Eco Park
-
సాహసకృత్యాలకు చిరునామా మయూరి ఎకో పార్క్
స్టేషన్ మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రానికి సమీపంలో ‘మయూరి హరితవనం’ (ఎకో అర్బన్ పార్క్) ప్రత్యేక గుర్తింపు పొందుతోంది. ఈ పార్క్ వనవిహార కేంద్రంగా రూపుదిద్దుకుంది. జిల్లా కేంద్రం అప్పన్నపల్లి శివారులోని ఈ ఎకో అర్బన్ పార్క్ పర్యాటకులకు ఆహ్లాదాన్ని అందిస్తోంది. ఈ నేచర్పార్క్ అర్బన్ లంగ్స్ స్పేస్ పర్యాటక కేంద్రంగా మారుతోంది. 2,087 ఎకరాల్లో మయూరి పార్క్‌ను అభివృద్ధి చేస్తున్నారు. పర్యాటకుల ఆహ్లాదం కోసం అన్ని రకాల వసతులు ఉండడంతో ఎకో పార్క్‌కు సందర్శకుల తాకిడి అధికమైంది. ఎకో అర్బన్ పార్కులో సౌకర్యాలు పార్క్‌లో చిల్డ్రన్స్ పార్క్, బటర్‌ఫ్లై గార్డెన్, కరెన్సీ పార్క్, రోజ్ గార్డెన్, రాశీవనం, నక్షత్ర వనం, నవగ్రహ వనం, హెర్బల్ గార్డెన్లు పర్యాటకులకు అమితంగా ఆకర్షిస్తున్నాయి. పార్క్‌లో మాకావ్ ఎన్‌క్లోజర్, స్వాన్ పాండ్, హిల్‌వ్యూ పాయింట్, ప్రత్యేకంగా జంగిల్ సఫారీ, ఫ్లాగ్ పాయింట్, ఆస్ట్రిచ్ బర్డ్ ఎన్క్లోజర్లను ఏర్పాటు చేశారు. ఆకట్టుకుంటున్న అడ్వెంచర్ గేమ్‌లు పార్క్‌లో పెద్దల కోసం ఏర్పాటు చేసిన జిప్‌లైన్, జిప్సైకిల్, చిన్నారులకు జిప్సైకిల్, జిప్‌లైన్ తదితర అడ్వెంచర్ గేమ్స్ అమితంగా ఆకట్టుకుంటున్నాయి. పెద్దల జిప్ సైకిల్ రూ.150, జిప్‌లైన్ రూ.70, చిన్నారుల జిప్సైకిల్ రూ.30, జిప్‌లైన్ రూ.30గా నిర్ణయించారు. జిప్సైకిల్ రానుపోను 600 మీటర్లు, జిప్‌లైన్ 200 మీటర్ల వరకు ఉంటుంది. వీకెండ్ రోజుల్లో ముఖ్యంగా చిన్నారులు, యువత జిప్ సైకిల్, జిప్ లైన్‌పై హుషారుగా సందడి చేస్తున్నారు. పార్క్‌లో అడల్ట్, చిల్డ్రన్స్ బోటింగ్‌తోపాటు నేచర్ నైట్ క్యాంపింగ్ సైట్ అందుబాటులో ఉంది.అడవిలో జంగిల్ సఫారీ పార్క్‌లో జంగిల్ సఫారీని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. పార్క్ నుంచి అడవిలో రానుపోను 14 కిలోమీటర్లు ఈ జంగిల్ సఫారీ ఉంటుంది. పార్క్ నుంచి ప్రారంభమయ్యే ఈ సఫారీ గోల్ బంగ్లా వాచ్ టవర్ వరకు తీసుకెళ్లి తిరిగి పార్క్‌కు చేరుకుంటుంది. సఫారీలో నెమళ్లు, జింకలు, ఇతర జంతువులను తిలకించే అవకాశం ఉంటుంది. రూ.2 వేలు చెల్లించి 8 మంది జంగిల్ సఫారీ చేయవచ్చు. మరిన్ని సాహస క్రీడల ఏర్పాటు పర్యాటకులను ఆకట్టుకునే విధంగా మయూరి పార్క్‌లో భవిష్యత్‌లో మరిన్ని సాహస క్రీడలను ఏర్పాటు చేస్తాం. రాక్ క్లైంబింగ్, ర్యాప్లింగ్, ట్రెక్కింగ్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటాం. జంగిల్ సఫారీకి పర్యాటకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. – సత్యనారాయణ, డీఎఫ్‌వో, మహబూబ్‌నగర్ -
హైదరాబాద్ : సర్వాంగ సుందరంగా గండిపేట ఎకో పార్క్ (ఫొటోలు)
-
ఏడు వింతలే అని ఎవరు చెప్పారు? ఇది ఎనిమిదో వింత!
