Dressing table
-
బాలుడిని బలిగొన్న డ్రెస్సింగ్ టేబుల్
రాంనగర్లో విషాదం హైదరాబాద్: వినాయక చవితి పండుగకి సిద్ధమవుతున్న ఓ ఇంట డ్రెస్సింగ్ టేబుల్ రూపంలో మృత్యువు తరుముకొచ్చింది. డ్రెస్సింగ్ టేబుల్ మీద పడడంతో 9 నెలల బాలుడు మరణించాడు. హైదరాబాద్ రాంనగర్లో ఈ విషాదకర సంఘటన జరిగింది. రాంనగర్‌కు చెందిన ప్రవీణ్, అనూష దంపతులకు ఇద్దరు కుమారులు. అందులో చిన్నవాడైన 9 నెలల బాలుడు అయాన్‌ను హాల్లో పడుకోబెట్టారు. వినాయక చవితి సందర్భంగా ఇంట్లో వస్తువులను సర్దుతున్న క్రమంలో డ్రెస్సింగ్ టేబుల్‌ను హాల్లో పెట్టి మరో రూంలోకి వెళ్లారు. ఈ క్రమంలో డ్రెస్సింగ్ టేబుల్ బ్యాలెన్స్ లేక పక్కనే పడుకుని ఉన్న బాలుని తలపై పడింది. తలకు తీవ్రమైన గాయం కావడంతో రాత్రి పలు ఆసుపత్రులకు తిప్పి చికిత్స చేయించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. -
ఏలూరులో చోరీ
పదిన్నర కాసుల బంగారం, రూ.20,900 నగదు అపహరణ ఏలూరు (వన్ టౌన్) :ఓ ఇంట్లో దొంగలు పడి పదిన్నర కాసుల బంగా రం, రూ.20,900 నగదు అపహరించుకుపోయిన ఘటన ఏలూరు నగరంలోని చింతచెట్టు రోడ్డులో సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. టౌన్ సీఐ ఎన్.రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక చేపల తూము సెంటర్లో ఫొటో స్టూడియో నిర్వహిస్తున్న గురజాపు బాలాజీ రాంప్రసాద్ ఇంట్లో చోరీ జరిగింది. రాంప్రసాద్, అతని కుటుంబ సభ్యులు గాఢ నిద్రలో ఉండగా, దొంగలు బీరువాలోని లాకరు నుంచి బంగారు ఆభరణాలు, డ్రెస్సింగ్ టేబుల్‌పై ఉంచిన పర్సును ఎత్తుకుపోయారు. రాంప్రసాద్ ఆదివారం ఉదయం పనులపై బయటకు వెళ్లేందుకు సిద్ధమవుతూ బీరువా తాళాల కోసం వెతికాడు. కనిపించకపోవడంతో డూప్లికేట్ తాళాలతో బీరువా తెరిచి చూడగా, లాకరులోని బంగారు ఆభరణాలు, నగదు కనిపించలేదు. డ్రెస్సింగ్ టేబుల్‌పై ఉన్న పర్సులో నగదు మాయమైంది. దీంతో రాంప్రసాద్ పోలీ సులకు ఫిర్యాదు చేశారు. బీరువాలో ఉండాల్సిన మూడున్నర కాసుల బంగారు నల్లపూసల గొలుసు, మూడు కాసుల రెండు గాజులు, 15 గ్రాముల బ్రాస్లెట్, వినాయకుడి ఉంగరం, లక్ష్మీదేవి ఉంగరం, ఫ్యాన్సీ ఉంగరాలు రెండు, లాకరులోని కొంత నగదు చోరీకి గురయ్యాయి. మొత్తంగా పదిన్నర కాసుల బంగారం, రూ.20,900 నగదు అపహరణకు గురైనట్టు ఫిర్యాదు అందిందని సీఐ చెప్పారు. కేసు దర్యాప్తులో ఉంది. -
వాస్తు-శుభమస్తు
