drinage canal
-
వందేళ్ల జలాశయాలకు మురుగు ముప్పు
సాక్షి, సిటీబ్యూరో: చారిత్రక జంట జలాశయాలకు మురుగు నీరు శాపంగా మారింది. వందేళ్ల చరిత్ర కలిగిన ఈ తాగునీటి తటాకాలను సమీప గ్రామాలు, ఇంజినీరింగ్ కళాశాలల నుంచి వచ్చి కలుస్తోన్న మురుగు జలాలు కాలుష్య కాసారాలుగా మార్చేస్తున్నాయి. నిత్యం సుమారు 1.50 కోట్ల లీటర్ల వ్యర్థజలాలు జలాశయాల్లో కలుస్తున్న నేపథ్యంలో ఆయా కళాశాలలు, గ్రామపంచాయతీల పరిధిలో మురుగుశుద్ధి కేంద్రాలు నిర్మించుకోవాలని జలమండలి, పీసీబీలు ఆయా కళాశాలలకు గతంలో నోటీసులు జారీచేశాయి. ఇదే అంశంపై హైకోర్టు కూడా కళాశాలల యాజమాన్యాలు ఎస్టీపీలను నిర్మించుకోవడం ద్వారా జలాశయాలను కాలుష్యకాసారం కాకుండా చూడాలని ఆదేశాలిచ్చింది. కానీ ఏళ్లుగా ఈ విషయంలో యాజమాన్యాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడం జలాశయాల పాలిట శాపంగా మారింది. కాగా ఈ జలాశయాలకు సమీపంలోని 11 గ్రామాల పరిధిలో ఎస్టీపీల నిర్మాణానికి పంచాయతీరాజ్ విభాగం రూ.27.50 కోట్లు, పీసీబీ నిధులు రూ.13 కోట్ల విడుదల చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. జి.ఓ.111కు అడుగడుగునా తూట్లు జలాశయాలను పరిరక్షించే ఉద్దేశంతో గతంలో ప్రభుత్వం జారీచేసిన జి.ఓ.111కు అడుగడుగునా అక్రమార్కులు తూట్లు పొడుస్తున్నారు. ప్రధానంగా ఈ జి.ఓ. వర్తించే గండిపేట్, శంషాబాద్, మొయినాబాద్, రాజేంద్రనగర్, శంకర్పల్లి మండలాల పరిధిలోని 84 గ్రామాల పరిధిలో పలు అక్రమాలను గతంలో రెవెన్యూ, జలమండలి, పీసీబీ విభాగాలు గుర్తించాయి. ఎగువ ప్రాంతాల్లో సుమారు 340 ఎకరాలు కబ్జాకు గురయినట్లు రెవెన్యూ విభాగం లెక్కతేల్చింది. ఇక జలాశయాల్లోకి వరదనీటి చేరికను నిరోధించేలా ఇసుక క్వారీలు తవ్వేయడం, ఇటుకబట్టీల కోసం భారీగా కందకాలు తవ్వడం, రియల్ వెంచర్లు, బహుళ అంతస్థుల భవంతులు, ఇంజినీరింగ్ కళాశాలలు, ఫాంహౌజ్‌లు నిర్మించడంతోపాటు వాటి చుట్టూ కోటలవలె అత్యంత ఎత్తున కిలోమీటర్ల విస్తీర్ణంలో ప్రహారీలు నిర్మించడంతో జలాశయాల్లో వరదనీరు చేరే జాడలేక అవి రోజురోజుకూ చిన్నబోతున్నాయి. మురుగుతో కాలుష్యం ముప్పు.. సుమారు పదివేల ఎకరాల సువిశాల విస్తీర్ణంలో నెలకొన్న జంట జలాశయాలకు సమీపంలో 11 గ్రామాలున్నాయి. ఈ గ్రామాల్లోని గృహ, వాణిజ్య, పారిశ్రామిక సముదాయాల నుంచి వెలువడుతోన్న మురుగునీరు యధేచ్ఛగా ఈ జలాశయాల్లోకి చేరుతోంది. ఈ నేపథ్యంలో 11 గ్రామాల పరిధిలో మురుగు శుద్ధి కేంద్రాలు (ఎస్టీపీ)లను నిర్మించాలని గతంలో ప్రభుత్వం సంకల్పించింది. సుమారు రూ.40.50 కోట్ల అంచనా వ్యయంతో వీటిని నిర్మించాలని నిర్ణయించింది. ఇందులో రూ.27.50 కోట్లు పంచాయతీరాజ్ శాఖ, మరో 13 కోట్లు కాలుష్య నియంత్రణ మండలి నిధులు కేటాయించాలని ఆదేశించింది. కానీ ఐదేళ్లుగా ఆయా విభాగాలు పైసా నిధులు విదిల్చకపోవడంతో సమీప గ్రామాల మురుగు నీరు ఎలాంటి శుద్ధి ప్రక్రియ లేకుండానే జలాశయాల్లో కలుస్తుండడంతో స్వచ్ఛమైన తాగునీటితో కళకళలాడే జలాశయాలు ఆర్గానిక్ కాలుష్యం కాటుకు బలవుతున్నాయి. ఘనచరిత్ర ఇదీ... అది...1908 సంవత్సరం..సెప్టెంబరు 28 మూసీనది నగరంపై కన్నెర్ర జేసింది. ఎగువన కురిసిన కుండపోత వర్షానికి నదిలో వరద ప్రవాహం పోటెత్తింది. ప్రశాంతమైన నది ఒక్కసారిగా మహోగ్రరూపం దాల్చింది. జలవిలయంతో చారిత్రక భాగ్యనగరం అల్లాడింది. సగానికి పైగా నగరం వరద ఉద్ధృతికి కొట్టుకుపోయింది. వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. ఈ దుస్థితి చూసి నాటి నిజాం ప్రభువు ఉస్మాన్ అలీఖాన్ కలత చెందారు. మూసీ వర దలకు ఎలా అడ్డుకట్ట వేయాలన్న అంశంపై నిపుణులతో సుదీర్ఘకాలం సమాలోచనలు జరిపారు. అప్పటికే మైసూరు,బొంబాయి సంస్థానాల్లో అద్భుతమైన ఇంజినీరింగ్ నైపుణ్యంతో తనదైన ముద్ర వేసిన సుప్రసిద్ధ ఇంజినీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఈ పరిస్థితికి చక్కని పరిష్కారం చూపుతారని భావించారు. తన ఆలోచనను ఆయన ముందుంచారు. విశ్వేశ్వరయ్య ప్రభువు కోరికను మన్నించారు. 1910, 1912 ప్రాంతంలో మూసీ ఎగువ ప్రాంతంలో విస్తృతంగా పర్యటించారు. సుమారు 46 కిలోమీటర్ల మేర విస్తీర్ణంలో రెయిన్‌గేజ్ యంత్రాలను ఏర్పాటుచేసి వర్షపాతాన్ని శాస్త్రీయంగా అంచనా వేశారు. భారీ వర్షాలు కురిసినపుడు 4,25,000 క్యూసెక్కుల వరద ప్రవాహం మూసీలో చేరుతుందని లెక్కగట్టారు. ఉస్మాన్‌సాగర్(గండిపేట్), దానిపక్కనే హిమాయత్‌సాగర్ జలాశయాలను ఏర్పాటుచేయాలని నిజాం రాజుకు సూచించారు. ఆయన చొరవ, దార్శనికత కారణంగానే 1920లో గండిపేట్(మూసీ),1927లో హిమాయత్‌సాగర్(ఈసీ)జంట జలాశయాల నిర్మాణం జరిగింది. ఓ స్వప్నం సాకారమైంది. ఈ జలాశయాల్లో నిల్వచేసిన మంచి నీటిని హైదరాబాద్ నగర దాహార్తిని తీర్చేందుకు గ్రావిటీ ద్వారా తరలించేందుకు వీలుగా డిìజైన్, డ్రాయింగ్ సిద్ధంచేశారు. నీటిని శుద్ధిచేసేందుకు వీలుగా మీరాలం ఫిల్టర్‌బెడ్‌కు è చక్కటి డిజైన్ సిద్ధంచేశారు. జంట జలాశయాలకు ఫ్లడ్గేట్లను ఏర్పాటు చేశారు. రాజధాని నగరానికి వరద తాకిడి నుంచి శాశ్వతంగా విముక్తి కల్పించారు. తక్కువ ఖర్చుతోనే ఈ బృహత్తర కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం ఆయన ఇంజినీరింగ్ ప్రతిభకు తార్కాణం. నాడు ఐదు లక్షల మంది నగర జనాభాకు మంచినీరు అందించేందుకు ఏర్పాటుచేసిన జంట జలాశయాలు నేటికీ రాజధాని దాహార్తి తీరుస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం రోజువారీగా 20 మిలియన్ గ్యాలన్ల మంచినీటిని ఈజలాశయాల నుంచి సేకరిస్తుండడం విశేషం. జంట జలాశయాలనుపరిరక్షించాలి జంట జలాశయాలను కాలుష్యం బారి నుంచి రక్షించాలి. వీటి వద్ద టూరిజం, రిక్రియేషన్ సదుపాయాలను కల్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దీంతో మానవ కార్యకలాపాలు పెరిగి ఈ జలాశయాలు హుస్సేన్‌సాగర్‌లా కుంచించుకుపోయి గరళ సాగరంగా మారడం తథ్యం. ఈ జలాశయాల పరిరక్షణకు హైకోర్టు సూచనల మేరకు నిపుణులతో లేక్ ప్రొటెక్షన్ అథారిటీని ఏర్పాటు చేయాలి. సమీపంలో ఉన్న 42 ఇంజినీరింగ్ కళాశాలలు తక్షణం మురుగునీటి శుద్ధి కోసం ఎస్టీపీలు నిర్మించుకోవాలి. జలాశయాల ఎగువన అక్రమంగా వెలిసిన ఫాంహౌజ్‌లు, ఇంజినీరింగ్ కళాశాలలు, రియల్ వెంచర్లను తక్షణం తొలగించాలి. కబ్జాల చెర నుంచి కాపాడాలి. ఈ జలాశయాలు పూర్వపు స్థాయిలో జలకళను సంతరించుకుంటే నగరానికి రోజువారీగా 40 మిలియన్ గ్యాలన్ల తాగునీటిని పొందే అవకాశం ఉంటుంది. – సజ్జల జీవానందరెడ్డి, పర్యావరణ వేత్త ఎస్టీపీలు నిర్మించాల్సిన గ్రామాలు..వాటి సామర్థ్యం ఇదీ ఉస్మాన్‌సాగర్(గండిపేట్ జలాశయం పరిధిలో) ఖానాపూర్– 0.6 మిలియన్ లీటర్లు వట్టినాగులపల్లి–0.8 జన్వాడ– 0.6 అప్పోజిగూడా– 0.1 చిలుకూరు– 0.7 బాలాజీ దేవాలయం– 0.1 హిమాయత్‌నగర్– 0.3 హిమాయత్‌సాగర్ పరిధిలో... హిమాయత్‌సాగర్–0.25 మిలియన్ లీటర్లు అజీజ్‌నగర్–0.9 మిలియన్ లీటర్లు ఫిరంగినాలా–2.9 మిలియన్ లీటర్లు కొత్వాల్‌గూడా– 0.3 మిలియన్ లీటర్లు -
అప్పుడే పుట్టిన పసిబిడ్డను కాలువలో..
