dug
-
రెండు గ్రామాల మధ్య రోడ్డు తవ్వేశారు
చిల్లకూరు : రెండు గ్రామాల మధ్య ప్రభుత్వ భూమిలో ఉన్న రోడ్డును టీడీపీ నేతలు తవ్వేయడంతో తీర ప్రాంతంలోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలంలోని సాగరమాల రోడ్డు నిర్మాణ పనులు చేపట్టే కాంట్రాక్టు సంస్థల నుంచి సబ్ కాంట్రాక్టు పనులు చేసే వారి మధ్య నెలకొన్న విభేదాలే దీనికి కారణం. తీర ప్రాంతంలోని వరగలి ప్రాంతంలో వెంకటాచలం మండలం నారికేళ్లపల్లి నుంచి వరగలి క్రాస్ రోడ్డు వద్ద ఉన్న జాతీయ రహదారి నుంచి పల్లెవానిదిబ్బ వరకు మరో కాంట్రాక్టు సంస్థకు పనులు అప్పగించారు.అయితే ప్రభుత్వం మారాక స్థానిక టీడీపీ నాయకులు వరగలి ప్రాంతంలో పనులు చేసే కాంట్రాక్టు సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని సబ్ కాంట్రాక్టు కింద మట్టి, గ్రావెల్ తవ్వి తరలించే పనులు చేస్తున్నారు. ఈ పనుల కోసం వరగలి – మన్నెగుంట గ్రామాల మధ్య ఉన్న రోడ్డుపై నుంచే వాహనాలు వెళ్లాల్సి ఉంది. అయితే ఇదే మార్గంలో మరో కాంట్రాక్టు సంస్థకు చెందిన వాహనాలు పల్లెవానిదిబ్బ వరకూ వెళ్లాల్సి ఉంది. ఆ పనులు కూడా తమకే అప్పగించాలని టీడీపీ నాయకులు పట్టుబట్టడంతో వారు అందుకు ఒప్పుకోలేదు.దీంతో టీడీపీ నాయకులు ఆ సంస్థకు చెందిన వాహనాలు చుట్టూ తిరిగి వచ్చేలా మన్నేగుంట – వరగలి మధ్యలో ఉన్న రోడ్డును తవ్వేశారు. ప్రభుత్వ భూమిలోని ఈ రోడ్డుపై ఎన్నో ఏళ్లుగా రెండు గ్రామాల ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు. దానిని తవ్వేయడంతో చుట్టూ తిరిగి మూడు కి.మీ. దూరం వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై స్థానిక వీఆర్వో మునిబాబును వివరణ కోరగా సాగరమాల రహదారి పనుల్లో ఇంజినీరింగ్ అధికారుల ఆదేశాల మేరకు పనులు చేస్తున్నారని అన్నారు. -
రియల్ ఛాలెంజ్ : ఈ దంపతులు ఏం చేశారంటే
సాక్షి, ముంబై: కరోనా విస్తరణ, లాక్డౌన్ సమయంలో సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా వారి వారి కాలక్షేపాలు, రోజువారి కార్యక్రమాల వీడియోలు, పోస్టులతో సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. అనేక సవాళ్లు, ప్రతిసవాళ్లు, టాస్క్ లతో సందడి చేస్తున్నారు. ఈ సందర్భంగా ఇంటి పని, తోట పని భార్యామణికి సాయం అంటూ ఒకర్ని మించి ఒకరు వీడియోలను పోస్టు చేస్తున్నారు. ఇలాంటి ఇలాంటి తరుణంలో ముంబై కి చెందిన ఓ జంట 21 రోజుల లాక్ డౌన్ సమయంలో ఏం చేశారో తెలిస్తే ఔరా అనిపించక మానదు (కరోనా : నడిచి..నడిచి..ఇంటికి చేరబోతుండగా) కరోనా వైరస్ వ్యాధి భయాలు, లాక్డౌన్ కారణంగా పనికోసం బయటికి వెళ్లడానికి లేకపోవడంతో తమ విలువైన సమయాన్ని ఆసక్తికరంగా, నిర్మాణాత్మకంగా గడిపిన తీరు ప్రశంసనీయంగా మారింది. అయిదూ, పది కాదు ఏకంగా 25 అడుగుల బావిని తవ్వుకున్నారు. ఆడుతు పాడుతు పనిచేస్తుంటే.. అనుకున్నారో ఏమో గానీ, 21 రోజులు శ్రమించి తమ ఇంటి ప్రాంగణంలో అంత పెద్ద లోతు బావిని తవ్వారు మహారాష్ట్రలోని వాషిమ్లోని కార్ఖేడా గ్రామానికి చెందిన గజనన్ , అతని భార్య. బయటికి వెళ్లే పరిస్థితి లేదు కనుక ఏదో ఒకటి చేయాలని ఇద్దరమూ భావించి, బావి తవ్వేందుకు నిర్ణయించామని గజానన్ చెప్పారు. (సంక్షోభం : బాటిల్ కోక్ కంటే..చౌక) -
తవ్వారు.. వదిలేశారు!
