Double roads
-
డబుల్ రోడ్లకు రూ.2,007 కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పూర్తిగా మందగించిన డబుల్ రోడ్ల నిర్మాణాన్ని మళ్లీ పట్టా లెక్కించేందుకు ప్రభుత్వం రూ.2,007 కోట్లు కేటాయించింది. గతేడాదితో పోలిస్తే రూ.7 కోట్లు తక్కువ. గత బడ్జెట్ కేటాయింపుల్లో పూర్తిస్థాయిలో నిధులు విడుదల కాకపోవటంతో పనులు బాగా మందగించాయి. ఈసారి ప్రతిపాదించిన నిధులు ఎంతమేర విడుదలవుతాయో వేచిచూడాలి. మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలు, జిల్లా కేంద్రాల నుంచి రాజధానికి డబుల్ రోడ్లను గతంలోనే ప్రభుత్వం పెద్దఎత్తున ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆదిలో చాలావేగంగా పనులు జరిగినప్పటికీ, రెండేళ్లుగా నిధులు పూర్తిస్థాయిలో అందక పడకేశాయి. గత రెండేళ్లుగా భారీ వర్షాలతో రోడ్లకు తీవ్ర నష్టం వాటిల్లిన విషయం తెలిసిందే. కానీ, వరద ప్రభావిత రోడ్ల పునర్నిర్మాణానికి నిధులు లేక పనులు జరగలేదు. తాత్కాలిక మరమ్మతులతో సరిపెట్టారు. ఇటీవలే సీఎం ఆ పనులపై సమీక్షించి రూ.2,500 కోట్లు మంజూరు చేశారు. వరదతో దెబ్బతిన్న రోడ్ల పునరుద్ధరణతోపాటు దెబ్బతిన్న రోడ్ల రెన్యూవల్ పనులు కూడా చేపట్టాలని ఆదేశించారు. ఇప్పుడు బడ్జెట్లో నాన్‌ప్లాన్ కింద ఆ పనులకు రూ.2,434 కోట్లు, భవనాల కోసం రూ.1,515 కోట్లు కేటాయించారు. ఇందులో కొత్త సచివాలయ భవనం పూర్తికి రూ.400 కోట్లు ప్రతిపాదించారు. రీజినల్ రింగురోడ్డు భూసేకరణకు సంబంధించి ఉత్తర భాగంలో రాష్ట్రప్రభుత్వ వాటాగా రూ.2,600 కోట్లు చెల్లించాల్సి ఉంది. దానికిగాను రూ.500 కోట్లు ప్రతిపాదించారు. వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి రూ.1,600 కోట్లు కేటాయించారు. -
డేంజర్ చౌరస్తా.. డబుల్రోడ్లు వేసినప్పటికీ ప్రమాదాలు
సాక్షి, ఇబ్రహీంపట్నం(కరీంనగర్): గ్రామాలకు వెళ్లేందుకు డబుల్రోడ్లు వేసినప్పటికీ ప్రధాన కూడళ్ల వద్ద ఎలాంటి హెచ్చరిక బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు పెట్టకపోవడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇబ్రహీంపట్నం మండల కేంద్రానికి రావడానికి జాతీయ రహదారి నుంచి సింగిల్‌రోడ్డును 10 ఏళ్ల క్రితం డబుల్‌రోడ్డుగా మార్చారు. దీంతో వాహనాలు అతివేగంగా వస్తూ ప్రమాదాలు జరుగుతున్నాయి. నిత్యం రద్దీ.. మండల కేంద్రంలోని ఇందిరాగాంధీ చౌరస్తా వద్ద నాలుగు గ్రామాలకు వెళ్లే రోడ్డును డబుల్‌రోడ్డుగా చేశారు. ఈ చౌరస్తా నుంచి మెట్పల్లి, ఇబ్రహీంపట్నం వస్తుండగా ఇబ్రహీంపట్నం నుంచి గోదూర్ మీదుగా నిర్మల్ జిల్లాకు, ఖానాపూర్‌కు ఇబ్రహీంపట్నం నుంచి మూలరాంపూర్, ఇబ్రహీంపట్నం నుంచి వర్షకొండ మీదుగా నిర్మల్ జిల్లాకు నిత్యం వందలాది వాహనాలు వెళ్తుంటాయి. మహారాష్ట్ర నుంచి నిర్మల్ జిల్లా మీదుగా ఇబ్రహీంపట్నం నుంచి ఇతర జిల్లాలకు తక్కువ దూరం అవుతున్నందున అనేక వాహనాలు వెళ్తుంటాయి. ఇబ్రహీంపట్నం ఇందిరాగాంధీ చౌరస్తా వద్ద ఎలాంటి హెచ్చరిక బోర్డులు, స్పీడ్‌బ్రేకర్లు