అమ్మా..నేనంటే నీకెంతో ఇష్టమని తెలుసు..నన్ను తొమ్మిది నెలలు అపురూపంగా చూసుకున్నావు..నా ఆరోగ్యాన్ని భద్రంగా కాపాడావు..నేను కసిగా కడుపులో తంతున్నా సంతోషించావు..అమ్మా..నీకే కష్టమొచ్చిందో తెలియదు..నా ఒంటిపై నీ రక్తపు మరకలు ఆరకముందేబంధాన్ని తెంపేసుకున్నావు..పుట్టిన వెంటనే నీ వెచ్చని పొత్తిళ్లలో సేదదీరాల్సిననేను మురుగు కాల్వ పాలయ్యాను..అమ్మా..నీ ప్రేమే నన్ను కాపాడింది..నేను క్షేమంగా ఉన్నాను..కర్నూలు పెద్దాస్పత్రిలో చికిత్స పొందుతున్నాను..అమ్మా..నిన్ను ఒక్కసారి చూడాలని ఉంది!!..ఆదోని పట్టణం కంచిగారి వీధిలో గురువారంమురుగు కాలువలో దొరికిన పసిపాప మూగ వేదన ఇదీ.. కర్నూలు, ఆదోని: ఆడ బిడ్డనో..మరేదో కారణమో..అప్పుడే పుట్టిన పసిబిడ్డను మురుగు కాలువలో పడేశారు. కాలువలో నీరు లేక పోవడంతో చెత్తలో గుక్క పట్టి ఏడుస్తున్న పసిగుడ్డును గుర్తించిన మున్సిపల్ వర్కర్లు కొందరు వెంటనే సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. దీంతో ఆ శిశువు ప్రాణాలతో బయట పడింది. గురువారం ఆదోని పట్టణం నడిబొడ్డున కంచిగారి వీధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఉదయం 5.30 గంటల సమయంలో మున్సిపల్ వర్కర్లు లక్ష్మిదేవి, ఈరమ్మ, తిరుమల, రంజనీకాంత్, మారెప్ప, ఈరప్ప మరికొందరు మురుగు కాలువలు శుభ్రం చేసేందుకు కంచిగారి వీధిగుండా వెళ్లుతున్నారు. ఎక్కడి నుంచో చిన్నగా పసిగుడ్డు ఏడ్పు విని పించడంతో మురుగు కాలువలో తొంగి చూశారు. చెత్తపై పరిచిన ఓ ప్లాస్టిక్ సంచిపై రక్తం తడారని ఓ పసిగుడ్డు కనిపించింది. బలహీనంగా ఉండడంతో ఏడ్పు చిన్నిగా వస్తోంది. ఇంకా బొడ్డు కూడ కోయలేదు. లక్ష్మీదేవి వెంటనే ఆ పసిగుడ్డును ఎత్తుకుంది. మిగిలిన వారితో చర్చించి సమీపంలో ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లారు. వైద్యులు వెంకటస్వామి, ఉషాశ్రీ పసిగుడ్డును ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. బిడ్డ బలహీనంగాను, తక్కువ బరువు ఉందని, కోలుకోడానికి కొంత సమయం పుడతోందని వైద్యురాలు ఉషశ్రీ అన్నారు. స్వాధీనం చేసుకున్న ఐసీడీఎస్ అధికారులు సమాచారాన్ని త్రీ టౌన్ ఎస్ఐ రాజా కుళ్లాయప్ప, ఐసీడీఎస్ ప్రాజెక్ట్ ఆఫీసర్ సఫరున్నీషాబేగంకు అందించారు. ఇరువురు ఆసుపత్రికి వచ్చి శిశువును పరిశీలించి.. ఆరగ్య పరిస్థితులపై ఆరా తీశారు. ఐసీడీఎస్ అధికారిణి సఫరున్నిసా బేగం..శిశువును స్వాధీనం చేసుకొని కర్నూలు పెద్దాస్పత్రికి తీసుకెళ్లారు. ఆమెతో పాటు సూపర్వైజర్ అంజినమ్మ, అంగన్ వాడీ టీచర్లు ఉన్నారు. పసిగుడ్డును మురుగు కాలువపాలు చేసిందెవరో విచారించి తగు చర్యలు తీసుకుంటామని ఎస్ఐ రాజాకుళ్లాయప్ప తెలిపారు. -
కాలువలో కలిసిన మానవత్వం
శ్రీకాకుళం రూరల్:మానవత్వం మంటకలిసింది. ముక్కుపచ్చలారని, రోజుల పసికందును డ్రైనేజీలో పడేసి ఓ తల్లి చేతులు దులుపుకొంది. ఈ సంఘటన చూసిన వారంతా అయ్యో...రామా అంటున్నారు. వివరాల్లోకి వెళ్తే... శ్రీకాకుళం నగరం పరిధిలోని చినబరాటం వీధిలో ఓ షాపును ఆనుకొని ఉన్న డ్రైనేజీలో రోజులు కావస్తున్న ఓ ఆడ శిశువు మృతదేహం సోమవారం ఉదయం లభ్యమయింది. కాలువలోని మురుగునీటిలో మునుగుతూ తేలుతూ ఇటువైపు కొట్టుకుంటూ వచ్చింది. ముందుగా చేతివేళ్లు బయటకు రావడంతో అక్కడ ఉన్నవారంతా దాన్ని గమనించి కాలువ నుంచి పసికందును బయటకు తీశారు. అయితే ఓ వస్త్రాల షాపు సంచిలో ఈ ఆడ శిశువు మృతదేహాన్ని మూటకట్టి పడేసినట్టుగా స్థానికులు గుర్తించారు. తీసి చూడగానే ఇంకా పూర్తిస్థాయిలో బొడ్డు కూడా కోయలేదని ఆవేదన చెందారు. ఎవరో గుర్తుతెలియని వారు రాత్రి వేళల్లో ఇలాంటి దారుణానికి పూనుకొని ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తేజోవంతమైన ముఖ కవలికలు పసికందును చూడగానే తేజోవంతమైన ముఖకవలికలు, బొద్దుగా చూడ్డానికి హత్తుకుపోయే విధంగా ఉంది. శిశువుపై ధరించిన నీలిరంగు గౌను, అదే రంగు గడులు తువ్వాల్లో చుట్టేసి పడేశారు. పసికందును చూసిన వారంతా అయ్యో... రామా అంటూ శిశువును కన్న తల్లిదండ్రులకు శాపనార్థాలు పెట్టారు. వివాహేతర సంబంధాలు, బరితెగించిన వారే ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడి ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం ఆనోట ఈనోట పాకడంతో ఆ శిశువును చూడడానికి జనాలు మరింతగా ఎగబడ్డారు. ఒన్‌టౌన్ పోలీసులకు సమాచారం అందడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహం స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. చుట్టు పక్కలా ఆసుపత్రులు ఏమైనా ఉన్నాయా, ఇటీవల కాలంలో ఎవరైనా ప్రసవం చేశారా అన్న కోణంలో ఒన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మురుగు శుద్ధికి మోడ్రన్ ట్రీట్మెంట్
సాక్షి,సిటీబ్యూరో : చారిత్రక మూసీనదిని గరళ సాగరంగా మారుస్తోన్న ప్రధాన నాలాలను ఒక్కొక్కటిగా ప్రక్షాళన చేసేందుకు ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా నగరం నలుమూలలా మురుగు శుద్ధి కేంద్రాల నిర్మాణం తలపెట్టింది. ముందుగా మూసీకి ప్రధాన ప్రతిబంధకంగా ఉన్న కూకట్పల్లి నాలాపై 400 మిలియన్ లీటర్ల వ్యర్థజలాలను శుద్ధి చేసేందుకు బ్యాంకాక్ (థాయ్‌లాండ్ దేశం) తరహాలో పది అంతస్తుల మురుగుశుద్ధి కేంద్రం నిర్మించాలని అదికారులు భావిస్తున్నారు. ముందుగా ఆ దేశంలో ప్రస్తుతం పనిచేస్తున్న మురుగు శుద్ధికేంద్రం పనితీరును అధ్యయనం చేసేందుకు త్వరలో జలమండలి నిపుణులు, అధికారుల బృందం బ్యాంకాక్‌లో పర్యటించనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ప్రధానంగా కూకట్పల్లి నాలాలో బల్క్‌డ్రగ్, ఫార్మా, ఇంటర్మీడియట్ పరిశ్రమల నుంచి వస్తున్న రసాయనిక వ్యర్థాలతో పాటు సమీప గృహ, వాణిజ్య సముదాయాల నుంచి మురుగునీరు చేరుతోంది. ఈ వ్యర్థజలాలు క్రమంగా మూసీలో పేరుకుపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇంత పెద్ద నాలాను శుద్ధి చేసేందుకు సాధారణ ఎస్టీపీ సరిపోదు. రసాయనిక వ్యర్థాలు, ఘన, ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించే ఎఫ్లుయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ తప్పనిసరి. అయితే ఈ రెండింటిని సమ్మిళితం చేసి బ్యాంకాక్ నగరంలోని ఎస్టీపీలో అవలంభించిన మూవింగ్ బెడ్ బయో రియాక్టర్ (ఎంబీబీఆర్) సాంకేతిక విధానాలను ఇక్కడ అమలుచేయాలని మున్సిపల్ మంత్రి కేటీఆర్ ఇటీవల జలమండలి అధికారులను ఆదేశించారు. మురుగుశుద్ధితో మూసీకి మహర్దశ గ్రేటర్ వ్యాప్తంగా వివిధ రకాలుగా నిత్యం 1400 మిలియన్ లీటర్ల వ్యర్థజలాలు ఉత్పన్నమవుతున్నాయి. వీటిలో 700 మిలియన్ లీటర్ల మురుగును జలమండలి అంబర్పేట్, అత్తాపూర్, నాగోల్, నల్లచెరువు ఎస్టీపీల్లో శుద్ధి చేస్తోంది. మిగతా 700 మిలియన్ లీటర్ల వ్యర్థ జలాలు నేరుగా మూసీలో కలుస్తున్నాయి. దీంతో మూసీ నది గరళ సాగరంగా మారుతోంది. ఈ నేపథ్యంలో తొలుత మూసీనదిలో కలిసే ప్రధాన నాలాలపై సుమారు 15 మురుగుశుద్ధి కేంద్రాలను నిర్మించి, ఎక్కడికక్కడ వ్యర్థ జలాలను శుద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కృషిలో కూకట్పల్లి నాలాపై ఎస్టీపీ నిర్మాణాన్ని తొలివిడతగా చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరోవైపు 100 నివాసాలు దాటిన అపార్ట్మెంట్లలో విధిగా ఎస్టీపీ ఉండేలా మున్సిపల్ చట్టాల్లో మార్పులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. శుద్ధి చేసిన నీతిని గార్డెనింగ్, ఫ్లోర్ క్లీనింగ్, కార్ వాషింగ్, టాయిలెట్ ఫ్లష్ వంటి అవసరాలకు శుద్ధిచేసిన జలాలను వినియోగించే అవకాశం ఉంది. దీంతో భూగర్భ జలాలు, జలమండలి సరఫరా చేస్తున్న మంచినీటిపై అంతగా ఒత్తిడి ఉండదని ప్రభుత్వం భావిస్తోంది ఈ నేపథ్యంలో మురుగు శుద్ధి కేంద్రాలను నిర్మించే అంశం ప్రాధాన్యత సంతరించుకుంది. రూ.3100 కోట్లతో మాస్టర్ ప్లాన్ గ్రేటర్లో విలీనమైన 11 శివారు మున్సిపల్ సర్కిళ్ల పరిధిలో మురుగు కష్టాలను తీర్చేందుకు సుమారు రూ.3100 కోట్ల వ్యయంతో సీవరేజీ మాస్టర్‌ప్లాన్ అమలుపైనా ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందుకోసం సమగ్ర ప్రాజెక్టు నివేదిక రూపొందించే బాధ్యతను ఇటీవల షా కన్సల్టెంట్స్ సంస్థకు అప్పగించింది. ఓఆర్ఆర్ లోపల ఉన్న గృహ, వాణిజ్య, పారిశ్రామిక సముదాయాల నుంచి రోజువారీగా వెలువడుతున్న మురుగు జలాలు, ఎస్టీపీలు నిర్మించాల్సిన ప్రాంతాలపై అధ్యయనం చేసి ఈ సంస్థ సమగ్ర నివేదికను ఆరునెలల్లో ప్రభుత్వానికి సమర్పించనుంది. తరవాత సీవరేజీ మాస్టర్‌ప్లాన్ దిశగా అడుగులు పడనున్నాయి. -
మురుగు కాలువలు శుభ్రం చేసిన ఎంపీటీసీ సభ్యుడు
నంగునూరు(సిద్దిపేట) : గ్రామంలోని మురుగు కాలువల్లో పేరుకుపోయిన చెత్త, చెదారాన్ని చూసి చలించిన ఎంపీటీసీ సభ్యుడు శుక్రవారం మురికి కాలువలను శుభ్రం చేసిన సంఘటన నంగునూరులో చోటు చేసుకుంది. మండల కేంద్రం నంగునూరులోని పలు కాలనీల్లో మురికి కాలువలు అపరిశుభ్రంగా మారాయి. కొన్ని నెలలుగా శుభ్రం చేయకపోవడంతో చెత్త, చెదారం నిండిపోయి అపరిశుభ్రంగా మారడంతో దోమలు వ్యాప్తి చెందాయి. వాటిని శుభ్రం చేయాలని పంచాయతీ కార్యదర్శికి మొరపెట్టుకున్నా స్పందించలేదు. విసుగెత్తిన గ్రామస్తులు ఎంపీటీసీ సభ్యుల ఫోరం మండలాధ్యక్షుడు సౌడిచర్ల జయపాల్‌రెడ్డికి మొరపెట్టుకున్నారు. స్పందించిన జయపాల్‌రెడ్డి శుక్రవారం గ్రామ యువకులతో కలిసి ఒకటవ వార్డులో మురికి కాలువలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో ఆరు నెలలుగా మురికి కాలువలు శుభ్రం చేయకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారన్నారు. శ్రమదానం చేసేందుకు యువకులు ముందుకురావడంతో వీధులను శుభ్రం చేశామని చెప్పారు. పదిరోజులపాటు శ్రమదానం చేసి అన్ని మురికి కాలువలను శుభ్రం చేస్తామన్నారు. ఎంపీటీసీ సభ్యుడు చూపిన చొరవతో కాలనీ పరిశుభ్రంగా మారిందని స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. -
దోమ కాటు.. కాలుష్యం పోటు
సాక్షి,మేడ్చల్ జిల్లా: అస్తవ్యస్తంగా డ్రైనేజీ వ్యవస్థ..అధ్వానంగా పారిశుద్ధ్యం..కాలుష్యం..దోమకాటులతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. రోగాల పాలతున్నారు.. ఇదీ గ్రామాల్లో దుస్థితి. అధికారులు పన్నులు వసూలుపై చూపిస్తున్న శ్రద్ధ అధిభివృద్ధి పనులపై చూపించడంలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో మేడ్చల్, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల పరిధిలో 77 గ్రామ పంచాయతీలు ఉండగా, 3.50 లక్షల మంది ప్రజలు నివసిస్తున్నారు. హైదరాబాద్ మహానగరానికి కూత వేటు దూరంలో ఉన్న పల్లెల్లో రోడ్లు, డ్రైనేజీ, పారిశుద్ధ్యం , దోమలు, ఈగలు, కాలుష్యం,దుర్వాసన వంటి సమస్యల కారణంగా ప్రజలు అవస్థలు పడుతున్నారు. గ్రామాల్లో శానిటేషన్, వాటర్ వర్స్, డంపింగ్ యార్డులు, డస్ట్ బిన్లు, డ్రైనేజీలు, కల్వర్టులు , కమ్యూనిటీ హాళ్లు, అంతర్గత రోడ్లు, శశ్మాన వాటికలు వంటి, అభివృద్ధి