సాక్షి, హైదరాబాద్: ఉత్తర దిశలో ఉండే పడక గదికి ఉదయం సూర్యకిరణాల వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. ఈ గదిలో తలను తూర్పు లేదా దక్షిణ దిశవైపు పెట్టి పడుకోవాలి. చక్కటి నిద్ర పడుతుంది. * కుటుంబ పెద్ద పడుకునే గది నైరుతి దిక్కులో ఉండాలి. ఒకవేళ ఇల్లు మొదటి, రెండో అంతస్తులో ఉంటే కుటుంబ పెద్దకు పడక గది పై అంతస్తులో ఉండడం మేలు. అది కూడా నైరుతీ దిశలోనే ఉండాలి. పెళ్లికాని పిల్లలకు మాత్రం పడక గది నైరుతి దిశలో ఉండకపోవడమే మంచిది. * పిల్లలకు పడక గది పశ్చిమ దిశలో ఉంటే మేలు. పెళ్లి కాని పిల్లలకు, ఇంటికి వచ్చే అతిథుల కోసం తూర్పు దిశగా ఉండే పడక గది అనువుగా ఉంటుంది. కొత్తగా పెళ్లయిన జంట మాత్రం ఈ దిశలోని పడక గదిని ఉపయోగించకపోవడం మంచిది. * ఈశాన్యం దేవతలకు స్థానం కాబట్టి.. ఏ పడక గది కూడా ఈ దిశలో ఉండకూడదు. * పడక గది ఇంటికి ఆగ్నేయ దిశలో ఉంటే.. అకార ణంగా దంపతుల మధ్య కీచులాటలు పెరుగుతాయి. అనవసర ఖర్చులూ అధికమవుతాయి. * నైరుతీ దిశలోనే గదిలో నైరుతీ మూలలో బరువైన వస్తువులు పెట్టాలి. మంచం విషయానికొస్తే పడక గదిలో మంచం దక్షిణం, పశ్చిమం లేదంటే నైరుతి దిశల్లో ఉండొచ్చు. * తూర్పు వైపు కాళ్లు పెట్టుకొని పడుకుంటే పేరు ప్రఖ్యాతలు రావడంతో పాటు ఐశ్యర్య వృద్ధికి అవకాశాలుంటాయి. అదే పశ్చిమం వైపు అయితే ప్రశాంతతో పాటు ఆధ్యాత్మిక భావన పెరుగుతుంది. ఉత్తర దిశలో అయితే సంపద వృద్ధికి అవకాశాలుంటాయి. ఒకవేళ దక్షిణ దిశవైపు కాళ్లు పెడితే మాత్రం చక్కటి నిద్రకు దూరమవుతారు. * పడక గదిలో డ్రెస్సింగ్ టేబుల్ ఉత్తర దిశకు తూర్పు వైపు ఉండాలి. చదువుకోవటం, రాసుకోవటం వంటివి పడక గదిలో పశ్చిమ దిశలో చేయాలి. తూర్పు వైపు కూడా ఇలాంటి పనులు చేసుకోవచ్చు. -
జ్ఞానోదయాల్లో గ్యాపులు!
ఉత్త(మ)పురుష లక్ష పూల నుంచి కొద్దికొద్దిగా మకరందాన్ని పోగేసి, తేనె పట్టు వేసినట్లుగా మావారి సంపాదనలో పైసా పైసా కూడబెట్టి రెండేళ్ల క్రితం ఎట్టకేలకు ఓ సోఫా సెట్టు, ఓ డ్రెస్సింగ్ టేబుల్ తీసుకున్నాన్నేను. అవి తీసుకున్నప్పట్నుంచీ నా మీద ఆయన సెటైర్లు మొదలు. శ్రీవారికి ఫోన్ చేసిన స్నేహితులకూ, తానే స్వయంగా ఫోన్ చేసి మిత్రులకూ నా షాపింగ్ గొప్పదనాన్ని కామెడీగా వివరించడం మొదలుపెట్టారు. ఇలా అడిగిన వారికీ, అడగని వారికీ మినహాయించి మిగతావారెవ్వరికీ తానేమీ చెప్పడం లేదంటూ చమత్కారమొకటి. అవును... ఇంటికి అవసరమైన ఈ వస్తువులు తీసుకున్నాన్నేను. వృత్తిపరంగా ఎంతోమంది మా ఇంటికి వచ్చి, ముందుగదిలోనే అఫీషియల్ కాన్ఫరెన్సుల్లాంటివాటిని అనఫీషియల్‌గా నిర్వహిస్తుంటారు మావారు. ఇది ఆయన ఆఫీసులో చేసే పనికి అదనం. ఎంతోమంది పెద్దలూ, పిన్నలూ, మాన్యులూ, అసామాన్యులూ వస్తుంటారు గాబట్టి సోఫా ఒకటి ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం. ఇక డ్రెస్సింగ్ టేబుల్ అంటారా... అదేదో నేను మేకప్ చేసుకోడానికి కాకుండా, మీలో వస్తున్న