doctor negligency
-
షాకింగ్: టీ ఇవ్వలేదనే కోపంతో ఆపరేషన్ మధ్యలో వెళ్లిపోయిన డాక్టర్
ముంబై: వైద్యులను దేవుడితో పోలుస్తున్నారు. ఆ దేవుడు జన్మనిస్తే వైద్యులు పునర్జన్మను ఇస్తారని అంటుంటారు. కేవలం డబ్బుల కోసమే కాకుండా, మానవతా హృదయంతో తన వద్దకు వచ్చిన వారి ప్రాణాలను రక్షిస్తున్న ఘనత వైద్యులకే దక్కుతుంది. అయితే ఇటీవల పరిస్థితుల్లో మార్పులు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుప్రతులనే తేడా లేకుండా వైద్యవవస్థ వ్యాపారంగా మారింది. అలాంటి ఓ షాకింగ్ ఘటనే మహారాష్ట్రలో చోటుచేసుకుంది. వృత్తి ధర్మం మరిచిన ఓ వైద్యుడు రోగిపట్ల నిర్లక్ష్యంగా వ్యహరించాడు. డ్యూటీ చేస్తుండగా తనకు టీ ఇవ్వలేదని ఆపరేషన్ థియేటర్ నుంచి మధ్యలో వెళ్లిపోయాడు సదరు వైద్యుడు. నాగ్‌పూర్‌లోని మౌడ మండల ప్రభుత్వ ఆసుపత్రిలో నవంబర్ 3న జరగ్గా.. ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల ప్రకారం.. మౌడ ప్రభుత్వాసుపత్రిలో శుక్రవారం ఎనిమిది మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయాల్సి ఉంది. ఈ క్రమంలో నలుగురు మహిళలకు ఆపరేషన్ చేసిన వైద్యుడు తేజ్‌రంగ్ భలవి.. మిగిలిన వారికి కూడా సర్జరీ చేసేందుకు ముందుగా అనస్తీషియా ఇచ్చాడు. అయితే ఆసుపత్రి సిబ్బందిని ఓ కప్ చాయ్ తీసుకురావాలని వైద్యుడు కోరాడు. కానీ ఎవరూ అతనికి టీ తీసుకోని రాలేదు. దీంతో ఆగ్రహం చెందిన డాక్టర్ భల్వాయి.. మిగతా నలుగురికి కు.ని శస్త్రచికిత్స చేయకుండానే ఆపరేషన్ థియేటర్ నుంచి వెళ్లిపోయాడు. ఈ విషయంపై వెంటనే ఆసుపత్రి సిబ్బంది జిల్లా వైద్యాధికారికి ఈ విషయం తెలపగా.. ఉన్నపళంగా మరో వైద్యుడిని మహిళలకు సర్జరీలు చేసేందుకు పంపించారు. అనంతరం క్టర్ భలవి ప్రవర్తనపై జిల్లా యంత్రాంగం సీరియస్ అయ్యింది. ముగ్గురు సభ్యులతో కూడిని కమిటీని ఏర్పాటు చేసి వైద్యుడిపై విచారణ చేపట్టినట్లు నాగ్‌పూర్ జిల్లా పరిషత్ సీఈవో సౌమ్య శర్మ తెలిపారు. ఇది చాలా తీవ్రమైన విషయమని, నివేదిక వచ్చిన తర్వాత అతనిపై చర్యలు తీసుకుంటామన్నారు. చదవండి: వివాదాస్పద వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్టు -
వైద్యుల నిర్లక్ష్యం.. పురిటిలోనే శిశువు మృతి.. కుటుంబసభ్యుల ఆందోళన
ఎల్లారెడ్డి: నిండు గర్భిణికి సకాలంలో వైద్యం అందకపోవడంతో పురిటిలోనే శిశువు మృతి చెందిందని ఆరోపిస్తూ బాధిత కుటుంబసభ్యులు ఎల్లారెడ్డి ప్రభుత్వాస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని బాలాజీనగర్ తండాకు చెందిన దేశెట్టి రాజేశ్వరికి శుక్రవారం వేకువజామున పురిటినొప్పులు రావడంతో కుటుంబసభ్యులు 108 అంబులెన్స్‌లో ఎల్లారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఉదయం 10 గంటల వరకు కూడా ఆస్పత్రికి వైద్యులు రాలేదు. ఆ తర్వాత వచ్చిన వైద్యురాలు నిషాత్ బూతుల్ గర్భిణీని పరీక్షించి ఇంకా కొద్దిసేపు వేచి చూద్దామని చెప్పి వెళ్లిపోయింది. మధ్యాహ్నానికి పురిటినొప్పులు ఎక్కువ కావడంతో గర్భిణిని కామారెడ్డికిగానీ, బాన్సువాడకుగానీ తీసుకునివెళ్లాలని సిబ్బంది సూచించారు. చేసేదేమీ లేక కుటుంబసభ్యులు అత్యవసరంగా స్థానికంగానే ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆపరేషన్ చేయగా అప్పటికే గర్భంలోనే మగశిశువు మృతి చెందింది. తల్లి పరిస్థితి సైతం ప్రాణాపాయంలో ఉందని వైద్యులు తెలిపారు. మృత శిశువుతో రాజేశ్వరి కుటుంబ సభ్యులు ఎల్లారెడ్డి ప్రభుత్వాస్పత్రి ఎదుట ధర్నాకు దిగారు. పోలీసులు వచ్చి విచారణ జరిపిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. శిశువు మృతి విషయమై ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రవీంద్రమోహన్‌ను వివరణ కోరగా, పురిటిలోనే శిశువు ఉమ్మనీరు మింగడంతో శ్వాస ఆడక మృతి చెందినట్లు చెప్పారు. ఆస్పత్రిలోని గైనకాలజిస్టు నిషాత్ బూతుల్ సెలవులో ఉన్నా గర్భిణి పరిస్థితి సీరియస్‌గా ఉండటంతో ఆమెను ఆసుపత్రికి పిలిపించామన్నారు. గర్భిణిని కామారెడ్డికి రిఫర్ చేసినప్పటికీ సకాలంలో తరలించకపోవడంతో శిశువు మృతి చెందిందని తెలిపారు. చదవండి: మరో గుడ్‌న్యూస్.. త్వరలోనే జేఎల్ఎం పోస్టుల భర్తీ -
ప్రసవం మధ్యలో వెళ్లిపోయిన వైద్యురాలు.. పసికందు మృతి
సాక్షి, గద్వాల: ప్రసవం కోసం వచ్చిన గర్భిణికి సకాలంలో వైద్యం అందించడంలో వైద్యురాలు నిర్లక్ష్యం కనబరచడంతో పురిటిలోనే శిశువు మృతిచెందింది. ఈ సంఘటన ఆదివారం జోగుళాంబ గద్వాల జిల్లా ఆస్పత్రిలో చోటు చేసుకుంది. బాధిత కుటుంబీకుల కథనం ప్రకారం.. జిల్లాలోని రాజోళి మండలం పచ్చర్ల గ్రామానికి చెందిన ఖలీఫా తొలి ప్రసవం కోసం ఈ నెల 16న జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చింది. సాధారణ కాన్పు అయ్యేలా చూస్తామని వైద్యులు చెప్పారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం పురిటి నొప్పులు రావడంతో వైద్యురాలు నర్మద, సిబ్బంది ప్రసవం చేసేందుకు చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో వైద్యురాలు నిర్లక్ష్యంగా వ్యవహరించి.. కాన్పు కాకముందే వెళ్లిపోవడం వల్లే పసికందు మృతిచెందిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ విషయమై వైద్యురాలు