Dushyant Singh
-
హర్యానా ఎన్నికల ముందు.. దుష్యంత్ చౌతాలాకు భారీ షాక్
చంఢీఘఢ్: హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలకు నెలరోజుల ముందు జననాయక్ జనతా పార్టీ(జేజేపీ)కి పెద్ద షాక్ తగిలింది. 10 మంది ఎమ్మెల్యేలలో నలుగురు జేజేపీని వీడారు. ఎమ్మెల్యేలు ఈశ్వర్ సింగ్, రామ్‌కరణ్ కాలా, దేవేంద్ర బబ్లీ శినివారం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇప్పటికే నిన్న (శుక్రవారం) ఎమ్మెల్యే అనూప్ ధనక్ రాజీనామా చేశారు. రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు.. లోక్ సభ ఎన్నికల్లో చెరో ఐదు సీట్లు గెలుపొందిన బీజేపీ లేదా కాంగ్రెస్ పార్టీలో చేరుతారని చర్చ జరుగుతోంది.పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు రామ్నివాస్ సుర్జాఖేరా, జోగి రామ్ సిహాగ్‌లపై మాజీ డిప్యూటీ సీఎం, జేజేపీ చీఫ్ దుష్యంత్ చౌతాలా అనర్హత వేటు వేశారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా ప్రచారం చేశారని వారిపై ఆరోపణలు వచ్చాయి. నార్నౌండ్‌కు చెందిన మరో ఎమ్మెల్యే రాంకుమార్ గౌరమ్మ కొంతకాలంగా నుంచి పార్టీని వ్యతిరేకిస్తున్నట్లు కార్యకర్తల్లో చర్చ జరుగుతోంది. దీంతో దుష్యంత్ చౌతాలా, అతని తల్లి నైనా చౌతాలా, అమర్జిత్ ధండాలతో జేజేపీ పార్టీలో కేవలం ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలారు. బీజేపీ-జేజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన హిసార్‌లోని ఉక్లానా ఎమ్మెల్యే అనూప్ ధనక్.. బీజేపీ చేరుతారని, ఫతేహాబాద్‌లోని తోహానాకు ప్రాతినిధ్యం వహించే దేవేంద్ర బబ్లీ, కైతాల్ జిల్లాలోని గుహ్లా చిక్కా ఎమ్మెల్యే ఈశ్వర్ సింగ్, కురుక్షేత్రలోని షహబాద్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న రామ్‌కరణ్ కాలా కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక.. 90 సీట్లు ఉన్న హర్యానాలో అక్టోబర్ 1న అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ జరగున్నట్లు ఎన్నికల సంఘం నిన్న (శుక్రవారం) ప్రకటించింది. అక్టోబర్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. -
సంతోషంగా ఉంది: వసుంధరా రాజే
జైపూర్: తన, తన కుమారుడికి సంబంధించిన కరోనా వైరస్ పరీక్షల ఫలితాల్లో నెగటివ్ అని తేలిందని రాజస్తాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజే హర్షం వ్యక్తం చేశారు. బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ లక్నోలో జరిగిన ఓ పార్టీలో వసుంధరా రాజే, ఆమె కుమారుడు, బీజేపీ ఎంపీ దుష్యంత్ సింగ్‌ను కలిసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చిన కనికాకు కరోనా సోకినట్లు వెల్లడికాడంతో వీరిద్దరి ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన నెలకొంది. అంతేగాకుండా దుష్యంత్ సింగ్ వివిధ రాజకీయ నాయకులు, ఎంపీలను కలిసిన క్రమంలో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో కనికా హాజరైన పార్టీకి వెళ్లిన వారంతా స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయారు.