‘తూర్పు’న ఉనికి కోల్పోయిన మావోలు | maoist in east agency | Sakshi
Sakshi News home page

‘తూర్పు’న ఉనికి కోల్పోయిన మావోలు

Published Fri, Oct 28 2016 9:52 PM | Last Updated on Wed, Apr 3 2019 9:27 PM

maoist in east agency

రంపచోడవరం : 
మావోయిస్టులకు పెట్టని కోటగా ఉన్న తూర్పు మన్యంలో విప్లవ పార్టీ ప్రాభవం కోల్పోయింది. ఒకప్పుడు మావోలను గుండెల్లో పెట్టుకుని చూసుకున్న ఆదివాసీలు తదనంతరం జరిగిన పరిణామ క్రమంలో వారికి పూర్తిగా దూరమయ్యారు. తూర్పు మన్యంలో మావోలు పూర్తిగా కనుమరుగు కావడానికి వారి స్వయం కృపారాధం ఒక కారణం కాగా పోలీసులు వ్యుహత్నకంగా తీసుకున్న చర్యలు మరో కారణంగా చెప్పవచ్చు.
ఈస్ట్‌ డివిజ¯ŒS  కమిటీలో ...
తూర్పు గోదావరి ఏజెన్సీలో ఈస్ట్‌ డివిజ¯ŒS కమిటీ ఆధ్వర్యంలో ఎల్లవరం, నాగుల కొండ, శబరి, కోనలోవ, కోరుకోండ దళం పేరుతో మావోలు తమ కార్యకలాపాలు విస్త్రతంగా నిర్వహించేవారు. విశాఖ, తూర్పు గోదావరి పరిధిలో గాలికొండ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో రెండు జిల్లాల్లో మావోల కదలికలు ఉండేవి. అయితే క్రమేపీ ఉద్యమంలో పలు మార్పులు చోటుచేసుకున్నాయి. దళాలను రద్దు చేసి ఏఓబీ(ఆంధ్రా ఒడిసా బోర్డర్‌) విశాఖ జిల్లా పలకజీడి ఏరియా కమిటీ ఆధ్వర్యంలో లోకల్‌ గెర్లిలా స్క్వాడ్‌(ఎల్‌జీఎస్‌), పీపుల్స్‌ గెరిల్లా ఆర్మీ పేరుతో మెరుపు దాడుల్లో పాల్గొనే వారు. 2004 తరువాత ప్రభుత్వంతో జరిగిన చర్చలు విఫలమయ్యాయి. తరువాత ఏఓబీలో మావో అగ్రనేతలు దేవన్న, పటేల్‌ సుధాకర్‌ వంటి అగ్రనాయకులు ఎ¯ŒSకౌంటర్‌లో ప్రాణాలు కోల్పోవడంతో మావోయిస్టుల ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. తూర్పు ఏజెన్సీకి చెందిన మావోయిస్టులు వరస లొంగుబాట్లు కూడా ఉద్యమం బలహీన పడడానికి మరో కారణం.
దీంతో ప్లాటూ¯ŒSలుగా సంచరిస్తూ ఆత్మరక్షణలో పడ్డారు. ఇ¯ŒSఫార్మర్‌ వ్యవస్థ కూడా పూర్తిగా బలహీన పడడంతో మావోల కదలికలు కష్టతరంగా మారాయి. అలాగే మావోయిస్టులు పోలీస్‌ ఇ¯ŒSఫార్మర్‌ల నెపంతో గిరిజన యువకుల్ని హతమర్చడం కూడా మావోలపై గిరిజనుల్లో వ్యతిరేకతకు కారణమైంది. ఇటు పక్క పోలీసులు కూడా గిరిజనులకు దగ్గరయ్యేందుకు పలు కార్యక్రమాలు అమలు చేస్తూ గ్రామాల్లో పట్టు సాధించారు. మావోల కదలికలపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని రాబట్టుకుని విస్త్రతంగా కూబింగ్‌లు నిర్వహిస్తు వారికి చెక్‌ చెప్పారు. ఆదివాసీలకు దూరం కావడం వలన మావోల ఇ¯ŒSఫార్మర్‌ వ్యవస్థ బలహీన పడింది. అదే సమయంలో గిరిజనులకు దగ్గరై పోలీసులు ఎప్పటికప్పుడు ఇ¯ŒSఫార్మర్‌ల ద్వారా పక్కాగా సమాచారం సేకరించగలిగారు. తూర్పు మన్యం నుంచి మావోలు కనుమరుగు కావడానికి కూడా పలు కారణాలు దోహదం చేశాయి. తాజా ఎ¯ŒSకౌంటర్‌తో జగ్గంపేట మండలం కాట్రావులపల్లి గ్రామానికి చెందిన కామేశ్వరి ఎ¯ŒSకౌంటర్‌తో తూర్పుగోదావరి నుంచి మావోయిస్టు ఉద్యమంలో జిల్లా వాసులు దాదాపు లేనట్టే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement