drinking water grid
-
రూ.11,992 కోట్లతో వాటర్‌గ్రిడ్ టెండర్
20 నుంచి ఆన్లైన్లో వివరాలు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ తాగునీటి సరఫరా పథకం (వాటర్‌గ్రిడ్) రెండో దశ టెండర్లకు ప్రభుత్వం సోమవారం నోటిఫికేషన్ జారీచేసింది. వీటికి సంబంధించి సెగ్మెంట్లు, పనుల ప్యాకేజీలు, అంచనాలు తదితర వివరాలను ఈనెల 20 నుంచి ఇ-ప్రొక్యూర్మెంట్ వెబ్సైట్ ద్వారా అందరికీ అందుబాటులో ఉంచుతామని గ్రామీణ నీటిసరఫరా విభాగం ఉన్నతాధికారులు తెలిపారు. తొలిదశలో 10 సె గ్మెంట్లకు టెండర్ నోటిఫికేషన్ ఇవ్వగా, రెండోదశలో 9 విభాగాలకు నోటిఫికేషన్ ఇచ్చారు. ఇ ప్పటికే ప్రారంభమైన తొలిదశ టెండర్ ప్రక్రియకు సంబంధించి కాంట్రాక్టర్లతో సోమవార ం ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయంలో ప్రి-బిడ్ స మావేశం నిర్వహించారు. దేశవ్యాప్తంగా 42 కంపెనీలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు. ప్రాజెక్టు పరిధి, షరతులపై కంపెనీల ప్రతినిధుల సందేహాలను అధికారులు నివృత్తి చేశారు. సమావేశంలో ఆర్డబ్ల్యూఎస్ చీఫ్ ఇంజనీర్ సురేశ్‌కుమార్, సలహాదారు జ్ఞానేశ్వర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రెండో దశ వాటర్‌గ్రిడ్ టెండర్లు ఇలా.. సెగ్మెంట్ అంచనా వ్యయం (రూ.కోట్లలో) మెదక్ 750 నర్సాపూర్ 445 బాల్కొండ 1,350 బాన్సువాడ 1,300 కోరుట్ల 1,300 సిరిసిల్ల 1,585 ఎస్సారెస్పీ 1,530 ఆసిఫాబాద్ 1,650 భద్రాచలం 2,082 మొత్తం 11,992 -
ఆషామాషీగా తీసుకోవద్దు
డ్రింకింగ్ వాటర్ గ్రిడ్ ఏర్పాటుపై అధికారులతో తెలంగాణ మంత్రి కేటీఆర్ పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా శాఖలు సమన్వయంతో పనిచేయాలి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని సూచన హైదరాబాద్: ప్రభుత్వం ప్రకటించే కార్యక్రమాల అమలును ఆషామాషీగా తీసుకుంటే సహించేది లేదని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కె.తారక రామారావు హెచ్చరించారు. స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా ఈనెల 25నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని అన్ని జిల్లాలకు ప్రభుత్వం సర్క్యులర్ ఇచ్చినా..పంచాయతీరాజ్ శాఖ మంత్రి ప్రాతినిధ్యం వహించే జిల్లాలోనే ప్రారంభించకపోతే.. అంతకంటే అవమానం ఏముంటుందని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం ఇచ్చిన కార్యక్రమాలు అమలు చేయకుండా ఇష్టానుసారం వ్యవహరిస్తే ఒప్పుకునేది లేదన్నారు. ఉద్యోగులు, అధికారులతో ఘర్షణను ప్రభుత్వం కోరుకోవడం లేదని, ఇది స్నేహపూర్వక ప్రభుత్వమని తెలిపారు. అలా అని చేయాల్సిన పనిచేయకపోతే మాత్రం క్షమించేది లేదన్నారు. శనివారం తెలంగాణ ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ శాఖ ఇంజనీర్లతో ఆయన సమావేశమయ్యారు. రాష్ట్రం వస్తే... రెండు గంటలు అదనంగా పనిచేస్తామని అప్పట్లో హామీ ఇచ్చారని, అది ఆషామాషీగా ఇచ్చారని తాను భావించడం లేదని పేర్కొన్నారు. కేవలం ఉద్యోగమని భావించకుండా కష్టపడి పనిచేయాలని కోరారు. తాగునీరు ప్రజల హక్కు..: తాగునీరు కోరే హక్కు ప్రజలకుందని, దానిని తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. ప్రజలకు కనీస అవసరమైన తాగునీటిని అందించకపోతే ప్రభుత్వం విఫలమైనట్లేనని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ రాష్ట్ర మంతటికి మంచినీరు అందించాలనే ఉద్దేశంతో డ్రింకింగ్ వాటర్ గ్రిడ్‌ను ఏర్పాటు చేస్తున్నారని, దీనికి సహకరించాలని మంత్రి ఇంజనీరను కోరారు. ప్రాథమిక సర్వే 95 శాతం పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారని, అయితే సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని స్పష్టతతో నివేదిక రూపొందించాలన్నారు. 2022 నాటికి 100 ఎల్పీసీడీల నీరు ఇవ్వాలని నిర్ణయించారని, అంతకంటే ఎక్కువ ఇవ్వడానికి ఎన్ని నిధులు కావాలో కూడా నివేదికలో పొందుపర్చాలని సూచించారు. ఆర్డబ్ల్యూఎస్, సాగునీటి శాఖ, పురపాలక ప్రజారోగ్య విభాగం ఇంజనీర్లతో సోమవారం సీఎం నిర్వహించే సమావేశానికి పూర్తి వివరాలతో రావాలని సూచించారు. ఇప్పటికే తాగునీటి పథకాల అమలు జాప్యం అవుతోందని, జడ్పీ సీఈవోలు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈలు సమన్వయంతో పనిచేస్తే.. ఈ ఇబ్బందులు వచ్చేవి కావని ఆయన వ్యాఖ్యానించారు. వాటర్ గ్రిడ్ కార్యక్రమానికి నిధులు సమకూర్చడానికి పలు ఆర్థిక సంస్థలు ముందుకు వస్తున్నాయని మంత్రి అన్నారు. వాటర్ గ్రిడ్‌కు రూ.25 వేల కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేసినట్లు తెలిపారు. తాటాకు చప్పుళ్లకు బెదరం హైదరాబాద్: బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తూ ప్రతిపక్షాలు చేసే తాటాకు చప్పుళ్లకు బెదిరేది లేదని, అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్న తాము దేవుడికి కూడా భయపడే ప్రసక్తి లేదని మంత్రి కె.టి.రామారావు స్పష్టం చేశారు. గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ)లో శనివారం ‘అర్బన్ హ్యాకథాన్’ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. క్రమశిక్షణ, నియమాలకు కట్టుబడి పారదర్శకతతో తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఒక్క అబద్ధాన్ని వందసార్లు చెబితే అది నిజమని ప్రజలు నమ్ముతారని భావిస్తే తాము చేసేదేమీ లేదన్నారు. కొడంగల్ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి మొదట్లో మెట్రో రైలు స్థలాన్ని ‘మైహోమ్’ సంస్థకు కేటాయించామని ప్రచారం చేశారని, దానిపై క్లారిటీ ఇచ్చాక, ఇక గేమింగ్ సిటీ స్థలమంటున్నారన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి తప్పు చేయలేదని, గతంలో కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం స్థల కేటాయింపులో 99 శాతం పనులు పూర్తి చేసి వెళ్లిందన్నారు. తాము ఒక శాతం మాత్రమే చేసి వివాదం లేకుండా పనిచేస్తే స్కాం అంటూ విమర్శించడం తగదన్నారు. రేవంత్‌రెడ్డి ప్రజా సమస్యలకు సంబంధించినవి ప్రస్తావిస్తే బాగుంటుందని కేటీఆర్ సూచించారు. గేమింగ్ సిటీ ద్వారా 50 వేల మందికి ఉపాధి గచ్చిబౌలి ప్రాంతంలో ఏర్పాటు చేయనున్న గేమింగ్ సిటీ ద్వారా 50 వేల మందికి ఉపాధి లభించే విధంగా ప్రభుత్వ చర్యలు తీసుకుంటోందని మంత్రి కేటీఆర్ తెలిపారు. వచ్చే ఐదేళ్లలో ఐటీ రంగంలో రాష్ట్రాన్ని, హైదరాబాద్‌ను అగ్రగామిగా నిలపడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. -
మనకూ వాటర్ గ్రిడ్
► జిల్లా యూనిట్‌గా ప్రతిపాదనలు ►జలాశయాల్లో ఐదు గ్రిడ్ల నిర్మాణం ►2050 జనాభా అంచనాతో డిజైన్లు ► జీఐఎస్ ద్వారా పని.. ► లైన్ అంచనాలు తయారు.. ►బడ్జెట్లో ఆమోదమే తరువాయి.. ►మూడు నెలల్లో టెక్నికల్ సర్వే పూర్తి ఆదిలాబాద్ : జిల్లాకు డ్రింకింగ్ వాటర్ గ్రిడ్ రాబోతోంది. జిల్లాను యూనిట్‌గా తీసుకుని అధికారులు ఐదు గ్రిడ్ల కోసం ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు. ఐదు సాగునీటి రిజర్వాయర్లే వనరులుగా వీటిని నిర్మించనున్నారు. ఇప్పటికైతే వేర్వేరుగా నిర్మించాలనే ఆలోచన ఉన్నా.. రానున్న రోజుల్లో ఐదు గ్రిడ్లను అనుసంధానం చేసే యోచన కూడా ఉంది. 2050 జనాభా అవసరాల అంచనాతో వీటిని డిజైన్ చేస్తున్నారు. సీఎం కేసీఆర్ గత నెల తెలంగాణ గ్రిడ్ డ్రింకింగ్ వాటర్ సప్లై స్కీంను ప్రకటించడం తెలిసిందే. ఇందులో భాగంగా అధికారులను ప్రతి జిల్లా నుంచి లైన్ అంచనాను ఈనెల చివరిలోగా ప్రభుత్వానికి పంపించాలని ఆదేశించారు. జిల్లా గ్రామీణ నీటి సరఫరా అధికారులు ప్రతిపాదనలు పంపేందుకు సిద్ధమయ్యారు. సర్కార్ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో ఈ గ్రిడ్‌కు ఆమోదం పొందితే పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మూడు నెలల్లో టెక్నికల్ సర్వేను పూర్తి చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఐదు గ్రిడ్లు జిల్లాలో ఐదు సాగునీటి రిజర్వాయర్ల ద్వారా గ్రిడ్లను నిర్మించనున్నారు. గ్రిడ్-1 శ్రీరాంసాగర్(ఎస్సారెస్పీ), గ్రిడ్-2 గడ్డెన్నవాగు, గ్రిడ్-3 కడెం, గ్రిడ్-4 ఎల్లంపల్లి, గ్రిడ్-5 కొమురం భీమ్ ప్రాజెక్టులను గుర్తించారు. వీటిలో తాగునీటి లభ్యతను అంచనా వేశారు. దీని ఆధారంగా గ్రిడ్లు అనుసంధానమయ్యే నియోజకవర్గాలు రూపొందించారు. ఎస్సారెస్పీ కింద నిర్మల్, బోథ్, ఆదిలాబాద్.. గడ్డెన్నవాగు కింద ముథోల్.. కడెం ప్రాజెక్టు కింద ఖానాపూర్.. కొమురం భీమ్ ప్రాజెక్టు కింద ఆసిఫాబాద్.. ఎల్లంపల్లి ప్రాజెక్టు కింద చెన్నూర్, మంచిర్యాల, బెల్లంపల్లిలు ఉన్నాయి. ప్రస్తుతం 2030 జనాభా ప్రకారం ఈ ఐదు గ్రిడ్లకు కలిపి ఏడాదికి 5.531 టీఎంసీల నీళ్లు తాగునీటి, ఇతర అవసరాల కోసం అవసరమని.. 