(ట్రోల్స్‌కు గట్టి కౌంటర్ ఇచ్చిన కనిక!) ఈ క్రమంలో వసుంధరా రాజే, దుష్యంత్ సింగ్ కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ‘‘ కోవిడ్-19 పరీక్ష నిర్వహించిన తర్వాత.. నెగటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని మీతో పంచుకోవడం సంతోషంగా ఉంది. అయితే ఫలితాలు నెగటివ్‌గా వచ్చినప్పటికీ ముందు జాగ్రత్త చర్యగా మేం మరో 15 రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉంటాం’’అని వసుంధరా రాజే ట్వీట్ చేశారు. అదే విధంగా తన కోసం ప్రార్థించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఇక వైద్యుల సూచన మేరకు తాము నిర్బంధంలో ఉంటామంటూ దుష్యంత్ సింగ్ కూడా ట్విటర్లో పేర్కొన్నారు. కాగా వీరితో పాటు పార్టీకి వెళ్లిన ఉత్తరప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రికి కూడా కరోనా నెగటివ్‌గా తేలడంతో అధికార వర్గాలు ఊపిరిపీల్చుకున్నాయి. ఇక కరోనా వ్యాప్తి నేపథ్యంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న కారణంగా కనికా కపూర్‌పై యూపీ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. (మాస్కు ధర రూ. 8, శానిటైజర్ ధర రూ.100) After conducting a #Covid19 test, I’m happy to inform you that the results came back negative. However, as a preventive measure, my son and I will continue to be in isolation for 15 days. — Vasundhara Raje (@VasundharaBJP) March 21, 2020 -
‘ఇంట్లోనే ఉన్నా.. షేక్ హ్యాండ్ ఇవ్వలేదు’
న్యూఢిల్లీ: మహమ్మారి కోవిడ్-19(కరోనా వైరస్) వ్యాప్తి నేపథ్యంలో ప్రముఖ బాక్సర్ మేరీ కోమ్ నిబంధనలు ఉల్లంఘించి క్వారంటైన్ నుంచి బయటకు వచ్చారంటూ వార్తలు ప్రచారమవుతున్నాయి. జోర్డాన్‌లోని అమ్మన్లో జరిగిన ఆసియా- ఓషనియా ఒలంపిక్ క్వాలిఫైయర్స్‌లో పాల్గొన్న ఆమె ఇటీవలే భారత్ చేరుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మేరీ కోమ్ మార్చి 18న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఇచ్చిన విందుకు హాజరయ్యారు. ఈ క్రమంలో మార్చి 13న స్వదేశానికి చేరుకున్న మేరీ కోమ్.. 14 రోజుల పాటు క్వారంటైన్లో ఉండాల్సిన నిబంధనను ఉల్లంఘించి నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రపతి భవన్లో ఆమె ఎంపీ దుష్యంత్‌కు షేక్‌హ్యాండ్ ఇచ్చారన్న ప్రచారం జరుగుతోంది.(ట్రోల్స్‌కు గట్టి కౌంటర్ ఇచ్చిన కనిక! ) ఈ నేపథ్యంలో మేరీ కోమ్ శనివారం మీడియాతో మాట్లాడారు. జోర్డాన్ నుంచి వచ్చిన నాటి నుంచి తాను ఇంట్లోనే ఉన్నానని స్పష్టం చేశారు. కేవలం రాష్ట్రపతి ఇచ్చిన విందుకు మాత్రమే హాజరయ్యానని.. బీజేపీ ఎంపీ దుష్యంత్ సింగ్‌ను తాను కలవలేదని తెలిపారు. తన క్వారంటైన్ ముగిసిందని... అయినప్పటికీ ప్రజల ఆరోగ్యం దృష్ట్యా మరో మూడు నుంచి నాలుగు రోజులు ఇంట్లోనే ఉండటానికి తనకేమీ అభ్యంతరం లేదని పేర్కొన్నారు. కాగా బాలీవుడ్ ప్రముఖ సింగర్ కనికా కపూర్ ఓ పార్టీలో రాజస్తాన్ మాజీ సీఎం వసుంధరా రాజే, ఆమె కుమారుడు దుష్యంత్ సింగ్‌ను కలిసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లండన్ నుంచి వచ్చిన కనికాకు కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఆమెతో పాటు వీరిద్దరు, వీరిని కలిసిన మరికొందరు ప్రముఖులు స్వీయ నిర్బంధంలోకి వెళ్లిన విషయం విదితమే. ఇక ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ ఉత్తరప్రదేశ్ పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. (మీ నాయకత్వం అచ్చం అలాగే: పీటర్సన్) MC Mary Kom: I am home since I came back from Jordan. I only attended the President's event and did not meet BJP MP Dushyant Singh or shake hands with him at all. My quarantine after Jordan ends, but I’m going to be at home only for the next 3-4 days. (File pic) #Coronavirus pic.twitter.com/itEfFuzWGO — ANI (@ANI) March 21, 2020 -
కనికా ఎఫెక్ట్: నిర్బంధంలోకి ఎంపీలు, మాజీ సీఎం
న్యూఢిల్లీ: బాలీవుడ్ ప్రముఖ గాయని కనికా కపూర్ వహించిన నిర్లక్ష్యం దేశాన్ని భయపెట్టిస్తోంది. ఆమెకు కరోనా వైరస్ సోకినట్లు శుక్రవారం వైద్యులు నిర్థారించిన విషయం తెలిసిందే. దీంతో ఆ పార్టీకి హాజరైన వాళ్లంతా భయాందోళనకు గురవుతున్నారు. కనికా పార్టీకి హాజరైన వాళ్లలో బీజేపీ ఎంపీ దుష్యంత్ సింగ్, ఆయన తల్లి రాజస్తాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజేతో పాటు పలువురు ప్రముఖులు ఉన్నారు. వీరంతా వైద్యుల సూచనల మేరకు స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. రాజస్తాన్ ఎంపీ అయిన దుష్యంత్ సింగ్ పార్టీకీ అనంతరం రాష్టపతి రామ్‌నాథ్ కోవింద్‌తో సహా పలువురు మంత్రులతో కలిసి విందులకు, సమావేశాలకు కూడా హాజరైయ్యారు. పార్లమెంటులో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్, ఎంపీ అనుప్రియా పటేల్‌లతో సన్నిహితంగా మెలిగారు. దీంతో ఆయన్ని కలుసుకున్న వారంతా స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. (ప్రముఖ బాలీవుడ్ సింగర్‌కు కరోనా పాజిటివ్) కనికాకు కరోనా : కేసు నమోదు ఎంపీ ఎవరెవరిని కలిసిశారంటే.. రెండు రోజుల క్రితం దుష్యంత్ సింగ్ ఉత్తరప్రదేశ్, రాజస్తాన్ ఎంపీలతో కలిసి రాష్టపతి రామ్‌నాథ్ కోవింద్‌తో అల్పహార విందులో పాల్గొన్నారు. ఈ విందులో కేంద్ర మాజీ మంత్రి రాజవర్థన్ రాథోడ్, మధుర ఎంపీ హేమమాలిని, కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, కాంగ్రెస్ నేత కుమారి సెల్జాతో పాటు బాక్సార్, ఎంపీ మేరీ కోమ్ కూడా ఉన్నారు. అంతేగాక తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ కూడా రెండు రోజుల క్రితం రవాణా స్టాండింగ్ కమిటీ సమావేశంలో దుష్యంత్ సింగ్‌తో రెండున్నర గంటలకు పైగా సంభాషించినట్లు ఆయన చెప్పారు. అదే విధంగా ఆమ్ఆద్మీ నేత సంజయ్ సింగ్, కాంగ్రెస్ నాయకుడు దీపేందర్ హూడా కూడా స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. (కరోనా మరణ మృదంగం: మృతుల సంఖ్య 11వేలు) అపాయింట్మెంట్స్ రద్దు చేసుకున్న రాష్టపతి ‘కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో ఇతరులకు దూరంగా ఉండాల్సిన సమయం ఇది. సెల్ఫ్ ఐసోలేషన్ అనేది వైద్య పరంగా తప్పనిసరి’ అంటూ రాష్ట్రపతి ట్వీట్ చేశారు. కాగా లక్నోలో జరిగిన ఆ పార్టీకి హాజరైన తర్వాత దుష్యంత్ సింగ్ కలిసిన ప్రతి ఒక్కరినీ ఆరోగ్య శాఖ అధికారులు పర్యవేక్షిస్తున్నట్లు అధికారులు తెలిపారు. వసుంధర రాజే ట్వీట్.. దీనిపై దుష్యంత్ సింగ్ తల్లి వసుంధర రాజే ట్వీట్ చేస్తూ.. లక్నోలో ఉన్నప్పుడు నా కొడుకు దుష్యంత్ సింగ్ తన అత్తమామలతో పాటు విందుకు హాజరయ్యాను. అక్కడికి సింగర్ కనికా కపూర్ కూడా అతిథిగా హాజరయ్యారు. తనకు వైరస్ సోకినట్లు తెలిసిన వెంటనే నేను, దుష్యంత్ స్వీయ నిర్భంధంలోకి వెళ్లాము. అలాగే అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాము’’ అని చెప్పారు. కాగా వసుంధర రాజే, ఎంపీ దుష్యంత్‌లు ఇంతవరకూ ఎలాంటి వైద్య పరీక్షలు కానీ కరోనా వైరస్ పరీక్షలు కానీ చేయుంచుకోలేదని వారి వైద్యులు తెలిపారు. అయితే వ్యాధి లక్షణాలు కనిపిస్తే తప్ప వైద్య పరీక్షలు నిర్వహించలేమని వైద్యులు పేర్కొన్నారు. చదవండి: క్వారంటైన్లో ఉండలేం -
కనికా కపూర్‌కు కరోనా