ముందుచూపు లేని అధికారులు.. మంజూరైన నిధులు రూ.6 కోట్లు.. నాలుగు నెలల కిందటే పనులు ప్రారంభం తవ్విన రోడ్లు 1.2 కిలో మీటర్లు.. సీసీ వేసిన రోడ్డు 600 మీటర్లు మాత్రమే.. వికారాబాద్: దుమ్ము.. దూళితో పట్టణ ప్రజలు రోజూ అవస్థలు పడుతూ.. శ్వాసకోస వ్యాధులతో ఆస్పత్రుల పాలవుతున్నారు. అనేక ఆరోగ్య సమస్యలతో పట్టణ ప్రజలు భాదపడుతున్నా అధికారులకు మాత్రం చీమకుట్టినట్టయినా లేదు. ‘ఎవరికేమైతే మాకేంటి’ అనే ధోరణిలో పట్టణ వ్యాపారస్తులు వ్యవహరిస్తున్నారు. పట్టణలో పూర్తిస్థాయిలో రోడ్లు వేసి సుందరంగా తీర్చిదిద్దాలని ఆర్అండ్బీ అధికారుల ఆలోచనబాగున్నప్పటికీ.. అమలులో ముందుచూపు లేకపోవడంతో అధికారుల తీరుపై ప్రజలు ఒకింత అసహనాన్ని, ఆగ్రహాన్ని వ్యక్తం చే స్తున్నారు. పట్టణ రోడ్డు వెడల్పుపై న్యాయస్థానాల్లో కేసులున్నప్పుడు కాంట్రాక్టర్లతో రోడ్లను ఎలా తవ్విస్తారని అధికారులపై ప్రజలు తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు. పట్టణంలో ప్రధాన దారులను అడ్డదిడ్డంగా తవ్వి రెండు నెలలకు పైగా అయింది. ఇటు అధికారుల తీరు, అటు వ్యాపారుల వైఖరితో ఇబ్బందులకు గురవుతున్నది మాత్రం సామాన్య ప్రజలే.. రాష్ట్ర ప్రభుత్వం జీఓ నంబర్ 129,130,131లో వికారాబాద్ ఆర్అండ్బీ డివిజన్ పరిధిలో వందల సంఖ్యలో రోడ్లు మంజూరయ్యాయి. పట్టణంలో రోడ్లన్నీ అధికలోడ్తో లారీలు వెళ్లడంతో ధ్వంసమవుతున్నాయి. గమనించిన ఆర్అండ్బీ అధికారులు దీర్ఘాకాలంపాటు రోడ్డు ధ్వంసం కాకుండా ఉండేందుకు సీసీ రోడ్డు ఏర్పాటు చేసేందుకు శ్రీకారం చుట్టారు. దీంట్లోభాగంగానే వికారాబాద్ పట్టణం లో 1.5 కిలోమీటరు మేరకు ప్రధాన రహదారులను సీసీ రోడ్డుగా మార్చేందుకు రూ.6 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నేపథ్యంలో నాలుగు నెలల కిందట పట్టణంలో పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు బీజేఆర్ చౌరస్తా నుంచి ఆలంపల్లి సీసీ రోడ్డు నిర్మాణం పనులను ప్రారంభించారు. ఆలంపల్లి నుంచి ఎంఆర్పీ చౌరస్తా వరకు సీసీ పనులు పూర్తయ్యాయి. కానీ మహాశక్తి టాకీస్ నుంచి కెనరా బ్యాంకు వరకు సీసీ పనులు ఆగిపోయాయి. అడ్డుకున్న వ్యాపారులు.. పట్టణంలో పెరుగుతున్న జనాభా, వాహనాల రాకపోకల దృష్ట్యా రోడ్డు వెడల్పు కార్యక్రమానికి ఆర్అండ్బీ అధికారులు 8 సంవత్సరాల కిందట రోడ్డు విస్తరణకు శ్రీకారం చుట్టారు. అప్పట్లో వ్యాపారులకు సంబంధించిన కొన్ని దుకాణాలకు నష్టం వాటిల్లింది. దీంతో కొందరు కోర్టును ఆశ్రయించారు. గతంలో చేసిన రోడ్డు వెడల్పు సంబంధించిన పనులు పూర్తిచేసిన తరువాతే ప్రస్తుతం సీసీ రోడ్డు పనులను ప్రారంభించాలని కోర్టు ద్వారా మధ్యంతర ఉత్తర్వులు పొంది అడ్డుకున్నారు. దీంతో ఎక్కడి పనులు అక్క డే ఆగిపోయాయి. నాలుగు నెలల కిందట తవ్వేసిన రోడ్ల తో పట్టణంలో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. మధ్యంతర ఉత్తర్వులు ఎత్తేస్తే.. ఆర్అండ్బీ అధికారులకు చిత్తశుద్ధి ఉంటే కోర్టులో వేసిన మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయించి పనులు పూర్తి చేయొచ్చని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
రహదారిపై కందకం తవ్విన మావోలు
భద్రాచలం: ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలో విలీనం చేసుకున్న ముంపు మండలాల్లో మావోయిస్టుల కార్యకలాపాలు పెరిగాయి. చింతూరు మండలంలోని ఏడుగురాళ్లపల్లి- పేగ గ్రామాల మధ్య రహదారిపై రెండు అడుగులకు పైగా కందకాలు తవ్వడం కలకలం సృష్టించింది. శనివారం అర్ధరాత్రి తర్వాత ఈ కందకాలు తవ్వినట్లు భావిస్తున్నారు. కందకాలు తవ్విన ప్రదేశానికి సమీపంలోనే ఓ చెట్టుకు మావోయిస్టులు పోస్టర్ అంటించి వెళ్లారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని శ్రామిక దినంగా జరుపుకోవాలని ఈ పోస్టర్లో పేర్కొన్నారు. ఉద్యమంలో అసువులు బాసిన మహిళా సభ్యులకు నివాళులు అర్పించాలని కూడా అందులో పేర్కొన్నారు. సమీపంలో రోడ్డుపై కరపత్రాలను విడిచివెళ్లారు. రెండు చోట్ల రహదారిపై చెట్లను నరికి వేశారు. రెండు అడుగుల లోతులో కందకం తవ్వేందుకు సుమారు మూడు గంటల సమయం పడుతుందని భావిస్తుండగా, మావోయిస్టులు పెద్ద ఎత్తున వచ్చి కందకాలు తవ్వి వెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే, మావోయిస్టులు తవ్విన కందకంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. ఆదివారం మధ్యాహ్నం తరువాత రోడ్డు పక్క నుంచి దారి వేసి వాహనాలను పంపించారు.