పరారీలో బినామీ రైతులు
ధర్మవరం కోల్డు స్టోరేజీ వ్యవహారం
ప్రత్తిపాడు :
ధర్మవరంలో సాయిభ్య అగ్రి కోల్డ్‌స్టోరేజీ రుణాల కేసులో బినామీలు పరారయ్యారు. స్టోరేజీ యజమాని కె.వెంకటసత్య ప్రసాద్, 111 మంది రైతుల పేర తప్పుడు దృవీకరణ పత్రాలతో సుమారు రూ.28 కోట్లకు కాకినాడలోని దేనా బ్యాంకుకు టోకరా ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో విచారణకు పోలీసులు గ్రామం లోకి వస్తున్నార్న విషయం తెలుసుకున్న రైతులు పరారయ్యారు. తాము రుణాలు తీసుకోలేదని, సంతకాలు పెట్టమంటే పెట్టామని, పోలీసులకు చిక్కితే అరెస్టు చేస్తారన్న భయంతో గ్రామం విడిచి వెళ్లినట్టు తెలుస్తోంది. బ్యాంకు జాబితాలో ఉన్నవారు రైతులు కాదని రైతు కూలీలని తెలుస్తోంది.
టోకరా ఇచ్చింది ఇలా..
కోల్డ్ స్టోరేజీలో ఉన్న సరుకు నిల్వపై యజమాని ఇచ్చిన ధ్రువీకరణ పత్రం చూపితే రూ.25 లక్షల వరకు రుణాలు పొందవచ్చు. ఈ అవకాశాన్ని వినియోగించుకున్న యజమాని ముందు వరుసలో ఉత్ప త్తులను ఉంచి వెనుక వరుసలో ఉన్న పెట్టెలు ఖాళీవి పెట్టి అధికారులకు మస్కా కొట్టినట్టు తెలుస్తున్నది. స్టోరేజీ యజమాని ఇచ్చిన తప్పుడు ధ్రువీకరణ పత్రంతో పాటు రైతు ఆధార్ కార్డు, రేష¯ŒSకార్డు, 2 ఫొటోలతో బినామీదారులను కాకినాడ దేవా బ్యాంకుకు తీసుకువెళ్లి యాజమానే రు ణం మంజూరు చేయించేవారు. ఇలా 2013 నుంచి ఇలాగే రుణాలు పొంది 2015–16 నుంచి బకాయి చెల్లించకపోవడంతో ఈ టోకరా బయటపడింది.
బినామీకి ముట్టింది రూ. 2 వేలేనట
కోల్డు స్టోరేజీ యాజమాని బినామీ రైతులకు చెల్లించింది రూ 2 వేలేనని, వ్యవసాయ కూలీలు, తన స్టోరేజీలో పనిచేసే వారి నుంచి ఆధార్‌కార్డు, రేష¯ŒSకార్డు, ఫొటోలతో వారిని కాకినాడ దేనా బ్యాంకు తీసుకువెళ్లి, రుణం మంజూరు చేయించేవారట. రుణం పొందిన సొమ్ముంతా స్టోరేజి యజమాని తీసుకుని, బినామీలకు ఆరోజు కాకినాడలో భోజన తదితర ఏర్పాట్లు చేసి, తిరుగు ప్రయాణంలో రూ. 2వేలు చేతిలో పెట్టి సాగనంపేవారని బినామీల బంధువులు చెబుతున్నారు.