dsa Stadium
-
హాకీ ఎంపికలకు స్పందన
కడప స్పోర్ట్స్ : కడప నగరంలోని డీఎస్ఏ క్రీడామైదానంలో ఆదివారం నిర్వహించిన జిల్లా స్థాయి సీనియర్ మహిళల హాకీ ఎంపికలకు మంచి స్పందన లభించింది. ఎంపికకు విచ్చేసిన జిల్లా హాకీ అసోసియేషన్ కార్యదర్శి ఎస్. సుభాన్‌బాషా మాట్లాడుతూ జిల్లాలో హాకీ క్రీడకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. హాకీకి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు క్రీడాకారులు కృషిచేయాలని సూచించారు. జిల్లా జట్టుకు ఎంపికైన క్రీడాకారులు ఈనెల 18 నుంచి 22వ తేదీ వరకు నంద్యాలలో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీల్లో, అనంతరం హర్యాణలో నిర్వహించే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనాల్సి ఉంటుందని తెలిపారు. అనంతరం ఎంపిక ప్రారంభించి, జిల్లా జట్టు ప్రకటించారు. కార్యక్రమంలో హాకీ కోచ్ ఖాదర్‌బాషా, వ్యాయామ ఉపాధ్యాయులు మమత, షకీల, వెంకటలక్ష్మీ, సీనియర్ క్రీడాకారుడు సందీప్, క్రీడాకారిణులు పాల్గొన్నారు. జిల్లా జట్టు : రాజేశ్వరి, పద్మజ, శైలజ(ప్రొద్దుటూరు), చిన్ని, శైలజ(బయనపల్లె), శ్రీలత, హారతి, జ్యోతి, హాజిత, ప్రమీల, నరిష్మ, ప్రశాంతి, కల్పన, జి.లక్ష్మీదేవి, లక్ష్మీదేవి(కడప), కె.గణిత, మనీష, గంగాదేవి. స్టాండ్‌బై : వెంకటభార్గవి, గంగాదేవి, శశి. -
13న సీనియర్ ఉమన్ హాకీ ఎంపికలు
కడప స్పోర్ట్స్: నగరంలోని డీఎస్ఏ క్రీడా మైదానంలో ఈనెల 13న జిల్లాస్థాయి సీనియర్ విభాగం మహిళల హాకీ జట్టు ఎంపికలు నిర్వహించనున్నట్లు జిల్లా హాకీ అసోసియేషన్ కార్యదర్శి ఎస్. సుభాన్‌బాషా ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా జట్టుకు ఎంపికైన క్రీడాకారులు ఈ నెల 18 నుంచి 20 వరకు నంద్యాలలో నిర్వహించే అంతర్ జిల్లాల సీనియర్ హాకీ చాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొనాల్సి ఉంటుందని పేర్కొన్నారు. -
ఎయిర్‌ఫోర్స్ ర్యాలీకి సర్వం సిద్ధం
కడప స్పోర్ట్స్ : కడప నగరంలో నిర్వహించనున్న ఎయిర్‌ఫోర్స్ రిక్రూట్మెంట్ ర్యాలీకి సర్వం సిద్ధమైంది. స్థానిక వైఎస్ఆర్ ఇండోర్ స్టేడియం, అవుట్ డోర్ స్టేడియంలో ఎంపికల ప్రక్రియ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇందుకోసం డీఎస్ఏ అవుట్డోర్ స్టేడియంలో పెద్ద ఎత్తున బారికేడ్లు, షామియానాలు వేశారు. వైఎస్ఆర్ ఇండోర్ స్టేడియంలో రాతపరీక్ష నిర్వహించేందుకు, అభ్యర్థులకు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అర్థమయ్యేలా బోధించేందుకు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈ ఏర్పాట్లను స్టెప్ సీఈఓ మమత ఎయిర్‌ఫోర్స్ వింగ్ కమాండర్లు, డి.