నకిలీ డిటర్జెంట్ తయారీ కేంద్రంపై దాడులు
హైదరాబాద్: నగరంలోని కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో నకిలీ డిటర్జెంట్, తేనె, నెయ్యి తయారీ కేంద్రంపై ఎస్వోటీ పోలీసులు శనివారం దాడులు నిర్వహించారు.
సర్ఫ్ఎక్సెల్ పేరుతో నకిలీ డిటర్జెంట్ తయారీ చేస్తున్నట్టు హిందూస్థాన్ యూనీలీవర్ కంపెనీ ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నాగార్జుననగర్‌లో ఓ తయారీ కేంద్రంపై దాడులు నిర్వహించారు. శ్రీనివాస్, సాగర్ అనే ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు. రూ.లక్ష విలువజేసే నకిలీ డిటర్జెంట్, రూ.5 లక్షల విలువ జేసే నకిలీ నెయ్యి, తేనెను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు స్టేషన్‌కు తరలించారు.