2050 అంచనాల ప్రకారం 7.319 టీఎంసీల నీళ్లు అవసరమని గుర్తించారు. రోజూ ఒక్కో వ్యక్తికి గ్రామీణ ప్రాంతాల్లో 100 లీటర్లు, అర్బన్ ఏరియాల్లో 135 లీటర్లు తాగునీరు, ఇతర అవసరాల వినియోగాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ అంచనాలు రూపొందించారు. దీనికోసం రిజర్వాయర్ల నుంచి ఒక్కో వ్యక్తి అవసరాల దృష్ట్యా గ్రామీణ ప్రాంతాల్లో 130 లీటర్లు, పట్టణ ప్రాంతాల కోసం 150 లీటర్లు రా వాటర్ తీసుకొని ఫిల్టరేషన్ చేయడం ద్వారా పైన పేర్కొన్న లీటర్లను అందజేయవచ్చు. అన్ని గ్రామాలకు నీరు.. ఐదు గ్రిడ్ల ద్వారా జిల్లాలోని ప్రతీ గ్రామానికి, అనుబంధ గ్రామాలకు కూడా నీటి సరఫరా జరిగేలా సర్వే చేస్తున్నారు. ఏదైన హ్యాబిటేషన్‌లో నీటి నిల్వ కోసం రిజర్వాయర్ లేకపోతే అక్కడ జనాభాకు అనుగుణంగా ఓహెచ్ఎస్ఆర్ నిర్మాణం, అదేవిధంగా ఏదైన నీటి పథకం డ్యామేజ్ ఉన్న పక్షంలో మార్పు కోసం ప్రతిపాదనలు చేసి కొత్త పైపులైన్ వేయడం జరుగుతుంది. కాగా గ్రిడ్లు జియో ఇన్ఫర్మేషన్ సిస్టమ్(జీఐఎస్)లో పనిచేసే విధంగా నిర్మాణం చేస్తున్నారు. పైపులైన్లు స్కాడా(ఎస్సీఏడీఏ) పద్ధతిలో చేపడుతున్నారు. తద్వారా ఎక్కడైన లీకేజీలుంటే ఆన్లైన్లో మానిటరింగ్ చేసే విధంగా ఈ నైపుణ్యం పనిచేయనుంది. సర్వేలో భాగంగా లైన్ల అంచనాలు తయారు చేస్తున్నారు. అదేవిధంగా ప్రతీ మండలం హ్యాబిటేషన్లలో ఎన్ని ఓహెచ్ఎస్ఆర్ పైప్లైన్లు ఉన్నాయనేది అంచనా వేస్తున్నారు. ప్రధానంగా కరెంటు సమస్యలతో గ్రామాల్లో బోర్‌వెల్స్ పనిచేయని పరిస్థితి. ఈ నేపథ్యంలో వేసవిలో తీవ్ర తాగునీటి ఎద్దడి సమస్యలు తలెత్తుతాయి. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని గ్రిడ్లను నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. -
మూడున్నరేళ్లలో అందరికీ తాగునీరు
* ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్లకు అవగాహన సదస్సులో సీఎం కేసీఆర్ * ప్రాజెక్టు నిర్మాణం, నిర్వహణ బాధ్యత ప్రభుత్వ ఇంజనీర్లదే * ఈ పనులు ప్రైవేటు సంస్థలకు ఇవ్వబోం.. ప్రస్తుత బడ్జెట్లోనే నిధుల కేటాయింపు * గ్రిడ్ కోసం త్వరలో రాష్ట్రవ్యాప్తంగా సర్వే చేస్తామని వెల్లడి సాక్షి, హైదరాబాద్: మూడున్నరేళ్లలో తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలందరికీ రక్షిత మంచి నీరు అందించడమే తాగునీటి గ్రిడ్ పథకం ముఖ్య ఉద్దేశమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వెల్లడించారు. ప్రతి పల్లెకు, ప్రతి ఇంటికి కుళాయి ద్వారా నీళ్లు సరఫరా చేస్తామని, దానికి ఖర్చయినా సరేనని పేర్కొన్నారు. ఈ పథకాన్ని పూర్తిగా ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్ల ఆధ్వర్యంలోనే నిర్మించి, నిర్వహిస్తామని చెప్పారు. ప్రస్తుత బడ్జెట్లోనే వాటర్ గ్రిడ్ పథకానికి నిధులు కేటాయిస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన తాగునీటి గ్రిడ్ నిర్మాణంపై ఆర్డబ్ల్యూఎస్ క్షేత్రస్థాయి ఇంజనీర్లకు బుధవారం జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అవగాహన సదస్సు, చర్చాగోష్టి నిర్వహించారు. మంత్రి కె.తారకరామారావు, ప్రభుత్వ సీఎస్ రాజీవ్ శర్మ, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి రేమండ్ పీటర్, ఆర్డబ్ల్యూఎస్ ఈఎన్సీ సురేందర్‌రెడ్డి, టీఎన్జీవోల అధ్యక్షుడు దేవీప్రసాద్, సీఎం ప్రధాన కార్యదర్శి నర్సింగరావుతో పాటు రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న ఏఈ, డీఈఈ, ఈఈ, ఎస్ఈ స్థాయి అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడారు. తాగునీటి విషయంలో తాను సిద్దిపేట ఎమ్మెల్యేగా 20 ఏళ్ల కిందే పూర్తిస్థాయిలో ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్ల ఆధ్వర్యంలో విజయవంతంగా సమీకృత తాగునీటి పథకాన్ని నిర్మించి.. 65 కిలోమీటర్ల దూరంలోని లోయర్ మానేర్ డ్యాం నుంచి సిద్దిపేటకు నీటిని తరలించానని గుర్తుచేశారు. ఇప్పుడు అదే తరహాలో రాష్ట్రవ్యాప్తంగా ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్ల ఆధ్వర్యంలోనే వాటర్ గ్రిడ్ నిర్మిస్తామన్నారు. రూ. 20 వేల నుంచి 30 వేలకోట్లతో చేపట్టనున్న ఈ బృహత్తర కార్యక్రమం కోసం తల తాకట్టు పెట్టయినా ఏడాదికి ఐదారువేల కోట్ల రూపాయలను సమకూర్చుతామని చెప్పారు. ఈ గ్రిడ్ నిర్మాణ బాధ్యతలను ప్రైవేటు సంస్థలకు అప్పగించాలని 80 శాతం మంది అధికారులు సలహాఇచ్చారని.. కానీ దానికి తాను ఒప్పుకోలేదన్నారు. ‘‘ఈ పనిని ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్లు చేయగలరని నేను వారితో వాదించాను. వారితో ఘర్షణ పడి మీ దగ్గరికి వచ్చా. నా మాటను కాపాడుతరు కదా. మీ మీద నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది..’’ అంటూ ఇంజనీర్లలో ఆత్మవిశ్వాసం నింపేందుకు కేసీఆర్ ప్రయత్నించారు. గ్రిడ్ పథకం కోసం అందుబాటులో ఉన్న నీటి వనరులు, పైపులైన్ల పనులు, వనరుల అనుసంధానం తదితర పనులు చేపట్టేందుకు ఇంజనీర్లు నరసింహావతారం ఎత్తాలన్నారు. గ్రిడ్ నిర్మాణంపై త్వరలో అన్ని ప్రభుత్వ శాఖ(విద్యుత్‌శాఖ మినహా)ల ఇంజనీర్లతో రాష్ట్రవ్యాప్తంగా సర్వే చేయిస్తామని కేసీఆర్ తెలిపారు. ఆర్డబ్ల్యూఎస్ విభాగంలో 2,030 ఏఈ పోస్టులు ఉండగా ప్రస్తుతం 1,500 మంది పనిచేస్తున్నారన్నారు. 