లేకపోవడంతో వాహనాలు అతివేగంగా వస్తు అప్పుడప్పుడు ప్రమాదాలు గత సంవత్సరం గోదూర్ వైపు నుంచి బైంసాకు వెళ్తున్న ఓ కారు బైకు ను ఢీ కొనడంతో ఓ మహిళతో పాటు యువతికి తీవ్ర గాయాలయ్యాయి. ఇదే సంవత్సరం కోమటి కొండాపూర్‌కు చెందిన భార్యభర్తలు బైక్‌పై గోదూర్ నుంచి కోమటికొండాపూర్‌కు వెళ్తుండగా అతివేగంగా కారును ఢీ కొట్టి కిందపడగా తీవ్రగాయాలయ్యాయి. ఈ చౌరస్తా గుండా నిత్యం బైక్‌లతో పాటు భారీ వాహనాలు అతివేగంగా వెళ్తుండడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. హెచ్చరిక బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు లేకనే.. ఇందిరాగాంధీ చౌరస్తా వద్ద నాలుగు గ్రామాలకు వెళ్లే రోడ్లు ఉండడంతో నిత్యం వందలాది వాహనాలు వెళ్తుంటాయి. ఇక్కడ ఎలాంటి హెచ్చరిక బోర్డులు, స్పీడ్బ్రేకర్లును ఆర్అండ్బీ అధికారులు ఏర్పాటు చేయకపోవడంతో ప్రమాదాల చౌరస్తాగా మారింది. చౌరస్తా వద్ద వాహనాలు వేగంగా వెళ్లడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. అధికారులు ఇప్పటికైనా పట్టించుకొని హెచ్చరిక బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేసి ప్రమాదాలను అరికట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు. ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలి చౌరస్తా వద్దనే మా షాపు ఉంది. నిత్యం వాహనాలు వేగంగా వెళ్లడంతో అప్పుడప్పుడు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆర్అండ్బీ అధికారులు చౌరస్తా వద్ద ప్రమాదాలు జరగకుండా, వాహనాలు వేగంగా వెళ్లకుండా చర్యలు తీసుకోవాలి. – పోలకొండ సుధాకర్ వర్మ, ఇబ్రహీంపట్నం ప్రతిపాదనలు పంపాం చౌరస్తా వద్ద నాలుగుదారులకు వెళ్లే చోట హెచ్చరిక, సూచికల బోర్డులు ఏర్పాటు చేయడానికి రూ.2లక్షలతో ప్రతిపాదినలు తయారుచేసి మంజూరు కోసం పై అధికారులకు పంపాం. నిధులు మంజూరు కాగానే హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తాం. – వేణు, ఆర్అండ్బీ, ఏఈ, మెట్పల్లి చదవండి: మద్యానికి బానిసైన కొడుకును మందలించినందుకు... -
నాణ్యత నగుబాటు
మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రానికి రవాణా సౌకర్యం మెరుగుపర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం డబుల్ రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా రూ.వేల కోట్ల ఖర్చు తో రోడ్ల నిర్మాణానికి పూనుకుంది. ఇందులో భాగంగా జిల్లాలోని అన్ని మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రానికి డబుల్ రోడ్ల అనుసంధా నం జరుగుతోంది. కోట్లాది రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న రోడ్లను పది కాలాల పాటు నిలిచేలా నాణ్యతతో నిర్మించాల్సి ఉండగా.. కాంట్రాక్ట ర్ల ధనదాహం, అధికారుల అవినీతి వల్ల నాణ్యత ప్రశ్నార్థకంగా మారింది. ఇందుకు పెద్దపల్లి కాల్వశ్రీరాంపూర్ డబుల్ రోడ్డు పనులే నిదర్శనం. కరీంనగర్ : పెద్దపల్లి- కాల్వశ్రీరాంపూర్ డబుల్‌రోడ్డు పనులు నాసిరకంగా