Kolkata Eco Park: ఈఫిల్ టవర్ చూడాలంటే... యూరప్ ట్రిప్ అక్కర్లేదిప్పుడు. వెస్ట్‌బెంగాల్ టూర్ చాలు. కోల్‌కతా నగరం... పారిస్ ఈఫిల్ టవర్‌కు ఏ మాత్రం తీసిపోని ప్రతిరూపాన్ని నిర్మించింది. విస్తారమైన పార్కింగ్ లాట్‌తో చాలా ముందుచూపుతో నిర్మించిన టూరిస్ట్ ప్రదేశం ఇది. ఎంట్రీ టికెట్ కేవలం ముప్పై రూపాయలు. పచ్చటి లాన్లలో చేతులు పట్టుకుని విహరించే పర్యాటక ప్రేమికులు, సరస్సులో బోట్ షికారు చేస్తూ కేరింతలు కొట్టే పిల్లలు, పిల్లగాలికి మెల్లగా కదిలే తేలికపాటి అలలను ఆస్వాదించడానికి ఒడ్డున బెంచీల మీద సీనియర్ సిటిజెన్, సైకిల్ తీసుకుని ఆవరణ అంతా తిరిగి చూస్తున్న యూత్, మూడు ఎంట్రీ గేట్లు... ఈ దృశ్యమే ఈ పార్క్ మనం అనుకున్నంతకంటే ఇంకా చాలా పెద్దది కావచ్చేమోననే సందేహాన్ని కలిగిస్తుంది. ఈ టవర్ వ్యూ పాయింట్ నుంచి దాదాపుగా కోల్‌కతా నగరమంతటినీ చూడవచ్చు. రోమన్ కలోజియం నమూనా ఏడు వింతల ప్రతిరూపం ఈ ఎకో పార్క్ ఈఫిల్ టవర్ ప్రతిరూపంతో ఎక్కువగా ప్రాచుర్యంలోకి వచ్చింది. కానీ తాజ్‌మహల్, గ్రేట్ వాల్ ఆఫ్ చైనాతోపాటు ప్రపంచంలోని ఏడు వింతల కట్టడాలకూ ప్రతిరూపాలున్నాయి. లండన్ బిగ్‌బెన్ టవర్, జపాన్ గార్డెన్, బెంగాలీ గ్రామం, హెర్బల్ గార్డెన్లతో కనువిందు చేస్తున్న ఈ ప్రదేశం ఆనందమయమైన విహారానికి అధునాతనమైన వేదిక. మరో సంగతి! కోల్‌కతా ఈఫిల్ టవర్ గురించి తెలిసిన వెంటనే మనకు ఇండియాలో ఈఫిల్ టవర్ అనే ట్యాగ్‌లైన్ గుర్తుకువస్తుంది. కానీ ఇంతకంటే ముందు మనదేశంలో ఈఫిల్ టవర్‌కు మరో రెండు ప్రతిరూపాలున్నాయి. చండీగఢ్‌లో పన్నెండు మీటర్ల ఎత్తులో ఒకటి ఉంది. రాజస్థాన్ రాష్ట్రం కోట నగరంలో ఒకటి ఉంది. అయితే వీటన్నింటిలోకి కోల్‌కతాలోని ఈఫిల్ టవర్ ప్రతిరూపం మాత్రమే పారిస్‌లోని అసలు ఈఫిల్ టవర్‌ను అచ్చంగా మూసపోసినట్లు ఉంటుంది. ఎకోపార్కులోని ఈజిప్టు గిజా పిరమిడ్ నమూనా ఈఫిల్ టవర్ ప్రతిరూపం తోపాటు ఈ వింతలన్నీ కోల్‌కతాలోని ఎకో పార్కులో ఉన్నాయి. ఇక్కడి ఈఫిల్ టవర్ పద్దెనిమిది అంతస్థుల నిర్మాణం, ఎత్తు 55 మీటర్లు (పారిస్ టవర్ ఎత్తు 324 మీటర్లు). 2015లో మొదలు పెట్టి నాలుగేళ్లలో పూర్తి చేశారు. ఈ పార్కు 2020లో పర్యాటక ద్వారాలు తెరుచుకుంది . ∙ఎకోపార్కులోని తాజ్‌మహల్ నమూనా (పై ఫొటో) క్రైస్ట్ రిడీమర్ విగ్రహం దగ్గర టూరిస్ట్ -
ఈ–వేస్ట్ వినియోగానికి ఎకో పార్కు
పబ్లిక్–ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పాటుకు కేంద్రం పరిశీలిస్తోంది: పర్యావరణ శాఖ న్యూఢిల్లీ: ఈ–వేస్ట్‌ను వాణిజ్యపరంగా ఉపయెగించుకు నేందుకు వీలుగా పునరుత్పత్తి చేసేందుకు పబ్లిక్–ప్రైవేటు భాగస్వామ్యంతో ఎకో పార్కును ఏర్పాటు సాధ్యా సాధ్యాలను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోందని కేంద్ర పర్యావరణ శాఖ ఓ పార్లమెంటరీ ప్యానెల్‌కు తెలిపింది. ఈ–వేస్ట్‌ను వాణిజ్యపరంగా వినియోగించుకోవాలంటే పర్యావరణ అనుకూల (ఎకో)పార్కును ఏర్పాటు చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్, శిక్షణ పరికరాలు సమ కూర్చాల్సి ఉంటుందని క్రేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ తెలిపినట్లు పర్యావరణ శాఖ చెప్పింది. ఎకోపార్కును ఏర్పాటు చేయడం ద్వారా ఈ–వేస్ట్‌ను పర్యావరణహితంగా తయారు చేయొచ్చని పేర్కొంది. ప్రమాదకరమైన వస్తువుల నిర్వహణ కోసం ఓ సంస్థను ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే ఓ స్కీం ఉందని, అందులో ఈ–వేస్ట్‌ను పునరుత్పత్తి చేసే వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీలు కూడా అందిస్తాయని తెలిపింది.