economically backward section
-
జనరల్ కోటా నుంచే ఈడబ్ల్యూఎస్: కేంద్రం
న్యూఢిల్లీ: సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు అమలవుతున్న 50 శాతం రిజర్వేషన్ కోటాలో ఎలాంటి కోత లేదని, కేవలం జనరల్ కోటా నుంచే ఈడబ్ల్యూఎస్‌కు స్థానం కల్పించామని కేంద్రం సుప్రీంకోర్టులో స్పష్టంచేసింది. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఉన్న 50 శాతం రిజర్వేషన్ స్వాతంత్య్రతకు ఎలాంటి భంగం వాటిల్లలేదని కేంద్రప్రభుత్వం తరఫున హాజరైన అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ సుప్రీంకోర్టు సీజే జస్టిస్ లలిత్ నేతృత్వంలోని ఐదుగురు జడ్జీల రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించారు. ప్రవేశాలు, ఉద్యోగాల్లో ఆర్థికంగా బలహీనమైన వర్గాల(ఈడబ్ల్యూఎస్)కు కేంద్రం 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్న విషయం విదితమే. రిజర్వేషన్ కల్పనకు ఆర్థిక పరిస్థితి గీటురాయి కాదని, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్‌ను కోర్టు సమరి్థంచాలనుకుంటే అంతకుముందుగా ఇందిరా సహానీ(మండల్) తీర్పును çసమీక్షించాలని తమిళనాడు ప్రభుత్వం కోరింది. ఇదీ చదవండి: పట్టణ శ్రేయస్సు ముఖ్యం -
ఎటూ తేలని ఈబీసీ కోటా?
సాక్షి, అమరావతి: ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు(ఈబీసీ) వర్తించే 10 శాతం కోటాపై రాష్ట్రంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఇటీవలే పార్లమెంటు చట్టం చేస్తూ తెచ్చిన ఈ రిజర్వేషన్ల మేరకు ఈ ఏడాది నుంచే విద్యా, ఉద్యోగాల్లో అవకాశం కల్పించాలి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో పీజీ వైద్య సీట్ల భర్తీ జరుగుతోంది. జాతీయ పూల్ సీట్లకు కౌన్సెలింగ్ మొదలైంది. అలాగే రాష్ట్రకోటాకు సంబంధించిన సీట్ల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేయాలని నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. కానీ ఇప్పటివరకూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రిజర్వేషన్లపై ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో.. గతంలో ఎలా కౌన్సెలింగ్ జరిగిందో అలాగే పూర్తిచేసేందుకు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఏర్పాట్లు పూర్తిచేసింది. కేంద్ర ప్రభుత్వం చట్టం చేయగానే.. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకిచ్చే 10 శాతం రిజర్వేషన్లలో 5 శాతం కాపులకు కేటాయిస్తామని వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బి.ఉదయలక్ష్మి 2019 మార్చి 8న ఉత్తర్వులు జారీచేశారు. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో యూనివర్సిటీ అధికారులు పాత పద్ధతినే కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే.. కౌన్సెలింగ్‌కు నోటిఫికేషన్‌ఇచ్చామని.. కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈబీసీ రిజర్వేషన్లపై మార్గదర్శకాలు రాలేదని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డా.అప్పలనాయుడు చెప్పారు. వచ్చే నెల 3 నుంచి రాష్ట్ర కోటా సీట్ల భర్తీ జరుగుతుందన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల ఆధారంగానే అడ్మిషన్లు జరుగుతాయన్నారు. మరోవైపు ప్రభుత్వ తీరుపై ఈబీసీ విద్యార్థులు మండిపడుతున్నారు. ఉత్తర్వులు జారీ చేసి, అమలు చేయకపోతే ఎలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. -
అచ్చం సినిమాలాగే.. బుక్కైన తండ్రి!
సాక్షి, న్యూఢిల్లీ : అచ్చం ‘హిందీ మీడియం’ సినిమా తరహాలోనే ఓ వ్యక్తి తన కొడుకుకు ప్రముఖ పాఠశాలలో అడ్మిషన్ పొందేందుకు అక్రమమార్గం తొక్కాడు. తాము సంపన్నులు అయినప్పటికీ.. నిరుపేదగా పేర్కొంటూ నకిలీ పత్రాలు పొంది.. కొడుకును ప్రఖ్యాత విద్యాసంస్థలో చేర్పించాడు. తాజాగా నకిలీ ధ్రువపత్రాల రాకెట్ పట్టుబడటంతో అతని బాగోతం వెలుగులోకి వచ్చింది. ఢిల్లీకి చెందిన గౌరవ్ గోయల్ తన కుమారుడిని న్యూఢిల్లీలోని ఓ ప్రముఖ పాఠశాలలో చదివించాలని ఆశపడ్డాడు. నకలీ సర్టిఫికేట్స్ సృష్టించి ఆర్థికంగా వెనుకబడినవర్గం కింద 2013 సంవత్సరంలో ఆ పాఠశాలలో కొడుకును చేర్పించాడు. తాజాగా అతని గుట్టురట్టు కావడంతో జైలుపాలైయ్యాడు. శనివారం అతనితోపాటు ఈ వ్యవహారంలో కీలకంగా మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ డిప్యూటీ పోలీస్ కమిషనర్ మాధుర్ వర్మ తెలిపిన వివరాల ప్రకారం, కొడుకుని ఉన్నత పాఠశాలలో చేర్పించడం కోసం గౌరవ్ గోయల్ నకిలీ ఇన్‌కం సర్టిఫికేట్ సంపాదించాడు. దీనితోపాటు అడ్మిషన్‌కు కావల్సిన ఇతర పత్రాలను కూడా నకిలీవి సృష్టించాడు. 2015లోనే ఉన్నత విద్యాసంస్థల్లో నకిలీ పత్రాల రాకెట్ వెలుగులోకి వచ్చింది. దీనికి ప్రధాన సూత్రధారి నీరజ్ కుమార్ వద్ద నుంచి గౌరవ్ ఈ నకిలీ పత్రాలు పొందాడు. సర్టిఫికేట్ బ్రోకర్ అయిన నీరజ్‌ను ఇటీవల పోలీసులు అరెస్టు చేయడంతో గౌరవ్ బాగోతం వెలుగులోకి వచ్చింది. ఇలా ఒక్కో నకిలీ పత్రాన్ని సృష్టించేందుకు ఒక్కొక్కరి నుంచి మూడు లక్షల వరకు వసూలు చేస్తున్నట్లు నీరజ్ ఒప్పుకున్నాడు. -
సిగరెట్లతో కాల్చి, సూదులు గుచ్చి..