250 ఏఈ పోస్టులతో పాటు మొత్తం 500 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. గ్రిడ్ నిర్మాణం అవసరాల దృష్ట్యా ఈ పోస్టులను యుద్ధప్రాతిపదికన భర్తీ చేస్తామన్నారు. ఆర్డబ్ల్యూఎస్ ఏఈలకు ఐపాడ్లు: కేటీఆర్ మండల స్థాయిలో పనిచేస్తున్న ఆర్డబ్ల్యూఎస్ ఏఈలకు త్వరలో ఐపాడ్లు అందజేస్తామని మంత్రి కె.తారకరామారావు హామీ ఇచ్చారు. గురువారం మధ్యాహ్నం లోపు ఆ విభాగంలో ఖాళీ పోస్టుల వివరాలను తనకు అందజేయాలని అధికారులకు ఆదేశించారు. తాగునీటి గ్రిడ్‌కు విరాళాలు తాగునీటి గ్రిడ్ నిర్మాణానికి పలువురు ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్లు విరాళం ప్రకటించారు. సకల జనుల సమ్మె కాలానికి ప్రభుత్వం చెల్లించిన 42 రోజుల వేతనాన్ని విరాళంగా ఇచ్చేందుకు కరీంనగర్ జిల్లాకు చెందిన ఆర్డబ్ల్యూఎస్ జియాలజిస్టు ముందుకు వచ్చారు. ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్ల అసోసియేషన్ సభ్యులు ఈ ప్రాజెక్టు కోసం ఒక రోజు వేతనాన్ని విరాళంగా ప్రకటించారు. నేనెప్పుడూ విఫలం కాలేదు.. తెలంగాణ ఉద్యమం, సమగ్ర సర్వే.. ఇలా తాను ఏ పని చేపట్టినా అవి సాధ్యం కాదంటూ ఎంతో మంది ఎద్దేవా చేశారని.. కానీ జీవితంలో తాను ఎప్పుడూ విఫలం కాలేదని కేసీఆర్ పేర్కొన్నారు. తాగునీటి గ్రిడ్ విషయంలోనూ పూర్తిస్థాయిలో విజయవంతం అవుతానని చెప్పారు. సమగ్ర సర్వే విజయవంతం కావడంతో.. దీనిపై కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలు ఆసక్తి చూపించాయని తెలిపారు. పరిశ్రమల ఏర్పాటు కోసం రాష్ట్రంలో పది లక్షల ఎకరాల భూమి సిద్ధంగా ఉందని తాను సింగపూర్ పర్యటనలో చెప్పడంతో.. అక్కడి పారిశ్రామిక వేత్తలు ఆశ్చర్యపోయారని కేసీఆర్ అన్నారు. సింగిల్‌విండో విధానంలో అనుమతులపై తాను ఇచ్చిన హామీల్లో 50 శాతం అమలు చేసినా... లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి తాము సిద్ధంగా ఉన్నామని పారిశ్రామికవేత్తలు తనకు చెప్పారని వెల్లడించారు. రూ. 25 వేల కోట్లతో గ్రిడ్.. రూ. 20 నుంచి 25 వేల కోట్ల అంచనా వ్యయంతో సమీకృత తాగునీటి గ్రిడ్ (టీఎస్డీడబ్ల్యూజీ) నిర్మాణం. గ్రిడ్ నిర్వహణలో భాగంగా విద్యుత్ వ్యవహారాలను పర్యవేక్షించేందుకు ఆర్డబ్ల్యూఎస్లోనే ప్రత్యేక విభాగం ఏర్పాటు. ప్రస్తుత నీటి సరఫరాకు అంతరాయం కలగకుండానే గ్రిడ్ పనులు.. అవసరమున్న చోట కొత్తగా డ్యాముల నిర్మాణం. ప్రతి నియోజకవర్గానికి ఒక డీఈ, మండలానికి ఒక ఏఈ, ఇద్దరు వర్క్ ఇన్స్పెక్టర్లు, ఒక పంప్ మెకానిక్ ఖచ్చితంగా ఉండాలి. ఆర్డబ్ల్యూఎస్ డివిజన్ల సంఖ్య పెరగాలి. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలి. అధికారులకు వాహన సౌకర్యం. వాహన సౌకర్యం లేని అధికారులకు రవాణా అలవెన్స్(ఎఫ్‌టీఏ) ప్రతి నెలా చెల్లించాలి. గ్రిడ్‌పై అవగాహన కల్పించేందుకు త్వరలో ప్రజాప్రతినిధులకు శిక్షణ