కుర్తీ డిజైన్
లేడీస్ టైలర్
అందంగా కనిపించాలి.. అదే టైమ్‌లో స్టైలిష్ అనే కాంప్లిమెంట్ రావాలి. దాంతో పాటే కంఫర్ట్ ఉండాలి. ఇవన్నీ ఒక్క కుర్తీతో సాధించేయవచ్చు. గతంలో కుర్తా మగవారు ధరించే దుస్తులలో ఒకటి. అదే కుర్తా కొన్ని రూపురేఖలు మార్చుకొని ఆడవారి వార్డ రోబ్‌లో కంపల్సరీ డ్రెస్‌గా కుర్తీ పేరుతో చేరిపోయింది. క్యాజువల్, పార్టీ వేర్... ఏ తరహా అయినా కుర్తీని మనమే డిజైన్ చేసుకుంటే..!! ఎలా కట్ చేయాలి? ఎలా స్టిచ్ చేయాలి? ఈ వారం తెలుసుకుందాం...
బ్లౌజ్ కటింగ్ మాదిరిగానే కుర్తీ డిజైనింగ్‌కి కూడా ముందు పేపర్ మీద డిజైన్ గీసుకుని, తర్వాత దాని కొలతలను బట్టి, క్లాత్‌ను కట్ చేసుకుంటే కటింగ్ సరిగ్గా వస్తుంది. అదీ కాకుండా కొత్తగా ప్రాక్టీస్ చేసేవారు పేపర్‌మీద నేర్చుకోవడం సరైన పద్ధతి.
పేపర్ చార్ట్, గుర్తు పెట్టడానికి టైలర్స్ చాక్ (మార్కింగ్ చేసుకోవడానికి వీలుగా చాక్‌పీస్) తీసుకోండి చార్ట్‌ను నిలువుగా, మధ్యకు మడవాలి మీ ఛాతి చుట్టుకొలత 34 అయితే (కింద అన్ని ఛాతి, వెయిస్ట్, హిప్.. చుట్టుకొలతల చార్ట్ ఇస్తున్నాం. పరిశీలించండి) నడుము భాగం 28, హిప్స్ (పిరుదులు) భాగం 38 తీసుకోవాలి ఎ-బి భాగం = ఫుల్ లెంగ్త్ ఎ-ఇ = ఆర్మ్‌హోల్ (చంకభాగం 2 వైపులా) ఎ-ఎఫ్ = నడుము భాగం ఎ-జి = పిరుదుల భాగం ఇఇ1= ఛాతి చుట్టుకొలత ఎఫ్.ఎఫ్.1 = నడుము కొలత జి.జి.1 = పిరుదల భాగం పై నుంచి కిందవరకు స్ట్రెయిట్ లైన్ ఎ1 నుంచి ఇఇ1-ఇ2 వరకు, ఇక్కడ నుంచి మళ్లీ ఎ1 దగ్గర అర అంగుళం కింద నుంచి ఎ2 వరకు మార్క్ చేసుకోవాలి
* ఆర్మ్‌హోల్ మధ్య భాగాన ఎ2 , ఇ2 , ఎ 4 వరకు మార్క్ చేసుకోవాలి.
* ఎ4 నుంచి ఎ 5 వరకు మార్క్ చేసేటప్పుడు లోపలి వైపు అర అంగుళం ఎక్కువ వదిలి మార్క్ చేయాలి అలాగే వెనుక భాగం ఆర్మ్‌హోల్ కర్వ్‌ను గీసుకోవాలి.
* ఎఎ1 = భుజ భాగం (2 వైపుల) ఎఎ2 = అర అంగుళం భుజం వాలు
* ఎఎ3 - మెడ భాగం (2 వైపుల) ఎ3, ఎ2 భుజం వాలు స్ట్రెయిట్ లైన్
* బి1 మార్క్ చేసేటప్పుడు మూలన అర అంగుళం గీయనక్కర్లేదు.
* ఎ.హెచ్ = నెక్ డెప్త్‌గా తీసుకోవాలి.
చేతుల భాగం: ఎ-బి = స్లీవ్స్ లెంగ్త్ (చేతుల పొడవు) ఎ-ఎ1 = 3 అంగుళాలు ఎఎ2 = ఆర్మ్‌హోల్ రౌండ్ (చంకభాగం చుట్టుకొలత) ఎఎ3 = 1 అంగుళం ఎ3 నుంచి ఎ2 వరకు స్ట్రెయిట్ లైన్, మధ్య భాగం ఎ4 ఎ4 నుంచి అర అంగుళం ఎక్కువ వదులుతూ ఎ5- ఎ6 వరకు మార్క్ చేయాలి వంపు వచ్చేలా ముందు వెనక చంకభాగం వరకు ఎ,ఎ3,ఎ5,ఎ1,ఎ,ఎ3,ఎ6,ఎ1 దగ్గర మార్క్ చేసుకోవాలి చేతుల చుట్టుకొలత = బి-బి1 ఆర్మ్ చుట్టుకొలత ముందుభాగం గీసేటప్పుడు వంపు వచ్చేలా చూసుకోవాలి. ఇందుకు (బి,బి1,ఎ1, ఎ5,ఎ3 నుంచి ఎ నుంచి ఎ1, ఎ6, ఎ3 నుంచి ఎ) ఇలా అంకెలు పెట్టి వంపు వచ్చేలా డ్రా చేసి, కట్ చేయాలి. ఇలా డ్రా చేసుకుంటే కట్ చేసేటప్పుడు కర్వ్ సరిగ్గా వస్తుంది.
క్లాత్ మీద: తీసుకున్న ఫ్యాబ్రిక్‌ని నాలుగు మడతలు వేసుకోవాలి. దీని మీద కొలతల ప్రకారం కట్ చేసిన పేపర్ నమూనాను ఉంచి, క్లాత్‌ను కట్ చేసుకోవాలి. (కట్ చేయడానికి ముందు పేపర్ కన్నా ఒకటిన్నర (1 1/2) అంగుళం సైడ్ మార్జిన్ వదలాలి. ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్‌లను మాత్రం విడిగా విడ్త్‌ను బట్టి కట్ చేసుకోవాలి.
లైనింగ్ కుర్తీ అయితే: కొలతలను డ్రా చేసుకున్న పేపర్ చార్ట్‌ను ముందుగా లైనింగ్ క్లాత్ మీద పెట్టి, మార్క్ చేసి, కత్తిరించాలి. ఆ తర్వాత లైనింగ్ క్లాత్‌ను మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టి, కట్ చేసుకోవాలి. లైనింగ్, సిల్క్ ఫ్యాబ్రిక్ ఒకేసారి పెట్టి కట్ చేస్తే కొలతల్లో తేడాలు వచ్చే అవకాశం ఉంది.
1. పేపర్ చార్ట్ మీద డ్రా చేసుకొని, కట్ చేసిన ముందు, వెనుక భాగాలు
2. కట్ చేసిన పేపర్ నమూనాను క్లాత్ మీద పెట్టి అంగుళం మార్జిన్ వదిలి కట్ చేయాలి.
3. స్లీవ్స్ భాగం కట్ చేసే విధానం.
దివ్యా మనిహర్
ఫ్యాషన్ డిజైనర్, ఇన్స్టిట్యూటో డిజైన్ ఇన్నోవేషన్ (ఐడిఐ), హిమాయత్‌నగర్, హైదరాబాద్
www.alwaysrupesh@gmail.com