కె. చౌదరి, ప్రసాద్, అనిల్ అశోక్మైన్దర్గిలు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంపిక ప్రక్రియకు 80 మంది ఎయిర్‌ఫోర్స్ సిబ్బంది సిద్ధంగా ఉన్నారన్నారు. ఈనెల 17న ఎయిర్ వైస్‌మార్షల్ తివారి, ఎయిర్కమెడో మెహదీరతాలు వస్తారని తెలిపారు. ఏర్పాట్ల పరిశీలన రిక్రూట్ మెంట్ ర్యాలీకి 7 జిల్లాల అభ్యర్థులు రానున్న నేపథ్యంలో ఏర్పాట్లను కలెక్టర్ కె.వి. సత్యనారాయణ పరిశీలించారు. ఇండోర్, అవుట్డోర్ స్టేడియంలో ఏర్పాట్ల గురించి స్టెప్ సీఈఓను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎయిర్‌ఫోర్స్ వింగ్ కమాండర్లు, సిబ్బందితో ఆయన కొద్దిసేపు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో స్టెప్ సీఈఓ మమత, డీఎస్డీఓ లక్ష్మినారాయణశర్మ, వైఎస్ఆర్ క్రీడాపాఠశాల ప్రత్యేకాధికారి సయ్యద్‌సాహెబ్ తదితరులు పాల్గొన్నారు. -
అవకాశం వదలొద్దు
కడప స్పోర్ట్స్: కడప నగరంలోని ఈనెల 16 నుంచి 22వ తేదీ వరకు నిర్వహించనున్న ఎయిర్‌ఫోర్స్ రిక్రూట్మెంట్ ర్యాలీలో పాల్గొనేందుకు ఇప్పటికే వివిధ జిల్లాల నుంచి అభ్యర్థులు నగరానికి తరలివచ్చారు. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో మెడికల్ అసిస్టెంట్, ఎయిర్‌ఫోర్స్ (సెక్యూరిటీ) విభాగాల్లో ఉద్యోగాల కోసం ఎంపికలు నిర్వహించనున్నారు. రాతపరీక్ష, అడాప్టబిలిటీ టెస్టు, ఫిజికల్ ఫిట్నెస్ టెస్టులు నిర్వహించి అప్పటికప్పుడే ఫలితాలను కూడా వెంటనే ప్రకటించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఎంపికలకు కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు, ప్రకాశం, యానాం జిల్లాల అభ్యర్థులు హాజరుకావచ్చు. ఈ ఎంపిక ప్రక్రియ కడప నగరంలోని వైఎస్ఆర్ ఇండోర్ స్టేడియం, డీఎస్ఏ అవుట్డోర్ స్టేడియాల్లో నిర్వహించనున్నారు. పరుగుపందెం పోటీ వైఎస్ఆర్ క్రీడాపాఠశాలల సమీపంలోని రింగురోడ్డు ప్రాంతంలో నిర్వహించనున్నారు. ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగం సాధించాలని.. ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగం సాధించాలన్న లక్ష్యంతో ఈ ఎంపికలకు వచ్చా. ప్రస్తుతం డిగ్రీ చేస్తూ మరోవైపు పోలీసు ఉద్యోగానికి శిక్షణ పొందుతున్నా. ఎయిర్‌ఫోర్స్‌లో ఎంపికలు రాయలసీమ ప్రాంతంలో జరుగుతుండటంతో ఇక్కడికి వచ్చా. – అశోక్, మద్దికెర, కర్నూలు జిల్లా మామ ప్రోత్సాహంతో.. మామయ్య ఆర్మీలో ఉంటూ దేశానికి సేవచేస్తున్నారు. ఆయన స్ఫూర్తితో త్రివిధ దళాల్లో పనిచేయాలన్న సంకల్పం నాలో ఉంది. ఇందులో భాగంగా కడపలో నిర్వహించే రిక్రూట్మెంట్ ర్యాలీకి వచ్చా. మెడికల్ అసిస్టెంట్ పోస్టు సాధించేందుకు ఈ ఎంపికల్లో పాల్గొంటున్నా. – రాజేష్, ఉరవకొండ, అనంతపురం జిల్లా శిక్షణ తీసుకుని సన్నద్ధమయ్యా.. ఎయిర్‌ఫోర్స్ రిక్రూట్మెంట్ ర్యాలీ కోసం శిక్షణ పొందాను. గతంలో కూడా నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఎంపికలకు వెళ్లా. దేశం కోసం సేవ చేసే అవకాశం ఉండటంతో ఈ రంగంలో ఉద్యోగం చేయాలన్న లక్ష్యం నిర్దేశించుకున్నా. – సుబ్బరంగారెడ్డి, శివాపురం, మార్కాపురం, ప్రకాశం జిల్లా. మహిళలకు అవకాశం లేకపోవడం విచారకరం.. ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగ అవకాశాలు అంటే ఇక్కడి వచ్చాం. అయితే ఎయిర్‌ఫోర్స్‌లో ప్రస్తుతం నిర్వహించే ఎంపికలు కేవలం పురుషులకు మాత్రమే అని తెలియజేశారు. మహిళలకు కూడా అవకాశం కల్పిస్తే బాగుండేది. ప్రస్తుతం కానిస్టేబుల్ పోస్టు కోసం శిక్షణ పొందుతున్న మాకు ఇటువంటి ఎంపికల్లో పాల్గొనడం ద్వారా భవిష్యత్‌కు ఉపయోగపడుతుందని ఇక్కడి వచ్చా. – ఎం. లక్ష్మిపార్వతి, అంకిరెడ్డిపల్లి, కర్నూలు జిల్లా పారదర్శకంగా ఎంపికలు... ఎయిర్‌ఫోర్స్ రిక్రూట్మెంట్ ర్యాలీలో ఎంపికలు పూర్తిగా పారదర్శకంగా నిర్వహిస్తాం. ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా క్రమపద్ధతిలో ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ఉద్యోగాల కోసం వచ్చే అభ్యర్థులు క్రీడాస్ఫూర్తి కలిగిఉండాలి. ఎంపిక కాని వారు నిరుత్సాహానికి గురికాకుండా మరోసారి ఎంపికయ్యేందుకు ప్రయత్నం చేయాలి. – డి.కె. చౌదరి, వింగ్ కమాండర్, సికింద్రాబాద్ అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాం.. ఎయిర్‌ఫోర్స్ రిక్రూట్మెంట్ ర్యాలీకి అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాం. ఎంపికలకు హాజరయ్యే అభ్యర్థులు క్రమశిక్షణతో, సంయమనంతో వ్యవహరించాలి. బయటి చెప్పే పుకార్లను నమ్మవద్దు. అర్హత కలిగిన అభ్యర్థులందరినీ ఎంపిక చేస్తారు. – మమత, స్టెప్ సీఈఓ, కడప అపరిమిత అవకాశాలు.. అందిపుచ్చుకోండి.. ఈ ఎంపికల్లో ఉద్యోగాల సంఖ్య అపరిమితం.. అర్హత కలిగిన అభ్యర్థులందరినీ ఎంపిక చేస్తారు. అన్ని రకాల ధ్రువపత్రాలతో అభ్యర్థులు హాజరై తమ సామర్థ్యం ప్రదర్శించి ఎంపికల్లో పాల్గొనవచ్చు. ఆకాశమే హద్దుగా ఉన్న అవకాశాలను యువత అందిపుచ్చుకోవాలి. – కె.వి. సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ -
25 నుంచి జిల్లాస్థాయి క్రీడా ఎంపికలు
కడప స్పోర్ట్స్ : రాష్ట్రంలోని ఏకైక క్రీడాపాఠశాల అయిన వైఎస్ఆర్ క్రీడాపాఠశాలలో 4వ తరగతిలో ప్రవేశానికి నిర్వహించే జిల్లాస్థాయి ఎంపికలు ఈనెల 25, 26 తేదీల్లో నిర్వహించనున్నారు. కడప నగరంలోని డీఎస్ఏ అవుట్డోర్ స్టేడియంలో ఈ ఎంపిక ప్రక్రియను నిర్వహించనున్నారు. మండల స్థాయిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు ఈ ఎంపికల్లో పాల్గొననున్నారు. ఎంపిక ప్రక్రియ ఇలా... 4వ తరగతిలో 20 బాలురు, 20 బాలికల సీట్లకు ఎంపికలు నిర్వహించనున్నారు. జిల్లాస్థాయిలో ఎంపికైన అభ్యర్థులకు రాష్ట్రస్థాయి ఎంపికలను కడప నగరంలోని డా.