నకిలీ ఆధార్ సెంటర్ సీజ్
హన్మకొండ అర్బన్ : హన్మకొండ సుబేదారిలోని నకిలీ ఆధార్ కేంద్రాన్ని రెవెన్యూ, పోలీస్ అధికారులు బుధవారం సంయుక్తంగా దాడి చేసి సీజ్ చేశారు. ఆసరా పింఛన్ల కోసం ఆధార్ కార్డుల్లో వ్యక్తుల వయసు మార్పులు చేస్తున్నట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. దీనిపై కలెక్టర్‌కు కొందరు వ్యక్తులు సమాచారం అందించారు. దీంతో బుధవారం రాత్రి సుబేదారిలోని ఎఫ్ఎన్ స్పేస్ ఇంటర్నెట్ సెంటర్లో అధికారులు సోదాలు నిర్వహించారు. అనుమతులు లేకుండా ఆధార్ కార్డుల్లో మార్పులు చేస్తున్నట్లు గుర్తించారు. రెండు లాప్‌ట్యాప్‌లు, ప్రింటర్లు, ఐరిష్ మిషన్ స్వాధీనం చేసుకున్నారు.
కాగా, నకిలీ కేంద్రం నిర్వాహకుడికి పాస్వర్డ్ ఎలా వచ్చిందని అధికారులు విచారిస్తున్నారు. గతంలో జిల్లాలో ప్రభుత్వం నిర్వహించిన ఆధార్ సెంటర్ల నిర్వాహకులు ప్రస్తుతం పనపిచేయడంలేదు. ప్రసుతం స్వాధీనం చేసుకున్న పరికరాలను పరిశీలించి, నిర్వాహకులను విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది. తనిఖీల్లో హన్మకొండ తహసీల్దార్ చెన్నయ్య, డీఐఓ విజయ్‌కుమార్, శ్రీధర్, సూపరింటెండెంట్ విజయలక్ష్మి, సత్యనారాయణ, శివశంకర్, సుబేదారి పోలీసులు పాల్గొన్నారు.