బాలీవుడ్ ప్రముఖ గాయని కనికా కపూర్‌కు కరోనా పాజిటివ్ అని తేలడంతో ఏకంగా ఎంపీలు సెల్ఫ్ క్వారంటైన్ విధించుకోవాల్సిన అగత్యం ఏర్పడింది. వివరాల్లోకి వెళితే గాయని కనికా కపూర్ ఇటీవల లక్నోలో ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అందులో రాజస్తాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే, ఆమె కుమారుడు దుష్యంత్ సింగ్‌లు పాల్గొన్నారు. ఇప్పుడు కనికా కపూర్‌కు కరోనా పాజిటివ్ అని తేలడంతో వసుంధర రాజే, దుష్యంత్ సింగ్‌లు సెల్ఫ్ క్వారంటైన్లోకి వెళ్లారు. రాజస్తాన్ నుంచి ఎంపీగా ఉన్న దుష్యంత్ పార్లమెంటులో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్, ఎంపీ అనుప్రియా పటేల్‌లతో సన్నిహితంగా మెలిగారు. దీంతో వారివురు కూడా సెల్ఫ్ క్వారంటైన్ విధించుకుంటున్నట్లు ప్రకటించారు. అంతేగాక మార్చి 18న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఇచ్చిన ఉపాహార విందుకు పలువురు ఎంపీలతోపాటు దుష్యంత్ కూడా హాజరయ్యారని, బుధవారం రవాణా, సాంస్కృతిక శాఖలు నిర్వహించిన సమావేశంలోనూ దుష్యంత్ 20 మంది ఎంపీలతో కలిసి ఉన్నారని డెరెక్ వివరించారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో పార్లమెంటు సమావేశాలను వాయిదా వేయాలని ఆయన కోరారు. -
లోక్‌సభలో కరోనా కలవరం
-
కనికా నిర్లక్ష్యంతో పార్లమెంటులో కలకలం
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ మహమ్మారి దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. బాలీవుడ్ గాయని కనికాకపూర్ నిర్లక్ష్యంతో కరోనా భయాందోళనలు తాజాగా పార్లమెంటు దాకా పాకాయి. కనికా కపూర్ తనకు కోవిడ్-19 (కరోనా) పాజిటివ్ అని తేలిందని, దీంతో తన కుటుంబం మొత్తం సెల్ఫ్ నిర్బంధంలోకి పోతున్నట్టు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. దీంతో కరోనా తుట్టె కదిలింది. పలువురు ఎంపీలు సహా, కనికాతో కలిసిన, సన్నిహిత మెలిగిన వారంతా స్వీయ నిర్బంధంలోకి వెళ్లి పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వివరాలను పరిశీలిస్తే..కనికాకపూర్ ఏర్పాటు చేసిన పార్టీకి రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే, ఆమె కుమారుడు బీజేపీ ఎంపీ దుష్యంత్ సింగ్, ఆయన సన్నిహిత బంధువులు హజరయ్యారు. దీంతో కనికాకపూర్‌కు కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలుసుకున్నఎంపీ దుష్యంత్ సింగ్ సెల్ఫ్ హోం క్వారంటైన్ విధించుకున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. మరోవైపు ఇంటికే పరిమితమైనట్టు ఆయన తల్లి వసుంధరా రాజే కూడా ట్విటర్లో ప్రకటించారు. మరోవైపు తాజాగా సెల్ఫ్ క్వారంటైన్ విధించుకున్న దుష్యంత్ లోక్‌సభ సమావేశాలకు హాజరయ్యారు. దీంతో ఆయన సమీపంలోనే కూర్చునే టీఎంసీ ఎంపీ డెరెక్ ఓ బ్రెయిన్ కూడా సెల్ఫ్ క్వారంటైన్ విధించుకుంటున్నట్టు ట్విటర్ ద్వారా ప్రకటించారు. ఈ ప్రభుత్వం మనందరినీ ప్రమాదంలో పడేస్తోంది. స్వీయ నిర్బంధం అవసరమని స్వయంగా ప్రధాని చెప్పారు, కానీ పార్లమెంటు కొనసాగుతోందని ఆయన విమర్శించారు. దుష్యంత్ పక్కన రెండున్నర గంటలు నేను కూర్చున్నాను. మరో ఇద్దరు ఎంపీలు సెల్ఫ్ క్వారంటైన్‌లొ ఉన్నారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికైనా పార్లమెంటు సమావేశాలను వాయిదా వేయాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాదు దుష్యంత్ సింగ్ దేశ అధ్యక్షుడు రామనాథ్ కోవింద్‌ను కూడా కలిసారన్న అంచనాలు మరింత కలకలం రేపుతున్నాయి. వీరితోపాటు పార్లమెంటు ఆవరణలో పోలీసు అధికారులు, ఇతర సిబ్బందితో పాటు మీడియా ప్రతినిధులు కూడా ఆందోళన చెందుతున్నారు. కాగా