పనులు చేపట్టాల్సి ఉండగా, ప్రజాప్రతినిధుల అలసత్వం, అధికారుల నిర్లక్ష్యం కారణంగా అటుకెక్కుతున్నాయి. జవహర్ నగర్ డంపింగ్ యార్డుతో జవహర్‌నగర్, చీర్యాల, నాగారం, బండ్లగూడ, అహ్మద్‌గూడ, దమ్మాయిగూడెం గ్రామాలకు కాలుష్య సమస్య పొంచి ఉంది. ఈ డంపింగ్ యార్డు నుంచి వెలువడుతున్న దుర్వాసనకు తోడు నీరు కూడా కాలుష్యంగా మారుతోంది. దీంతో ఇక్కడి ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. అంతేకాకుండా గ్రామాల్లో అంతర్గత రోడ్లు అస్తవ్యస్తంగా ఉండడంతో వర్షా కాలంలో ప్రజల కష్టాలు వర్ణణాతీతం. ఆదాయం ఎక్కువే.. జిల్లాలో 77 గ్రామ పంచాయతీలు ఉండగా, కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో 12 గ్రామ పంచాయతీలు మినహాయించి మిగతా గ్రామాలన్నీ మేడ్చల్ నియోజకవర్గం పరిధిలోనే ఉన్నాయి. గ్రామాల ప్రజల నుంచి ముక్కు పిండి ఏడాదికి వివిధ పన్నుల పేరుతో రూ.100 కోట్లు పంచాయతీ శాఖ వసూలు చేస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.91 కోట్లు పన్నులు వసూలు చేసిన జిల్లా పంచాయతీ రాజ్ శాఖ ఈ ఆర్థిక సంవత్సరంలో పన్నులు పెంచడం ద్వారా రూ.100 కోట్లు లక్ష్యంగా చర్యలు చేపట్టింది. ఇప్పటి వరకు వివిధ పన్నుల ద్వారా రూ.62 కోట్లు వసూలు చేసిన పంచాయతీ కార్యదర్శులు మార్చి కల్లా మిగతా రూ.38 కోట్ల పన్నులు రాబట్టేందుకు ప్రణాళిక రూపొందించింది. ఇదిలా ఉండగా, కేంద్ర ప్రభుత్వం 14వ ఆర్థిక సంఘం కింద రెండు పర్యాయాలు 77 గ్రామ పంచాయతీలకు రూ.15.30 కోట్ల నిధులు విడుదల చేసింది. అయినప్పటికీ గ్రామాల్లో అభివృద్ధి పనులు ముందుకు సాగటం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రజాప్రతినిధుల అలసత్వం, అధికారుల నిర్లక్ష్యం వల్ల అభివృద్ధి పనులు ముందుకు సాగడం లేదన్న విమర్శలు ప్రజల నుంచి వ్యక్తమవుతున్నాయి. గ్రామపంచాయతీలకు సమకూరే ఆదాయంలో 30 శాతం సిబ్బంది జీతభత్యాలకు, 15 శాతం పారిశుద్ధ్య పనులకు, 15 శాతం విద్యుత్ దీపాలు, 15 శాతం నీటి సరఫరా, 20 శాతం నిధులు గ్రామంలో అభివృద్ధి పనులకు, 5 శాతం నిధులు ఇతర ఖర్చులకు (స్టేషనరీ తదితర వాటికి) వినియోగించాల్సి ఉన్నా ఇష్టారాజ్యంగా దుర్వినియోగం చేస్తున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. -
మురికి కాలువలో చిన్నారి మృతదేహం
తూర్పుగోదావరి: అప్పుడే పుట్టిన పసికందును మురికి కాలువలో వదిలేసి వెళ్లారు. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లి మండలం ఉప్పాడ గ్రామంలో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. గ్రామంలోని మురికి కాలువలో మగశిశువును గుర్తించిన స్థానికులు అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.