dosa maker
-
ఆటోమేటిక్ దోసె మేకర్.. నిమిషంలో ఆకలి తీరుస్తుంది
దోసె ఇష్టపడని వాళ్లు అరుదు. ఈ చిత్రంలోని మేకర్ ఒకే ఒక్క నిమిషంలో దోసెలేసి ఆకలి తీరుస్తుంది. దీనిలోని 360 డిగ్రీస్ ఫుడ్ గ్రేడ్ కోటెడ్ రోలర్.. దోరగా వేగిన దోసెలను ట్రేలో అందిస్తుంది. అందుకు వీలుగా వెనుకవైపున్న ట్యాంకర్లో దోసెల పిండి వేసి.. పక్కనే ఉండే బటన్ ప్రెస్ చేస్తే చాలు. ఈ డివైస్.. కంపాక్ట్ అండ్ పోర్టబుల్‌గా, యూజర్ ఫ్రెండ్లీగా పని చేస్తుంది. దీనిలోని ఆటోమేటిక్ సేఫ్టీ కట్ ఆఫ్ ఫీచర్‌తో.. దోసెకు దోసెకు మధ్య 3 నిమిషాల గ్యాప్ ఇస్తుంది. ఈ మోడల్ మేకర్స్‌లో చాలా కలర్స్ అందుబాటులో ఉన్నాయి. మరింకెందుకు ఆలస్యం? ఈసారి దోసెలు వేసే పనిని ఈ మేకర్‌కి అప్పగించేయండి! -
Anand Mahindra: రోబో కంటే వేగంగా దోశలు వేస్తున్నాడే..!
ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ అప్పుడప్పుడూ స్ఫూర్తిదాయకమైన, ఆసక్తికరమైన వీడియోలు షేర్ చేస్తూ ఉంటారు. మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్లో ఆసక్తికరమైన వీడియోలు, ఆలోచనాత్మక పోస్టులను తన అభిమానులతో షేర్ చేసుకుంటాడు. ఇటీవల మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్ర ట్విటర్లో రోబో కంటే వేగంగా దోశను వేస్తున్న ఒక వ్యక్తి వీడియోను పంచుకున్నారు. మహీంద్రా ఆ వ్యక్తి అసాధారణ నైపుణ్యాలను ప్రశంసించారు.(చదవండి: ఖాతాదారులకు ఎస్బీఐ అలర్ట్!) "ఈ పెద్దమనిషి రోబోట్ల కంటే వేగంగా దోశలు వేస్తున్నారు. నేను అతనిని చూస్తూ అలసిపోయాను.. అలాగే ఆకలిగా కూడా ఉంది" అని ట్విటర్ పోస్టులో రాశారు. మహీంద్రా @finetrait ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా షేర్ చేసిన వీడియోను ఇప్పటివరకు 25 లక్షల మంది చూడటంతో పాటు 30 వేల మంది లైక్ చేశారు. ఈ బిజినెస్ టైకూన్ ట్విటర్ అకౌంట్ ఆసక్తి వీడియోలకు గోల్డ్‌మైన్‌లా మారింది. ఆలోచనాత్మక పోస్ట్‌లతో అభిమానులు, ఫాలోవర్లను అలరించడం ఆనంద్ మహీంద్రాకు ఇష్టం. ఈ వీడియోలో దోశలు వేసే వ్యక్తి చాలా వేగంగా దోశలు వేస్తూ కస్టమర్లకు వేగంగా అందజేస్తున్నారు. అలాగే గత వారం ఆనంద్ మహీంద్రా ఒక మెషిన్ ద్వారా కొబ్బరి నీటిని సృజనాత్మకంగా విక్రయించే ఒక విక్రేతకు సంబంధించిన వీడియోను షేర్ చేశారు. This gentleman makes robots look like unproductive slowpokes… I’m tired just watching him…and hungry, of course.. pic.twitter.com/VmdzZDMiOk — anand mahindra (@anandmahindra) August 17, 2021 -
దోశ మేకర్‌ను ఆర్డరిచ్చిన ప్రిన్స్ విలియమ్స్
చెన్నై: కరకరలాడుతూ ఘుమఘుమలాడే కడక్ దోశ దక్షిణాదితో ఎంతో ఫేమ్. భారత్ పర్యటనలో భాగంగా ముంబై సందర్శించిన బ్రిటన్ యువరాజు దంపతులు ప్రిన్స్ విలియమ్స్, కేట్లు కూడా ఈ దోశ రుచి చూసి వారెవ్వా! అంటూ ప్రశంసించారు. చెన్నైలోని ఎస్ఆర్ఎం యూనివర్శిటీకి చెందిన మాజీ బీటెక్ విద్యార్థి 24 ఏళ్ల వికాస్ ఈశ్వర్, తాను కనిపెట్టిన దోశ మేకర్‌పై వేసిన దోశనే వారికి తినిపించి శభాష్ అనిపించుకున్నారు. ముకుంద ఫుడ్స్ వ్యవస్థాపక సీఈవో అయిన ఈశ్వర్ తన బ్యాచ్‌మేట్ సుబీత్ సాబత్తో కలసి ఈ దోశ మేకర్‌ను కనుగొన్నారు. దానికి ‘దోశామేటిక్’ అని కూడా పేరుపెట్టారు. రాజ దంపతుల గౌరవార్థం ముంబైలో ఏర్పాటు చేసిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తల ప్రదర్శనలో పాల్గొన్న ఈశ్వర్ రాజదంపతులను ఎంతగానో ఆకర్షించారు. వెంటనే ఓ దోశా మేకర్‌ను బ్రిటన్‌కు షిప్పింగ్ చేయాల్సిందిగా కూడా ఆర్డర్ పొందారు. చెన్నైలో దొరికే ఒకే రీతి మందం, ఒకే సైజు, ఒకే తీరు కడక్గల దోశ తనకు భారత్ దేశమంతటా పర్యటించినా ఎక్కడా దొరకలేదని, అందుకనే ఎప్పుడూ ఒకే తీరుండే దోశను తయారుచేసే పరికరాన్ని కనుగొనాలనే తపన నుంచే ఈ దోశ మేకర్ పుట్టుకొచ్చిందని ఈశ్వర్ తెలిపారు. ఢిల్లీలో జరిగిన ఓ ప్రదర్శనలో కూడా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని తన దోశ మేకర్ ఆకర్షించిందని, అయితే ఆయన అలా దూరం నుంచి చూసుకుంటూ వెళ్లారని చెప్పారు. ఇప్పుడు కూడా రాజ దంపతుల నుంచి అలాంటి అనుభవమే ఎదురవుతుందని భావించానని, అయితే అందుకు విరుద్ధంగా వారొచ్చి తన దోశను తినడం, పరికరం పనిచేసే విధానం కూడా అడిగి తెలుసుకోవడం ఆనందం వేసిందని ఆయన వివరించారు. అంతకుమించిన ఆనందం తన దోశమేటిక్‌కు ఆర్డరివ్వడమన చెప్పారు. ఈ దోశమేటిక్ను తాను రెండు వర్షన్లుగా తయారు చేశానని, ఒక వర్షన్ రెస్టారెంట్లలో ఉపయోగించుకోవడానికని, అది 1.5 లక్షల రూపాయలని, ఇంటిలో ఉపయోగించడానికి తయారుచేసిన మోడల్ 12,500 రూపాయలకే లభిస్తుందని ఈశ్వర్ తెలిపారు. తన ఈ దోశమేటిక్‌కు అమెరికా, బ్రిటన్ దేశాల్లో యమగిరాకీ ఉందని చెప్పారు.