వైఎస్ఆర్ క్రీడాపాఠశాలలోనిర్వహిస్తారు. రాష్ట్రస్థాయి ఎంపికలు ఈనెల 27 నుంచే ప్రారంభమవుతున్నా.. వైఎస్ఆర్ జిల్లావిద్యార్థులకు ఈనెల 29న నిర్వహించనున్నారు. ఇందులో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఎంపికచేసి వీరికి ఆగస్టు 1 నుంచి 3వ తేదీ వరకు కోచ్‌ల పర్యవేక్షణలో శిక్షణ ఇస్తారు. అనంతరం తుది ఎంపికలు నిర్వహించి 4వ తరగతిలో ప్రవేశాలు కల్పిస్తారు. ఎంపికలకు హాజరయ్యే విద్యార్థులకు ఎత్తు, బరువుతో పాటు 30 మీటర్ల ప్లయింగ్స్టార్ట్, స్టాండింగ్ బ్రాడ్‌జంప్, 6 ఇంటూ 10 మీటర్స్ షటిల్రన్, స్టాండింగ్ వర్టికల్ జంప్, ఫ్లెక్సిబిలిటీ, మెడిసినల్‌బాల్ త్రో, 800 మీటర్ల పరుగు పందెం అంశాల్లో ప్రతిభను పరీక్షించి పాయింట్లు కేటాయిస్తారు. 4వ తరగతిలో ప్రవేశం పొందగోరే విద్యార్థులు 8 సంవత్సరాలు పూర్తయి 2008 ఫిబ్రవరి 28 నుంచి 2009 మార్చి1 మధ్యలో జన్మించిన వారు అర్హులు. దీనికి సంబంధించిన ధృవీకరణ పత్రాలతో పాటు ఫొటోలు వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. -
ఓటుపై ప్రతిజ్ఞ
కడప స్పోర్ట్స్ న్యూస్‌లైన్ : ఒకటే గమనం.. ఒకటే లక్ష్యం.. ఓటు వేయించడమే లక్ష్యంగా.. ఓటరును చైతన్యపరిచే విధంగా నిర్వహించిన 3కే వాక్ ఉత్సాహంగా సాగింది. శుక్రవారం నగరంలోని డీఎస్ఏ క్రీడామైదానంలో నిర్వహించిన 3 కిలోమీటర్ల నడక ప్రారంభోత్సవ కార్యక్రమంలో కలెక్టర్ కోన శశిధర్ మాట్లాడుతూ జిల్లా ప్రజలకు ఓటుహక్కుపై అవగాహన కల్పించడంతో పాటు అన్ని వర్గాల ప్రజలు ఓటింగ్‌లో పాల్గొని దేశంలోనే జిల్లాను ఆదర్శవంతంగా నిలిపేందుకు 3కే వాక్ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. నిద్ర శారీరక, మానసికం అని రెండు రకాలుగా ఉంటుందని, ప్రజలందరూ మానసిక నిద్ర నుంచి మేల్కొని తప్పక ఓటుహక్కును వినియోగించుకోవాలన్నారు. రాష్ట్ర చరిత్రలో ఒకేసారి 5 ఎన్నికలు నిర్వహించడం జరుగుతోందన్నారు. గత ఎన్నికల్లో జిల్లాలో కేవలం 60 శాతం మాత్ర మే పోల్ అయ్యాయన్నారు. పోలింగ్ శాతం పెంచేందుకు ప్రజలు ముందుకు రావాలన్నారు. ఎస్పీ జి.వి.జి. అశోక్‌కుమార్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో కంటే పట్టణ ప్రాంతాల్లోనే ఓటింగ్ శాతం తక్కువగా ఉంటోందన్నారు. అన్ని ప్రాంతాల్లోని ప్రజలకు ఓటింగ్ పట్ల అవగాహన పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం కలెక్టర్ ఓటు వినియోగంపై అధికారులు, విద్యార్థులతో ప్రతిజ్ఙ చేయించారు. అనంతరం 3కే వాక్ ర్యాలీని కలెక్టర్ జెండాఊపి ప్రారంభించారు. డీఎస్ఏ స్టేడియం వద్ద ప్రారంభమైన ఈ నడక అప్సరా కూడలి, ఆర్టీసీ బస్టాండు మీదుగా కోటిరెడ్డి సర్కిల్ వరకు సాగింది. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ రామారావు, ఏజేసీ సుదర్శన్‌రెడ్డి, డీఆర్ఓ సులోచన, ఆర్డీఓ హరిత, పరిశ్రమల కేంద్రం జీఎం గోపాల్, డీఎస్డీఓ బాషామోహిద్దీన్, వైఎస్ఆర్ స్పోర్ట్స్ స్కూల్ స్పెషలాఫీసర్ ఎం. రామచంద్రారెడ్డి, పశుసంవర్థకశాఖ జేడీ వెంకట్రావు, మున్సిపల్ కమిషనర్ చల్లా ఓబులేసు, శాంతిసంఘం కార్యదర్శి రాజారత్నం ఐజాక్, ఓఎస్డీ చంద్రశేఖర్‌రెడ్డి, వివిధ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు.