సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: జిల్లాలో రహదారుల నిర్మాణం, విస్తరణకు మోక్షం కలగనుంది. ఒక వరసతో ఉన్న రహదారులన్నీ రెండు వరసల రోడ్లుగా మారనున్నాయి. జిల్లాలోని అన్ని గ్రామాల నుంచి ఆయా మండల కేంద్రాలను అనుసంధానం చేస్తూ తారురోడ్లు వేయనున్నారు. కొత్త వంతెనలను నిర్మించనున్నారు. శిథిల నిర్మాణాలకు మరమ్మతులు చేయను న్నారు. ఈ మేరకు రహదారు లు, భవనాలశాఖకు ప్రభుత్వం రూ. 1011.50 కోట్లు విడుదల చేసింది.
45 సింగిల్‌లైన్ రోడ్లను డబుల్ రోడ్లుగా మార్చడంతోపాటు గ్రామాలకు మండల అనుసంధానం కోసం 14 ర హదారులు, శిథిల వంతెనలతోపాటు కొత్తగా 35 వంతెనలు నిర్మించేందుకు ఆర్‌అండ్‌బీ అధికారులు గతంలో ప్రతిపాదనలు పంపారు. ఈ మేరకు నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. టెండర్ల ద్వారా పనుల చే పట్టేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
మొదటిసారి భారీగా నిధులు
రోడ్లు, వంతెనల నిర్మాణం, విస్తరణ పనులతో జిల్లాకు మహర్ధశ పట్టనుంది. ఇందుకోసం రహదారుల, భవనాలశాఖకు మొదటిసారిగా ప్రభుత్వం పెద్దమొత్తంలో నిధులు విడుదల చేసింది. ఏక వరసలో ఉన్న 45 రహదారులను రెండు వరసల రోడ్లుగా విస్తరించేందుకు రూ. 618.45 కోట్లు విడుదలయ్యాయి. ఇందులో రూ.85 కోట్ల విలువ చేసే ఐదు రోడ్లు కోర్‌రోడ్ నెట్‌వర్క్ (సీఆర్‌ఎన్) స్కీం కిందకు వస్తాయి. 15 మండలాలతో వివిధ గ్రామాలను అనుసంధానం చేసే 14 రహదారులను నిర్మాణం కో సం రూ.231 కోట్లు కేటాయించారు.
శిథిల మైన, కొత్త వంతెనల నిర్మాణం కోసం మరో రూ.162.05 కోట్లు విడుదల చేశారు. సింగిల్ లేన్ రోడ్ల విస్తరణ కోసం అత్యధికంగా వర్ని- మొండిసడక్ రోడ్డు కోసం రూ.35 కోట్లు, నిజామాబాద్-వర్నికి రూ.30 కోట్లు, జుక్కల్-మద్నూరుకు రూ.19 కోట్లు, రాజంపేట్-గుండారంకు రూ.18 కోట్లు, నందిపేట-చిన్నయానం రోడ్డుకు రూ.17 కోట్లు, మద్దుల-గడ్‌కోల్ రహదారికి రూ.16.80 కోట్లు కేటాయించగా.. అత్యల్పంగా తాళ్లమడుగు-దోంచందాకు రూ. 3.20 కోట్లు, మెండోరా-కొడిచెర్లకు రూ.3 కోట్లు మంజూరు చేశారు. మండల కేంద్రాల అ నుసంధాన రోడ్లు, వంతెనలకు కూడా ప్రాంతాలవారీగా నిధులు మంజూరు చేశారు.
జనవరి 2 నాటికి కాంట్రాక్టర్ల ఖరారు
ఈ భారీ నిధులతో చేపట్టే పనుల కోసం టెండర్ల ప్రక్రియ జరిపేందుకు రహదారులు, భవనాల శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇదివరకు ఆర్‌అండ్‌బీ పర్య వేక్షక ఇంజనీర్‌గా ఉన్న మాధవి సుకన్య ఇటీవలే బదిలీ కాగా, కొత్తగా పి.మధుసూదన్ రెడ్డి విధుల్లో చేరారు. టెండర్ల ప్రక్రియ తదితర విధివిధానాల గురించి చీఫ్ ఇంజనీర్, కమిషనర్‌తో చర్చించేందుకు ఆయన శుక్రవారం హైదరాబాద్‌కు వెళ్లారు. రూ.50 లక్షలు పైబడిన పనులన్నింటికీ చీఫ్ ఇంజినీర్, ఆపైబడిన పనులకు ఇంజి నీర్ ఇన్ చీఫ్ కార్యాలయాల నుంచి టెండర్లు పిలుస్తారు. జనవరి రెండు నాటికి టెండర్లు ఖరారు చేయాల్సి ఉంది.
రహదారులకు నిధుల వరద
Published Sat, Nov 29 2014 2:57 AM | Last Updated on Tue, Mar 19 2019 6:19 PM
Advertisement