హాకీ ఎంపికలకు స్పందన | Hockey response options | Sakshi
Sakshi News home page

హాకీ ఎంపికలకు స్పందన

Published Sun, Nov 13 2016 11:11 PM | Last Updated on Mon, Sep 4 2017 8:01 PM

హాకీ ఎంపికలకు స్పందన

హాకీ ఎంపికలకు స్పందన

కడప స్పోర్ట్స్‌ : కడప నగరంలోని డీఎస్‌ఏ క్రీడామైదానంలో ఆదివారం నిర్వహించిన జిల్లా స్థాయి సీనియర్‌ మహిళల హాకీ ఎంపికలకు మంచి స్పందన లభించింది. ఎంపికకు విచ్చేసిన జిల్లా హాకీ అసోసియేషన్‌ కార్యదర్శి ఎస్‌. సుభాన్‌బాషా మాట్లాడుతూ జిల్లాలో హాకీ క్రీడకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. హాకీకి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు క్రీడాకారులు కృషిచేయాలని సూచించారు. జిల్లా జట్టుకు ఎంపికైన క్రీడాకారులు ఈనెల 18 నుంచి 22వ తేదీ వరకు నంద్యాలలో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీల్లో, అనంతరం హర్యాణలో నిర్వహించే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనాల్సి ఉంటుందని తెలిపారు. అనంతరం ఎంపిక ప్రారంభించి, జిల్లా జట్టు ప్రకటించారు. కార్యక్రమంలో హాకీ కోచ్‌ ఖాదర్‌బాషా, వ్యాయామ ఉపాధ్యాయులు మమత, షకీల, వెంకటలక్ష్మీ, సీనియర్‌ క్రీడాకారుడు సందీప్, క్రీడాకారిణులు పాల్గొన్నారు.
జిల్లా జట్టు : రాజేశ్వరి, పద్మజ, శైలజ(ప్రొద్దుటూరు), చిన్ని, శైలజ(బయనపల్లె), శ్రీలత, హారతి, జ్యోతి, హాజిత, ప్రమీల, నరిష్మ, ప్రశాంతి, కల్పన, జి.లక్ష్మీదేవి, లక్ష్మీదేవి(కడప), కె.గణిత, మనీష, గంగాదేవి. స్టాండ్‌బై : వెంకటభార్గవి, గంగాదేవి, శశి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement