20 నుంచి ఆన్‌లైన్‌లో వివరాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ తాగునీటి సరఫరా పథకం (వాటర్‌గ్రిడ్) రెండో దశ టెండర్లకు ప్రభుత్వం సోమవారం నోటిఫికేషన్ జారీచేసింది. వీటికి సంబంధించి సెగ్మెంట్లు, పనుల ప్యాకేజీలు, అంచనాలు తదితర వివరాలను ఈనెల 20 నుంచి ఇ-ప్రొక్యూర్‌మెంట్ వెబ్‌సైట్ ద్వారా అందరికీ అందుబాటులో ఉంచుతామని గ్రామీణ నీటిసరఫరా విభాగం ఉన్నతాధికారులు తెలిపారు. తొలిదశలో 10 సె గ్మెంట్లకు టెండర్ నోటిఫికేషన్ ఇవ్వగా, రెండోదశలో 9 విభాగాలకు నోటిఫికేషన్ ఇచ్చారు.
ఇ ప్పటికే ప్రారంభమైన తొలిదశ టెండర్ ప్రక్రియకు సంబంధించి కాంట్రాక్టర్లతో సోమవార ం ఆర్‌డబ్ల్యూఎస్ కార్యాలయంలో ప్రి-బిడ్ స మావేశం నిర్వహించారు. దేశవ్యాప్తంగా 42 కంపెనీలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు. ప్రాజెక్టు పరిధి, షరతులపై కంపెనీల ప్రతినిధుల సందేహాలను అధికారులు నివృత్తి చేశారు. సమావేశంలో ఆర్‌డబ్ల్యూఎస్ చీఫ్ ఇంజనీర్ సురేశ్‌కుమార్, సలహాదారు జ్ఞానేశ్వర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
రెండో దశ వాటర్‌గ్రిడ్ టెండర్లు ఇలా..
సెగ్మెంట్ అంచనా వ్యయం (రూ.కోట్లలో)
మెదక్ 750
నర్సాపూర్ 445
బాల్కొండ 1,350
బాన్సువాడ 1,300
కోరుట్ల 1,300
సిరిసిల్ల 1,585
ఎస్సారెస్పీ 1,530
ఆసిఫాబాద్ 1,650
భద్రాచలం 2,082
మొత్తం 11,992
` రూ.11,992 కోట్లతో వాటర్‌గ్రిడ్ టెండర్
Published Tue, Aug 18 2015 2:54 AM | Last Updated on Sun, Sep 3 2017 7:37 AM
Advertisement