నర్మద స్పందిస్తూ పాప ఉమ్మనీరు తాగి పరిస్థితి విషమంగా మారడంతో ఆపరేషన్ చేయాలని చెప్పినా కుటుంబ సభ్యులు వినిపించుకోలేదన్నారు. కాన్పు కాకముందే వెళ్లిపోయానన్న ఆరోపణలు అవాస్తవం అన్నారు. తన డ్యూటీ సమయం అయిపోయినప్పటికీ విధులు నిర్వహించానని పేర్కొన్నారు. పసికందు మృతిపై విచారణకు ఆదేశించామని కలెక్టర్ వల్లూరి క్రాంతి ‘సాక్షి’కి తెలిపారు. విచారణలో వైద్యుల తప్పిదం ఉందని తేలితే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు. గతంలోనూ సస్పెండ్ డాక్టర్ నర్మద గతంలో ఓసారి ఇలాంటి సంఘటనలో సస్పెండ్ అయినట్లు తెలిసింది. ధరూర్ మండలం జాంపల్లికి చెందిన దీపిక అనే గర్భిణి కాన్పు సమయంలో ఆమె నిర్లక్ష్యం వల్ల శిశువు మృతి చెందాడు. దీంతో అప్పటి కలెక్టర్ ఆమెను సస్పెండ్ చేసినట్లు సమాచారం. -
Telangana: మొన్న బాలింత.. నిన్న పసికందు.. నేడు మరొకరు
సాక్షి, నల్గొండ: మొన్న బాలింత, నిన్న నాలుగు రోజుల పసికందు, నేడు మరో వ్యక్తి నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృత్యువాత పడ్డారు. పది రోజుల వ్యవధిలోనే ముగ్గురు మృతిచెందడం కలకలం రేపుతోంది. ఆస్పత్రిలో మరణాలపై ఇటీవల డీఎంఈ రమేష్‌రెడ్డి విచారణ జరిపినా కూడా వైద్యుల తీరులో మార్పు కనిపించడం లేదని రోగుల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా జిల్లా కేంద్ర ఆస్పత్రిలో అస్వస్థతతో బాధపడుతున్న వ్యక్తికి సకాలంలో సరైన చికిత్స అందించకపోవడంతోనే మృతిచెందాడని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. సకాలంలో వైద్యం అందలేదని.. నల్లగొండ పట్టణానికి చెందిన కంది బుచ్చిరాములు (50) తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు బుధవారం ఉదయం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆస్పత్రి సిబ్బంది అతడిని అత్యవసర విభాగంలో చేర్చి చికిత్స అందించారు. నిమిషాల వ్యవధిలోనే బుచ్చిరాములు మృతిచెందడంతో బంధువులు తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు. సకాలంలో వైద్యం అందకనే బుచ్చిరాములు మృతిచెందాడంటూ డ్యూటీలో ఉన్న డాక్టర్ శ్రీనాథ్‌తో వాగ్వాదం చేస్తూ అతడిపై చేయి చేసుకున్నారు. దీంతో ఆస్పత్రిలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు ఆస్పత్రికి చేరుకుని డాక్టర్‌పై దాడిచేసిన ముగ్గురిని అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. విధులు బహిష్కరించి డాక్టర్ల ఆందోళన సేవాభావంతో విధులు నిర్వహిస్తున్నా తమపై రోగుల బంధువులు దాడి చేస్తున్నారంటూ జిల్లా కేంద్ర ఆస్పత్రి వైద్యులు విధులను బహిష్కరించి ఆందోళనకు దిగారు. దాడి చేసిన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆ సమయంలో డాక్టర్ శ్రీనాథ్‌పై దాడి చేసిన ఓ వ్యక్తి అక్కడికి రాగా, పోలీసుల సమక్షంలోనే అతడిపై వైద్య సిబ్బంది ప్రతిదాడి చేశారు. అతడి వెంట ఉన్న మహిళలు కాళ్లు పట్టుకుంటామని వేడుకున్నా పట్టించుకోకుండా పిడిగుద్దులు కురిపించారు. వెంటనే పోలీసులు జోక్యం చేసుకుని ప్రతిదాడి చేసిన వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం నీలగిరి ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ మూర్తి, ప్రధాన కార్యదర్శి డాక్టర్ అనితారాణి, కోశాధికారి డాక్టర్ రమేష్, ఇతర వైద్యులు.. ఎస్పీ రెమా రాజేశ్వరిని కలిసి తమకు రక్షణ కల్పించాలని కోరారు. -
‘గాంధీ’లో అదే నిర్లక్ష్యం!
గాంధీఆస్పత్రి : ఎన్ని విమర్శలు వస్తున్నా సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బంది వైఖరిలో మాత్రం మార్పు రావడం లేదు. ప్రాణాపాయస్థితిలో స్వైన్‌ఫ్లూ పాజిటివ్‌తో వచ్చిన గర్భిణిని పట్టించుకోలేదని ఆరోపణలు వెల్లువెత్తడంతో ఆస్పత్రి పాలనా యంత్రాంగం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. పలువురు వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, పీజీలకు మెమోలు జారీ చేశారు. డీఎంఈ రమేష్‌రెడ్డితోపాటు ప్రభుత్వానికి సమాచారం అందించారు. వివరాల్లోకి వెళితే.. కరీంనగర్, జమ్మికుంటకు చెందిన నిండు గర్భిణి తీవ్రమైన జ్వరం, జలుబుతో మ్యాక్స్‌క్యూర్ ఆస్పత్రిలో చికిత్స కోసం చేరింది. నిర్ధారణ పరీక్షల్లో స్వైన్‌ఫ్లూ పాజిటివ్ రావడంతో అక్కడి వైద్యుల సూచన మేరకు బుధవారం అర్ధరాత్రి 12.30 రిఫరల్‌పై గాంధీ ఆస్పత్రిలో అడ్మిట్ అయింది. వెంటిలేటర్‌పై ఉన్న ఆమెకు తెల్లవారుజామున నొప్పులు వచ్చాయి. అయితే ఆ సమయంలో సదరు వార్డులో వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, పీజీ, సెక్యూరిటీ సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో బాధితురాలి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యశాఖ ఉన్నతాధికారులతోపాటు మీడియాకు సమాచారం అందించారు. ఉన్నతాధికారుల సూచన మేరకు గాంధీ ఇన్చార్జి సూపరింటెండెంట్ ప్రొఫెసర్ రాజారావు బుధవారం ఉదయం విచారణ చేపట్టారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైద్యసేవల్లో జాప్యం జరిగిన విషయం వాస్తమేనన్నారు. గర్భిణికి స్వైన్‌ఫ్లూ పాజిటివ్ రావడంతో బుధవారం అర్ధరాత్రి గాంధీ ఆస్పత్రి స్వైన్‌ఫ్లూ వార్డులో అడ్మిట్ చేశామన్నారు. స్వైన్‌ఫ్లూతోపాటు ఇతర రుగ్మతలతో బాధపడుతున్న ఆమెకు అర్ధరాత్రి 1.45కు ఫిజీషియన్, 3 గంటలకు గైనకాలజీ డాక్టర్లు చికిత్స అందించారన్నారు. అయితే తెల్లవారుజామున 3 నుంచి 5 గంటల వరకు వైద్యులు, సిబ్బంది, పీజీలు అందుబాటులో లేరని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నట్లు తెలిపారు. అయితే, డ్యూటీ మెడికల్ ఆఫీసర్ వాష్‌రూంకు వెళ్లాడని, నర్సులు వార్డులోని గదిలో ఉన్నారని, పీజీలు ఇతర రోగుల పనిపై వివిధ విభాగాలకు వెళ్లినట్లు తేలిందన్నారు. ఆ సమయంలో విధుల్లో ఉన్న వైద్యులు, నర్సులు, పీజీలకు మెమోలు జారీ చేసినట్లు తెలిపారు. ఈ ఘటనపై డీఎంఈ రమేష్‌రెడ్డితోపాటు ప్రభుత్వానికి సమాచారం అందించామన్నారు. తానే స్వయంగా గర్భిణికి వైద్యపరీక్షలు నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు. సిజేరియన్ చేసి శిశువును బయటకు తీసి ఎన్ఐసీయూలో ఉంచినట్లు తెలిపారు. వెంటిలేటర్‌పై ఉన్న తల్లి పరిస్థితి విషమంగా ఉందన్నారు. స్వైన్‌ఫ్లూ నిర్ధారణ పరీక్షలు నిమిత్తం శిశువు నుంచి నమూనాలు సేకరించామన్నారు. గాంధీ నర్సింగ్ సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామన్నారు. 70 మంది కోవిడ్ అనుమానితులకు వైద్యపరీక్షలు... గాంధీ ఆస్పత్రి ఐసోలేషన్ వార్డులో చేరిన 70మంది కోవిడ్ అనుమానితులకు నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా అందరికీ నెగిటివ్ వచ్చిందని ఇన్చార్జి సూపరింటెండెంట్ రాజారావు తెలిపారు. ఇద్దరు స్వైన్‌ఫ్లూ పాజిటివ్ రోగులతోపాటు మరో ఐదుగురు అనుమానితులకు డిజాస్టర్ వార్డులో వైద్యసేవలు అందిస్తున్నట్లు ఆయన వివరించారు. -
శిశువు ప్రాణం తీశారు
సాక్షి ,బొమ్మలసత్రం(కర్నూలు): నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం అప్పుడే పుట్టిన శిశువు ప్రాణం తీసింది. మంగళవారం చోటుచేసుకున్న ఈ సంఘటన తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చింది. వివరాల్లోకి వెళితే.. ఆళ్లగడ్డ మండలం పెద్దబోధనం గ్రామానికి చెందిన చెన్నమ్మకు నెలలు నిండటంతో భర్త దేవదాసు కాన్పు కోసం సోమవారం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చారు. డ్యూటీలో ఉన్న వైద్యురాలు ఆమెకు పరీక్షలు నిర్వహించి బిడ్డ ఆరోగ్యం బాగుందని రాత్రిలోగా కాన్పు చేస్తామని చెప్పారు. రాత్రంతా చూసినా పురిటి నొప్పులు రాలేదు. ఉదయం కాల కృత్యాలు తీర్చుకునేందుకు చెన్నమ్మ బాత్రూంకు వెళ్లగా అందులో నీరులేదు. దీంతో ఆమె మెట్లు దిగి కింద అవుట్ పేషంట్ల కోసం ఏర్పాటు చేసిన టాయిలెట్‌కు నడుచుకుంటూ వెళ్లింది. అక్కడే కాన్పు కావడంతో సిబ్బంది తల్లీబిడ్డను కాన్పుల వార్డుకు తరలించారు. అయితే, డ్యూటీలో ఉండాల్సిన వైద్యురాలు ముందుగానే ఇంటికి వెళ్లిపోయింది. దీంతో చికిత్స అందించే వారు ఎవరూ లేక ఉమ్ము నీరు తాగిన పసిబిడ్డ కొద్దిసేపటికే ప్రాణాలు విడిచింది. వైద్యులే మా బిడ్డను పొట్టన పెట్టుకున్నారు వైద్యుల నిర్లక్ష్యమే తమ బిడ్డ మృతికి కారణమని చెన్నమ్మ, దేవదాసు కన్నీరుమున్నీరుగా విలపించారు. కాన్పు సమయంలో విధులు నిర్వహించాల్సిన వైద్యురాలు అందుబాటులో లేకపోవడంతో చికిత్స అందలేదన్నారు. ఉన్నతాధికారులు స్పందించి ప్రభుత్వాసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. మూడేళ్ల క్రితం చెన్నమ్మ మొదటి కాన్పు కోసం 108లో వస్తుండగా మార్గమధ్యంలోనే ప్రసవమైంది. ఆసుపత్రికి బిడ్డను తీసుకునే వచ్చేలోగా మృతిచెందినట్లు ఆ దంపతులు గుర్తుచేసుకుని బోరున విలపించారు. వైద్యురాలిపై విచారణకు ఆదేశించాం డ్యూటీలో వైద్యురాలు లేక పోవటంతో బిడ్డ మృతి చెందినట్లు అందిన ఫిర్యాదు నేపథ్యంలో డాక్టర్‌పై విచారణకు ఆదేశించాం. వైద్యురాలు నిర్లక్ష్యం వహించినట్లు విచారణలో రుజువైతే కఠిన చర్యలు తీసుకుంటాం. –విజయ్‌కుమార్, సూపరింటెండెంట్ -
విజయవాడలో రైల్వే కార్మికుడు మృతి
-
గర్భిణి మృతి
ఖమ్మం వైద్యవిభాగం: ఖమ్మం నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యుడి నిర్లక్ష్యం వల్ల గర్భిణి ప్రాణాలు కోల్పోయిందంటూ ఆమె తరఫు బంధువులు ఆస్పత్రి ఎదుట మంగళవారం ఆందోళన నిర్వహించారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం పెరుమాళ్లసంకీస గ్రామానికి చెందిన గుగులోతు ఉమ (25) ఏడు నెలల గర్భవతి. కడుపులో నొప్పిగా ఉండటంతో ఈ నెల 8న ఆమెను కుటుంబీకులు ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. రెండు రోజులపాటు వైద్య సేవలందించారు. 10న స్నేహ డయాగ్నస్టిక్స్‌లో స్కానింగ్ చేయించగా.. పరిశీలించిన వైద్యులు ఆమె పరిస్థితి బాలేదని, వరంగల్ ఎంజీఎంకు రెఫర్ చేశారు. ఆమెను వరంగల్ ఎంజీఎంకు తీసుకెళ్లగా.. అక్కడి వైద్యులు చేర్చుకునేందుకు నిరాకరించారు. అక్కడి నుంచి హైదరాబాద్‌కు తీసుకెళ్లగా.. పరీక్షించిన వైద్యులు కడుపులో పిండం కదలిక లేకపోవడంతో ఆమె శరీరం విషతుల్య మైందని చెప్పారు. బతకడం కష్టమని చెప్పగా.. ఆమె మంగళవారం ఉదయం మృతి చెందింది. దీనికి ఖమ్మం ఆస్పత్రి వైద్యులే కారణమని ఆమె కుటుంబీకులు నిర్ధారణకు వచ్చి మృతదేహాన్ని తరలించి ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. -
కుట్లేశారు.. కత్తెర మరిచారు..
హైదరాబాద్/ సోమాజిగూడ: నగరంలోని ప్రముఖ ఆసుపత్రుల్లో ఒకటైన నిమ్స్ (నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్)లో వైద్యుల నిర్లక్ష్యం మరోసారి బట్టబయలైంది. ఇటీవల ఆసుపత్రిలోని గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగం వైద్యులు ఓ మహిళకు ఆపరేషన్ చేసి కత్తెరను కడుపులోనే మరిచిపోయి నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఘటన వెలుగులోకి వచ్చింది. దీనిపై బాధితురాలి తరపు బంధువులు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుచేయడంతోపాటు శనివారం ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. ఆపరేషన్ చేసిన ఇద్దరు వైద్యులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై నిమ్స్ ముగ్గురు నిపుణులతో కమిటీ ఏర్పాటుచేసింది. దీని ఆధారంగా చర్యలు తీసుకుంటామని నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ మనోహర్ స్పష్టం చేశారు. ఆపరేషన్ సక్సెస్.. కానీ! హైదరాబాద్‌లోని మంగళ్‌హాట్‌కు చెందిన వ్యాపారి హర్షవర్దన్ భార్య మహేశ్వరి (33) కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతున్నారు. చికిత్స కోసం ఆమెను అక్టోబర్ 30న నిమ్స్ ఆసుపత్రి వైద్యులకు చూపించారు. మహేశ్వరిని పరిశీలించిన గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగం వైద్యులు డాక్టర్ వేణుమాధవ్, డాక్టర్ జగన్మోహన్రెడ్డిలు.. హెర్నియాతో ఆమెకు కడుపునొప్పి వస్తోందని గుర్తించి సర్జరీ చేయాలని సూచించారు. నవంబర్ 2న ఈ ఇద్దరు డాక్టర్లు ఆమెకు ఆపరేషన్ చేశారు. అయితే ఆపరేషన్ సమయంలో నిర్లక్ష్యంగా.. సర్జరీ చేసిన కత్తెరను కడుపులో మరిచిపోయి కుట్లు వేశారు. ఈ విషయం ఎవరూ గమనించలేదు. రోగి కోలుకోవడంతో నవంబర్ 11న ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. సర్జరీ జరిగి మూడునెలలైనా.. తరచూ కడుపునొప్పి వస్తుండటంతో బాధితురాలి కుటుంబం శుక్రవారం రాత్రి మళ్లీ నిమ్స్ వైద్యులను సంప్రదించింది. వైద్య పరీక్షల్లో భాగంగా ఎక్సరే తీయించగా, పొత్తి కడుపులో సర్జికల్ కత్తెర ఉన్నట్లు తేలింది. ఈ విషయం తెలియడంతో మహేశ్వరి భర్త, బంధువులు నిమ్స్ పరిపాలనాభవనం ముందు ఆందోళనకు దిగడంతో విషయం బయటికి పొక్కింది. ఈ ఆందోళనతో అప్రమత్తమైన వైద్యులు రోగికి మళ్లీ సర్జరీ చేసి కడుపులోని కత్తెరను బయటికి తీశారు. ప్రస్తుతం ఆమె ప్రాణాలకేమీ ప్రమాదం లేదు. నిమ్స్ వైద్యులు నిర్లక్ష్యపూరిత వైఖరిపై రోగి తరపు బంధువులు పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేశారు. నిమ్స్ ఘటనపై వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఆరా తీశారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలతో ఓ నివేదిక అందజేయాలని డైరెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు. రోగికి సర్జరీ చేసే ముందు, ఆ తర్వాత.. ఆపరేషన్‌లో వినియోగించిన వైద్య పరికరాలు, ఇతర వస్తువులు లెక్కిస్తారు. బ్లేడ్స్, కత్తెర, కాటన్ బెడ్స్, ఇతర సర్జికల్ ఐటమ్స్‌ను విధిగా లెక్కించి, అన్నీ ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాతే కుట్లు వేస్తారు. కానీ నిమ్స్ ఆసుపత్రిలో ఇలాంటివేవీ జరగకుండానే పని పూర్తి చేస్తారనే ఆరోపణలున్నాయి. దురదృష్టకరం రోగి కడుపులో సర్జికల్ కత్తెర ఉంచి కుట్లు వేయడం దురదృష్టకరం. వైద్యపరమైన నిర్లక్ష్యానికి పాల్పడిన వారెంతటివారైనా ఉపేక్షించబోం. బాధ్యులను గుర్తించేందుకు ఆస్పత్రి డీన్, మెడికల్ సూపరింటిండెంట్, ఉస్మానియా ఆస్పత్రి గ్యాస్ట్రో ఎంటరాలజీ ప్రొఫెసర్‌తో త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేశాం. కమిటీ నివేదిక ఇచ్చిన వెంటనే సదరు వైద్యులపై చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ మనోహర్, డైరెక్టర్, నిమ్స్ బాధ్యులపై చర్యలు తీసుకోండి నిమ్స్‌కు జాతీయస్థాయిలో మంచి గుర్తింపు ఉంది. కొంతమంది వైద్యుల నిర్లక్ష్యం వల్ల ఆస్పత్రి ప్రతిష్ట దెబ్బతింటోంది. వైద్యపరమైన నిర్లక్ష్యానికి పాల్పడుతున్న వైద్యులపై కఠినచర్యలు తీసుకోవాలి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి. – హర్షవర్థన్, బాధితురాలి భర్త -
చనిపోయాడా..? చంపేసిందా..?
అయ్యా.. గణేషా...! నువ్వంతట నువ్వే చనిపోయావా...? పెద్దాసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం చంపేసిందా...? వీల్ చైర్లో బయల్దేరిన నువ్వు.. మధ్యలోనే విగతుడిగా పడిపోయావెందుకు..? నీ చైర్‌ను నెట్టుకుంటూ వచ్చినోళ్లే్లమయ్యారు..? ఈ ప్రశ్నలేవీ వినపడనంత దూర తీరానికి ఆ గణేషుడు శవమై వెళ్లిపోయాడు. మన పెద్దాసుపత్రిలో ఈ గణేషుడిలాగే మరో రాముడో.. రహీమో... దిక్కూమొక్కూ లేకుండా చావకూడదనుకుంటే... పై ప్రశ్నలన్నిటికీ సమాధానాలు కావాల్సిందే...!!! ఖమ్మంవైద్యవిభాగం: నగరంలోని జిల్లా కేంద్ర ప్రధాన ఆసుపత్రిలో బుధవారం ఓ టీబీ వ్యాధిగ్రస్తుడు ఆకస్మికంగా మృతిచెందాడు. మృతదేహం ఎక్కడుందో తెలుసా...? ఆస్పత్రిలోని మాతాశిశు సంరక్షణ కేంద్రం ఎదురుగాగల ఖాళీ ప్రదేశంలో...! అతడి మృతదేహం అక్కడ ఎందుకుంది..? శవమే నడుచుకుంటూనో, ఎగురుకుంటూనో వెళ్లిందా..?! అసలేం జరిగిందో చూద్దాం. మంగళవారం రోజున... అది, నగరంలోని జిల్లా కేంద్ర ప్రధాన ఆసుపత్రి. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న నగరంలోని రేవతి సెంటర్‌కు చెందిన ఎల్.గణేష్(45)ను ఆయన భార్య రమ, మంగళవారం ఈ ఆసుపత్రికి తీసుకొచ్చింది. క్యాజువాల్టీలో వైద్యులు పరీక్షలు నిర్వహించారు. అతడికి క్షయ (టీబీ) వ్యాధి సోకినట్టుగా గుర్తించారు. ఆ వెంటనే టీబీ వార్డుకు తరలించారు. అక్కడ వైద్య సేవలు సాగుతున్నాయి. బుధవారం రోజున... టీబీ డాక్టర్ వచ్చారు. గణేష్‌ను పరీక్షించారు. కొన్ని పరీక్షల కోసం క్యాజువాల్టీకి తీసుకెళ్లాలని అక్కడున్న సిబ్బందితో చెప్పారు. అతడిని వీల్ చైర్లో సిబ్బంది తీసుకెళ్లారు. కానీ, టీబీ వార్డుకు గణేష్ చేరుకోలేదు..! మార్గమధ్యలో ‘మాయమయ్యాడు’..!! తమ మనిషి అటు టీబీ వార్డులోనూ, ఇటు క్యాజువాల్టీలోనూ లేకపోవడంతో అతడి కుటుంబీకులు, బంధువులు కలవరపడ్డారు. అటూఇటూ చూస్తుండగానే.. టీబీ వార్డుకు, క్యాజువాల్టీకి మధ్యలోగల మాతాశిశు సంరక్షణ కేంద్రం ఎదురుగాగల ఖాళీ ప్రదేశంలో నిశ్చలంగా పడిపోయిన గణేష్ కనిపించాడు. అక్కడున్న, అటుగా తిరుగాడుతున్న రోగులు, సహాయకులు కూడా అప్పుడే గమనించారు. అందరూ ఒకేసారి గుమిగూడారు. ఆందోళన... ‘‘రోగిని ఇలా పడేస్తారా..?’’ అంటూ, వారంతా తీవ్రస్థాయిలో ఆగ్రహోదగ్రులయ్యారు. గణేష్ కుటుంబీకులతో కలిసి ఆందోళనకు దిగారు. అతడు ఇంకా బతికే ఉన్నాడని వారంతా అనుకున్నారు. కానీ, అప్పటికే అతడి ప్రాణాలు పోయాయని తెలుసుకున్న కుటుంబీకులు బిగ్గరగా రోదించారు. ఇక్కడికెలా వచ్చాడు...? ఈ ప్రశ్నకు ఆస్పత్రి అధికారుల నుంచిగానీ, సిబ్బంది నుంచిగానీ సూటిగా సమాధానం రావడం లేదు. వైద్య నారాయణులే ప్రాణ భిక్ష పెడతారన్న గంపెడాశతో ఇక్కడికొచ్చిన ఈ గణేషుడికి ఇంత దిక్కులేని చావు ఎందుకు దాపురించింది..? వీల్ చైర్లో బయల్దేరిన అతడు... ఉంటే, క్యాజువాల్టీలోనైనా ఉండాలి. లేదంటే, వీల్ చైర్లోనే ఉండాలి. అక్కడా, ఇక్కడా కాకుండా... ఈ ఖాళీ ప్రదేశంలో ఎందుకు ఉన్నట్టు..? తనంతట తానే వీల్ చైర్‌ను వదిలేసి, సిబ్బందిని కాదని ఇక్కడికి పరుగెత్తుకుంటూనో, నడుచుకుంటూనో వచ్చాడా..? వీల్ చైర్లో తీసుకెళ్లిందెవరు..? వాళ్లు ఏమయ్యారు..? వీల్ చైర్లో తీసుకెళ్లలేక ఇక్కడ పడేశారా...? ఇదిగో... ఆందోళనకారుల్లో ఇన్ని ప్రశ్నలు. వీటికి జవాబులేవి..? అప్పటికే పోయాడు... ఆ ఖాళీ ప్రదేశంలో ఆందోళన విషయం తెలుసుకున్న వెంటనే ఆర్ఎంఓ డాక్టర్ కృప ఉషశ్రీ,, ఔట్‌పోస్ట్ పోలీసులు వచ్చారు. ఆందోళనకారులకు నచ్చచెప్పేందుకు ప్రయత్నించారు. అక్కడి నుంచి గణేష్‌ను వెంటనే క్యాజువాల్టీకి తీసుకెళ్లారు. అప్పటికే అతడు ప్రాణాలు కోల్పోయినట్టుగా వైద్యులు గుర్తించారు. టూటౌన్ పోలీసులు విచారణ జరిపారు. చర్యలు తీసుకుంటాం... ఈ మొత్తం వ్యవహారంపై ఆర్ఎంఓ డాక్టర్ కృప ఉషశ్రీ,ని ‘సాక్షి’ వివరణ కోరింది. ‘‘దీనిపై, పూర్తిస్థాయిలో విచారణ జరుపుతాం. బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. వైద్య సేవల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వారిని ఉపేక్షించం’’ అన్నారు. ష్.. సైలెన్స్...! గణేష్ ఎలా చనిపోయాడు..? అతడంత అతడే చనిపోయాడా..? సిబ్బంది నిర్లక్ష్యం చంపేసిందా...? ష్.. సైలెన్స్..! -
అర్హతలేని వైద్యం.. ప్రాణసంకటం
పశ్చిమగోదావరి, తణుకు అర్బన్: వైద్య ఆరోగ్య శాఖలో బయటపడుతోన్న ఉదంతాలు జిల్లా వైద్య రంగాన్ని కుదిపేస్తున్నాయి. డబ్బు వ్యామోహంతో కొందరు వైద్యులు చేస్తోన్న అధర్మ వైద్యం జిల్లాలో తణుకును ముందు వరుసలో నిలిపింది. ప్రైవేటు రంగంలో ఇస్టానుసారంగా చేస్తోన్న సిజేరియన్లు, డెంగీ వ్యాధి పేరుతో వైద్యం వంటి అంశాలపై దృష్టి సారించిన వైద్య ఆరోగ్య శాఖ ఇప్పుడు తాజాగా అర్హత లేని వైద్యం చేస్తోన్న వైద్యుల భరతం పడుతోంది. గణపవరం మండలం జల్లి కొమ్మరలో ఇటీవల జరిగిన మరణంపై డీఎంహెచ్‌వో డాక్టర్ బండారు సుబ్రహ్మణ్యేశ్వరి విచారణ జరిపారు. అనంతరం ఆమె అర్హతలేని వైద్యం చేస్తున్నారంటూ తణుకులోని ఓ హాస్పటల్లో మత్తు వైద్యుడు డాక్టర్ డి.బిల్లీగ్రహంను నిలదీసిన విషయం తెలిసిందే. ఆస్పత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన ఆమె ఇటీవల కాలంలో జ్వరపీడితులు, ప్లేట్ లెట్స్ కౌంట్ తగ్గాయని చికిత్స చేయించుకున్న వారి కేస్ షీట్లు స్వాధీనం చేసుకున్నారు. ఆ కేస్ షీట్లలో జనరల్ ఫిజీషియన్కు బదులుగా సదరు బిల్లీగ్రహం వైద్యమే కనిపించడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రోగులు డాక్టర్ బిల్లీగ్రహం ఆస్పత్రిపై డీఎంహెచ్‌వో తనిఖీల నేపథ్యంలో సాక్షిలో వచ్చిన కథనానికి అనేకమంది బాధితులు బయటకు వచ్చి తమ ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నపాటి రుగ్మతలకు కూడా మా వద్ద వేలకు వేలు గుంజారంటూ వాపోయారు. పదేళ్లుగా వైద్యం చేస్తోన్న సదరు వైద్యుడు తన ఆస్పత్రిలో ఎక్కువగా పాయిజన్ కేసులు, ప్లేట్లెట్స్ కౌంట్ తగ్గిన కేసులు ఇతర అత్యవసర కేసులన్నిటికీ వైద్యం చేస్తున్నట్టు తణుకు వాసులు చెప్పారు. కేవలం మత్తు వైద్యుడు ఇన్ని రకాల అత్యవసర వైద్యం చేస్తుంటే వైద్యాధికారులు, ఐఎంఏ ప్రతినిధులు ఏం చేస్తున్నారనేది ప్రజానీకం ప్రశ్న. జిల్లావ్యాప్తంగా నకిలీ వైద్యులు, అర్హత లేని వైద్యులు, లేని డిగ్రీలు తగిలించించుకుని చేస్తోన్న వైద్యం తాలూకా వ్యవహారాలు రెండేళ్లుగా వెలుగులోకి వస్తున్నాయి. ప్రాణానికి డబ్బుతో ముడి 2015లో బయటపడ్డ నకిలీ వైద్యుడు బొల్లినేని శ్రీకాంత్ ఘటన జిల్లాను కుదిపేసిన విషయం తెలిసిందే. ఆ ఘటన తరువాత జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో నకిలీ వైద్యుల ఉదంతాలు బయటపడ్డాయి. ఇటీవల తణుకు ఏరియా ఆస్పత్రికి కూతవేటు దూరంలో ఉన్న ప్రైవేటు ఆస్పత్రిలో కాలుకు పుండు పడి చికిత్స పొందుతున్న వ్యక్తి అనుమానాస్పదంగా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు సంబంధించి వైద్యుడి నిర్వాకం కారణంగానే ప్రాణాలు పోయాయనే ఆరోపణలతో జిల్లాకు చెందిన ఒక మంత్రి కలుగచేసుకోవడంతో బాధిత కుటుంబానికి రూ. రూ.1.50 లక్షలు ఇచ్చి గొడవ లేకుండా సరిచేసుకున్నట్టు సమాచారం. వైద్యాన్ని వ్యాపారం చేసే క్రమంలో ఒక ఫార్మసిస్ట్ నడుపుతోన్న ఈ ఆస్పత్రిలో వైద్యులు గెస్ట్ రోల్ పోషిస్తున్నారని, ఆస్పత్రి నిర్వహణకు అనుమతులపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే క్రమంలో మరొక ఆస్పత్రిలో ఇటీవల మృతిచెందిన గర్భిణి ఉదంతం కూడా అనుమానాస్పదంగా ఉంది. డెంగీ అని ఆస్పత్రి వైద్యులు అంటుండగా, చేసిన పొరపాటును డెంగీ అని చెప్పి కప్పిపుచ్చుతున్నారని, గర్భిణికి మూడు నెలల ముందుగా శస్త్రచికిత్స చేయడం వలనే చనిపోయిందని వైద్యాధికారి చెబుతున్నారు. రెండు సార్లు జిల్లా వైద్యాధికారులు విచారణ చేసిన ఈ వ్యవహారం రాష్ట్ర వైద్యాధికారి చేతుల్లోకి వెళ్లినట్టు సమాచారం. వైద్యాధికారులపై చిందులు వేస్తున్న నేతలు తణుకులో ఇటీవల సిజేరియన్లు భారీగా చేస్తున్నారనే వ్యవహారంలో డీఎంహెచ్‌వో డాక్టర్ బండారు సుబ్రహ్మణ్యేశ్వరి దూకుడును అడ్డుకోవాలంటూ తణుకు ఐఎంఏ ప్రతినిధులు తణుకు, నిడదవోలు ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకున్నారు. అంతేకాకుండా తాడేపల్లిగూడెం పర్యటనకు వచ్చిన ఒక మంత్రిని కలిసి వైద్యాధికారికి ఫోన్ చేయించారు. రూ.25 వేలు బిల్లు వేశారు డయేరియా లక్షణాలతో మా అమ్మను తణుకులోని డాక్టర్ డి.బిల్లీగ్రహం హాస్పటల్లో చూపించాను. పదిరోజులపాటు వైద్యం చేసి రూ.25 వేలు బిల్లు వేశారు. రక్త పరీక్షలు అక్కడ మాత్రమే చేయించుకోవాలని, మందులు ఆస్పత్రి డిస్పెన్సరీలోనే తీసుకోవాలనే నిబంధనలు పెట్టారు. రెండు రోజుల ట్రీట్మెంట్ పదిరోజులు సాగదీశారు. ఆఖరుకు రూ.1500 మాత్రమే తగ్గించి బిల్లు చెల్లించాం. –ఎం.లక్ష్మణ్, పైడిపర్రు -
‘కంటి వెలుగు’లో నిర్లక్ష్యం
హన్మకొండ చౌరస్తా (వరంగల్): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కంటి వెలుగు పథకంలో ప్రైవేట్ ఆస్పత్రి యాజమాన్యాల నిర్లక్ష్యం బయటపడింది. కాటరాక్ట్ సర్జరీలను మమ అనిపించిన వైద్యులు పూర్తిగా చెకప్ చేయకుండానే డిశ్చార్జి చేశారు. ఇంటికి వెళ్లిన రోగులు కంటి చూపు సరిగా లేకపోవడంతో ఆందోళనకు గురయ్యారు. అయితే.. సర్జరీ సరిగా చేయలేకపోయామని గుర్తించిన వైద్యులు మరుసటి రోజే మరోసారి ఆస్పత్రికి రావాలని ఫోన్ చేయడంతో వారి నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. రోగుల అనుమానమే నిజం కావడంతో ఆస్పత్రికి చేరుకుని షాక్‌కు గురయ్యారు. హన్మకొండలోని జయ ఆస్పత్రిలో జరిగిన ఘటన వివరాలు రోగులు, వారి బంధువులు తెలిపిన ప్రకారం.. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కంటి వెలుగు పథకం కోసం క్యాంపులు ఏర్పాటు చేసి పరీక్షలు చేసిన వైద్యులు, ఆపరేషన్ కోసం ఆయా పథకం అమలవుతున్న ప్రైవేట్ ఆస్పత్రులకు రెఫర్ చేస్తున్నారు. ప్రాథమిక వైద్య పరీక్షలు చేసుకున్న పలువురు శస్త్రచికిత్స చేసుకోవడానికి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 18 మంది ఈ నెల 26వ తేదీన హన్మకొండ చౌరస్తాలోని జయ ఆస్పత్రి కి చేరుకున్నారు. వారికి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం డాక్టర్ లక్ష్మిరమాదేవి నేతృత్వంలో కాటరాక్ట్ శస్త్ర చికిత్స చేశారు. ఆపరేషన్ చేసిన మరుసటి రోజు డిశ్చార్జి చేసి ఇంటికి పంపించారు. అయితే.. ఇంటికి వెళ్లిన రోగులు కట్లు విప్పితే చూపు లేకపోవడంతో కంగుతిన్నారు. భయంతోనే ఆ రాత్రి నిద్రపోయిన బాధితులకు ఉదయమే జయ ఆస్పత్రి నుంచి ఫోన్ వచ్చింది. మీరు అత్యవసరంగా మరొకసారి ఆస్పత్రికి రావాలని, చెకప్ చేసి పంపిస్తామని సిబ్బంది సమాచారం అందించారు. అప్పటికే కళ్లు కనిపించకపోవడం.. ఆస్పత్రి నుంచి ఫోన్ రావడంతో ఆందోళన చెందిన బాధితులు శుక్రవారం హాస్పిటల్‌కు చేరుకున్నారు. అందులో 11 మందికి మరోసారి కాటరాక్ట్ రీఆపరేషన్ చేశారు. మిగతా ఏడుగురిని పరీక్షించి ఫర్వాలేదని చెప్పారు. ఆందోళనకు దిగిన బాధితులు.. రెండు రోజుల వ్యవధిలో రెండు సార్లు ఆపరేషన్ చేయడంపై భయాందోళనకు గురైన బాధిత బందువులు ఈ విషయంపై ఆస్పత్రి సిబ్బందిని ప్రశ్నించారు. సిబ్బంది ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో ఆస్పత్రిలో ఆందోళనకు దిగారు. సమాచారం తెలుసుకున్న ప్రజాసేన అవినీతి స్వచ్ఛంద సంస్థ చైర్మన్ పుప్పాల రజనీకాంత్ ఆస్పత్రికి చేరుకుని రోగులు, వారి బంధువులతో మాట్లాడి విషయం తెలుసుకున్నారు. వైద్యుల నిర్లక్ష్యాన్ని డీఎంహెచ్ఓ హరీష్‌రాజ్ దృష్టికి తీసుకెళ్లారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆస్పత్రి వైద్యులు, కాసుల కక్కుర్తి కోసం మనుషుల జీవితాలతో చెలగాటమాడుతున్న ఆస్పత్రులను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న వరంగల్ అర్బన్ జిల్లా డీఎంహెచ్ఓ హరీష్‌రాజు కంటి ఆపరేసన్ చేసుకున్న రోగులు, వారి బంధువులతో మాట్లాడారు. హాస్పిటల్‌లోని ఆపరేషన్ థియేటర్, ల్యాబ్ ను పరిశీలించారు. అనంతరం ఆస్పత్రిలో శస్త్రచికిత్స చేసేందుకు అన్ని వసతులు ఉన్నాయని.. అయితే జరిగిన తప్పిదానికి జయ హాస్పిటల్ యాజమాన్యానికి నోటీసులు అందజేయనున్నట్లు తెలిపారు. ఆ తర్వాత ల్యాబ్‌ను సీజ్ చేశారు. రెండోసారి ఆపరేషన్ ఎందుకంటే చెప్పలేదు.. 20 రోజుల క్రితం నయీంనగర్ లష్కర్‌సింగారంలో నిర్వహించిన క్యాంపులో కంటి పరీక్షలు చేసుకున్నాను. అక్కడ వైద్యులు ఆపరేషన్ చేయాలన్నారు. జయ ఆస్పత్రిలో ఉందంటే ఈనెల 26న ఇక్కడికి వచ్చాం. వైద్య పరీక్షలు చేసిన డాక్టర్ లక్ష్మిరమాదేవి ఆపరేషన్ చేసి గురువారం డిశ్చార్జి చేశారు. ఇంటికి వెళ్లి కట్టు విప్పితే ఏమి కనిపించడం లేదు. అంతలోనే ఉదయం ఆస్పత్రి ఉంచి ఫోన్ వచ్చింది. ఇక్కడికి రాగానే మరోసారి ఆపరేషన్ చేశారు. ఎందుకు రెండోసారి చేస్తున్నారని అడిగితే ఎవరూ పట్టించుకోలేదు. – హెచ్.పద్మ, గిర్నిబావి, దుగ్గొండి, వరంగల్ రూరల్ ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రికి రెఫర్ చేశాం జయ ఆస్పత్రిలో కంటి పరీక్షలకు సంబంధించిన అన్ని పరికరాలు, ఏర్పాట్లు బాగానే ఉన్నాయి. ఇప్పటివరకు 250 కంటి ఆపరేషన్లు చేశారు. ఈనెల 26న చేసిన 18మందిలో ఆరుగురికి ఈ రోజు ఇన్ఫెక్షన్ అయినట్లు గుర్తించి తిరిగి మెరుగైన చికిత్స అందించారు. ఇంకొందరికి తీవ్రత ఎక్కువ ఉన్నట్లు గుర్తించాం. అయినప్పటికీ 18మందిని హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రికి ముందు జాగ్రత్త చర్యగా తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేశాం. జయ ఆస్పత్రి వైద్యుల నిరక్ష్యంపై విచారణ చేస్తాం. నిర్లక్ష్యమని తేలితే చర్యలు తీసుకుంటాం. – హరీష్‌రాజ్, డీఎంహెచ్ఓ, వరంగల్ అర్బన్ ఫోన్ చేసి రమ్మంటే వచ్చాను రెండు రోజుల క్రితం జయ ఆస్పత్రికి వస్తే కంటి ఆపరేషన్ చేసి పంపించారు. ఇంటికి పోయిన మరుసటి రోజు ఫోన్ చేసి రమ్మంటే వచ్చాను. కంటికి ఇన్ఫెక్షన్ అయింది.. ఇంజక్షన్ వేయాలని లోపలికి తీసుకెళ్లారు. మత్తు ఇవ్వడంతో ఆపరేషన్ చేశారా.. లేదో తెలియడం లేదు. – కందుల మల్లయ్య, రాంనగర్, హన్మకొండ మళ్ళీ ఆపరేషన్ చేయాలని లోపలికి తీసుకెళ్లారు రెండు రోజుల క్రితం మా అత్తకు జయ ఆస్పత్రిలో కంటి ఆపరేషన్ చేసి ఇంటికి పంపించారు. మళ్లీ ఈ రోజు ఫోన్ చేసి అర్జెంటుగా ఆస్పత్రికి రావాలని చెప్పారు. చెకప్ చేయాలంటే మా అత్త కొమురమ్మను తీసుకొచ్చాను. రాగానే కంటి పరీక్షలు చేసి.. మళ్లీ ఆపరేషన్ చేయాలని లోపలికి తీసుకెళ్లారు. – అరుణ, బాదితురాలు కొమురమ్మ కోడలు, ములుగు -
వైద్యుడి నిర్లక్ష్యంతో కుక్క మృతి
చిలకలగూడ: వెటర్నరీ వైద్యుని నిర్లక్ష్యం కారణంగానే కుక్క మృతి చెందిందని ఆరోపిస్తు ఓ జంతు ప్రేమికురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఘటన చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. చిలకలగూడ పోలీసులు, జంతు ప్రేమికురాలు రాధాకుమారి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. గత నెల 10న బాగ్‌లింగంపల్లి రోడ్డుపై పడి ఉన్న కుక్కపిల్లను అదేప్రాంతానికి చెందిన రాధ గుర్తించి చేరదీసింది. నారాయణగూడలోని ప్రభుత్వ వెటర్నరీ ఆస్పత్రిలో గత కొద్దిరోజులుగా దానికి చికిత్స చేయిస్తోంది. రెగ్యులర్‌గా వైద్యం అందించే డాక్టర్ సెలవుపై వెళ్లడంతో మరో వైద్యుడు బేగ్ కుక్కపిల్లకు వైద్యసేవలు అందించాడు. కుక్కపిల్లకు తక్షణమే సర్జరీ చేయాలని సూచించిన అతను బౌద్ధనగర్‌లోని తన ప్రైవేటు ఆస్పత్రి కెన్నెల్ స్మార్ట్ క్లినిక్‌కు తీసుకువస్తే సర్జరీ చేస్తానని చెప్పాడు. ఆపరేషన్‌కు ముందు రెండు డోసుల మత్తుమందు ఇచ్చాడు. దీనికి రాధాకుమారి అడ్డు చెప్పినా ఇబ్బంది లేదని డాక్టర్ పేర్కొన్నాడు. మరుసటి రోజు శ్వాస ఆడక కుక్కపిల్ల మృతి చెందింది. మత్తుమందు ఎక్కువ ఇవ్వడంతోపాటు సర్జరీ అనంతరం కుట్లుకూడా సరిగా వేయలేదని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. ఈనెల 1న పోలీసులకు ఫిర్యాదు చేయగా, న్యాయనిపుణుల సలహామేరకు గురువారం సాయంత్రం కేసు నమోదు చేశారు. డాక్టర్ బేగ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు చిలకలగూడ ఎస్ఐ బ్రహ్మచారి తెలిపారు. -
వైద్యుల నిర్లక్ష్యానికి గర్భిణి మృతి
చౌటుప్పల్ (మునుగోడు) : పదిహేను గంటల పాటు ఆస్పత్రిలో ఉన్నా ఎవరూ పట్టించుకోలేదు. ప్రాణాపాయ స్థితికి చేరుకున్నాక హడావుడి చేశారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో గుండెపోటు వచ్చింది. చివరి దశలో ఆసుపత్రి సిబ్బంది వచ్చి చెప్పగా డ్యూటీ డాక్టర్ పరీక్షించి ఈసీజీ తీయిం చింది. అప్పటికే గర్భిణి మృతిచెందింది. ఈ సంఘటన శనివారం నల్గొండ జిల్లా చౌటుప్పల్ ప్రభుత్వాసుపత్రిలో శనివారం చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. మండలంలోని చిన్నకొండూరు గ్రామానికి చెందిన చెక్క లింగస్వామి స్థానికంగా సీఆర్పీగా పనిచేస్తున్నాడు. ఆయన భార్య సవిత(28)కి నెలలు నిండడంతో శుక్రవారం సాయంత్రం నుంచి నొప్పులు రావడం మొదలయ్యాయి. వెంటనే హుటాహుటిన ఆటోలో చౌటుప్పల్ ఆస్పత్రికి తరలించారు. పోచంపల్లి మండలం దోతిగూడెం గ్రామంలోని ఓ పరిశ్రమలో సవిత ఉద్యోగం చేస్తుండడంతో వీరికి ఈఎస్ఐ కార్డు ఉంది. గర్భం దాల్చినప్పటి నుంచి నాచారంలోని ఈఎస్ఐ, మండల కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రిలో వైద్య సేవలు పొందేది. ప్రసవ నొప్పులు వస్తుంటే