టుకున్నారు. అరుుతే కొన్ని నెలల క్రితం సర్వే నంబర్ 551 స్థలం తమదేనని బాబునాయక్‌తండాకు చెందిన కొంతమంది వ్యక్తులు హద్దురాళ్లను తొలగించారు. దీంతో అంగన్వాడీ కార్యకర్తలకు హద్దురాళ్లు తొలగించిన వారిపై రెవెన్యూ అధికారులతోపాటు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా సంబంధిత వ్యక్తులపైన పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇళ్ల కూల్చివేత.. కాగా, పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైన తర్వాత స్తబ్దుగా ఉన్న బాబునాయక్ తండావాసులు మళ్లీ రెచ్చిపోరుునట్లు అంగన్వాడీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో 16 మంది అంగన్వాడీలు రూ.50 వేలు వెచ్చించి ఒక్కో గదిని నిర్మించుకున్నారు. ఈ క్రమంలో సదరు గదులను బుధవారం మధ్యాహ్నం బాబునాయక్ తండాకు చెందిన వ్యక్తులు కూల్చివేయడంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. తమ భూమిలో ఇళ్లు ఎలా కట్టుకున్నారని తండావాసులు ఎదురు తిరగడంతో అంగన్వాడీలు మళ్లీ రెవెన్యూ అధికారులతో పాటు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రెవెన్యూ, పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించి తమను ఆదుకోవాలని అంగన్వాడీ కార్యకర్తలు కోరుతున్నారు. రూ. 50 వేలు నష్టపోయాను.. తనకు ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో రూ. 50 వేలతో ఇల్లు కట్టుకున్నాను. అరుుతే బాబునాయక్ తండాకు చెందిన ఏడుగురు వ్యక్తులు నా ఇంటిని బుధవారం కూల్చివేశారు. ఆ భూమి విషయంలో అడ్డువస్తే చంపుతామని బెదిరిస్తున్నారు. పోలీసులు వారిపై కేసులు పెట్టి మాకు న్యాయం చేయూలి. -గజ్జెల ఉపేంద్ర, అంగన్వాడీ ఆయా సౌకర్యాలు లేకనే ఉండడం లేదు.. ప్రభుత్వం కేటారుుంచిన స్థలంలో ఇల్లు కట్టుకున్నా సౌకర్యాలు లేవు. దీంతో తాము అక్కడ ఉండడంలేదు. బాబునాయక్తండావాసులు గతంలో హద్దురాళ్లను తొలగిస్తే రక్షణ కోసం ఇల్లు కట్టుకున్నాం. అధికారులు మా బాధలను పట్టించుకోవాలి. -గౌసియా, అంగన్వాడీ ఆయా