కొనసాగుతున్నాయి. తొలిదశగా రూ.10 కోట్లతో పెద్దపల్లి రైల్వే లెవల్ క్రాసింగ్ నుంచి రాంపల్లి వరకు కొనసాగుతున్న రోడ్డు పనుల్లో కాంట్రాక్టర్లు నిబంధనలకు నీళ్లు వదిలారు. గ్రావెల్ పనులు జరుగుతున్న సమయంలో ఆశించిన రీతిలో వాటర్ క్యూరింగ్ ముగించకుండానే నామమాత్రంగా నీల్లు పట్టి రోడ్డు పనులు పూర్తి చేశారు. ఇప్పుడు కంకర తేలి చెల్లాచెదురైన రోడ్డుపైనే బీటీ వేయడం వ ల్ల రోడ్డు మన్నిక ప్రశ్నార్థకంగా మారింది. రోడ్డుకు ఇరువైపుల చివరలో కంకర పైనా బీటీ వేయడంతో బలంగా పట్టుకునే పరిస్థితులు లేవు. దీంతో కొన్ని నెలల్లోనే ఇరువైపుల చివర భాగాలు దెబ్బతిని దాని ప్రభావం డబుల్ రోడ్డుపై పడుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఎన్నో ఏళ్లుగా కలలుకన్న డబుల్ రోడ్డు నిర్మాణం పనులను పర్యవేక్షించే ఇంజనీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్ సైతం పనులు జరుగుతున్న సమయంలో అందుబాటులో ఉండడం లేదు. ఆర్‌ఆండ్‌బీ గ్యాంగ్మన్ మాత్రం ఒక్కరిద్దరు రోడ్డు వద్ద ఉండి సారు... ఇప్పుడే ఆఫీసుకు వెళ్లారని సమాధానం ఇస్తున్నారు. ప్రస్తుతం రైల్వే లెవల్ క్రాసింగ్ నుంచి రాంపల్లి ఎల్లమ్మగుడి వరకు రూ.10 కోట్లతో పనులు కొనసాగుతున్నాయి. రాంపల్లి ఎల్లమ్మగుడి నుంచి కాల్వశ్రీరాంపూర్ వరకు మరో రూ.10 కోట్లతో టెండర్లు పిలిచారు. అవి కూడా వారం పదిరోజుల్లో పూర్తవుతాయని అంటున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న రోడ్డు పనుల్లో భాగంగా కల్వర్టుల నిర్మాణం సైతం నాసిరకంగా ఉంది. పాతకాలంలో నిర్మించిన పైపులైన్ కల్వర్టుకి ఇరువైపుల అతుకులు వేసి పై పై మెరుగులు దిద్దుతున్నారు. డబుల్ రోడ్డు నిర్మాణంతో వాహనాల రద్దీ పెరిగితే పాత కాలం నాటి పైపులైన్ కల్వర్టు దెబ్బతింటే పరిస్థితి ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. రోడ్డు నిర్మాణంలో కాంట్రాక్టర్ల నుంచి అధికారులకు ముడుపులు ముట్టడం వల్లే నాణ్యత గురించి పట్టించుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నారుు. ఎంతో కీలకమైన అభివృద్ధి పనులు జరుగుతున్న సమయంలో స్థానిక ప్రజాప్రతినిధులు ఇటువైపు తొంగిచూడకపోవడం విశేషం. కూనారం రోడ్డు నాలుగులైన్ల ప్రతిపాదన పెద్దపల్లి పట్టణంలోని కూనారం రోడ్డును నాలుగులైన్ల రోడ్డుగా మార్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. పట్టణంలో పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకుని హన్మంతుని పేట రైల్వే లెవల్ క్రాసింగ్ వరకు 100 ఫీట్ల వెడల్పుతో కూడిన నాలుగులైన్ల రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు కాగా, త్వరలోనే టెండర్లు పిలువన్నుట్లు సమాచారం. నాణ్యతపై నిఘా ఉంచుతున్నాం పెద్దపల్లి-కాల్వశ్రీరాంపూర్ డబుల్‌రోడ్డు నిర్మాణ పనులపై నిఘా ఉంచామని పెద్దపల్లి ఆర్అండ్బీ డీఈఈ రాములు చెప్పారు. నాణ్యత విషయంలో ఎలాంటి అనుమానాలు వచ్చినా ఎప్పటికప్పుడు అనుమతించి పనులు చేయిస్తున్నామన్నారు. క్వాలిటీ అధికారుల నివేదికల తరువాతనే బిల్లులు చెల్లిస్తామన్నారు. -డిఇఇ రాములు -
