doctor jagannatham
-
ఓడి గెలిచిన రాజు
ఒకప్పుడు అతనో చెస్ క్రీడాకారుడు. ఎత్తుకు పైఎత్తులు వేసి, ప్రత్యర్థులనుచిత్తు చేసి బంగారు పతకాలు కొల్లగొట్టాడు. అయితే తల్లిదండ్రులమరణంతో ఆయన జీవితం గాడితప్పింది. దురలవాట్లతో ఉద్యోగం పోయింది. తినడానికి లేకపోవడంతో యాచకుడిగా మారాడు. మళ్లీ ఇప్పుడు మామూలు మనిషిగా మారిన అతడు... చదరంగంలో ఎత్తులు వేసేందుకు సై అంటున్నాడు. అతడే ఎంవై రాజు. తార్నాక: తార్నాకలోని వినాయక దేవాలయంలో భిక్షాటన చేస్తూ జీవితం వెళ్లదీస్తున్న రాజును ‘సాక్షి’ గమనించింది. ఆయన పరిస్థితిపై ‘జీవన చదరంగంలో ఓడిపోయాడు’ శీర్షికతో ఆరు నెలల క్రితం కథనం ప్రచురించింది. అప్పటికే అతడు స్కీజోఫినియా వ్యాధితో బాధపడుతున్నాడు. కథనానికి స్పందించిన రాజు చిన్ననాటి స్నేహితులు, సోదరుడు.. ఆయనకు మంచి వైద్యం అందించాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం ప్రయత్నిస్తున్న తరుణంలో శంషాబాద్‌లోని ‘ఆశాజ్యోతి రిహాబిలిటేషన్’ కేంద్రం వైద్యులు డాక్టర్ జగన్నాథం ఉచితంగా వైద్యం అందించేందుకు ముందుకొచ్చారు. దీంతో రాజును అక్కడ చేర్పించగా మూడు నెలలు చికిత్స అందించారు. ఉచితంగానే భోజన సదుపాయాలు, మందులు అందజేశారు. రాజు ఇప్పుడు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాడని, చెస్‌లో పాల్గొనేందుకు సిద్ధమని డాక్టర్ జగన్నాథం తెలిపారు. స్కీజోనిఫియా వ్యాధి పూర్తిగా నయమైందని, ఇక మామూలుగా మందులు వాడితే సరిపోతుందని చెప్పారు. ఆవాసం కోసంమిత్రుల ప్రయత్నం.. ఇంతకముందు వరకు దేవాలయంలోనే గడిపిన రాజుకు షెల్టర్ లేదు. ఇప్పుడు ఆయన ఉండేందుకు గదిని అద్దెకు తీసుకోవాలని మిత్రులు నిర్ణయించారు. అందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. గది కోసం వెతుకుతున్నామని, దొరికిన వెంటనే కావాల్సిన వస్తువులు కొనుగోలు చేసి.. అన్ని రకాలు సదుపాయాలు సమకూరుస్తామని రాజు మిత్రుడు గుమ్మడి విజయ్‌కుమార్ తెలిపారు. అన్ని సెట్ అయ్యాక రాజును డిశ్చార్జీ చేసి తీసుకెళ్తామన్నారు. ఇదీ నేపథ్యం.. రాజు 1969లో ఒంగోలులో జన్మించాడు. తండ్రి ప్రభుత్వ ఉద్యోగి. రాజుకు చిన్నతనం నుంచి చదరంగం అంటే ఎంతో ఆసక్తి. ఆయన క్రీడాసక్తికి తండ్రి ప్రోత్సాహం తోడవడంతో జాతీయ స్థాయి క్రీడాకారుణిగా రాణించాడు. ఆ ప్రతిభతోనే 1998లో దక్షిణమధ్య రైల్వేలో ఉద్యోగం సంపాదించాడు. అయితే తల్లిదండ్రుల మరణంతో రాజు జీవితం మారిపోయింది. దురలవాట్లకు బానిసవడంతో అటు ఆట.. ఇటు ఉద్యోగం రెండింటికీ దూరమయ్యాడు. మానసిక వ్యాధితో బాధపడుతూ యాచకుడిగా మారాడు. ఉద్యోగం.. చదరంగం మిత్రుల సహకారంతో నేను కోల్పోయిన ఉద్యోగాన్ని తిరిగి సంపాదిస్తాను. ఉపాధి కోసం ఉద్యోగమైతే... నా ఆసక్తిని కొనసాగించేందుకు చదరంగం. మళ్లీ చెస్‌ను ప్రారంభిస్తాను. మంచి క్రీడాకారుడిగా రాణిస్తూ.. జాతీయ స్థాయిలో అవార్డులు అందుకోవాలనేదే నా ఆశయం. ఔత్సాహిక క్రీడాకారులకు నావంతుగా శిక్షణనిస్తాను. – ఎంవై రాజు -
ఉద్యోగమా? ప్రాక్టీసా..? తేల్చుకోండి
– విధి నిర్వహణలో అలసత్వం వద్దు – అందరూ సమయపాలన పాటించాలి – సర్వజనాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జగన్నాథ్ (సాక్షి ఎఫెక్ట్) అనంతపురం మెడికల్ : ‘ఉద్యోగం చేయడమా లేక ప్రైవేట్ ప్రాక్టీసా చేసుకోవడమో మీరే తేల్చుకోండి. ఇక్కడ పని చేస్తూ నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవు’ అని సర్వజనాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జగన్నాథ్ వైద్యులను హెచ్చరించారు. ఉరవకొండ మండలం ఆమిద్యాలకు చెందిన ఇబ్రహీం ఎద్దులబండి నుంచి పడి గాయపడగా సర్వజనాస్పత్రికి తెస్తే సర్జికల్ వార్డు నుంచి ప్రైవేట్ ఆస్పత్రికి పంపించేసిన విషయం తెలిసిందే. చివరకు బాలుడు మృత్యు ఒడికి చేరాడు. ఈ క్రమంలో ‘ఇదేం సర్కారు వైద్యం’, బో‘ధనాస్పత్రి’, ‘మెడికల్ మాఫియా’ శీర్షికలతో ఆస్పత్రి వైద్యసేవలపై ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురించింది. దీంతో బుధవారం సర్జికల్ వైద్యులతో సూపరింటెండెంట్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఇబ్రహీం విషయంలో జరిగిన తప్పు మరోసారి పునరావృతం కాకూడదన్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటలకు ఓపీ, వార్డుల్లో డ్యూటీ చేయాల్సిందేనని స్పష్టం చేశారు. డాక్టర్లు నిర్లక్ష్యంగా విధులు నిర్వర్తిస్తే సంబంధిత హెచ్ఓడీదే బాధ్యతన్నారు. ఒకవేళ హైరిస్క్ కేసులు వస్తే ఆ విషయాన్ని బాధిత కుటుంబ సభ్యులకు చెప్పి వైద్యం అందించాలన్నారు. ఆస్పత్రిలో ఉదయం 8.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఓపీ చీటీలు ఇస్తారని, వైద్యులు 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఓపీల్లో ఉండాలన్నారు. సమావేశంలో ఆర్ఎంఓ డాక్టర్ లలిత, డిప్యూటీ ఆర్ఎంఓ డాక్టర్ వైవీ రావు, సర్జికల్ హెచ్ఓడీ డాక్టర్ రామస్వామినాయక్, వైద్యులు నారాయణస్వామి, శివశంకర్‌నాయక్, మనోహర్, రాజేశ్, నిర్మల, రమాబాయి తదితరులు పాల్గొన్నారు.