Doors Locked
-
దిగుతున్న టైంలో విమానం డోర్ లాక్ అయ్యింది!..పాపం ఆ ప్రయాణికుడు..
విమానం గమ్యస్థానానికి చేరకోగానే ప్రయాణికులు దిగిపోవడం సర్వసాధారణం. ఐతే ఓ విమానంలో చివరిగా దిగుతున్న ప్రయాణికుడు దిగే సమయంలో సడెన్‌గా డోర్లు లాకయ్యాయి. ఆ విమానం తిరిగి మరో జర్నీకి రెడీ అవతుండగా అసలు విషయం బయట పడింది. పాపం ఆ ప్రయాణికుడుని బయటకు తీసుకొచ్చేందుకు పైలట్ కాక్‌పీట్ విండో గుండా వెళ్లాల్సి వచ్చింది. ఈ అరుదైన ఘటన అమెరికాలోని శాన్ డియాగో అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..శాన్ డియాగో అంతర్జాతీయ విమానాశయంలో శాక్రమెంటోకు వెళ్లే సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్‌లో ఓ ప్రయాణికుడు అనుకోకుండా ఇరుక్కుపోయాడు. నిజానికి సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ శాన్ డియాగో విమానాశ్రయం చేరుకోగానే ప్రయాణికులంతా దిగిపోతున్నారు. సరిగ్గా అదే సమయంలో బోర్డింగ్ ప్రక్రియలో ఇతర ప్రయాణికులు, ఫ్లైట్ అటెండెంట్లు ఆన్‌బోర్డ్‌లో ఉండగా.. చివరగా దిగుతున్న ప్రయాణికుడు ఫార్వార్డ్ లావేటరీ డోర్‌ని తెరిచాడు. అంతే ఒక్కసారిగా విమానం డోర్ లాక్ అయ్యిపోయింది. దీంతో ఆప్రయాణికుడు ఆ విమానంలో అలానే ఉండిపోయాడు. ఇంతలో మరో ట్రిప్‌కి విమానం సిద్దమయ్యే నిమిత్తం పైలట్లు ఆ విమానాన్ని ఆపరేట్ చేసేందుకు రావడంతో అసలు విషయం బయటపడింది. దీంతో పైలట్ డెక్ కాక్‌పీట్ వద్ద ఉండే విండో గుండా వెళ్లి ఆ ప్రయాణికుడిని బయటకు తీసుకొచ్చాడు. ఆ ప్రయాణికుడు ఒక్కడే ఆ విమానం నుంచి చివరిగా బయటకు వచ్చాడు. అందుకు సంబంధించిన ఫోటోను అదే విమానంలో ప్రయాణించేందుకు వెళ్తున్న రెక్స్ రోడ్ అనే మరో ప్రయాణికుడు ఆ దృశ్యాలను నెట్టింట షేర్ చేయడంతో ఈ విషమం నెట్టింట తెగ వైరల్‌గా మారింది. ఈ అనుహ్య ఘటనతో తాము తొమ్మది నిమిషాలు ఆలస్యంగా బయలుదేరినట్లు తెలిపాడు. ప్రతిస్పందనగా సదరు ఎయిర్‌లైన్స్ ట్విట్టర్లో మీరు ఎప్పుడూ చూడని అరుదైన దృశ్యం అని పేర్కొంది. No joke… yesterday last passenger got off plane with no one else on board, he shut the door. Door locked. Pilot having to crawl through cockpit window to open door so we can board. @SouthwestAir pic.twitter.com/oujjcPY67j — Matt Rexroad ✌🏼🇺🇸 (@MattRexroad) May 25, 2023 (చదవండి: తొలిసారిగా సాధారణ పౌరుడిని అంతరిక్షంలోకి పంపనున్న చైనా!) -
టైంకి ఆస్పత్రికి తరలించారు.. కానీ అంబులెన్స్ డోర్లు ఓపెన్ కాలేదు
కేరళ: ఇటీవల కాలంలో రోడ్డుప్రమాదాలు అంతకంతకు ఎక్కువైపోతున్నాయి. వాహనదారులు ఎంత జాగ్రత్తగా ఉన్న మృత్తువు ఏదో ఒక రూపంలో కబళిస్తోంది. ఒకవేళ ప్రమాదాలు జరిగినా సమయానికి క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలిస్తే ఎంతో కొంతప్రమాదాన్ని నివారించగలుగుతాం. ఐతే ఇక్కడొక వ్యక్తిని అంబులెన్స్‌లో సమయానికి ఆస్పత్రికి తీసుకెళ్లినా అక్కడ అంబులెన్స్ డోర్లు ఓపెన్ కాకపోవడంతో ప్రాణాలు కోల్పోయాడు. అసలేం జరిగిందంటే.... కేరళలోని ఫెరోక్‌కు చెందిన 66 ఏళ్ల కోయమోన్ అనే వ్యక్తికి బైక్ యాక్సిడెంట్ అయ్యింది. ఆ వ్యక్తి చాలా తీవ్రంగా గాయపడ్డాడు. వెనువెంటనే అంబులెన్స్ వచ్చి నిర్ణీత సమయానికి ప్రభుత్వ మెడికల్ కాలేజ్‌కి తీసుకువచ్చింది కూడా. ఐతే క్షతగాత్రుడిని చికిత్స వార్డుకి తరలిద్దాం అనుకుంటే అంబులెన్స్ డోర్లు ఎంతకి ఓపెన్ కాలేదు. ఆఖరికి ఆస్పత్రి సిబ్బంది మొత్తం ప్రయత్నించినప్పటికీ... సుమారు అరగంట వరకు వ్యాన్ డోర్లు ఓపెన్ గాక చాలా ఇబ్బందిపడ్డారు. చివరికి డోర్‌కు ఉండే అద్దాలు పగలుగొట్టి లోపలి నుంచి డోర్లు ఓపెన్ చేశారు. ఈ ఆలస్యం కారణంగా సదరు క్షతగాత్రుడు మృతి చెందాడు. అయితే అంబులెన్స్ డోర్లు తెరుచుకోకపోవడమే ఆ వ్యక్తి మరణానికి కారణమైంది. ఈ ఘటన గురించి తెలుసుకున్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ విచారణకు ఆదేశించారు. (చదవండి: ఆగ్రహంతో ప్రభుత్వాధికారిని స్థంభానికి కట్టేసిన రైతులు: వీడియో వైరల్) -
ఈ కారు ఎవరిదో !
బ్రాహ్మణగూడెంలో వారం రోజులుగా వదిలేసిన మారుతి కారు బ్రాహ్మణగూడెం(చాగల్లు): నిడదవోలు-పంగిడి రహదారిలోని బ్రాహ్మణగూడెం గ్రామం శివారులో ఒక కారు వారం రోజులుగా రోడ్డు పక్కనే నిలిపివేసి ఉండడం స్థానికంగా పలు అనుమానాలకు తావిస్తోంది. ఏపీ 31 క్యూ 1155 నంబర్ కలిగిన ఈ మారుతి 800 కారును ఎవరో డోర్స్ లాక్‌చేసి రోడ్డు పక్కన వదిలి వెళ్లిపోయారని స్థానికులు చెబుతున్నారు. కారు యజమాని గాని, సంబంధీకులు గానీ రాకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కారు రిజిస్ట్రేషన్ నంబర్ విశాఖ జిల్లాకి చెందినది కావడం అనుమానాలను మరింత పెంచుతోంది. ఎవరు ఎందుకు ఈ కారును వదిలేశారు? యజమాని క్షేమమేనా? ఏదైనా నేరఘటనకు దీనికీ సంబంధం ఉందా? ఇలా పలు విధాల చర్చించుకుంటున్నారు. పోలీసులు జోక్యం చేసుకుని ఈ కారు మిస్టరీని ఛేదించాలని స్థానికులు కోరుతున్నారు.