మార్పులను నిత్యం పరికించడానికి ఉపయోగపడుతుందని నా అభిప్రాయం. కానీ మావారికెంతసేపటికీ... రెండేళ్ల నుంచి సంపాదించిన మొత్తాన్ని రెండు గంటల షాపింగ్‌లో ఖర్చు చేసినట్లుగా గత రెండునెలలుగా నా మీద జోకులేస్తున్నారు. ఆఫీసునుంచి పెద్దలు రాగానే సోఫాల్లో ఆసీనులను చేయించారు మావారు. కాఫీ ఏదైనా తెమ్మంటూ నాకు పురమాయింపు. మొత్తానికి ఆ రోజు మీటింగులో సోఫాలు కూడా చట్టంలాగే తమ పనిని తాము నిశ్శబ్దంగా చేసుకుపోయినట్టు అనిపించింది మా శ్రీవారికి. ఎందుకంటే... అంతకు ముందు మా ఇంట్లో ఒకదానిలో మరొకటి దూరిపోయేలా ఉంచేసే నాలుగు ప్లాస్టిక్ కుర్చీలు ఉండేవి. ఎవరైనా అతిథులు రాగానే ఆయన హడావుడిగా ఆ బండిల్ సెట్టును లోపల్నుంచి తెచ్చి గబగబా కుర్చీలోంచి కుర్చీని లాగేసి పేర్చేవారు. ఇలాంటి ఒక శుభముహూర్తానే... మీటింగ్ తర్వాత ఓ కుర్చీలోకి మరో కుర్చీని దూర్చేప్పుడు ఒకదాని కాలు మరోదాని సీటుమీద బలంగా పడి ఓ రంధ్రం కూడా పడింది. ఆ కుర్చీలో తాను కూర్చుని సదరు రంధ్రాన్వేషణ ఎవ్వరికీ సాధ్యం కాని విధంగా తనను తాను సర్దుకుంటూ కూర్చుంటుండేవారు మా వారు. కానీ ఈ సోఫాల పుణ్యమా అని ఆయనకు ఆ బాధ తప్పిపోయింది. మధ్యతరగతి మాడెస్టీల ప్రకారం ఆ మాత్రం సోఫాలకు మనమూ డిజర్వింగే సుమా అనే ఒకలాంటి భావన నెలకొంది మా శ్రీవారిలో. ఇక డ్రెస్సింగ్ టేబుల్ వచ్చాక అందులో నన్ను నేను చూసుకుంటూ మేకప్పు అయ్యిందెంతో తెలియదు గానీ... మా ఆయనే వెనక్కు తిరిగినప్పుడు టక్కూ... ముందుకు తిరిగినప్పుడు స్టమక్కూ చూసుకోవడం సరిపోయింది. ఇవన్నీ నేను గమనిస్తునే ఉన్నా... ఆయన నాపై వేసే జోకులనూ చూసీచూడనట్లుగానే పోతున్నా. ఎందుకంటే నాకు తెలుసు... నేను చేసింది వేస్ట్ కాదని. రెండేళ్ల తర్వాత ఆయనే అన్నారు. స్నేహితుడితో ఫర్నిచర్ షాపుకు వెళ్లారట. ఆ రాత్రి నాతో అన్నారు. ‘‘నువ్వు సోఫా, డ్రెస్సింగ్ టేబులూ రెండేళ్ల క్రితం మనం కొనడం మంచిదైంది. అప్పటి ఇరవై వేలు... ఇప్పటి ముప్ఫై అయిదు వేలు. కాబట్టి ఇవ్వాళ్టి లెక్క ప్రకారం చూసినా మనకు పదిహేను వేలు ఆదా’’ అంటూ రెండేళ్ల క్రితం నేను చేసిన ‘దుబారా’లో... ‘మనం’ అంటూ తానూ వాటా కలిశారు. ఇక్కడ నేను మాట చెప్పదలిచాను. దేన్నో వెతుక్కుంటూ వెళ్లి తపస్సు చేసిన సిద్ధార్థుడికి జ్ఞానోదయమై, బుద్ధి కలిగి బుద్ధుడు కావడానికి ఎన్నేళ్లు పట్టిందో తెలియదుగానీ... ఆయన అడవులకు వెళ్లిపోయిన రోజే మొగుడి మీద ఆధారపడకూడదని గౌతముడి భార్య యశోధరకు ఆ క్షణంలోనే జ్ఞానోదయమై ఉంటుంది. అలాగే రెండేళ్ల క్రితమే నాక్కూడా. కాకపోతే మగాళ్లకు జ్ఞానోదయమై సత్యం తెలిసి రావడానికి మాత్రం చాలా టైం గ్యాప్ అవసరమవుతుంది. అదీ తేడా! - వై!