న్యూఢిల్లీ : దేశంలో మరణశిక్ష పడిన ఖైదీలలో మూడొంతులమంది జీవన నేపథ్యం సామాజికంగా, ఆర్థికంగా, సమాజంలో వెనుకబడిన వర్గానికి చెందినదేనని సెంటర్ ఫర్ డెత్ పెనాల్టీ వెల్లడించింది. 80శాతానికి పైగా ఖైదీలు జైళ్లలో చిత్రహింసలకు గురవుతున్నారని రిపోర్టులో తెలిపింది. ఢిల్లీ నేషనల్ లా యూనివర్సిటీ చేపట్టిన ఈ అధ్యయనంలో జైళ్లలో ఖైదీల జీవన పరిస్థితులను వివరించింది. మానసికంగా, శారీరకంగా చిత్రహింసలకు గురవుతూ దారుణమైన అమానుష పరిస్థితుల్లో ఖైదీలు జీవిస్తున్నారని రిపోర్టు పేర్కొంది. 270 మంది ఖైదీల్లో 260 ఖైదీలు అమానుషమైన మానసిక, శారీరక చిత్రహింసలకు గురవుతున్నామని తెలిపినట్టు రిపోర్టు వెల్లడించింది. సిగరేట్లతో కాల్చడం, చేతివేళ్లలోకి సూదులు గుచ్చడం, బలవంతంగా యూరైన్ ను తాగించడం, తీగలు ద్వారా వేలాడుతీయడం, బలవంతపు నగ్నత్వం, తీవ్రంగా కొట్టడం వంటి దారుణమైన చిత్రహింసలకు ఖైదీలను గురిచేస్తున్నారని ఈ రిపోర్టు వెల్లడించింది. మరణ శిక్ష పడ్డ ఖైదీల ఆర్థిక జీవన నేపథ్యం పరిశీలిస్తే, వారిలో 3/4 వంతు ఆర్థికంగా చాలా చితికిపోయిన వాళ్లని, కుటుంబాన్ని పోషించే సంపాదనలో వారే ప్రధాన పాత్ర పోషించేవారని తేలింది. సమాజంలో వెనుకబడిన వర్గాలకు, మత మైనార్టీలకు చెందినవారని పేర్కొంది. అదేవిధంగా మరణశిక్ష పడిన 12 మంది మహిళా ఖైదీలు కూడా ఈ వర్గానికి చెందినవారేనని రిపోర్టు నివేదించింది. ఒకవేళ ఈ ఆరోపణలు నిరక్షరాస్యతకు సంబంధించినవై ఉంటే, వారి రక్షణ అత్యంత కీలకమని ఢిల్లీ నేషనల్ లా యూనివర్సిటీ నివేదించిన రిపోర్టుపై పానెల్ డిస్కషన్ సమయంలో సుప్రీం కోర్టు జడ్జి జస్టిస్ మదన్ బి. లోకూర్ అన్నారు. ప్రజలు న్యాయ సహాయ న్యాయవాదులపై నమ్మకం కోల్పోతున్నారని అభిప్రాయపడ్డారు. ఆర్థికంగా బాగాలేని 70.6శాతం మంది మరణ శిక్ష ఖైదీలూ ప్రైవేట్ లాయర్లనే ఆశ్రయిస్తున్నారని విచారణ వ్యక్తంచేశారు. మరణశిక్ష ఖైదీల జీవనం గురించి, క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ గురించి ఈ రిపోర్టు కూలంకషంగా విశ్లేషించింది. ఈ రిపోర్టుపై ఎలాంటి వాదన చేయాల్సినవసరం లేకుండా ఖైదీల కులం, మతం, ఆర్థిక పరిస్థితి, అక్షరాస్యత వంటి అన్నీ అంశాలను పరిగణలోకి తీసుకుని తయారుచేశామని సెంటర్ ఫర్ డెత్ పెనాల్టీ డైరెక్టర్ అనూప్ సురేంద్రనాథ్ తెలిపారు. ఈ రిపోర్టులో నివేదించిన ప్రకారం దేశంలో వివిధ రాష్ట్రాల్లో మరణ శిక్ష పడిన ఖైదీలు 385 మంది ఉన్నారు. వారిలో ఉత్తరప్రదేశ్ లో అధికంగా 79 మంది మరణశిక్ష ఖైదీలున్నారు.