కనికా కపూర్ మార్చి 15 న లండన్ నుంచి లక్నోకు చేరుకున్న తర్వాత తన కుటుంబసభ్యులు, స్నేహితులకు ఓ ఫైవ్ స్టార్ హోటల్ పార్టీ ఏర్పాటు చేశారు. ఈ పార్టీకి పలువురు రాజకీయనాయకులు, సామాజిక వేత్తలు దాదాపు 100 మంది హాజరయ్యారు. దీంతో కనికా కపూర్‌పై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఆమెపై క్రిమినల్ కేసు నమోదు చేయాలన్న డిమాండ్లు ఊపందుకున్నాయి. While in Lucknow, I attended a dinner with my son Dushyant & his in-laws. Kanika, who has unfortunately tested positive for #Covid19 was also a guest. As a matter of abundant caution, my son & I have immediately self-quarantined and we’re taking all necessary precautions. — Vasundhara Raje (@VasundharaBJP) March 20, 2020 -
తుపాకులు, పుస్తకాలు..పెయింటింగ్స్
రాజస్తాన్ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు పలువురు నామినేషన్లు దాఖలు చేశారు. ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లలో పలువురు అభ్యర్థులు తుపాకులు, లగ్జరీ కార్లు, పెయింటింగులు, పుస్తకాలే తమ ఆస్తులుగా చూపిం చారు. కేంద్ర సహాయ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ తన దగ్గర 15 తుపాకులు ఉన్నాయని, వాటి విలువ 9 లక్షల రూపాయలని పేర్కొన్నారు. రాథోడ్ పేరొందిన షూటర్ అన్న సంగతి తెలిసిందే. ఈ తుపాకుల్లో పది తనకు బహుమానంగా వచ్చాయని ఆయన అఫిడవిట్లో వివరించారు. జల్వార్–బరన్ నుంచి పోటీలో దిగిన దుష్యంత్ సింగ్ తనకు ఐదు రోల్స్‌రాయస్ కార్లు ఉన్నాయని పేర్కొంటే, అజ్మీర్ కాంగ్రెస్ అభ్యర్థి రిజు ఝన్‌ఝన్‌వాలా 16 లక్షల రూపాయల విలువైన కళాఖండాలను తన ఆస్తులుగా అఫిడవిట్లో ప్రకటించారు. భారతీయ జనతా పార్టీ తరపున రాజ్‌సమంద్ నుంచి పోటీ చేస్తున్న జైపూర్ యువరాణి దియా కుమారి తనకు 64.89 లక్షల రూపాయల విలువైన నగలున్నాయని తెలిపారు. ఇక కోటా నుంచి కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేస్తున్న రాం నారాయణ్ మీనా దగ్గర 25,500 రూపాయల విలువైన పుస్తకాలు ఉన్నాయట. -
సీఎంకు, ఆమె తనయుడికి పెద్ద ఊరట
జైపూర్: ధోల్పూర్ రాజసౌధం వివాదంలో రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే కు ఊరట లభించింది. ఈ వివాదంపై దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు సోమవారం కొట్టివేసింది. ధోల్పూర్ రాజసౌధం రాష్ట్ర ప్రభుత్వ ఆస్తి అని దీనిపై సీబీఐ విచారణ జరపించాలని దాఖలైన పిటిషన్‌పై విచారణకు ఉన్నత న్యాయస్థానం తిరస్కరించింది. దీంతో ధోల్పూర్, లలిత్ గేట్ వివాదంలో చిక్కుకుని ఉక్కిరిబిక్కిరి అవుతున్న ముఖ్యమంత్రికి, ఆమె కుమారుడు దుష్యంత్ కు పెద్ద ఊరట లభించిట్టే. కాగా ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీతో కుమ్మక్కయి దానిని భారీస్థాయి లగ్జరీ హోటల్‌గా మార్చారన్న కాంగ్రెస్ విమర్శించింది. ఆ సౌధం రాజస్తాన్ ప్రభుత్వ ఆస్తి అని రాజే మాజీ భర్త హేమంత్‌సింగ్ ఒక కోర్టులో అంగీకరించారని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ఆరోపించారు. అయితే దీన్ని ఈ విమర్శలను తిప్పి కొట్టిన బీజేపీ ధోల్ పూర్ ప్యాలెస్ వసుంధరా రాజే కుమారుడు దుష్యంత్ సింగ్ ఆస్తిగా స్పష్టం చేసింది. ఆ ప్యాలెస్ కు చెందిన డాక్యుమెంట్లను, కోర్టు, కుటుంబ సంబంధిత సెటిల్ మెంట్ పేపర్లను బీజేపీ మీడియా ఎదుట ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. -
ఆ రాజసౌధంపై సవాల్ కు సిద్ధమా?
జైపూర్:ధోల్పూర్ రాజసౌధం రాష్ట్ర ప్రభుత్వ ఆస్తిలో భాగమని.. ప్రభుత్వ పాత్ర ఏమీ లేకుండా రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే, ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీలు కలిసి దానిని భారీస్థాయి లగ్జరీ హోటల్‌గా మార్చారన్న కాంగ్రెస్ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. కాంగ్రెస్ వ్యాఖ్యలను తిప్పికొడుతూ సవాల్ విసిరిన బీజేపీ.. ధోల్ పూర్ ప్యాలెస్ వసుంధరా రాజే కుమారుడు దుష్యంత్ సింగ్ ఆస్తిగా స్పష్టం చేసింది. దీనిపై తాము విసిరిన ఛాలెంజ్ కు కాంగ్రెస్ సిద్ధంగా ఉందా? అని పార్టీ చీఫ్ అశోక్ పర్నామీ డిమాండ్ చేశారు. ఈమేరకు ఆయన మంగళవారం మీడియా కాన్ఫరెన్స్ నిర్వహించారు. దీనిలో భాగంగా ఆ ప్యాలెస్ కు చెందిన డాక్యుమెంట్లను, కోర్టు, కుటుంబ సంబంధిత సెటిల్ మెంట్ పేపర్లను ఆయన మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. ధోల్ పూర్ ప్యాలెస్ పూర్తిగా దుశ్యంత్ కు చెందిన ఆస్తిగానే ఆయన పేర్కొన్నారు. ఈ అంశంపై కాంగ్రెస్ అనవసర రాద్ధాంతం చేస్తూ, నీచమైన రాజకీయాలకు పాల్పడుతుందన్నారు. అవసరమైతే ఆర్టీఐ నుంచి డాక్యుమెంట్లను తెప్పించుకుని పరీక్షించుకోవచ్చని అశోక్ పేర్కొన్నారు. ఒకవేళ ప్యాలెస్ కు సంబంధించి ఎటువంటి అవతవకలకు పాల్పడినా.. కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో ఏం చేశారని ప్రశ్నించారు. రాజే.. లలిత్‌తో కలసి ఒక ప్రైవేట్ సంస్థ ద్వారా అక్రమంగా, బలవంతంగా ఆక్రమించుకున్నారని కాంగ్రెస్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆ సౌధం రాజస్తాన్ ప్రభుత్వ ఆస్తి అని రాజే మాజీ భర్త హేమంత్‌సింగ్ ఒక కోర్టులో అంగీకరించారని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ సోమవారం ఢిల్లీలో విలేకర్లకు చెప్పారు. 1954 - 2010 మధ్య కాలానికి సంబంధించిన రెవెన్యూ శాఖ పత్రాలు కొన్ని.. ధోల్పూర్ రాజసౌధం రాష్ట్ర ప్రభుత్వ ఆస్తి అని చూపుతున్నాయని.. కానీ ప్రభుత్వ పాత్ర ఏమీ లేకుండా రాజే, లలిత్‌లు కలిసి దానిని భారీస్థాయి లగ్జరీ హోటల్‌గా మార్చారని, రూ. 100 కోట్లు పెట్టుబడులుగా పెట్టారని చెప్పారు.