in east
-
‘తూర్పు’న ఉనికి కోల్పోయిన మావోలు
రంపచోడవరం : మావోయిస్టులకు పెట్టని కోటగా ఉన్న తూర్పు మన్యంలో విప్లవ పార్టీ ప్రాభవం కోల్పోయింది. ఒకప్పుడు మావోలను గుండెల్లో పెట్టుకుని చూసుకున్న ఆదివాసీలు తదనంతరం జరిగిన పరిణామ క్రమంలో వారికి పూర్తిగా దూరమయ్యారు. తూర్పు మన్యంలో మావోలు పూర్తిగా కనుమరుగు కావడానికి వారి స్వయం కృపారాధం ఒక కారణం కాగా పోలీసులు వ్యుహత్నకంగా తీసుకున్న చర్యలు మరో కారణంగా చెప్పవచ్చు. ఈస్ట్ డివిజ¯ŒS కమిటీలో ... తూర్పు గోదావరి ఏజెన్సీలో ఈస్ట్ డివిజ¯ŒS కమిటీ ఆధ్వర్యంలో ఎల్లవరం, నాగుల కొండ, శబరి, కోనలోవ, కోరుకోండ దళం పేరుతో మావోలు తమ కార్యకలాపాలు విస్త్రతంగా నిర్వహించేవారు. విశాఖ, తూర్పు గోదావరి పరిధిలో గాలికొండ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో రెండు జిల్లాల్లో మావోల కదలికలు ఉండేవి. అయితే క్రమేపీ ఉద్యమంలో పలు మార్పులు చోటుచేసుకున్నాయి. దళాలను రద్దు చేసి ఏఓబీ(ఆంధ్రా ఒడిసా బోర్డర్) విశాఖ జిల్లా పలకజీడి ఏరియా కమిటీ ఆధ్వర్యంలో లోకల్ గెర్లిలా స్క్వాడ్(ఎల్జీఎస్), పీపుల్స్ గెరిల్లా ఆర్మీ పేరుతో మెరుపు దాడుల్లో పాల్గొనే వారు. 2004 తరువాత ప్రభుత్వంతో జరిగిన చర్చలు విఫలమయ్యాయి. తరువాత ఏఓబీలో మావో అగ్రనేతలు దేవన్న, పటేల్ సుధాకర్ వంటి అగ్రనాయకులు ఎ¯ŒSకౌంటర్లో ప్రాణాలు కోల్పోవడంతో మావోయిస్టుల ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. తూర్పు ఏజెన్సీకి చెందిన మావోయిస్టులు వరస లొంగుబాట్లు కూడా ఉద్యమం బలహీన పడడానికి మరో కారణం. దీంతో ప్లాటూ¯ŒSలుగా సంచరిస్తూ ఆత్మరక్షణలో పడ్డారు. ఇ¯ŒSఫార్మర్ వ్యవస్థ కూడా పూర్తిగా బలహీన పడడంతో మావోల కదలికలు కష్టతరంగా మారాయి. అలాగే మావోయిస్టులు పోలీస్ ఇ¯ŒSఫార్మర్ల నెపంతో గిరిజన యువకుల్ని హతమర్చడం కూడా మావోలపై గిరిజనుల్లో వ్యతిరేకతకు కారణమైంది. ఇటు పక్క పోలీసులు కూడా గిరిజనులకు దగ్గరయ్యేందుకు పలు కార్యక్రమాలు అమలు చేస్తూ గ్రామాల్లో పట్టు సాధించారు. మావోల కదలికలపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని రాబట్టుకుని విస్త్రతంగా కూబింగ్లు నిర్వహిస్తు వారికి చెక్ చెప్పారు. ఆదివాసీలకు దూరం కావడం వలన మావోల ఇ¯ŒSఫార్మర్ వ్యవస్థ బలహీన పడింది. అదే సమయంలో గిరిజనులకు దగ్గరై పోలీసులు ఎప్పటికప్పుడు ఇ¯ŒSఫార్మర్ల ద్వారా పక్కాగా సమాచారం సేకరించగలిగారు. తూర్పు మన్యం నుంచి మావోలు కనుమరుగు కావడానికి కూడా పలు కారణాలు దోహదం చేశాయి. తాజా ఎ¯ŒSకౌంటర్‌తో జగ్గంపేట మండలం కాట్రావులపల్లి గ్రామానికి చెందిన కామేశ్వరి ఎ¯ŒSకౌంటర్‌తో తూర్పుగోదావరి నుంచి మావోయిస్టు ఉద్యమంలో జిల్లా వాసులు దాదాపు లేనట్టే. -
నెత్తురోడిన రహదారులు
