బస్సును ఢీకొన్న లారీ, 15మందికి గాయాలు
ఏలూరు : పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి మండలం దుద్దుకూరు వద్ద బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును ఓ క్వారీ లారీ ఢీకొన్న ఘటనలో 15మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినవారిని సమీప ఆస్పత్రికి తరలించారు. మరోవైపు క్వారీ లారీ ఒక్కసారిగా బస్సును ఢీకొనటంతో లారీలో ఉన్న పేలుడు పదార్థాలు ఒక్కసారిగా చెల్లాచెదురు అయ్యాయి.
పేలుడు పదార్థాల నేపథ్యంలో 50 కిలోమీటర్ల వరకూ ఎవరూ రావొద్దంటూ పోలీసులు ఆదేశించారు. ఆర్టీవో, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితి సమీక్షిస్తున్నారు. మరోవైపు లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.