దగ్గర్లో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు. ఆరేళ్ల క్రితం మొదటి కాన్పు సాధారణంగా జరగడంతో కుటుంబ సభ్యులు ఇప్పుడు కూడా అదే భరోసాతో ఉన్నారు. మృతదేహంతో ఆసుపత్రి వద్ద ఆందోళన.. సవిత కుటుంబ సభ్యులు అక్కడి నుంచి నేరుగా మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చారు. కుటుంబసభ్యుల ద్వారా విషయం తెలసుకున్న గ్రామస్తులు, బంధువులు, మిత్రులు పెద్దఎత్తున తరలివచ్చి ఆందోళనకు దిగారు. వైద్యులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిర్లక్ష్యం వహించిన వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. డీసీహెచ్ కోట్యానాయక్, ఆర్డఓ సూరజ్‌కుమార్, తహసీల్దార్ షేక్ అహ్మద్, సీఐ వెంకటయ్య వైద్యులు, భాదితులతో చర్చలు జరిపారు. పూర్తిగా విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు. ఏడుగురు సభ్యులతో కలిపి కమిటీ వేస్తామని, ఆ కమిటీ పర్యవేక్షణలో పోస్టుమార్టం నిర్వహించి వాస్తవాలను వెలికి తీస్తామని చెప్పారు. దీంతో వారు ఆందోళన విరమించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. సవిత అదే గ్రామానికి చెందిన లింగస్వామిని ఏడేళ్ల క్రితం ప్రేమించి వివాహం చేసుకుంది. ఓ రసాయన పరిశ్రమలో కెమిస్ట్‌గా పనిచేస్తోంది. వీరికి కూతురు గ్రేసీ(6) ఉంది. కాగా తన భార్యను డాక్టర్లే చంపారని లింగస్వామి రోదిస్తున్న తీరు పలువురిని కంటతడిపెట్టించింది. కాగా ఈ ఘటనలో తమ తప్పిదం ఏమాత్రం లేదని సవితను పరీక్షించిన వైద్యురాలు శ్వేత ప్రియాంక తెలిపారు. గుండెపోటు రావడంతోనే చనిపోయిందని చెప్పారు. ఎలాంటి విచారణకైనా తాను సిద్ధమేనని అన్నారు. తేలికగా తీసుకున్న వైద్యులు.. శుక్రవారం రాత్రి 9 గంటలకు ఆస్పత్రికి వెళ్లిన సవితను డ్యూటీలో ఉన్న వైద్యులు పరీక్షిం చారు. కడుపులో బిడ్డ నాలుగు కిలోల బరువు ఉందని, ప్రసవానికి ఇంకా సమయం ఉందని చెప్పారు. భరించలేని నొప్పులు వస్తున్నాయ ని సవిత చెప్పినా అవి సాధారణమైన నొప్పులేనన్నారు. మళ్లీ నొప్పులు వచ్చినప్పుడు ఆస్పత్రి కి రావాలని సూచించి ఇంటికి వెళ్లమన్నా రు. డాక్టర్ల మాటలను పట్టించుకోని సవిత తన నొప్పుల బాధను కుటుంబ సభ్యులకు చెప్పింది. ఈ సమయంలో ఇంటికి వెళితే రాత్రివేళ ఆస్పత్రికి రావడం కష్టమని భావించిన వారు అక్కడే ఉండిపోయారు. నొ ప్పులు తగ్గకపోవడంతో డ్యూటీలో ఉన్న సిబ్బందిని కలిసి విషయాన్ని చెప్పారు. వారు కూడా చాలా తేలికగా తీసుకున్నారు. ఇలా తెల్లవారినా ఏమాత్రం మార్పురాలేదు. పరిస్థితి విషమించాక హడావుడి.. రాత్రి నుంచి పట్టించుకోని వైద్యులు, సిబ్బంది చివరకు పరిస్థితి పూర్తిగా విషమించాక హడావుడి చేశారు. పరిస్థితి తీవ్రతను మృతురాలి భర్త ఆస్పత్రిలో పనిచేసే తన తెలిసిన వ్యక్తికి చెప్పి పరిష్కారం చూపాలని వేడుకున్నాడు. సవిత పడుతున్న ఇబ్బందిని గమనించిన ఆ వ్యక్తి వెంటనే విషయాన్ని డ్యూటీలో ఉన్న వైద్యురాలు శ్వేతప్రియాంకకు చెప్పగా ఓపీలో ఉన్న ఆమె వచ్చి చూసింది. అంతకుముందు ఎంత బతిమిలాడినా పట్టించుకోని ఆమె తమ సిబ్బంది చెప్పగానే వచ్చింది. ఇంతలోనే సవితకు గుండెపోటు వచ్చింది. గమనించిన వైద్యులు వెంటనే ఈసీజీ తీశారు. మరిన్ని పరీక్షల పేరుతో హడావుడి చేశారు. చివరకు హైదరాబాద్‌కు తరలించాలని చెప్పారు. వెంటనే భర్తతో సంతకం చేయించుకుని అంబులెన్స్‌లో పంపించారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందిందని చెప్పారు. -
సిద్ధిపేటలో వైద్యం వికటించి పసికందు మృతి
వైద్యుని నిర్లక్ష్యానికి ఓ పసికందు ప్రాణం కోల్పోయింది. నాలుగు నెల బాబు వైద్యం వికటించి మృతిచెందాడు. చికిత్స నిమిత్తం అమ్హత చిల్డ్రన్స్ ఆస్పత్రిలో చేర్పించినట్టు బంధువులు తెలిపారు. వైద్యం వికటించడంతో తమ బాబు మృతిచెందినట్టు వారు ఆరోపిస్తున్నారు. బాబు మృతికి వైద్యుని నిర్లక్ష్యమే కారణమంటూ బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగినట్టు సమాచారం. -
కేస్ షీట్లు మారటం వాస్తవమే: డాక్టర్ బుద్ధ
కాకినాడ : కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రిలో కేసు షీట్లు మారిన ఘటనపై సూపరింటిండెంట్ డాక్టర్ బుద్ద స్పందించారు. కేస్ షీట్లు మారిడం వాస్తవమేనని ఆయన అంగీకరించారు. సత్యవతికి సరైన వైద్యమే అందించామని.... అనుమానాలు ఉంటే పోస్ట్‌మార్టం ద్వారా నివృత్తి చేసుకోవచ్చని సూపరింటిండెంట్ అన్నారు. కాగా వివరాల్లోకి వెళితే తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో ఒకే పేరు కలిగిన ఇద్దరు మహిళా రోగుల కేస్‌షీట్లు మారిపోయాయి. గోకవరానికి చెందిన మాదిరెడ్డి సత్యవతి అనే మహిళ గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఆస్పత్రిలో చేరింది. వేట్లపాలేనికి చెందిన మాదాసు సత్యవతి మూడురోజుల కిందట జ్వరంతో బాధపడుతూ చేరింది. వైద్య పరీక్షల సమయంలో సిబ్బంది మాదిరెడ్డి సత్యవతి కేస్‌షీట్... మాదాసు సత్యవతికి ఇచ్చారు. ఈ విషయాన్ని గుర్తించక పోవడంతో... రాత్రి డ్యూటీలో ఉన్న జూనియర్ డాక్టర్ ఒకరికి చేయాల్సిన ఇంజెక్షన్ మరొకరికి చేశారని... ఫలితంగా వైద్యం వికటించి మాదాసు సత్యవతి మరణించిందని బంధువులు ఆరోపిస్తున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించినవారిపై చర్యలు తీసుకోవాలని... తమకు న్యాయం చేయాలని మృతురాలి బంధువులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు.