e-wallet
-
ఫ్రీచార్జ్‌పై మొబిక్విక్ కన్ను
► విలీనంపై ప్రాథమిక స్థాయిలో చర్చలు ► 1 బిలియన్ డాలర్లుగా విలీన కంపెనీ విలువ న్యూఢిల్లీ: ఈ–వాలెట్ కంపెనీ ఫ్రీచార్జ్ కొనుగోలుపై పోటీ సంస్థ మొబిక్విక్ దృష్టి పెట్టింది. రెండింటి మధ్య విలీన చర్చలు ప్రస్తుతం ప్రాథమిక స్థాయిలో ఉన్నట్లు సమాచారం. వేర్వేరుగా చూస్తే రెండు సంస్థల విలువ చెరో 300 మిలియన్ డాలర్లుగా ఉండొచ్చని.. ఒకవేళ డీల్ కానీ పూర్తయిన పక్షంలో విలీన కంపెనీ విలువ సుమారు 700 మిలియన్ డాలర్ల నుంచి 1 బిలియన్ డాలర్ల దాకా ఉండగలదని పరిశ్రమవర్గాల అంచనా. అలాగే, భారత మార్కెట్లో ప్రవేశించాలని ఆసక్తిగా ఉన్న ఓ చైనా ఇన్వెస్టరు.. ఈ సంస్థలోకి సుమారు 200 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయడానికి సంసిధ్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. కొన్ని బ్యాంకులు కూడా ఆసక్తిగా ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మొబిక్విక్‌తో పాటు ఫ్లిప్‌కార్ట్, పేటీఎం కూడా ఫ్రీచార్జ్ కొనుగోలుపై ఆసక్తిగా ఉన్నాయి. ఫ్రీచార్జ్‌ను విక్రయించేందుకు గత కొన్నాళ్లుగా కంపెనీ సీఈవో జేసన్ కొఠారి ప్రయత్నిస్తున్నారు. అమెరికా, చైనాకు చెందిన పలువురు ఇన్వెస్టర్లతో కూడా చర్చలు జరిపారు. ఫ్రీచార్జ్‌లో ఇన్వెస్ట్ చేసేందుకు పేపాల్ ఆసక్తి వ్యక్తం చేసినప్పటికీ.. అది సాధ్యపడలేదు. ఈ నేపథ్యంలో తాజాగా మొబిక్విక్, ఫ్రీచార్జ్ మధ్య విలీన చర్చలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. సెకోయా క్యాపిటల్ ఈ రెండు సంస్థల్లోనూ ఇన్వెస్ట్ చేసింది. దేశవ్యాప్తంగా కొత్తగా 13 కార్యాలయాలు ప్రారంభించిన మొబిక్విక్.. సుమారు వెయ్యి మందికి పైగా ఉద్యోగులను రిక్రూట్ చేసుకుంది. రూ. 1,000 కోట్లు పైగా సమీకరించే ప్రయత్నాల్లో భాగంగా పలు బ్యాంకులు, మ్యూచువల్ ఫండ్స్‌తో చర్చలు జరుపుతోంది. ఏప్రిల్ నెలాఖరు లేదా మే ప్రారంభంలో నిధులు అందవచ్చని అంచనా. -
పేటీఎం ఈ–వాలెట్‌కు బీమా ధీమా
న్యూఢిల్లీ: డిజిటల్ చెల్లింపుల సంస్థ పేటీఎం తాజాగా తమ ఈ–వాలెట్ సర్వీసులకు బీమా సదుపాయాన్ని ప్రకటించింది. ఇది పూర్తిగా ఉచితం. బీమా కవరేజి రూ. 20,000 దాకా లేదా వాలెట్లో చివరిసారిగా ఉన్న మొత్తానికి (ఏది తక్కువైతే అది) వర్తిస్తుందని సంస్థ పేర్కొంది. ఈ బీమా కవరేజి నిబంధనల ప్రకారం.. డివైజ్ చోరీకి గురవడం తదితర సందర్భాల్లో ఈ–వాలెట్లో నగదు అనధికారికంగా డెబిట్ అయిన పక్షంలో పేటీఎం సదరు మొత్తాన్ని రీఫండ్ చేస్తుంది. ఇలాంటి ఉదంతాలు చోటు చేసుకున్న పన్నెండు గంటలలోగా యూజరు ఈమెయిల్, లేదా ఫోన్ కాల్ ద్వారా పేటీఎంకి తెలియజేయాల్సి ఉంటుంది. -
ఆ లావాదేవీలపై కన్ను
కొత్త ఖాతాలు, ఫిక్స్డ్ డిపాజిట్లపై నిశిత పరిశీలన న్యూఢిల్లీ: నోట్ల రద్దు పథకం చివరి 10 రోజుల్లో జరిగిన కొన్ని అనుమానాస్పద లావాదేవీల్ని క్షుణ్నంగా విశ్లేషించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కొత్త ఖాతాల్లో చేసిన డిపాజిట్లు, రుణాల చెల్లింపులు, ఈ–వాలెట్లకు నగదు బదిలీలు, దిగుమతుల కోసం ముందస్తుగా చేసిన చెల్లింపులపై అధికారులు విచారణ ప్రారంభించారు. ఫిక్స్డ్ డిపాజిట్లు, రుణ ఖాతాలపై కూడా దృష్టి సారించారు. ‘రూ. 50 వేలకు మించిన డిపాజిట్లకు పాన్ నెంబర్ జత చేయని వారిపై ఐటీ శాఖ చర్యలు మొదలుపెట్టింది’ అని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు ఆదివారం వెల్లడించారు. నగదు రహిత డిపాజిట్లపైనా దృష్టి ఆర్జీటీఎస్, ఇతర పద్ధతుల్లో చేసిన నగదు రహిత డిపాజిట్లపైనా దృష్టి సారించారని, తమ విచారణలో వెల్లడవుతున్న అంశాల్ని సంబంధిత విచారణ సంస్థలతో పంచుకుంటున్నామని చెప్పారు.