మృత్యువులోనూ వీడని తాతా మనుమల బంధం నలుగురి మృతితో చొల్లంగిలో విషాదఛాయలు జిల్లా రహదారులపై నెత్తురు పారింది. వేర్వేరు చోట్ల జరిగిన రెండు ప్రమాదాల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. వెలుగుల పండుగ దీపావళికి నాలుగు రోజుల ముందు మూడు కుటుంబాల్లో విషాదపు చీకటి అలుముకుంది. బుధవారం పరీక్షలు రాయాల్సిన రంపచోడవరం లెనోరా ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల్లో ఇద్దరు తెల్లవారుజామున బైక్ అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టడంతో మృతి చెందారు. రంపచోడవరం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఉపాధి నిమిత్తం తల్లి హైదరాబాద్‌లో ఉండగా, తాళ్లరేవు మండలం చొల్లంగి అగ్రహారంలోని అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటున్న ఇద్దరు చిన్నారులు రంగంపేట మండలం వడిశలేరు వద్ద జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో వారి అమ్మమ్మ, తాతయ్యలు కూడా అసువులు బాశారు. తాళ్లరేవు: తల్లితండ్రులు దూరంగా ఉండడంతో తాతయ్య, అమ్మమ్మలతో అనుబంధం పెంచుకున్న ఆ చిన్నారులు మృత్యువులోనూ వారికి తోడయ్యారు. రంగంపేట మండలం వడిశలేరు వద్ద జాతీయ రహదారిలో బుధవారం జరిగిన ప్రమాదంలో తాళ్లరేవు మండలం చొల్లంగి అగ్రహారం పరిధిలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన వనుము పోతురాజు (65), అతని భార్య పార్వతి (60) మనుమడు కర్రి ఆనంద్ (10), మనుమరాలు కర్రి దీవెన (9) మృతి చెందారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం పాలవడంతో చొల్లంగిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోతురాజుకు నలుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు సంతానం. వారిలో మూడో సంతానమైన శ్రీదేవికి పన్నెండేళ్ల క్రితం వివాహమైంది.అయితే భర్తతో మనస్పర్థలు రావడంతో శ్రీదేవి భర్తను వదిలేసి తన ఇద్దరు పిల్లలతో సహా పుట్టింటికి వచ్చేసింది. అనంతరం ఉపాధి నిమిత్తం హైదరాబాద్‌లో ఉంటూ పిల్లలకు కావాల్సిన సొమ్ము పంపుతోంది. ఆనంద్, దీవెన చొల్లంగి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో చదువుకుంటున్నారు. పోతురాజు, ఆయన తోడల్లుడు పంపన నారాయడు, భార్య రాజేశ్వరి వీరితో పాటుగా ఆటోడ్రైవర్ వెంట్రు అనిల్‌తో కలిసి బుధవారం ఉదయం ఏడు గంటలకు ఆటోలో గౌరీపట్నం బయలుదేరారు. దైవదర్శనం అనంతరం తిరుగు ప్రయాణంలో వడిశలేరు వద్ద ఘోర ప్రమాదానికి గురై నలుగురూ ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన తమ మనస్సులను కలిచి వేస్తోందని గ్రామస్తులు అన్నారు. అటు తల్లి, తండ్రి లేనిలోటు తీరుస్తూ తాతా, అమ్మమ్మవద్ద ఆనందంగా గడుపుతున్నా చిన్నారులను బస్సు రూపంలో మృత్యువు కాటేసిందని బంధువులు బోరున విలపిస్తున్నారు. కుమారుడు, కుమార్తె చనిపోయిన విషయాన్ని హైరరాబాద్లో ఉంటున్న తల్లి శ్రీదేవికి ఏ విధంగా చెప్పాలో తెలియని పరిస్థితి నెలకొందని కుటుంబసభ్యులు ఆవేదన చెందుతున్నారు. కనీసం పిల్లలను సాకుతున్న శ్రీదేవి చెల్లెలు శాంతకుమారికి సైతం ఈ విషయాన్ని చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నామని కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. మితిమీరిన వేగం బలి తీసుకుంది రంపచోడవరం : మలుపులతో కూడిన ఏజెన్సీ రోడ్లు.. మితిమీరిన వేగం యువత ప్రాణాలను హరిస్తున్నాయి. రంపచోడవరం పాత ఆంధ్రా బ్యాంకు సమీపంలో మంగళవారం అర్ధరాత్రి జరిగిన ప్రమాదంలో స్థానిక లెనోరా ఇంజనీరింగ్ కళాశాల బీటెక్ మూడో సంవత్సరం విద్యార్థులిద్దరు మృతి చెందారు. ప్రాణాలు కోల్పోయిన వారిలో గుంటూరు జిల్లా దాచేపల్లికి చెందిన బుర్రి నరేష్( 20), జిల్లాలోని బిక్కవోలు మండలం కొంకుదురుకు చెందిన మసాబత్తుల అనిల్‌కుమార్ (21) ఉన్నారు. ఇదే ప్రమాదంలో తాళ్లరేవుకు చెందిన యువకుడు పందిరి రవికుమార్ గాయపడి కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు. మంగళవారం రాత్రి రంపచోడవరం నుంచి గోకవరం వైపు బైక్‌పై ముగ్గురు యువకులు వెళుతుండగా పాత ఆంధ్రా బ్యాంకు సమీపంలోని మలుపుతో బైక్ తప్పి పక్కన ఉన్న పుంత రోడ్డులోకి దూసుకువెళ్లింది. అక్కడే ఉన్న చెట్టును ఢీ కొనడంతో ఇద్దరూ సంఘటనా స్థలంలోనే ప్రాణాలొదిలారు. గాయపడిన రవికుమార్ తెల్లవారాక అక్కడకు దగ్గరలో ఉన్న సత్తెమ్మతల్లి గుడివద్దకు చేరుకుని అక్కడే ఉండిపోయాడు. ఏజెన్సీ రోడ్లపై అతివేగంగా ప్రయాణించడం ప్రమాదాలకు కారణం అవుతోంది. -
వైరల్ ఫీవర్
జిల్లాలో 92 డెంగీ కేసులు నమోదు అనధికారికంగా మరో నాలుగురెట్ల బాధితులు తీవ్రత ఉన్న గ్రామాల్లో వైద్యశిబిరాలు కాకినాడ జీజీహెచ్‌లో ప్రత్యేకవార్డు జిల్లా వైద్య,ఆరోగ్యశాఖాధికారి చంద్రయ్య రాయవరం : జిల్లాలో ప్రస్తుతం వైరల్ జ్వరాలు అధికంగా ఉన్నాయని, ఇప్పటి వరకూ అధికారికంగా 92 డెంగీ కేసులు నమోదయ్యాయని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి (డీఎం అండ్ హెచ్ఓ) డాక్టర్ కె.చంద్రయ్య తెలిపారు. అనధికారికంగా 400 వరకు డెంగీ కేసులు ఉండవచ్చన్నారు. ఆయన గురువారం రాయవరం పీహెచ్‌సీని సందర్శించిన సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. పెద్దాపురం, కాకినాడ రూరల్‌లో డెంగీ కేసులు ఎక్కువగా నమోదవుతున్నట్లుగా గుర్తించామన్నారు. డెంగీ తీవ్రత ఉన్నట్టు గుర్తించిన గ్రామాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఏజెన్సీలో 645 వైద్య శిబిరాల నిర్వహణ లక్ష్యం కాగా ఇప్పటి వరకూ 280 శిబిరాలు ఏర్పాటు చేశామన్నారు. మందుల కొరత లేదని, జ్వరాల నియంత్రణకు కాకినాడ జీజీహెచ్‌లో ప్రత్యేకంగా ఫీవర్ వార్డు, చిన్నారులకు ప్రత్యేకంగా పీఐసీయూ ఏర్పాటు చేశామని చెప్పారు. జ్వరాల నియంత్రణకు దోమల నిర్మూలన ఒక్కటే మార్గమని, పారిశుద్ధ్యం సక్రమంగా ఉంటే నియంత్రణ సాధ్యమని చెప్పారు. ప్రసవాలు జరగని పీహెచ్‌సీలు 24.. జిల్లాలో లక్ష ప్రసవాలకు 34 మంది తల్లులు, 74 మంది చిన్నారుల మరణాలు సంభవిస్తున్నట్లు డీఎం అండ్‌హెచ్‌ఓ తెలిపారు. మరణాల్ని మరింత తగ్గించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో 24 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాలు జరగడం లేదన్నారు. రామచంద్రపురం డివిజన్లో రాయవరం, రామవరం, కొంకుదు, వాకతిప్ప పీహెచ్‌సీల్లో జీరో ప్రసవాలు నమోదయ్యాయన్నారు. పీహెచ్‌సీల్లో ప్రసవాల సంఖ్య పెరిగేలా గర్భిణుల్లో అవగాహన పెంచాల్సిన బాధ్యత వైద్యులపై ఉందన్నారు. ప్రధానమంత్రి మాతృత్వ సురక్ష యోజన ప్రవేశ పెట్టిన జూలై నెలలో 5,646 మంది, ఆగస్టులో 8 వేల మంది గర్భిణులను పరీక్షించామన్నారు. ఈ నెలలో 10 వేల మందిని పరీక్షించాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు తెలిపారు. -
వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురి మృతి
బొబ్బర్లంక (ఆత్రేయపురం) : వేర్వేరు సంఘటనల్లో జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ముగ్గురు మరణించారు. బొబ్బర్లంక ఆర్అండ్బీ రోడ్డుపై గురువారం రాత్రి ఆర్టీసీ బస్సు, ఆటో ఢీకొనడంతో ఓ మహిళ వరణించగా, నలుగురికి గాయాలైనట్టు ఎస్సై జేమ్స్ రత్నప్రసాద్ తెలిపారు. సీతానగరం మండలం ఉండేశ్వరపురానికి చెందిన కుటుంబం ఆత్రేయపురం మండలం రాజవరం గ్రామంలోని ఓ వివాహ వేడుకకు హాజరైంది. పెళ్లి ముగిశాక ఈ కుటుంబం ఆటోలో తిరుగు ప్రయాణమైంది. బొబ్బర్లంక సమీపంలో రాజమహేంద్రవరం నుంచి రావులపాలెం వైపు వస్తున్న ఆర్టీసీ బస్సు వీరి ఆటోను ఢీకొంది. ఈ సంఘటనలో ఉండేశ్వరపురం గ్రామానికి చెందిన కోమలి సుశీల(44) అక్కడికక్కడే మరణించింది. ఆటోలో ప్రయాణిస్తున్న మిగిలిన కుటుంబ సభ్యులు కోమలి మంగరాజు, కోమలి సూర్యకాంతంతో పాటు ఆటో డ్రైవర్ పీతల సన్నబాబు, బొబ్బర్లంకకు చెందిన ప్రయాణికుడు నూకల సుబ్రహ్మణ్యం గాయపడ్డారు. క్షతగాత్రులను 108లో రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై జేమ్స్ తెలిపారు. కారు ఢీకొని పూల వ్యాపారి తుని : జాతీయ రహదారిలోని కొట్టాం సెంటర్ వద్ద కారు ఢీకొని పూల వ్యాపారి దుర్మరణం పాలయ్యాడు. ఎస్సై బి.శంకర్రావు కథనం ప్రకారం.. స్థానిక కొండవారి పేటకు చెందిన మీలా కృష్ణ(45) స్థానిక గొల్ల అప్పారావు సెంటర్లో పూల వ్యాపారం చేస్తుంటాడు. అతడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. శుక్రవారం ఉదయం అతడు కొట్టాం సెంటర్లో పూల బుట్టల కోసం వెళ్లాడు. రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని కారు అతడిని ఢీకొంది. తీవ్రంగా గాయపడిన అతడిని స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించగా, అప్పటికే చనిపోయినట్టు వైద్యులు ధ్రువీకరించారు. రాజమహేంద్రవరం నుంచి విశాఖపట్నం వైపు వెళుతున్న ఆ కారు ఆపకుండా వెళ్లిపోయింది. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. రైలు నుంచి జారి పడి యువకుడు.. తుని : రైలు నుంచి జారి పడి 17 ఏళ్ల గుర్తు తెలియని యువకుడు మరణించాడు. తుని జీఆర్పీ హెచ్‌సీ సింహాచలం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తుని మండలం టి.తిమ్మాపురం వద్ద అప్‌లైన్‌లో గుర్తు తెలియని మృతదేహ ఉన్నట్టు శుక్రవారం కీమన్ రైల్వే పోలీసులకు సమాచారమిచ్చాడు. మృతదేహం వద్ద సెల్‌ఫోన్, రైలు టికెట్ లభించాయి. సూరత్ నుంచి ఒడిశా రాష్ట్రం బరంపురం వెళ్లేందుకు టికెట్ ఉంది. అందులో నిర్మల చందన్ నాయక్, జయా దీనా పేర్లు ఉన్నాయి. మృతుడి జేబులో లభించిన సెల్‌ఫోన్ నంబరుకు కాల్ చేయగా, నిర్మలచందన్ నాయక్ అనే వ్యక్తి మాట్లాడారు. బరంపురానికి టికెట్ తీశానని, యువకుడి వివరాలు తెలియదని చెప్పినట్టు రైల్వే పోలీసులు తెలిపారు. మృతుడు ఒyì శాకు చెందిన వ్యక్తిగా అనుమానిస్తున్నారు. మృతదేహంపై నలుపు రంగు ప్యాంట్, నలుపు టీ షర్ట్, కట్ బనియన్ ఉన్నాయి. రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
అధైర్యపడొద్దు.. అండగా ఉంటా...
సూదాపాలెం బాధితులను పరామర్శించిన జగన్ గంటకుపైగా బాధితుల మధ్య జిల్లాకు వచ్చిన బాబు ఇటువైపు రాలేదెందుకు? అడుగడుగునా ఘనస్వాగతం.. అమలాపురం : ‘అధైర్యపడొద్దు.. నేను మీకు అండగా ఉన్నా.. మీకు న్యాయం జరిగే వరకు వెన్నెంటే ఉంటాను. మీకు ప్రభుత్వం నుంచి న్యాయంగా రావాల్సిన పరిహారం అందే వరకూ పోరాటం చేస్తాను’ అని ఉప్పలగుప్తం మండలం సూదాపాలెం బాధితులకు ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి భరోసా ఇచ్చారు. అమలాపురం ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సూదాపాలెం బాధిత దళితులను ఆయన శుక్రవారం పరామర్శించారు. ఉదయం పదకొండు గంటలకు హైదరాబాద్ నుంచి విమానంలో మధురుపూడికి చేరుకున్నారు. చాలా రోజుల తరువాత జగన్ జిల్లా పర్యటనకు రావడంతో జిల్లా నలుమూలల నుంచి ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున మధురపూడి చేరుకున్నారు. బయటకు వచ్చిన జగన్ నేరుగా కారు వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించగా అభిమానులు అడ్డుకున్నారు. దీంతో జగన్ కారు ఎక్కి అభివాదం చేయడంతో కేరింతలు, జగన్ నాయకత్వం వర్ధిల్లాలి అనే నినాదాలతో విమానాశ్రయం మారుమోగిపోయింది. ఎయిర్‌పోర్టు దాటిన తరువాత రాజమహేంద్రవరం– కోరుకొండ రోడ్డులో పార్టీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మితోపాటు స్థానికులు స్వాగతం పలికారు. పార్టీ రంగులతో ఉన్న గొడుగును అందించిన విజయలక్ష్మి స్థానిక నాయకులను పరిచయం చేశారు. అక్కడ నుంచి బయలుదేరి మోరంపూడి జంక్షన్, వేమగిరి, కడియపులంక, జొన్నాడ సెంటర్లలో జనం స్వాగతం పలికారు. రావులపాలెం కళావెంకట్రావు సెంటరులో కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. కొత్తపేట కౌశికరోడ్డు వద్ద మహిళలు, కళాశాల విద్యార్థినులు పెద్ద ఎత్తున వచ్చి ఆప్యాయంగా అభివాదం చేశారు. అక్కడ నుంచి అమలాపురం బయలుదేరిన జగన్‌కు అంబాజీపేట మండలం ముక్కామల సెంటరులో భారీ స్వాగతం లభించింది. పి.గన్నవరం నియోజకవర్గ కో ఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు ఆధ్వర్యంలో కార్యకర్తలు బాణాసంచా కాల్చారు. కార్యకర్తల కోరిక మేరకు అక్కడ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అక్కడ నుంచి నేరుగా అమలాపురం ఏరియా ఆస్పత్రికి మ«ధ్యాహ్నం ఒంటి గంటకు చేరుకున్నారు. గంటపాటు బాధితులతోనే... సూదాపాలెం ఘటనలో గాయపడిన బాధిత దళితులతో జగన్ గంటపాటు గడిపారు. చికిత్స పొందుతున్న మోకాటి ఎలీషా, మోకాటి వెంకటేశ్వరరావు, సవరపు లక్ష్మణకుమార్, సవరపు ప్రేమ్‌ను జగన్ కలిసి దాడి జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. సంఘటనకు దారితీసిన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. గాయపడ్డ వారి చేతలను తన చేతుల్లోకి తీసుకుని ప్రేమగా మాట్లాడారు. పదో తరగతి చదువుతున్న ప్రేమ్ తనపై జరిగిన దాడిని వివరించగా జగన్ చలించిపోయారు. జగన్ వస్తున్నారని తెలిసి కోనసీమ నలుమూలల నుంచి అభిమానులు పెద్ద ఎత్తున తరలిరావడంతో ఆస్పత్రి కిక్కిరిసిపోయింది. కనీసం మనోధైర్యం కల్పించలేరా? అనంతరం విలేకరులతో మాట్లాడిన జగన్ బాధితులపై విషయంలో చంద్రబాబు సర్కార్ అనుసరించిన తీరును తూర్పారబట్టారు. గురువారం రాజమహేంద్రవరం వచ్చిన చంద్రబాబు 60 కి.మీ.ల దూరంలో ఉన్న బాధితులను పరామర్శించడానికి రాలేరా? వారికి కనీసం మనోధైర్యం కల్పించలేరా? కేవలం రూ.లక్ష ఇచ్చి చేతులు దులుపుకుంటారా? అని నిప్పులు చెలరేగారు. ప్రివెన్షనల్ అట్రాసిటీ యాక్టు కింద బాధిత దళితులకు ఇవ్వాల్సిన గరిష్ఠ పరిహారం రూ.8.25 లక్షల ఒక్కొక్క బాధితునికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇతరుల బాధలను తెలుసుకుంటా... ఆస్పత్రి నుంచి జగన్ నేరుగా మధురపూడి విమానాశ్రయానికి చేరుకున్నారు. ఏయిర్పోర్టు వద్ద రాజమహేంద్రవరానికి చెందిన పేపరు మిల్లు కార్మికులు జగన్‌ను కలిసి తమ సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందించారు. 35 మంది కార్మికులను యాజమాన్యం విధుల నుంచి తొలగించిందని కార్మికులు వాపోయారు. పక్కనే ఉన్న కన్నబాబుతో జగన్ మాట్లాడుతూ కార్మికులకు మద్దతుగా పోరాటం చేయాలన్నారు. సూరంపాలెం ఎత్తిపోతల ప«థకం రైతులు కూడా జగన్‌ను కలిశారు. వైఎస్సార్సీపీ రైతు విభాగం మండల కన్వీనర్ తోరాటి శ్రీను ఆధ్వర్యంలో రైతులు జగన్‌తో మాట్లాడుతూ దివంగత మహానేత వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి హాయాంలో ఈ ఎత్తిపోతల çపథకం నిర్మాణం జరిగిందని గుర్తు చేశారు. ఈ ప«థకం ద్వారా సాగునీరందడం లేదని, ప్రస్తుత నేతలు పట్టించుకోవడం లేదని వాపోయారు. ఈ సమస్యను పరిష్కరించాలని, ఎత్తిపోతల పథకం తీరుతెన్నులను పరిశీలించాలని పార్టీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మిని జగన్ సూచించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్, ఎమ్మెల్యేలు చిర్ల జగ్గిరెడ్డి, దాడిశెట్టి రాజా, వంతాల రాజేశ్వరి, నియోజకవర్గ కో ఆర్డినేటర్లు పినిపే విశ్వరూప్ పాల్గొన్నారు. జిల్లాలో గడపగడపకు వైఎస్సార్ జరుగుతున్న తీరును విజయలక్ష్మిని అడిగి తెలుసుకున్నారు. సాయంత్రం 4.30 గంటలకు విమానంలో హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. -
జిల్లాలో 27.1 మిల్లీమీటర్ల వర్షపాతం
అత్యధికంగా యు.కొత్తపల్లిలో 118.2 కాకినాడ సిటీ : జిల్లా వ్యాప్తంగా ఆదివారం ఉదయం 8 గంటల వరకు గడిచిన 24 గంటల్లో సగటున 27.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా యు.కొత్తపల్లి మండలంలో అత్యధికంగా 118.2 మీల్లీమీటర్లు, అత్యల్పంగా తొండంగి మండలంలో 1.2 మిల్లీమీటర్లు నమోదైంది. మండలాలవారీగా మారేడుమిల్లిలో 1.8, వై.రామవరంలో 13.6, అడ్డతీగలలో 2.0, రాజవొమ్మంగిలో 19.4, గోల్లప్రోలులో 11.2, శంఖవరంలో 1.4, ప్రత్తిపాడులో 29.2, ఏలేశ్వరంలో 5.2, గంగవరంలో 13.4, రంపచోడవరంలో 2.0, దేవీపట్నంలో 3.8, సీతానగరంలో 46.6, కోరుకొండలో 52.4, గోకవరంలో 6.2, జగ్గంపేటలో 30.2, కిర్లంపూడిలో 32.2, పెద్దాపురంలో 98.8, పిఠాపురంలో 12.4, కాకినాడ రూరల్‌లో 51.0, కాకినాడ అర్బన్‌లో 29.2, సామర్లకోటలో 63.2, రంగంపేటలో 53.4, గండేపల్లిలో 15.8, రాజానగరం 51.6, రాజమహేంద్రవరం రూరల్‌లో 51.2, రాజమహేంద్రవరం అర్బన్‌లో 80.2, కడియంలో 17.2, మండపేటలో 24.2, అనపర్తిలో 72.0, బిక్కవోలులో 40.6, పెదపూడిలో 32.2, కరపలో 48.6, తాళ్లరేవులో 6.4, కాజులూరులో 14.6, రామచంద్రపురంలో 16.4, రాయవరంలో 56.4, కపిలేశ్వరపురంలో 27.6, ఆలమూరులో 9.4, ఆత్రేయపురంలో 11.2, రావులపాలెంలో 7.2, కె.గంగవరంలో 13.4, కొత్తపేటలో 32.0, పి.గన్నవరంలో 18.6, అంబాజీపేటలో 16.2, అయినవిల్లిలో 34.8, ముమ్మిడివరంలో 16.4, ఐ.పోలవరంలో 7.4, కాట్రేనికోనలో 40.4, ఉప్పలగుప్తంలో 6.4, అమలాపురంలో 20.2, అల్లవరంలో 6.4, మామిడికుదురులో 32.8, రాజోలులో 40.8, మల్కిపురంలో 41.4, సఖినేటిపల్లిలో 38.4, రౌతులపూడిలో 84.4, ఎటపాకలో 3.0, చింతూరు మండలంలో 2.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.