అగమ్య గోచరం
బాబు డైరీ: దుమ్ముగూడెం-సాగర్ టెయిల్‌పాండ్‌ను పక్కన పెట్టడంతో కృష్ణా నదిపై ఆధారపడ్డ ప్రాజెక్టుల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. వరద జలాలను ఆధారం చేసుకుని నిర్మిస్తున్న మహబూబ్‌నగర్‌లోని కల్వకుర్తి, నెట్టెంపాడు, నల్లగొండ జిల్లాలోని ఏఎమ్మార్పీతో పాటు రాయలసీమ, ప్రకాశం జిల్లాకు ఉపయోగపడే హంద్రీ-నీవా, గాలేరు- నగరి, వెలుగొండ వంటి ప్రాజెక్టుల పరిస్థితి అగమ్య గోచరమైంది. ముఖ్యంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్న సమయంలో వీటికి నీటి సరఫరా ఉండదు. పైగా ట్రిబ్యునల్ కొత్త తీర్పు వల్ల రాష్ట్రానికి వచ్చే నీటి వాటా భారీగా తగ్గనుంది. దుమ్ముగూడెం ప్రాజెక్టును నిర్మిస్తే.. పైన పేర్కొన్న ప్రాజెక్టులకు నీరు లభించే అవకాశం ఉంది.