పేటీఎం ఈ–వాలెట్‌కు బీమా ధీమా
న్యూఢిల్లీ: డిజిటల్ చెల్లింపుల సంస్థ పేటీఎం తాజాగా తమ ఈ–వాలెట్ సర్వీసులకు బీమా సదుపాయాన్ని ప్రకటించింది. ఇది పూర్తిగా ఉచితం. బీమా కవరేజి రూ. 20,000 దాకా లేదా వాలెట్లో చివరిసారిగా ఉన్న మొత్తానికి (ఏది తక్కువైతే అది) వర్తిస్తుందని సంస్థ పేర్కొంది.
ఈ బీమా కవరేజి నిబంధనల ప్రకారం.. డివైజ్ చోరీకి గురవడం తదితర సందర్భాల్లో ఈ–వాలెట్‌లో నగదు అనధికారికంగా డెబిట్ అయిన పక్షంలో పేటీఎం సదరు మొత్తాన్ని రీఫండ్ చేస్తుంది. ఇలాంటి ఉదంతాలు చోటు చేసుకున్న పన్నెండు గంటలలోగా యూజరు ఈమెయిల్, లేదా ఫోన్ కాల్ ద్వారా పేటీఎంకి తెలియజేయాల్సి ఉంటుంది.