Drilling mission
-
ప్రాణం తీసిన పిండిమిల్లు
సాక్షి, (ఖమ్మం)బూర్గంపాడు: లక్ష్మీపురం గ్రామానికి చెందిన మారం చౌడమ్మ(65) గురువారం తన ఇంట్లోని పిండిమిల్లును నడుపుతున్న క్రమంలో ప్రమాదవశాత్తూ చీర మరలో చిక్కుకుంది. ఈ క్రమంలో ఆమె చీరతో పాటుగా పిండిమరలోకి జారిపడడంతో తీవ్రగాయాలయ్యాయి. వెంటనే కుటుంబసభ్యులు ఆమెను భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్థారించారు. చౌడమ్మ, రామిరెడ్డి దంపతులు గత కొన్నేళ్లుగా లక్ష్మీపురంలో పిండిమిల్లు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. జీవనాధారమైన పిండిమిల్లే చౌడమ్మ ప్రాణం తీయడాన్ని కుటుంబసభ్యులు జీర్ణించుకోలేక పోతున్నారు. మృతురాలికి ఇద్దరు కుమారులున్నారు. ఎస్ఐ జితేందర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డ్రిల్లింగ్ పనిచేస్తుండగా విద్యుదాఘాతం అన్నపురెడ్డిపల్లి: రాజాపురం గ్రామానికి చెందిన చింతల రాజు(32)గురువారం ఎర్రగుంటలోని ఓ పాత భవనం పిల్లర్లను తొలగించే పనికి వెళ్లాడు. డ్రిల్లింగ్ మిషన్తో ఇనుప చువ్వలను తొలగించే క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురయ్యాడు. తోటి కార్మికులు వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించగా..అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొడుకు మృతదేహం వద్ద తల్లి సోమమ్మ కన్నీరుమున్నీరుగా విపలించింది. ఎస్సై తిరుపతి కేస -
గుప్తనిధుల కలకలం.. పురాతన రాతి శిల్పానికి డ్రిల్లింగ్..
సాక్షి, అమ్రాబాద్ (మహబూబ్నగర్): మండలంలోని రాయలగండిలో వెలసిన లక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయంలో గుప్తనిధుల తవ్వకాల కలకలం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆలయం వెనక భాగంలో ప్రహరీ లోపల పురాతన రాతి శిల్పానికి డ్రిల్లింగ్ మిషిన్తో తవ్వినట్లు గుర్తించారు. ఆదివారం ఆలయ పూజారి మోహన్ గమనించి ఆలయ కమిటీ సభ్యులకు చెప్పగా వారి ఫిర్యాదు మేరకు ఎస్ఐ సురేష్ అక్కడికి చేరుకుని పరిశీలించారు. రెండు రోజుల క్రితమే గుర్తుతెలియని వ్యక్తులు ఈ తవ్వకాలు జరిపినట్లు తేల్చారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చెప్పారు. అయితే గతేడాది కూడా ఈ ఆలయం వద్ద తవ్వకాల కోసం వచ్చి ప్రజలను చూసి కారులో పారిపోతున్న కొంతమందిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. పురాతన ఆలయం కావడంతో గుప్తనిధులు ఉంటాయనే ఆలోచనతో తవ్వకాలకు పాల్పడుతున్నారని, ఆలయానికి రక్షణ కల్పించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. -
ఎరక్కపోయి.. ఇరుక్కుపోయాడు
♦ ఆడుకుంటూ ఇరుకైన గోడల మధ్య చిక్కుకున్న బాలుడు ♦ వైఎస్సార్ జిల్లాలో నాలుగు గంటలు ఉత్కంఠ ♦ ఎట్టకేలకు రక్షించిన అగ్నిమాపక సిబ్బంది లక్కిరెడ్డిపల్లె: దసరా సెలవుల్లో దాగుడుమూతలాట ఓ పిల్లాడి ప్రాణాలు మీదికి తెచ్చింది. రెండు ఇళ్ల ఇరుకైన గోడల మధ్య నాలుగు గంటల పాటు ఇరుక్కుపోయిన ఆ బాలుడిని చివరకు అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. వైఎస్సార్ జిల్లా లక్కిరెడ్డిపల్లె మండలం చింతకుంటవాండ్లపల్లెలో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. గాలివీడు మండలం పూలుకుంట గ్రామానికి చెందిన ఫరూక్(6) దసరా సెలవులు కావడంతో రెండురోజుల క్రితం అమ్మమ్మగారి ఊరైన చింతకుంటవాండ్లపల్లెకు వచ్చాడు. గురువారం పిల్లలంతా కలసి దాగుడుమూతలాట ప్రారంభించారు. ఎవరికీ కనబడకుండా దాక్కోవాలని భావించిన ఫరూక్ సమీపంలోని రెండు ఇళ్ల గోడల మధ్య ఉన్న 20 అడుగుల పొడవైన ఇరుకైన సందులోకి వెళ్ళి ఇరుక్కుపోయాడు. దాదాపు 10 అడుగుల మేర లోపలికి వెళ్లిన అతను బయటకు వచ్చేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో ఏడుపు లంకించుకున్నాడు. బాలుడి ఏడుపు విన్న ఆ ఇళ్లలోని వారు అతని కుటుంబసభ్యులకు విషయం తెలియజేశారు. వారు స్థానికుల సహకారంతో పోలీసులతో పాటు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం చేరవేశారు. అగ్నిమాపక అధికారి గాబ్రియేల్ సిబ్బందితో పూలుకుంట చేరుకుని డ్రిల్లింగ్ మిషన్ సాయంతో ఓ ఇంటి గోడను తొలగిస్తూ వెళ్లి బాలుడ్ని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా గ్రామంలో 4 గంటలపాటు తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అగ్నిమాపక సిబ్బందిని గ్రామస్తులందరూ అభినందించారు.