district collectors meeting
-
జిల్లాల కలెక్టర్లతో CCLA కమిషనర్ నవీన్ మిట్టల్ వీడియో కాన్ఫరెన్స్
-
అన్నీ కలెక్టర్లే అంటే సరికాదు
సాక్షి, హైదరాబాద్: ధరణి దరఖాస్తుల పరిష్కారంలో అధికారాలను వికేంద్రీకరించడమే మేలని పలు జిల్లాల కలెక్టర్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. ధరణి పరిధిలోని ప్రతి మాడ్యూల్ ద్వారా వచ్చే దరఖాస్తులన్నింటినీ జిల్లా కలెక్టర్లే పరిష్కరించే పద్ధతి సరైంది కాదని, ఇందుకు పరిస్థితులు కూడా అనుకూలంగా ఉండవని తెలిపారు. ఈ నేపథ్యంలోనే ధరణి దర ఖాస్తులు పేరుకుపోయాయని వెల్లడించారు. ధరణి పునర్నిర్మాణ కమిటీ బుధవారం సచివాలయంలో ఐదు జిల్లాల కలెక్టర్లతో సమావేశమైంది. కమిటీ సభ్యులు ఎం.కోదండరెడ్డి, ఎం.సునీల్‌కుమార్, రేమండ్ పీటర్, మధుసూదన్, నవీన్ మిత్తల్‌తో పాటు సీఎంఆర్వో పీడీ వి.లచ్చిరెడ్డి, జిల్లాల కలెక్టర్లు ప్రశాంత్ పాటిల్ (సిద్దిపేట), రాజీవ్‌గాంధీ హనుమంతు (నిజామాబాద్), ప్రావీణ్య (వరంగల్), గౌతమ్ కుమార్ (ఖమ్మం), శశాంక్ (రంగారెడ్డి), రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ధరణి దరఖాస్తుల పరిష్కారంలో ఎదురవుతున్న సమస్యలు, అనుభవాలను కమిటీ సభ్యులకు కలెక్టర్లు వివరించారు. అన్ని సమస్యలకూ తగిన మాడ్యూల్స్ లేవు ధరణి పోర్టల్‌లో అన్ని సమస్యల పరిష్కారానికి అవసరమైన మాడ్యూల్స్ లేవని, తమకు ఉన్న పని ఒత్తిడిలో అన్ని దరఖాస్తులు పరిశీలించి పరిష్కరించేందుకు జాప్యం జరుగుతోందని కలెక్టర్లు తెలిపారు. ఈ మేరకు అవసరమైన సిబ్బంది కూడా క్షేత్రస్థాయిలో లేరని చెప్పినట్టు తెలిసింది. సమస్యల పరిష్కార అధికారాలను కేవలం కలెక్టర్లకే కాకుండా కేటగిరీల వారీగా తహశీల్దార్లకు, ఆర్డీవోలకు కూడా ఇవ్వాలని సూచించారు. సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారంపై ప్రభుత్వం నుంచి ఎలాంటి మార్గదర్శకాలు లేనందున వాటిని పరిష్కరించలేకపోయామని వివరించినట్టు సమాచారం. టెర్రాసిస్ కాంటెల్లా ప్రతినిధులతోనూ సమావేశం ధరణి పోర్టల్ నిర్వహిస్తోన్న టెర్రాసిస్ కాంటెల్లా కంపెనీ ప్రతినిధులతోనూ కమిటీ సభ్యులు భేటీ అయ్యారు. ధరణి పోర్టల్ పనితీరు, ఇందులో ఇమిడి ఉన్న సాంకేతిక అంశాలు, సమస్యల పరిష్కారానికి ఉన్న మార్గాల గురించి చర్చించారు. ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగిన ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్లు, కంపెనీ ప్రతినిధుల నుంచి అవసరమైన సమాచారాన్ని కమిటీ సభ్యులు సేకరించారు. 27న అటవీ, వ్యవసాయ అధికారులతో భేటీ ఈ నెల 27న మరోమారు భేటీ కావాలని, ఉదయం అటవీ, గిరిజన శాఖలతో, మధ్యాహ్నం వ్యవసాయ శాఖ అధికారులతో సమావేశం కావాలని నిర్ణయించారు. ఆ తర్వాత స్టాంపులు, రిజి్రస్టేషన్లు, సర్వే సెటిల్మెంట్, దేవాదాయ, వక్ఫ్ ఉన్నతాధికారులతో సమావేశం కావాలని, ఆ భేటీ తర్వాతే ప్రభుత్వానికి మధ్యంతర నివేదిక సమర్పించాలని నిర్ణయించారు. -
భారమైతే బదిలీ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు ఎనిమిది పనిదినాల్లో ‘ప్రజాపాలన’కార్యక్రమాన్ని నిర్వహించాలని కలెక్టర్లు, ఎస్పీలను ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ఆదేశించారు. రెవెన్యూ శాఖ గ్రామసభలను నిర్వహిస్తుందని, పోలీసుశాఖ వాటిని గాడిలో పెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమం అమల్లో ఏవైనా ఇబ్బందులుంటే సీఎస్, డీజీపీకి ఫోన్ చేసి తెలియజేయాలన్నారు. పని చేయడానికి ఇబ్బందిగా ఉన్నా, ఇష్టం లేకపోయినా చెప్పాలని.. వేరే చోటికి బదిలీ చేయడానికి ప్రభుత్వానికి ఎటువంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. జిల్లాల్లో ఉండి ఏమీ చేయబోమంటే అంగీకరించే ప్రసక్తే లేదన్నారు. ఆదివారం రాష్ట్ర సచివాలయంలో జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ వారి నుంచి సూచనలు, సలహాలు తీసుకున్నారు. పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. ‘‘ప్రభుత్వ లక్ష్యాలను ప్రజలకు చేరవేయడం ఎవరికైనా ఇష్టం లేకున్నా.. ఎక్కువగా పనిచేయాల్సి వస్తోందని, 18 గంటలు పనిచేయాల్సి వస్తోందని, మానసికంగా, శారీరకంగా ఇబ్బంది ఎందుకని అనిపించినా చెప్పండి. అలాంటి వారిని వేరే చోటికి బదిలీ చేస్తాం. 