Doctors team
-
ఆరుగురు డాక్టర్లతో బృంద వైద్యం
సాక్షి, అమరావతి: బ్లాక్ ఫంగస్ బారిన పడిన వారిని ఆరుగురు వైద్యుల బృందం పర్యవేక్షించాల్సి ఉంటుంది. జనరల్ ఫిజీషియన్, ఈఎన్టీ సర్జన్, ఆఫ్తాల్మాలజీ, న్యూరాలజిస్ట్, న్యూరోసర్జన్, హెడ్–అండ్ నెక్ సర్జన్లతో కూడిన బృందం క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉంటుందని వైద్యారోగ్య శాఖ తెలిపింది. ఈ మేరకు ట్రీట్మెంట్ ప్రొటోకాల్స్‌పై ఆదేశాలు జారీచేసింది. నిపుణుల బృందం పరిశీలించిన అనంతరం వైద్యారోగ్య శాఖ ఈ మార్గదర్శకాలిచి్చంది. నాసికా మార్గం ద్వారా బ్లాక్ ఫంగస్ వేగంగా వ్యాపించి రక్త నాళాలను మూసివేస్తుంది. నియంత్రణలో లేని మధుమేహం, స్టెరాయిడ్స్, రోగ నిరోధక మందులు ఎక్కువగా వాడటం, ఎక్కువ కాలం ఆక్సిజన్ థెరపీలో, వెంటిలేటర్‌పై ఉండటం వల్ల జబ్బు సోకే అవకాశం ఉంటుంది. ఐసీయూలోని గొట్టాలను సరిగా శుభ్రపరచకపోవడం వల్ల కూడా ఫంగస్ వస్తుంది. ► నిర్ధారణ.. ముక్కుకు సంబంధించిన పరీక్షలు చేయాలి. ముక్కు ఎండోస్కొపీ ద్వారా ఈ జబ్బును గుర్తించవచ్చు. సీటీ స్కాన్ ద్వారా ముక్కులో గాలి గదుల్లో ఇన్ఫెక్షన్ తెలుసుకోవచ్చు. మెదడుకు, కంటికి సోకిందో లేదో ఎంఆర్ఐ స్కానింగ్ ద్వారా తెలుసుకోవచ్చు. ► నివారణా మార్గాలు.. స్టెరాయిడ్లను అవసరం మేరకు తగిన మోతాదులో మాత్రమే వాడాలి. ఆక్సిజన్ ఇచ్చే సమయంలో శుభ్రమైన నీటిని వాడాలి. పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి. రోజూ బెటడిన్‌తో నోటిని పుక్కిలించాలి. -
విశాఖ గ్యాస్ లీకేజీ: ప్రత్యేక వైద్య బృందాల ఏర్పాటు
సాక్షి, విశాఖపట్నం: విశాఖ ఎల్జీ గ్యాస్ లీకేజీ బాధిత గ్రామాల ప్రజలకు భరోసా ఇచ్చేందుకు వెంకటాపురంలో 10 పడకలతో వైఎస్సార్ క్లినిక్‌ను ఏర్పాటు చేసినట్లు వైద్య నిపుణుల కమిటీ చైర్మన్ డాక్టర్ సుధాకర్ తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచనల మేరకు బాధిత గ్రామాలలో 24 గంటలలో పాటు 3 షిఫ్టులలో 6 వైద్య బృందాలు పనిచేస్తున్నట్లు చెప్పారు. ఈ బృందం ప్రజల ఆరోగ్య సమస్యలపై దీర్ఘకాలికంగా పర్యవేక్షించడానికి 10 మంది నిపుణులతో కూడిన ప్రత్యేక వైద్య బృందాన్ని నియమించామన్నారు. ఈ వైద్య నిపుణుల కమిటీ గ్యాస్ లీకేజీ బాధిత గ్రామాల్లో ప్రజల ఆరోగ్య సమస్యలను పరీక్షించడంలో దీర్ఘకాలికంగా పనిచేస్తుందని చెప్పారు. (బాధిత గ్రామాల్లో సహాయక చర్యలు) ఇందులో న్యూరో, పల్మనాలజీ, గ్యాస్ట్రో ఎంట్రాలజీ, కంటి, జనరల్ మెడిసిన్, పాథాలజీ, చిన్న పిల్లల వైద్య నిపుణులు ఉన్నట్లు పేర్కొన్నారు. ఇక ఈ కమిటీకి తాను చైర్మన్‌గా వ్యవహరిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. బాధిత గ్రామాల ప్రజల ఆరోగ్య సమస్యలపై ఈ కమిటీ అధ్వర్యంలో ప్రజల ఆరోగ్య సమస్యలపై శాస్త్రీయమైన పద్దతిలో అధ్యయనం చేయడమే కాకుండా నిరంతరాయంగా పర్యవేక్షణ చేయనున్నామన్నారు. ఇక బాధిత గ్రామాల ప్రజల ఆరోగ్య సమస్యల బాధ్యత ప్రభుత్వమే తీసుకుంటుందని స్పష్టం చేశారు. భవిష్యత్‌లో వారి ఆరోగ్యంపై ఇబ్బందులు రాకుండా ఈ నిపుణుల కమిటీ పనిచేస్తుందన్నారు. స్టెరైనా గ్యాస్ వ్యవహారం, బాధితుల భవిష్యత్తు వైద్య సమస్యలపై ఢిల్లీలోని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ రాజీవ్ గర్గ్, ఇన్సిట్యూట్ ఆప్ న్యూక్లియర్ మెడిసిన్ నిపుణులతోనూ చర్చిస్తున్నామన్నారు. ప్రభుత్వం తరపు నుంచి హెల్త్ కార్డులను కూడా జారీ చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. (‘మంత్రుల బసతో బాధితుల్లో ధైర్యం’) -
వైద్య ఆరోగ్యంపై కేసీఆర్ ఆలోచనలు
హైదరాబాద్: పేద రోగులపై అధికభారం పడకుండా వైద్య సేవలు అందించాలని ఈ రోజు తనను కలిసిన వైద్య బృందాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు కోరారు. డాక్టర్ సోమరాజు, డాక్టర్ కృష్ణారెడ్డి తదితర ప్రముఖ వైద్యుల బృందం సీఎం కేసీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ హైదరాబాద్‌ను హెల్త్ హబ్‌గా మార్చాలని అన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు సంయుక్తంగా మెరుగైన వైద్యం అందించాలని కోరారు. స్టెంట్ సహా ముఖ్యమైన వైద్య పరికరాలు తెలంగాణలోనే తయారు చేసుకునేలా ఎదగాలని అన్నారు. నిష్టాతులైన వైద్యులతో ఆరోగ్య సలహా మండలిని ఏర్పాటు చేస్తామని కేసీఆర్ చెప్పారు.