రహదారులకు నిధుల వరద
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: జిల్లాలో రహదారుల నిర్మాణం, విస్తరణకు మోక్షం కలగనుంది. ఒక వరసతో ఉన్న రహదారులన్నీ రెండు వరసల రోడ్లుగా మారనున్నాయి. జిల్లాలోని అన్ని గ్రామాల నుంచి ఆయా మండల కేంద్రాలను అనుసంధానం చేస్తూ తారురోడ్లు వేయనున్నారు. కొత్త వంతెనలను నిర్మించనున్నారు. శిథిల నిర్మాణాలకు మరమ్మతులు చేయను న్నారు. ఈ మేరకు రహదారు లు, భవనాలశాఖకు ప్రభుత్వం రూ. 1011.50 కోట్లు విడుదల చేసింది. 45 సింగిల్‌లైన్ రోడ్లను డబుల్ రోడ్లుగా మార్చడంతోపాటు గ్రామాలకు మండల అనుసంధానం కోసం 14 ర హదారులు, శిథిల వంతెనలతోపాటు కొత్తగా 35 వంతెనలు నిర్మించేందుకు ఆర్అండ్బీ అధికారులు గతంలో ప్రతిపాదనలు పంపారు. ఈ మేరకు నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. టెండర్ల ద్వారా పనుల చే పట్టేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. మొదటిసారి భారీగా నిధులు రోడ్లు, వంతెనల నిర్మాణం, విస్తరణ పనులతో జిల్లాకు మహర్ధశ పట్టనుంది. ఇందుకోసం రహదారుల, భవనాలశాఖకు మొదటిసారిగా ప్రభుత్వం పెద్దమొత్తంలో నిధులు విడుదల చేసింది. ఏక వరసలో ఉన్న 45 రహదారులను రెండు వరసల రోడ్లుగా విస్తరించేందుకు రూ. 618.45 కోట్లు విడుదలయ్యాయి. ఇందులో రూ.85 కోట్ల విలువ చేసే ఐదు రోడ్లు కోర్రోడ్ నెట్వర్క్ (సీఆర్ఎన్) స్కీం కిందకు వస్తాయి. 15 మండలాలతో వివిధ గ్రామాలను అనుసంధానం చేసే 14 రహదారులను నిర్మాణం కో సం రూ.231 కోట్లు కేటాయించారు. శిథిల మైన, కొత్త వంతెనల నిర్మాణం కోసం మరో రూ.162.05 కోట్లు విడుదల చేశారు. సింగిల్ లేన్ రోడ్ల విస్తరణ కోసం అత్యధికంగా వర్ని- మొండిసడక్ రోడ్డు కోసం రూ.35 కోట్లు, నిజామాబాద్-వర్నికి రూ.30 కోట్లు, జుక్కల్-మద్నూరుకు రూ.19 కోట్లు, రాజంపేట్-గుండారంకు రూ.18 కోట్లు, నందిపేట-చిన్నయానం రోడ్డుకు రూ.17 కోట్లు, మద్దుల-గడ్కోల్ రహదారికి రూ.16.80 కోట్లు కేటాయించగా.. అత్యల్పంగా తాళ్లమడుగు-దోంచందాకు రూ. 3.20 కోట్లు, మెండోరా-కొడిచెర్లకు రూ.3 కోట్లు మంజూరు చేశారు. మండల కేంద్రాల అ నుసంధాన రోడ్లు, వంతెనలకు కూడా ప్రాంతాలవారీగా నిధులు మంజూరు చేశారు. జనవరి 2 నాటికి కాంట్రాక్టర్ల ఖరారు ఈ భారీ నిధులతో చేపట్టే పనుల కోసం టెండర్ల ప్రక్రియ జరిపేందుకు రహదారులు, భవనాల శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇదివరకు ఆర్అండ్బీ పర్య వేక్షక ఇంజనీర్‌గా ఉన్న మాధవి సుకన్య ఇటీవలే బదిలీ కాగా, కొత్తగా పి.మధుసూదన్ రెడ్డి విధుల్లో చేరారు. టెండర్ల ప్రక్రియ తదితర విధివిధానాల గురించి చీఫ్ ఇంజనీర్, కమిషనర్‌తో చర్చించేందుకు ఆయన శుక్రవారం హైదరాబాద్‌కు వెళ్లారు. రూ.50 లక్షలు పైబడిన పనులన్నింటికీ చీఫ్ ఇంజినీర్, ఆపైబడిన పనులకు ఇంజి నీర్ ఇన్ చీఫ్ కార్యాలయాల నుంచి టెండర్లు పిలుస్తారు. జనవరి రెండు నాటికి టెండర్లు ఖరారు చేయాల్సి ఉంది.