18 గంటల పని ఉండని ప్రాంతానికి బదిలీ చేయడంలో అభ్యంతరం లేదు. అధికారుల సూచనలు, సలహాలను ఓపెన్ మైండ్‌తో స్వీకరిస్తాం. అధికారుల పనితీరుకు నీతి, నిజాయతీలే పెద్ద కొలమానం. పోస్టింగ్స్‌లో వాటినే పరిగణనలోకి తీసుకుంటాం..’’అని రేవంత్ చెప్పారు. ప్రజా పాలనకు ప్రత్యేకాధికారులు ప్రజాపాలనలో భాగంగా ప్రతి మండలంలో రోజూ రెండు గ్రామాల్లో సభలు నిర్వహించాలని సీఎం ఆదేశించారు. మండలంలో రెండు బృందాలుంటే ఒక బృందానికి ఎమ్మార్వో, మరో బృందానికి ఎంపీడీవో బాధ్యత తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమం కోసం 119 నియోజకవర్గాలకు 119 మంది ప్రత్యేకాధికారులను నియమిస్తామని చెప్పారు. ముందుగా గ్రామాలకు వెళ్లి ప్రణాళికతో సభ నిర్వహించాలని.. మహిళల కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రభుత్వ సందేశాన్ని చదివి వినిపించిన తర్వాత కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు. నిరక్షరాస్యుల దరఖాస్తులను నింపించడానికి అంగన్వాడీలు, ఆశా వర్కర్ల సేవలను వినియోగించుకోవాలన్నారు. దరఖాస్తులకు అవసరమైన డేటా, ఆధార్‌కార్డు, ఫోటో వంటివి తేవాలని ప్రజలకు ముందే తెలియజేయాలని ఆదేశించారు. అమరవీరులు, ఉద్యమకారులపై ఎఫ్ఐఆర్, కేసుల వివరాలను సేకరించాల్సి ఉంటుందని, ముందే అప్లికేషన్లు పంపిణీ చేయాలని సూచించారు. ప్రజాపాలన కింద సేకరించిన దరఖాస్తులను డిజిటలైజ్ చేసి ప్రభుత్వానికి పంపిస్తే.. వాటిని స్రూ్కటినీ చేసి అర్హులైన వారికి సంక్షేమ పథకాలను అందిస్తామని చెప్పారు. ప్రతి నాలుగు నెలలకోసారి గ్రామసభలు, ప్రజాపాలన పరిస్థితిని సమీక్షించుకుందామన్నారు. అద్దాల మేడలు కట్టి అభివృద్ధి అంటే ఎలా? ‘‘అభివృద్ధి అంటే అద్దాల మేడలు, రంగుల గోడలు కాదు. పౌరుల నైతికాభివృద్ధే నిజమైన దేశాభివృద్ధి అని అంబేడ్కర్ ఎప్పుడో చెప్పారు. అద్దాల మేడలు, రంగుల గోడలు చూపించి అభివృద్ధి జరిగిందని ఎవరైనా భ్రమపడితే పేద ప్రజలకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. చివరి వరసలోని పేదలకు సంక్షేమ పథకాలు అందినప్పుడే ఈ రాష్ట్రం గానీ, దేశం గానీ అభివృద్ధి చెందినట్టు కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది..’’అని రేవంత్ చెప్పారు. ఆరు గ్యారంటీల అమలుపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలపైనే పూర్తి బాధ్యత పెట్టామని, వారిపై నమ్మకంతో దరఖాస్తుల స్వీకరణ కోసం ప్రజాపాలన కార్యక్రమాన్ని చేపట్టామని పేర్కొన్నారు. ప్రజలతో జాగ్రత్తగా వ్యవహరించాలి ‘‘తెలంగాణ ప్రజలు గౌరవంగా, మర్యాదగా వ్యవహరిస్తారు. అభివృద్ధిని విస్మరిస్తే వారి ప్రతిస్పందన చాలా కటువుగా ఉంటుంది. అది మీరంతా ఇటీవలే చూశారు..’’అని అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ఉద్దేశిస్తూ సీఎం రేవంత్ పేర్కొన్నారు. ప్రజల ఆలోచనలను అర్థం చేసుకోకుంటే ఎంతటి వారినైనా ఇంటికి పంపించగలరని.. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉండి బాధ్యతాయుతంగా, జవాబుదారీతనంతో వారి సమస్యలను పరిష్కరించాలని కోరారు. మాది ఫ్రెండ్లీ ప్రభుత్వమే.. కానీ.. తమది ఫ్రెండ్లీ ప్రభుత్వమేనని.. అయితే ప్రజలతో శభాష్ అనిపించుకున్నంత వరకే ఈ ప్రభుత్వం అధికారులతో ఫ్రెండ్లీగా ఉంటుందని సీఎం రేవంత్ పేర్కొన్నారు. నిర్లక్ష్యం వహించినా, ఉద్దేశపూర్వకంగా తప్పుడు నిర్ణయాలు తీసుకున్నా ప్రభుత్వం సమీక్షిస్తుందని చెప్పారు. అధికారుల్లో మానవీయ కోణం ఉంటే ప్రజల సమస్యల్లో 90శాతం సమస్యలు అక్కడే పరిష్కరించవచ్చని స్పష్టం చేశారు. రూల్స్‌ను అమలు చేస్తున్నామని అనుకోవడం కంటే, ప్రజల సమస్యలను పరిష్కరించడానికే ఉన్నామన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. సమస్యల పరిష్కారంలో సానుకూల (పాజిటివ్) దృక్పథం, ధోరణితో ముందుకెళ్లాలన్నారు. అలా కాకుండా ఏ కాగితం వచ్చినా ఎలా తిరస్కరించాలన్న ఆలోచనా ధోరణి ఉంటే అభివృద్ధి, సంక్షేమం సరైన దిశగా ప్రయాణించవని స్పష్టం చేశారు. పాత ప్రభుత్వ పద్ధతులను మానుకుంటే మంచిది డిప్యూటీ సీఎం భట్టి కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు అనుగుణంగా అధికారుల పనితీరు ఉండాలని.. విధుల్లో అలసత్వాన్ని సహించేది లేదని కలెక్టర్లు, ఎస్పీలకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ప్రభుత్వం అమలు చేసే ప్రతి కార్యక్రమాన్ని క్షేత్రస్థాయి వరకు తీసుకెళ్లడంలో అధికారులు అంకిత భావంతో పనిచేయాలని సూచించారు. తెలంగాణ వచ్చిన దశాబ్దకాలం తర్వాత ప్రజల ప్రభుత్వం ఏర్పడిందని.. ఈ ప్రభుత్వం తమదేనన్న నమ్మకం, భరోసాను ప్రజల్లో కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని స్పష్టం చేశారు. అందుకు తగ్గట్టుగా అధికార యంత్రాంగం పనితీరు ఉండాలని సూచించారు. పాత ప్రభుత్వ పద్ధతులను అధికారులు మార్చుకోవాలని, ఆ మైండ్‌సెట్ ఇక ముందు ఉండకూడదని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే రెండు గ్యారంటీలు అమలు చేశామని.. మిగతా గ్యారంటీలను కూడా వంద రోజుల్లో కచ్చితంగా అమలు చేస్తామని చెప్పారు. ఈ గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రతి లబ్ధిదారుకు అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. -
5 పథకాలు.. 4 నెలలకోసారి
సాక్షి, హైదరాబాద్: ఆరు గ్యారంటీలు సమర్థవంతంగా అమలు...క్షేత్రస్థాయిలో ప్రజలెదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు నాలుగునెలలకోసారి ప్రభుత్వం ‘ప్రజాపాలన’ కార్యక్రమం నిర్వహించనుంది. అయితే ఈ కార్యక్రమాన్ని ఐదు పథకాలకు మాత్రమే వర్తింపజేస్తామని ప్రభుత్వవర్గాలు స్పష్టం చేశాయి. ఈ మేరకు ఆదివారం జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ప్రజాపాలన కార్యక్రమ అమలు విధివిధానాలపై మార్గదర్శకాలు విడుదల చేశారు. దీని ప్రకారం ప్రజాపాలన కార్యక్రమాన్ని ఈనెల 28 నుంచి జనవరి 6 వరకు ఎనిమిది పనిదినాల్లో (డిసెంబర్31, జనవరి1 మినహాయించి) నిర్వహించాల్సి ఉంటుంది. ప్రతి రోజు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండు షిఫ్టుల్లో ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి గ్రామపంచాయతీలోనూ, పట్టణ ప్రాంతాల్లో ప్రతి మున్సిపల్ వార్డులోనూ ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. షెడ్యూల్, నిబంధనలు ►ఈ నెల 25వ తేదీలోపు అధికారుల బృందాల ఏర్పాటు, గ్రామాల వారీగా విజిట్ షెడ్యూల్ త యారీ (మంగళవారం సాయంత్రం ఆరు గంట లకల్లా ఈ వివరాలు పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయానికి పంపాల్సి ఉంటుంది) ►ఈ నెల 26న అధికారుల బృందాలకు శిక్షణ, అవగాహన ►ఈ నెల 26,27 తేదీల్లో జిల్లా ఇన్చార్జ్ మంత్రుల ఆధ్వర్యంలో జిల్లాస్థాయి, నియోజకవర్గ స్థాయిలో అధికారులకు అవగాహన కార్యక్రమం, పథకం ఉద్దేశాల వివరణ ►ఈ నెల 28న గ్రామ, వార్డు సదస్సులు ప్రారంభం..సాయంత్రం 8 గంటల కల్లా డైలీ రిపోర్టు ఆన్లైన్లో పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయానికి. ►సదస్సు ఏర్పాటుకు ఒక రోజు ముందే గ్రామాలు, వార్డుల్లో టాంటాం వేయించడంతో పాటు కౌంటర్లు, ఇతర ఏర్పాట్లు చేసుకోవాలి. ►రాష్ట్ర స్థాయిలో ఒక ఉమ్మడి దరఖాస్తు ఫారం రూపొందించి కలెక్టర్లకు పంపిస్తారు. వీటిని ఈ నెల 27వ తేదీ రాత్రికల్లా గ్రామాలు, వార్డులకు పంపించాలి. ముందు రోజే గ్రామాలు, వార్డుల్లో దరఖాస్తులు పంపిణీ చేసి వాటిని ప్రజలతో నింపించాలి. ►సభలు సజావుగా నిర్వహించడానికి తాగునీరు, టెంట్లు, కౌంటర్ల కోసం టేబుళ్లు, క్యూలైన్ల కోసం బారికేడ్లు ఏర్పాటు చేయాలి. ►గ్యారంటీల అమలుతో సంబంధం ఉన్న అన్ని శాఖల అధికారులు ఈ సభలకు హాజరు కావాలి. నియోజకవర్గస్థాయిలో నోడల్ అధికా రులను నియమించి కార్యక్ర మాన్ని పర్యవేక్షించాలి. ప్రతి గ్రామపంచాయతీ / వార్డుకు ప్రత్యేక అధికారిని ఇన్చార్జ్గా నియమించాలి. ►ఇతర గ్రామ స్థాయి అధికా రులు, అంగన్వాడీ టీచర్లు, ఆశ వర్కర్లతో సమన్వయం చేసుకొని కార్యక్రమం నిర్వ హించాలి. ►గ్రామ పంచాయతీ సర్పంచ్/కౌన్సిలర్/కార్పొరేటర్, ఇతర ప్రజాప్రతినిధులను సదస్సులకు ఆహ్వానించాలి. ►సభ ప్రారంభానికి ముందు ప్రభుత్వ సందేశాన్ని చదివి వినిపించాలి. ►దరఖాస్తులతో పాటు అవసరమైన ఆధార్, తెల్లరేషన్ కార్డు సమర్పించేలా కౌంటర్లలో ఉండే సిబ్బంది జాగ్రత్త తీసుకోవాలి. దరఖాస్తుల స్వీకరణకు మహిళలకు ప్రత్యేక కౌంటర్లు, స్త్రీ, పురుషులకు విడివిడిగా క్యూలైన్లు ఏర్పాట్లు చేయాలి. దరఖాస్తుదారులు భారీ సంఖ్యలో ఉంటే టోకెన్ విధాననం అమలు చేయాలి. ►దరఖాస్తుకు రశీదు తప్పనిసరిగా ఇవ్వాలి. ► స్వీకరించిన ప్రతి దరఖాస్తు వివరాన్ని పంచాయతీరాజ్ శాఖ రూపొందించిన ఆన్లైన్ సాఫ్ట్‌వేర్‌లో నమోదు చేయాలి. ప్రతి దరఖాస్తుకు ఒక ప్రత్యేక సంఖ్య కేటాయించాలి. ► పట్టణ ప్రాంతాల్లో ఈ కార్య క్రమాన్ని జీహెచ్ఎంసీ కమిష నర్ లేదా సంబంధిత మున్సి పల్ కమిషనర్లు పర్యవే క్షిస్తారు. ► స్వీకరించిన అన్ని దర ఖాస్తులు టీం లీడర్ అధీనంలో ఉంచాలి. వాటిని భద్రపర్చడంతో పాటు కంప్యూటరీకరించేందుకు అవస రమైన కార్యాలా యాన్ని జిల్లా కలెక్టర్ కేటాయించాలి. ►ప్రతి అధికారుల బృందం రోజుకు రెండు గ్రామాల్లో సభలు నిర్వహించాలి. జనవరి ఆరో తేదీ నాటికి పూర్తి చేసుకోవాలి. ప్రతి 100 కుటుంబాలకు కనీసం ఒక కౌంటర్ ఉండేలా చూసుకోవాలి. ►దరఖాస్తుల వెరిఫికేషన్/ప్రాసెసింగ్‌కు సూచన లు ప్రభుత్వం త్వరలోనే జారీ చేస్తుంది. ►అధికారుల బృందాలు విజిట్ షెడ్యూల్‌కు 10 అంశాలతో, డైలీ రిపోర్టు కోసం 11 అంశాలతో ప్రత్యేక ఫార్మాట్ రూపొందించారు. గ్రామాలు లేదా వార్డులకు వచ్చే అధికారులు వీరే ►తహసీల్దారు లేదా రెవెన్యూ శాఖ ప్రతినిధి ►ఎంపీడీఓ లేదా గ్రామీణాభివృద్ధి శాఖ ప్రతినిధి ►మండల పంచాయతీ అధికారి లేదా పంచాయతీరాజ్ ప్రతినిధి ►మండల వ్యవసాయ అధికారి లేదా వ్యవసాయ శాఖ ప్రతినిధి ►పౌరసరఫరాల శాఖ ప్రతినిధి ► పీహెచ్‌సీలోని వైద్యాధికారి లేదా వైద్య శాఖ ప్రతినిధి ►మండల విద్యాధికారి లేదా విద్యాశాఖ ప్రతినిధి ►ఏఈ (డిస్కం) లేదా విద్యుత్‌శాఖ ప్రతినిధి ►సంబంధిత గ్రామ పంచాయతీ కార్యదర్శి ►ఇతర సంబంధిత అధికారులు. (వీరిలో అవసరమైన అధికారులను గ్రామాల వారీ గా నియమించుకోవాల్సి ఉంటుంది.) దరఖాస్తులు స్వీకరించే పథకాలు: మహాలక్ష్మి రైతుభరోసా గృహజ్యోతి ఇందిరమ్మ ఇళ్లు చేయూత -
కలెక్టర్లతో సీఎం జగన్ వీడియోకాన్ఫరెన్స్
-
ఈనెల 9 నుంచి 'వై ఏపీ నీడ్స్ జగన్' కార్యక్రమం
-
ఆర్థిక వనరులు సమకూర్చే శాఖలతో సీఎం సమీక్ష
-
భారీ వర్షాలపై ఎప్పటికప్పుడు కలెక్టర్లు సమీక్ష నిర్వహించాలి: సీఎం జగన్
-
పదిరోజుల్లో మారాలి: సీఎం కేసీఆర్
జిల్లాను దత్తత తీసుకుంటా... నేను కూడా ఒక జిల్లాను దత్తత తీసుకుని, పల్లె ప్రగతి,పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో స్వయంగా పాల్గొంటా. అదనపు కలెక్టర్, నేను కలిసి పనిచేస్తం. అభివృద్ధి ఎందుకు జరగదో చేసి చూపిస్తం 24 అంతస్తుల్లో ఆస్పత్రి.. వరంగల్ సెంట్రల్ జైలు స్థలంలో 24 అంతస్తులతో, ఆధునిక సదుపాయాలతో గ్రీన్ బిల్డింగ్‌గా మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మిస్తం. వైద్యం కోసం రోగులు హెలికాప్టర్లో వచ్చి దిగేందుకు వీలుగా ఆస్పత్రి భవనంపై హెలిప్యాడ్ నిర్మిస్తం. సాక్షి, హైదరాబాద్: పల్లెలు, పట్టణాలను ప్రగతిపథంలో నడిపించేందుకు జిల్లాల అదనపు కలెక్టర్లు, జిల్లా పంచాయతీరాజ్, మున్సిపల్ అధికారులు కంకణబద్ధులు కావాలని... గ్రామాలు, పట్ణణాల అభివృద్ధిని ఒక యజ్ఞంలా భావించి కృషి చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. ఈ నెల 20న సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల్లో, 21న వరంగల్ జిల్లాలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తానని ప్రకటించారు. తన పర్యటనకు ఇంకా పదిరోజుల సమయం ఉందని, ఏమైనా తప్పులుంటే ఆలోగా సరిదిద్దుకోవాలని సూచించారు. సీఎం కేసీఆర్ ఆదివారం రాష్ట్రంలోని జిల్లాల అదనపు కలెక్టర్లు, డీపీవోలతో ప్రగతిభవన్‌లో సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభించడంతో పాటు నూతనంగా నిర్మించ తలపెట్టిన మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి శంకుస్థాపన చేయనున్నట్టు తెలిపారు. కావలసినంత సమయమిచ్చా.. పల్లెలు, పట్టణాల అభివృద్ధికి అదనపు కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులు (డీపీవోలు) కష్టపడి పనిచేస్తున్నా ఆశించినంత పని జరగట్లేదని క్షేత్రస్థాయి నుంచి నివేదికలు అందుతున్నాయని సీఎం కేసీఆర్ అన్నారు. కావలసినంత సమయమిచ్చాకే ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నానని, దానికి ముందు మరోసారి మాట్లాడి అభిప్రాయాలు తెలుసుకుందామని సమావేశాన్ని ఏర్పాటు చేశానని చెప్పారు. గ్రామసభలు జరపకపోతే గ్రామ కార్యదర్శులు, సర్పంచులను సస్పెండ్ చేయాలని, ఈ విషయంలో అధికార పార్టీ వారు అని కూడా చూడవద్దని కేసీఆర్ సూచించారు. టీఆర్ఎస్ సర్పంచులు తప్పు చేస్తే ముందు వాళ్ల మీదే చర్యలు తీసుకోవాలన్నారు. స్థానిక సంస్థల సమస్యలను పరిష్కరించడానికి ప్రతి అదనపు కలెక్టర్‌కు తక్షణమే రూ.25 లక్షల చొప్పున కేటాయించాలని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించారు. అభివృద్ధి కోసం అందరి భాగస్వామ్యం రాష్ట్రంలోని పల్లెలు, పట్టణాలు నూటికి నూరుశాతం అభివృద్ధి సాధించేందుకు అందరి భాగస్వామ్యం అవసరమని సీఎం కేసీఆర్ అన్నారు. తాను ఒక జిల్లాను దత్తత తీసుకుని అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. హరితహారం ప్రారంభించిన పది పదిహేను రోజుల్లో అన్ని గ్రామాలు, పట్టణాల్లో మొక్కలు నాటే కార్యక్రమాలను పూర్తి చేయాలని అటవీశాఖ అధికారులను ఆదేశించారు. ఆదివారం ప్రగతి భవన్లో అదనపు కలెక్టర్లు, డీపీవోలతో సమావేశంలో మాట్లాడుతున్న సీఎం కేసీఆర్. చిత్రంలో మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి, సీఎస్ సోమేశ్ 24 అంతస్తులతో వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి వరంగల్ సెంట్రల్ జైలు స్థలంలో దేశంలోనే మెరుగైన సౌకర్యాలతో అద్భుతమైన మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మిస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు. 24 అంతస్తులతో, ఆధునిక సాంకేతిక సదుపాయాలతో, గ్రీన్ బిల్డింగ్‌గా ఆ ఆస్పత్రిని నిర్మించాలని అధికారులను ఆదేశించారు. అత్యవసర వైద్యం కోసం రోగులు హెలికాప్టర్లో వచ్చి దిగేందుకు వీలుగా ఆస్పత్రి భవనంపై హెలీప్యాడ్ నిర్మించాలని సూచించారు. కెనడా మోడల్లో ధారాళంగా గాలి, వెలుతురు ప్రసరించేలా క్రాస్ వెంటిలేషన్ పద్ధతుల్లో ఆస్పత్రి నిర్మాణం జరగాలని ఆదేశించారు. ఇందుకు అధికారులు కెనడాలో పర్యటించి రావాలన్నారు. మొదట ప్రేమగా.. వినకుంటే కఠినంగా.. మొదట సర్పంచులు, క్షేత్రస్థాయి సిబ్బందితో ప్రేమగా ఉండాలని, మంచిగా, సముదాయించి చెప్పాలని.. అభిమానంతో పనిచేయించుకోవాలని అధికారులకు సీఎం కేసీఆర్ సూచించారు. అలా వినకుంటే కఠినంగా మారాలన్నారు. ‘‘నయమున ప్రాలుందాగరు, భయమున విషమైన భుజింతురు అని సామెత ఉంది. మంచిగా బతిమాలి చెప్తే కూడా కొన్ని కొన్ని సార్లు వినరు. అప్పుడు నర్సింహావతారం ఎత్తక తప్పదు’’ అని చెప్పారు. గ్రామాభివృద్ధిలో కేరళను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. కొందరు అదనపు కలెక్టర్లు, డీపీవోలను ఎంపిక చేసి కేరళకు పంపి పరిశీలన చేయించాలని సీఎస్‌ను ఆదేశించారు. ఢిల్లీ, తమిళనాడు ప్రభుత్వాలు అమలుచేస్తున్న కొన్ని పథకాలను తెలంగాణ కూడా ఆదర్శంగా తీసుకుందని.. నేర్చుకోవడం నిరంతర ప్రక్రియ, తెలియని విషయాలను తెలుసుకోవడానికి అహంభావం ఉండకూడదని సీఎం పేర్కొన్నారు. లేఅవుట్ల విషయంలో జాగ్రత్త నర్సరీలు, వెజ్, నాన్ వెజ్ మార్కెట్లు, పబ్లిక్ టాయిలెట్లు, వైకుంఠ ధామాలు సహా అన్ని అంశాల్లో ప్రతి పట్టణానికి ఒక స్టేటస్ రిపోర్టు తయారు చేయాలని సీఎం కేసీఆర్ సూచించారు. పట్టణాల్లో లే అవుట్ల విషయంలో అదనపు కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని స్పష్టం చేశారు. కమ్యూనిటీ హాల్స్, ట్రాన్స్ ఫార్మర్లు, సబ్ స్టేషన్లు, వాటర్ ట్యాంకులు వంటి అవసరాలకు కేటాయించిన స్థలాలను స్థానిక మున్సిపాలిటీ పేరు మీద రిజిస్టర్ చేయించాలని ఆదేశించారు. నగరాలు, పట్టణాల్లో రోడ్ల విస్తరణ కోసం మాస్టర్ ప్లాన్లను నవీకరించాలని సూచించారు. ప్రజా అవసరాల కోసం నగరాలు, పట్టణాల్లో ప్రభుత్వ ల్యాండ్ రికార్డ్స్ బ్యాంక్ ఏర్పాటు చేయాలన్నారు. సేవ్ ది విలేజెస్.. సేవ్ యువర్ సెల్ఫ్ గ్రామ సభలు నిర్వహించి, గ్రామాల ఆర్థిక నివేదికల మీద చర్చలు చేపట్టేలా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత డీపీవోలదేనని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. పంచాయతీ ఉద్యోగుల జీతాలు, కరెంటు బిల్లులు, ట్రాక్టర్ కిస్తీల చెల్లింపులు, గ్రీన్ కవరేజీ కోసం ఖర్చులు అన్న ‘చార్జ్డ్ అకౌంట్’ కిందికి వస్తాయని.. వాటికి ముందు నిధులు కేటాయించాకే మిగతా ఖర్చులు చేసుకోవాలని ఆదేశించారు. పల్లె ప్రకృతి వనాల కోసం ప్రభుత్వ భూమి అందుబాటులో లేనిపక్షంలో గ్రామ పంచాయతీ నిధుల నుంచి ప్రైవేటు భూమిని కొనుగోలు చేయాలని సూచించారు. ‘సేవ్ ది పీపుల్.. సేవ్ ది విలేజెస్.. సేవ్ యువర్ సెల్ఫ్’ అనే నినాదంతో పనిచేయాలన్నారు. పనితీరు సరిగా లేనివారికి షోకాజ్ నోటీసులు పంపాలని, తాత్సారం చేయకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సీజనల్ వ్యాధులపై ముందస్తు చర్యలు జిల్లా, మండల, పీహెచ్సీ స్థాయిల్లో సీజనల్ వ్యాధుల నిర్మూలనపై వైద్య, పంచాయాతీరాజ్, మున్సిపల్ శాఖల అధికారులు ముందస్తుగా సమన్వయ సమావేశాలు నిర్వహించుకోవాలని సీఎం కేసీఆర్ సూచించారు. మలేరియాలో ప్రీఎలిమినేషన్ దశ నుంచి ఎలిమినేషన్ (నిర్మూలన) దశకు చేరుకున్నామని అధికారులు ఈ సందర్భంగా సీఎంకు వివరించారు. ఇవే పద్ధతులు అవలంబిస్తే మరో మూడేళ్లలో మలేరియా రహిత రాష్ట్రంగా తెలంగాణ అవతరిస్తుందని పేర్కొన్నారు. -
జిల్లాలవారీగా ఓటర్ల ముసాయిదా జాబితాల ప్రకటన
సాక్షి, అమరావతి: జిల్లాల వారీగా ముసాయిదా ఓటర్ల జాబితాలను జిల్లాల కలెక్టర్లు సోమవారం ప్రకటించారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా ఓటర్ల నమోదు ప్రారంభమైంది. వచ్చే ఏడాది జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండేవారిని ఓటర్‌గా నమోదు చేసేందుకు ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఓటర్ల జాబితాలో పేరులేని వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కె.విజయానంద్ తెలిపారు. డిసెంబర్ 15 వరకు ఓటర్‌గా నమోదుకు లేదా అభ్యంతరాలకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఈ నెల 28, 29 తేదీల్లో, డిసెంబర్ 12, 13 తేదీల్లో పోలింగ్ కేంద్రాల వారీగా ప్రత్యేక ప్రచార కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఈ తేదీల్లో పోలింగ్ కేంద్రాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు బూత్ స్థాయి అధికారులు, రాజకీయ పార్టీలకు చెందిన బూత్ స్థాయి ఏజెంట్లు అందుబాటులో ఉంటారు. ఓటర్లుగా చేరేందుకు, ఏదైనా మార్పులు, చేర్పులున్నా బూత్ స్థాయి ఆఫీసర్లకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులను, అభ్యంతరాలను వచ్చే ఏడాది జనవరి 5 నాటికి పరిష్కరిస్తారు. జనవరి 14న తుది ఓటర్ల జాబితాలో పేర్లు సక్రమంగా ఉన్నాయో, లేదో సరిచూసుకుని జనవరి 15న ఓటర్ల తుది జాబితాను ప్రకటిస్తారు. ప్రస్తుత ముసాయిదా జాబితాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం ఓటర్లు ఖాళీలను భర్తీ చేయండి ఖాళీగా ఉన్న జాయింట్ కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా రెవెన్యూ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, వీఆర్వో, వీఆర్ఏ, పంచాయతీ కార్యదర్శులు, బూత్ స్థాయి ఆఫీసర్ల పోస్టులను తక్షణం భర్తీ చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కె.విజయానంద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు జిల్లాల కలెక్టర్లు చర్యలు తీసుకుని.. ఇంకా ఖాళీలుంటే ఆ వివరాలతో నివేదిక పంపించాలని కోరారు. రాష్ట్రంలో తాజా ఓటర్ల సంఖ్య ఇలా -
లంచం లేకుండా ఇళ్ల అనుమతులు
సాక్షి, హైదరాబాద్: పైసా లంచం లేకుండా ఇళ్ల నిర్మాణ అనుమతులు జారీ చేసేందుకు ఏప్రిల్ 2 నుంచి ‘టీఎస్–బీపాస్’పేరుతో కొత్త అనుమతుల విధానాన్ని అమల్లోకి తీసుకొస్తున్నామని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. మార్చిలోగా అన్ని లోటుపాట్లను సరిచేసి టీఎస్–బీపాస్‌ను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. నేరు గా టీఎస్–బీపాస్ వెబ్సైట్ ద్వారా లేదా మీ–సేవ కేంద్రాల ద్వారా ఇంటి నిర్మాణ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఇందుకోసం కొత్తగా మొబైల్ యాప్‌ను సైతం తీసుకొస్తున్నామన్నారు. ఈ మూడు మార్గాల్లో లేదా స్థానిక మున్సిపల్ అధికారులను కలవడం ద్వారా అనుమతులు పొందవచ్చన్నారు. మర్రి చెన్నారెడ్డి మాన వ వనరుల శిక్షణ కేంద్రంలో శుక్రవారం ఆయన జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో సమావేశమై కొత్త మున్సిపల్ చట్టంతో పాటు పట్టణ ప్రగతి కార్యక్రమం అమలుపై దిశానిర్దేశం చేశారు. కొత్తగా తెస్తున్న టీఎస్–బీపాస్ విధానం పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. కొత్త మున్సిపల్ చట్టం ద్వారా 75 చదరపు గజాల్లోపు స్థలంలో ఇళ్ల నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉచితం చేసిందన్నారు. కలెక్టర్లపై బాధ్యతలు.. ముఖ్యమంత్రి కేసీఆర్ కోరుకునే విధంగా పచ్చని, ఆహ్లాదకరమైన పట్టణాల రూపకల్పన కోసం కృషి చేయాలని కలెక్టర్లు, అదనపు కలెక్టర్లను మంత్రి కేటీఆర్ సూచించారు. ప్రతీ పౌరుడు కోరుకునేలా రోడ్లు, మౌలిక సదుపాయాలు అందించాలని, వారి కి సంతృప్తి కలిగించేలా సమాధానాలివ్వాలన్నారు. అక్రమాలకు పాల్పడే, నిర్లక్ష్యం వహించే ప్రజాప్రతినిధులను పదవి నుంచి తొలగించే అసాధారణ అధికారాన్ని సీఎం కేసీఆర్ కలెక్టర్లకు అప్పగించారని గుర్తుచేశారు. సీఎం నిర్ణయంతో వ్యవస్థలో సమూల మార్పులొచ్చాయన్నారు. కార్యక్రమంలో పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్, పురపాలక శాఖ కమిషనర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
వినండహో..
