Dunedin
-
3 నిమిషాలు మించి హత్తుకోకండి
వెల్లింగ్టన్: తమను విడిచి విదేశాలకు వెళ్లే వారికి ఎయిర్‌పోర్టుల్లో కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులు గుంపులుగా వచ్చి వీడ్కోలు చెబుతుండటం మనం చూసే ఉంటాం. ఇలా ఒక్కో ప్రయాణికుడికి వీడ్కోలు చెప్పే వారి సంఖ్య పెరుగుతుండటం, వచీ్చపోయే ద్వారాల వద్ద రద్దీ ఎక్కువవడంతో న్యూజిలాండ్‌లోని డ్యునెడిన్ ఎయిర్పోర్ట్ నిర్వాహకులు కొత్త నిబంధనను అమల్లోకి తెచ్చారు. ‘‘మీ ఆప్తులకు హత్తుకుని వీడ్కోలు పలకాలంటే గరిష్టంగా మూడు నిమిషాలే హగ్ చేసుకోండి. ఇంకా ఎక్కువ సమయం మనసారా వీడ్కోలు పలకాలంటే కారు పార్కింగ్ స్థలాన్ని వినియోగించుకోండి’అని ఒక పెద్ద బోర్డ్ తగిలించింది. తమ నిర్ణయాన్ని ఎయిర్పోర్ట్ సీఈఓ డేనియర్ బోనో సమర్థించుకున్నారు. ‘‘విరహవేదన కావొచ్చు ఇంకేమైనా కావొచ్చు. ఆప్తులు దూరమవుతుంటే కౌగిలించుకుంటే ఆ బాధ కాస్తయినా తీరుతుంది. అందుకే కౌగిలించుకుంటే కేవలం 20 సెకన్లలోనే ప్రేమ హార్మోన్ ‘ఆక్సిటాసిన్’విడుదలవుతుంది. బాధ తగ్గుతుంది. అంతమాత్రాన దారిలో అడ్డుగా ఉండి అదేపనిగా హత్తుకుంటే ఇతర ప్రయాణికుల రాకపోకలకు ఇబ్బంది కలుగుతుంది. డ్రాప్ జోన్ల వద్ద అడ్డుగా ఉండటం సబబు కాదు’అని ఆయన వాదించారు. దీనిపై ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలైంది. తమ వారికి ప్రశాంతంగా కాస్తంత ఎక్కువ సమయం వీడ్కోలు చెప్పడం కూడా ఇతర ప్రయాణికులను ఇబ్బంది పెడుతుందా? అని కొందరు విమర్శలకు దిగారు. ఎయిర్పోర్ట్ నిర్ణయాన్ని కొందరు సమర్థించారు. ‘‘మిగతా దేశాల్లో కారులో లగేజీ దింపి హత్తుకుని, ఏడ్చి సాగనంపితే ఆ కొద్ది సమయానికే ‘కిస్ అండ్ ఫ్లై’చార్జీల కింద చాలా నగదు వసూలుచేస్తారు. ఈ ఎయిర్పోర్ట్ యాజమాన్యం ఎంతో మంచిది. తొలి 15 నిమిషాలు పార్కింగ్ ఉచితం’’అని ఒక ప్రయాణికుడు మెచ్చుకున్నాడు. ప్రయాణికుల వెంట వచ్చే వారిని తగ్గించేందుకు చాలా దేశాల ఎయిర్‌పోర్ట్‌లు ఆ కొద్దిసేపు కారు ఆపినందుకు కూడా చార్జీలు వసూలుచేస్తుండం గమనార్హం. బ్రిటన్‌లోని ఎస్సెక్స్ ఎయిర్పోర్ట్ యాజమాన్యం ఇందుకు 15 నిమిషాలకు దాదాపు రూ.768 వసూలుచేస్తోంది. -
వర్షం కురిసింది... విండీస్ గట్టెక్కింది
డునెడిన్: అదృష్టమంటే ఇదేనేమో...! పరాజయం ఖాయమనుకున్న వేళ వరుణుడు కరుణ చూపడంతో న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో వెస్టిండీస్ ‘డ్రా’తో గట్టెక్కింది. ఆట చివరి రోజు శనివారం 112 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ టీ విరామానికి 30 ఓవర్లలో నాలుగు వికెట్లకు 79 పరుగులు చేసి విజయం దిశగా పయనించింది. కివీస్ విజయానికి 33 పరుగుల దూరంలో ఉండగా భారీ వర్షం మొదలైంది. ఆ తర్వాత ఎంతకీ వర్షం తగ్గకపోవడంతో చివరి సెషన్ ఆట సాధ్యపడలేదు. దాంతో కివీస్ ఆశలు ఆవిరయ్యాయి. వరుణుడు దయతో ఓటమి నుంచి గట్టెక్కిన వెస్టిండీస్ శిబిరం ఊపిరిపీల్చుకుంది. అంతకుముందు వెస్టిండీస్ ఓవర్‌నైట్ స్కోరు 443/6తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించి 507 పరుగులవద్ద ఆలౌటైంది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ డారెన్ బ్రేవో (416 బంతుల్లో 31 ఫోర్లతో 218) ఓవర్‌నైట్ స్కోరుకు మరో 8 పరుగులు జోడించి అవుట్‌కాగా.... స్యామీ (145 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 80) నిలకడగా ఆడుతూ అర్ధసెంచరీ సాధించాడు. ఈ ఇద్దరి మధ్య ఏడో వికెట్‌కు 90 పరుగుల భాగస్వామ్యం నెలకొంది. కివీస్ బౌలర్లలో వాగ్నేర్ 3, సౌతీ, బౌల్ట్, సోధి తలా రెండేసి వికెట్లు తీశారు. 112 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్‌ను విండీస్ స్పిన్నర్ షిల్లింగ్‌ఫోర్డ్ (4/26) ఇబ్బందిపెట్టాడు. కివీస్ 44 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన దశలో రాస్ టేలర్ (16 నాటౌట్), అండర్సన్ (20 నాటౌట్) క్రీజ్‌లో నిలదొక్కుకున్నారు. అయితే ఈ దశలో వర్షం రావడంతో ఆట సాధ్యపడలేదు. కివీస్ తొలి ఇన్నింగ్స్‌లో అజేయ డబుల్ సెంచరీ చేసిన రాస్ టేలర్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య రెండో టెస్టు వెల్లింగ్టన్లో ఈనెల 11న ప్రారంభమవుతుంది. సంక్షిప్త స్కోర్లు న్యూజిలాండ్ తొలి ఇన్సింగ్స్: 609/9 డిక్లేర్డ్; వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్: 213; వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్: 507; న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్: 79/4. -
డారెన్ బ్రేవో ద్విశతకం
డునెడిన్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఫాలోఆన్‌లో పడిన వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం దీటుగా ఆడుతోంది. డారెన్ బ్రేవో (404 బంతుల్లో 210 బ్యాటింగ్; 30 ఫోర్లు) కెరీర్లో తొలి డబుల్ సెంచరీతో చెలరేగడంతో శుక్రవారం నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి విండీస్ రెండో ఇన్నింగ్స్‌లో 139 ఓవర్లలో 6 వికెట్లకు 443 పరుగులు చేసింది. బ్రేవోతో పాటు స్యామీ (44 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. ప్రస్తుతం కరీబియన్ జట్టు 47 పరుగుల ఆధిక్యం సంపాదించింది. శనివారం మ్యాచ్‌కు చివరి రోజు. ఆఖరి రోజు కివీస్ బౌలర్లు విండీస్‌ను తొందరగా ఆలౌట్ చేస్తే ఆ జట్టుకు విజయా వకాశాలు ఉంటాయి. 168/2 ఓవర్‌నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆట కొనసాగించిన విండీస్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. శామ్యూల్స్ (23), చందర్‌పాల్ (1) వెంటవెంటనే అవుటైనా... బ్రేవో మాత్రం మూడు కీలక భాగస్వామ్యాలతో ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. దేవ్‌నారాయణ్ (52)తో ఐదో వికెట్‌కు 122 పరుగులు... రామ్‌దిన్ (24)తో కలిసి ఆరో వికెట్‌కు 56 పరుగులు; స్యామీతో కలిసి ఏడో వికెట్‌కు అజేయంగా 80 పరుగులు జోడించాడు. జీవంలేని వికెట్‌పై బ్రేవో అద్భుతమైన టెక్నిక్‌తో ఆడగా... కివీస్ ఫీల్డర్లు క్యాచ్‌లను మిస్ చేసి మూల్యం చెల్లించుకున్నారు. 82 పరుగుల వద్ద ఉన్నప్పుడు బ్రేవో క్యాచ్‌ను వాగ్నేర్ జారవిడవగా... 40 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద దేవ్‌నారాయణ్ ఇచ్చిన క్యాచ్‌ను షార్ట్ కవర్లో మెకల్లమ్ వదిలేశాడు. సోధి 2, సౌతీ, బౌల్ట్, వాగ్నేర్, అండర్సన్ తలా ఓ వికెట్ తీశారు. -
దుమ్మురేపిన టేలర్, మెకల్లమ్
డునెడిన్: వెస్టిండీస్‌తో మంగళవారం ప్రారంభమైన తొలి టెస్టులో న్యూజిలాండ్ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. కెప్టెన్ బ్రెండన్ మెకల్లమ్ (122 బంతుల్లో 109 బ్యాటింగ్; 14 ఫోర్లు, 3 సిక్సర్లు), టేలర్ (157 బంతుల్లో 103 బ్యాటింగ్; 13 ఫోర్లు) సెంచరీలతో చెలరేగారు. ఫలితంగా తొలి రోజు ఆట ముగిసే సమయానికి కివీస్ తొలి ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లలో 3 వికెట్లకు 367 పరుగులు చేసింది. ఈ ఇద్దరు నాలుగో వికెట్‌కు అజేయంగా 182 పరుగులు జోడించారు. ఓపెనర్లు ఫుల్టన్ (61), రూథర్‌ఫోర్డ్ (62) అర్ధసెంచరీలతో శుభారంభాన్నిచ్చారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 95 పరుగులు జోడించారు. అయితే వరుస విరామాల్లో రూథర్‌ఫోర్డ్, రెడ్మండ్ (20) అవుట్ కావడంతో కివీస్ 117 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో ఫుల్టన్‌కు జత కలిసిన టేలర్ నెమ్మదిగా ఆడాడు. స్ట్రయిక్‌ను రొటేట్ చేస్తూ క్రీజులో కుదురుకునేందుకు ప్రయత్నించాడు. మరోవైపు నిలకడగా ఆడుతున్న ఫుల్టన్‌ను... స్యామీ పెవిలియన్‌కు పంపించాడు. టేలర్ నిలకడకు ప్రాధాన్యమిచ్చినా... తర్వాత వచ్చిన మెకల్లమ్ మాత్రం వేగంగా ఆడాడు. గాబ్రియెల్ బౌలింగ్‌లో భారీ సిక్సర్‌తో జట్టు స్కోరును 300 దాటించిన మెకల్లమ్ ఆ తర్వాతా దూకుడును కొనసాగించి కెరీర్లో ఏడో టెస్టు సెంచరీని నమోదు చేశాడు.