మానుకోటలో భూ పంచాయితీ | AANGANWADI homes and places of crisis | Sakshi
Sakshi News home page

మానుకోటలో భూ పంచాయితీ

Published Fri, May 1 2015 1:31 AM | Last Updated on Sun, Sep 3 2017 1:10 AM

మానుకోటలో భూ పంచాయితీ

మానుకోటలో భూ పంచాయితీ

అంగన్‌వాడీల ఇళ్ల స్థలాలపై రగడ
కట్టిన ఇళ్లను కూల్చివేసిన బాబునాయక్‌తండా వాసులు
బోరున విలపిస్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలు

 
మహబూబాబాద్ : మానుకోట పట్టణంలో భూములు పంచాయితీ జోరుగా సాగుతోంది. ప్రభుత్వం నిరు పేదలకు పట్టాలు పంపిణీ చేసినప్పటికీ.. కొందరు ఆ భూములు తమవేనని గొడవలకు దిగుతున్నారు. ఇందుకు నిదర్శనంగా అంగన్‌వాడీ వర్కర్లు, ఆయూలకు పంపిణీ చేసిన స్థలమే ఉంటుంది. వివరాల్లోకి వెళితే... పట్టణ శివారు తొర్రూరురోడ్డులోని సబ్‌జైల్ సమీపంలో 551 సర్వే నంబర్‌లో సుమారు 56 మంది అంగన్‌వాడీ వర్కర్లు, ఆయూలకు 2010లో ప్రభుత్వం స్థలాలు కేటారుుంచి పట్టాలు పంపిణీ చేసింది. ఇందులో భాగంగా ఒక్కొక్కరికి 80 గజాల చొప్పున స్థలాన్ని కేటాయించింది. దీంతో కొందరు అంగన్‌వాడీ వర్కర్లు, ఆయూలు తమకు కేటారుుంచిన స్థలంలో ఇళ్లు కట్టుకున్నారు. అరుుతే కొన్ని నెలల క్రితం సర్వే నంబర్ 551 స్థలం తమదేనని బాబునాయక్‌తండాకు చెందిన కొంతమంది వ్యక్తులు హద్దురాళ్లను తొలగించారు. దీంతో అంగన్‌వాడీ కార్యకర్తలకు హద్దురాళ్లు తొలగించిన వారిపై రెవెన్యూ అధికారులతోపాటు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా సంబంధిత వ్యక్తులపైన పోలీసులు కేసులు నమోదు చేశారు.

ఇళ్ల కూల్చివేత..

కాగా, పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైన తర్వాత స్తబ్దుగా ఉన్న బాబునాయక్ తండావాసులు మళ్లీ రెచ్చిపోరుునట్లు అంగన్‌వాడీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో 16 మంది అంగన్‌వాడీలు రూ.50 వేలు వెచ్చించి ఒక్కో గదిని నిర్మించుకున్నారు. ఈ క్రమంలో సదరు గదులను బుధవారం మధ్యాహ్నం బాబునాయక్ తండాకు చెందిన వ్యక్తులు కూల్చివేయడంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. తమ భూమిలో ఇళ్లు ఎలా కట్టుకున్నారని తండావాసులు ఎదురు తిరగడంతో అంగన్‌వాడీలు మళ్లీ  రెవెన్యూ అధికారులతో పాటు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రెవెన్యూ, పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించి తమను ఆదుకోవాలని అంగన్‌వాడీ కార్యకర్తలు కోరుతున్నారు.
 
 రూ. 50 వేలు నష్టపోయాను..


తనకు ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో రూ. 50 వేలతో ఇల్లు కట్టుకున్నాను. అరుుతే బాబునాయక్ తండాకు చెందిన ఏడుగురు వ్యక్తులు నా ఇంటిని బుధవారం కూల్చివేశారు. ఆ భూమి విషయంలో అడ్డువస్తే చంపుతామని బెదిరిస్తున్నారు. పోలీసులు వారిపై కేసులు పెట్టి మాకు న్యాయం చేయూలి.
 -గజ్జెల ఉపేంద్ర, అంగన్‌వాడీ ఆయా
 
సౌకర్యాలు లేకనే ఉండడం లేదు..


ప్రభుత్వం కేటారుుంచిన స్థలంలో ఇల్లు కట్టుకున్నా సౌకర్యాలు లేవు. దీంతో తాము అక్కడ ఉండడంలేదు. బాబునాయక్‌తండావాసులు గతంలో హద్దురాళ్లను తొలగిస్తే రక్షణ కోసం ఇల్లు కట్టుకున్నాం. అధికారులు మా బాధలను పట్టించుకోవాలి.
 -గౌసియా, అంగన్‌వాడీ ఆయా
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement