సాక్షి, వనపర్తి: రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల కోడ్ కూసింది. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలపై ఆంక్షలు విధించింది. ఇంతలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు బ్రేక్ పడింది. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎన్నికలకు వెళ్లాలని నిశ్చయించుకుని ఈనెల 6న అసెంబ్లీని రద్దుచేసిన విషయం తెలిసిందే. దీంతో ఎన్నికల నిర్వాహణకు కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. నాలుగు రాష్ట్రాలతో పాటే తెలంగాణలోనూ నిర్వహించేందుకు అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అధికారులు గుర్తించారు. ఈనెల 25వ తేదీ వరకు ఓటు హక్కు నమోదుకు అవకాశం కల్పించిన అధికారులు అక్టోబర్ 8న తుది ఓటరు జాబితాను ప్రకటించనున్నారు. ఆ తరువాత కేంద్ర ఎన్నికల సంఘం ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినా ఎన్నికల నిర్వహణకు అధికా ర యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ప్రతిరోజు క లెక్టర్, ఎస్పీ జిల్లా అధికారులతో సమీక్షలు, స మా వేశాలు నిర్వహిస్తూ ఎలాంటి పొరపాట్లు చోటుచేసుకోకుండా సూచనలు, సలహాలు ఇస్తున్నారు.
27నుంచే ఎన్నికల కోడ్
ప్రభుత్వం రద్దయిన తర్వాత ఇటీవల వరకు ఎన్నికల నియామవళి అమలుకాకపోవడంతో జిల్లాలో అక్కడక్కడ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు కొనసాగాయి. ప్రతిపక్షాల ఫిర్యాదు నేపథ్యంలో ఈనెల 27 నుంచి కోడ్ అమల్లోకి వచ్చినట్లేనని రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు ప్రకటించారు. ఈ మేరకు కలెక్టర్, ఎన్నికల అధికారి శ్వేతామహంతికి ఆదేశాలు అందాయి. కొత్తగా ఎలాంటి పనులు చేపట్టినా ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందికే వస్తుంది. ఈ నిబంధనల మేరకు ప్రజాప్రతినిధులు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనవద్దు. ఏదైనా అభివృద్ధి కా ర్యక్రమాలకు నిధులు మంజూరైనా కోడ్ ముగిసే వరకు ఆపివేయాల్సిందే. ఇక నుంచి జిల్లాలో జరిగే అధికారిక కార్యక్రమాల్లో అధికారులే పాల్గొననున్నారు. ప్రజాప్రతినిధులు, తాజా మాజీ ఎమ్మెల్యేలు ఇక నుంచి ఎన్నికల ప్రచారంలో నిమగ్నం కానున్నారు
అధికారులకు బాధ్యతలు
ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కలెక్టర్ శ్వేతామహంతి జిల్లాలో 16 మంది నోడల్ అధికారుల ను నియమించారు. ఈవీఎంల నిర్వహణ, వాహనాల ఏర్పాట్లు, ఎన్నికల సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు, సామగ్రి, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నిర్వహణ, ఖర్చులు, ఎన్నికల పరిశీలన, లా అండ్ ఆ ర్డర్, బ్యాలెట్ పేపర్, డమ్మీ బ్యాలెట్ నిర్వహణ, మీడియా, కంప్యూటరైజేషన్, స్వీప్ కార్యక్రమాలు, హెల్ప్‌లైన్, ఫిర్యాదులు, ఎస్‌ఎంఎస్‌లు, కమ్యూనికేషన్ వంటి అంశాల నిర్వహణకు బాధ్యతలు అ ప్పగించారు. నోడల్ అధికారులకు శనివారం ఉద యం కలెక్టర్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ప్రతి గ్రామంలో అవగాహన కార్యక్రమాలు
జిల్లాలోని వనపర్తి నియోజకవర్గ పరిధిలోని వనపర్తి, పెద్దమందడి, ఖిల్లాఘనపురం, గోపాల్‌పేట, రేవల్లి, పెబ్బేరు, శ్రీరంగాపురం మండలాలు, కొ ల్లాపూర్‌లోని పాన్‌గల్, వీపనగండ్ల, చిన్నంబావి మండలాలు, దేవరకద్ర నియోజకవర్గంలోని కొత్తకోట, మదనాపురం మండలాలు, మక్తల్ నియోజకవర్గంలోని ఆత్మకూరు, అమరచింత మండలాల్లో సెప్టెంబర్ 10న విడుదల చేసిన డ్రాప్ట్ నోటిఫికేషన్ ప్రకారం 3,89,293 మంది ఓటర్లు ఉన్నారు. 380 వీవీ ప్యాడ్లు, 440 బ్యాలెట్ యూనిట్లు, 350 కంట్రోల్ యూనిట్లు జిల్లాకు వచ్చాయి. వీటి పనితీరుపై పలు రాజకీయ పార్టీల నాయకులకు ఇప్పటికే మొదటి విడత అవగాహన కల్పించారు. ప్రతి గ్రామంలో వీవీ ప్యాట్లు, ఈవీఎంలపై వచ్చే వారం నుంచి ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించనున్నారు.
సీ విజిల్ యాప్
ఈ ఎన్నికల్లో స్మార్ట్‌ఫోన్లు కీలకం కాబోతున్నాయి. స్మార్ట్ కలిగిన ఉన్న వారు ప్లే స్టోర్‌లో ‘సీ విజిల్’ అనే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటే చాలు నేరుగా ఎవరైనా ఎన్నికల నిబంధనలను ఉల్లఘించినట్లు కనిపిస్తే నేరుగా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చే యొచ్చు. నిబంధనలను ఉల్లంఘించిన వీడియోలను తీసి యాప్‌లో అప్‌లోడ్ చేస్తే జీపీఎస్ ఆ ధారంగా అధికారులు బాధ్యులపై చర్యలు తీసుకుంటారు. యాప్‌లో వీడియో అప్‌లోడ్ చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతారు.
వినండహో..
Published Sun, Sep 30 2018 8:34 AM | Last Updated on Mon, Oct 8 2018 5:07 PM
1/1
Advertisement
Comments
Please login to add a commentAdd a comment