సాక్షి, వనపర్తి: రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల కోడ్ కూసింది. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలపై ఆంక్షలు విధించింది. ఇంతలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు బ్రేక్ పడింది. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికలకు వెళ్లాలని నిశ్చయించుకుని ఈనెల 6న అసెంబ్లీని రద్దుచేసిన విషయం తెలిసిందే. దీంతో ఎన్నికల నిర్వాహణకు కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. నాలుగు రాష్ట్రాలతో పాటే తెలంగాణలోనూ నిర్వహించేందుకు అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అధికారులు గుర్తించారు. ఈనెల 25వ తేదీ వరకు ఓటు హక్కు నమోదుకు అవకాశం కల్పించిన అధికారులు అక్టోబర్ 8న తుది ఓటరు జాబితాను ప్రకటించనున్నారు. ఆ తరువాత కేంద్ర ఎన్నికల సంఘం ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినా ఎన్నికల నిర్వహణకు అధికా ర యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ప్రతిరోజు క లెక్టర్, ఎస్పీ జిల్లా అధికారులతో సమీక్షలు, స మా వేశాలు నిర్వహిస్తూ ఎలాంటి పొరపాట్లు చోటుచేసుకోకుండా సూచనలు, సలహాలు ఇస్తున్నారు. 27నుంచే ఎన్నికల కోడ్ ప్రభుత్వం రద్దయిన తర్వాత ఇటీవల వరకు ఎన్నికల నియామవళి అమలుకాకపోవడంతో జిల్లాలో అక్కడక్కడ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు కొనసాగాయి. ప్రతిపక్షాల ఫిర్యాదు నేపథ్యంలో ఈనెల 27 నుంచి కోడ్ అమల్లోకి వచ్చినట్లేనని రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు ప్రకటించారు. ఈ మేరకు కలెక్టర్, ఎన్నికల అధికారి శ్వేతామహంతికి ఆదేశాలు అందాయి. కొత్తగా ఎలాంటి పనులు చేపట్టినా ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందికే వస్తుంది. ఈ నిబంధనల మేరకు ప్రజాప్రతినిధులు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనవద్దు. ఏదైనా అభివృద్ధి కా ర్యక్రమాలకు నిధులు మంజూరైనా కోడ్ ముగిసే వరకు ఆపివేయాల్సిందే. ఇక నుంచి జిల్లాలో జరిగే అధికారిక కార్యక్రమాల్లో అధికారులే పాల్గొననున్నారు. ప్రజాప్రతినిధులు, తాజా మాజీ ఎమ్మెల్యేలు ఇక నుంచి ఎన్నికల ప్రచారంలో నిమగ్నం కానున్నారు అధికారులకు బాధ్యతలు ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కలెక్టర్ శ్వేతామహంతి జిల్లాలో 16 మంది నోడల్ అధికారుల ను నియమించారు. ఈవీఎంల నిర్వహణ, వాహనాల ఏర్పాట్లు, ఎన్నికల సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు, సామగ్రి, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నిర్వహణ, ఖర్చులు, ఎన్నికల పరిశీలన, లా అండ్ ఆ ర్డర్, బ్యాలెట్ పేపర్, డమ్మీ బ్యాలెట్ నిర్వహణ, మీడియా, కంప్యూటరైజేషన్, స్వీప్ కార్యక్రమాలు, హెల్ప్‌లైన్, ఫిర్యాదులు, ఎస్ఎంఎస్లు, కమ్యూనికేషన్ వంటి అంశాల నిర్వహణకు బాధ్యతలు అ ప్పగించారు. నోడల్ అధికారులకు శనివారం ఉద యం కలెక్టర్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రతి గ్రామంలో అవగాహన కార్యక్రమాలు జిల్లాలోని వనపర్తి నియోజకవర్గ పరిధిలోని వనపర్తి, పెద్దమందడి, ఖిల్లాఘనపురం, గోపాల్పేట, రేవల్లి, పెబ్బేరు, శ్రీరంగాపురం మండలాలు, కొ ల్లాపూర్‌లోని పాన్‌గల్, వీపనగండ్ల, చిన్నంబావి మండలాలు, దేవరకద్ర నియోజకవర్గంలోని కొత్తకోట, మదనాపురం మండలాలు, మక్తల్ నియోజకవర్గంలోని ఆత్మకూరు, అమరచింత మండలాల్లో సెప్టెంబర్ 10న విడుదల చేసిన డ్రాప్ట్ నోటిఫికేషన్ ప్రకారం 3,89,293 మంది ఓటర్లు ఉన్నారు. 380 వీవీ ప్యాడ్లు, 440 బ్యాలెట్ యూనిట్లు, 350 కంట్రోల్ యూనిట్లు జిల్లాకు వచ్చాయి. వీటి పనితీరుపై పలు రాజకీయ పార్టీల నాయకులకు ఇప్పటికే మొదటి విడత అవగాహన కల్పించారు. ప్రతి గ్రామంలో వీవీ ప్యాట్లు, ఈవీఎంలపై వచ్చే వారం నుంచి ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించనున్నారు. సీ విజిల్ యాప్ ఈ ఎన్నికల్లో స్మార్ట్ఫోన్లు కీలకం కాబోతున్నాయి. స్మార్ట్ కలిగిన ఉన్న వారు ప్లే స్టోర్‌లో ‘సీ విజిల్’ అనే యాప్‌ను డౌన్లోడ్ చేసుకుంటే చాలు నేరుగా ఎవరైనా ఎన్నికల నిబంధనలను ఉల్లఘించినట్లు కనిపిస్తే నేరుగా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చే యొచ్చు. నిబంధనలను ఉల్లంఘించిన వీడియోలను తీసి యాప్‌లో అప్లోడ్ చేస్తే జీపీఎస్ ఆ ధారంగా అధికారులు బాధ్యులపై చర్యలు తీసుకుంటారు. యాప్‌లో వీడియో అప్లోడ్ చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతారు. -
'వనరుల లేమి సమస్యను అధిగమిస్తాం'
విజయవాడ : 2018 కల్లా పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయడమే లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్రంలో కరవు ఉండదన్నారు. రెండు రోజుల పాటుజరగనున్న జిల్లా కలెక్టర్ల సమావేశం బుధవారం విజయవాడలో చంద్రబాబు అధ్యక్షత ప్రారంభమైంది. స్మార్ట్ వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పని చేయాలని జిల్లా కలెక్టర్లకు చంద్రబాబు సూచించారు. ప్రకృతి విపత్తులను ఎలా ఎదుర్కోవాలో ఆలోచించాలన్నారు. వనరుల లేమి సమస్యను అధిగమిస్తామని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్లపై సీఎస్ టక్కర్ ఫైర్ : జిల్లాల్లో పరిశ్రమలకు భూకేటాయింపుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని జిల్లా కలెక్టర్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్ పీ టక్కర్ ఆగ్రహాం వ్యక్తం చేశారు. పరిశ్రవమల ఏర్పాటు కోసం కొంతమంతి గత 18 నెలల నుంచి వేచి చూస్తున్నారని చెప్పారు. పరిశ్రమల ఏర్పాటుకు దరఖాస్తు చేసిన వారికి 100 రోజుల్లో క్లియరెన్స్ ఇవ్వాలని జిల్లా కలెక్టర్లకు టక్కర్ ఆదేశాలు జారీ చేశారు.